arbhaj khan
-
మళ్లీ పెళ్లి చేసుకున్న విలన్
-
అందుకే అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్నా.. మలైకా అరోరా
బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె ఓటీటీలో పలు సిరీస్‌ల్లో నటిస్తోంది. ఇటీవల ఓ ఎపిసోడ్లో నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులపై ఆమె స్పందించారు. డిసెంబర్ 5న విడుదలైన సిరీస్‌లో ఆమె వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్లో చిత్ర నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై మలైకాను ప్రశ్నించారు. జీవితంలో విభిన్నమైన విషయాలను కోరుకున్నట్లు మలైకా వెల్లడించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే తాము విడిపోయినట్లు మలైకా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌ను ఆమె కొనియాడింది. మలైకా మాట్లాడుతూ.. 'అతను నన్ను ఓ వ్యక్తిగా మార్చాడు. అతని వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నానని నాకు అనిపిస్తుంది. నేను కూడా విభిన్నమైన విషయాలను కోరుకున్నా. జీవితం ఎక్కడో గాడి తప్పినట్లు నేను భావించా. అయినా నేను ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా కొన్ని బంధాలను వదులుకోగలిగితే అలా చేయగలనని భావించా.' అంటూ వివరించింది. మరోవైపు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్‌లో మలైకా-అర్జున్‌ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారని టాక్. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్
ముంబై : సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్ అయిన నటి మలైకా అరోరా. మొదట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ వంటి విషయాలు మలైకాను హైలైట్ చేశాయి. ఇప్పుడు మరోసారి మలైకా పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన మాజీ భర్త కోసం ఓ పోస్ట్ పెట్టడమే. మలైకా కోసం అర్భాజ్ తన తోటలోని రుచికరమైన మామాడి పండ్లు పండ్లను బహుమతిగా పంపాడు. దీంతో అతడికి థ్యాంక్స్ చెబుతూనే, దీన్ని ఆన్లైన్లో సైతం ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతూ మాజీ భర్త బిజినెస్‌ను ప్రమోట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు..మలైకా పోస్ట్‌ను తెగ షేర్ చేస్తుండటంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది సేపటికే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నుంచి దీన్ని డిలీట్ చేసేసింది మలైకా. అయితే అప్పటికే దీన్ని స్ర్కీన్షాట్లు చేస్తూ నెటిజన్లు వైరల్ చేసేశారు. కాగా ఓ యాడ్ షూట్లో ప్రేమలో పడిపోయిన మలైకా- అర్భాజ్ ఖాన్లు 1998లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తడంతో 18 ఏళ్ల వైవివాహిక బంధానికి ఇరువురు గుడ్ బై చెప్పేసుకున్నారు. వీరి విడాకులు అయిన కొద్ది కాలానికే మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉండగా.. అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. తన కన్నా వయసులో 12 ఏళ్ల చిన్నవాడు అయినప్పటికీ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది ఈ హాట్ బ్యూటీ. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్నెస్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఇక అర్జున్- మలైకా రిలేషన్షిప్లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పలు పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతుంటారు. బుధవారం రాత్రి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో వీరిద్దరూ కనపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : డిన్నర్: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి! విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు.. -
బాయ్‌కాట్ సల్మాన్
‘‘నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. చాకచక్యంగా నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్ (రచయిత–నటుడు, సల్మాన్ ఖాన్ తండ్రి), సల్మాన్ ఖాన్, సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్. ఇంకా వెన్నుపోటు పొడిచినవాళ్లు ఉన్నారు. కానీ ఈ విషపూరిత సర్పానికి సల్మాన్ కుటుంబం అధిపతి. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌వరల్డ్ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. దురదృష్టం ఏంటంటే నావైపు ‘నిజాయితీ’ మాత్రమే ఉంది. అయితే నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా జీవితాన్ని చాలించను. తలవంచేది లేదు. ఎదురు నిలబడి పోరాడతా. ఒకటీ వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. ఇక భరించింది చాలు. మళ్లీ పోరాడే సమయం ఆసన్నమైంది’’ అని హిందీ దర్శకుడు అభినవ్ కశ్యప్ మంగళవారం తన ఫేస్బుక్లో సుదీర్ఘంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి హిందీ పరిశ్రమలో అతనికి ఎదురైన చేదు అనుభవాలు ఒక కారణం అనేది పలువురి అభిప్రాయం. అభినవ్ కశ్యప్ కూడా ఆ మాటే అంటున్నారు. ఇది ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది ‘‘ప్రభుత్వానికి ఓ విన్నపం. సుశాంత్ మరణానికి గల కారణాలను సునిశితంగా పరిశోధించాలి. మేం చాలామంది ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బయటకు తీసుకొస్తోంది. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలవి. సుశాంత్ మరణం అనేది ఒక మచ్చు తునక అనే భయం వేస్తోంది. ఇది (నెపోటిజమ్ – బంధుప్రీతి) ‘మీటూ’ ఉద్యమం అంత పెద్దది. సుశాంత్ మరణానికి ‘వైఆర్ఎఫ్’ టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ ముఖ్య కారణం. ఈ టాలెంట్ ఏజెన్సీ వాళ్లు మన కెరీర్‌ని బిల్డ్ చేయరు.. కెరీర్‌తో పాటు జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. పదేళ్లుగా ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా చెబుతున్నా.. బాలీవుడ్‌కి చెందిన ప్రతి టాలెంట్ మ్యానేజర్, టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీలు ఆర్టిస్ట్‌లకు ఓ ‘డెత్ ట్రాప్’లాంటివి. ఈ మ్యానేజర్లు, ఏజెన్సీలు అవకాశాలిప్పిస్తామని ఇండస్ట్రీకి సంబంధంలేనివాళ్లను నమ్మిస్తారు. బాలీవుడ్లో జరిగే పార్టీలకు వాళ్లను ఆహ్వానిస్తారు. అయితే అక్కడ వీరిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు వీళ్లకు ఓ అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అప్పుడు ఈ క్యాస్టింగ్ డైరెక్టర్లు మేం కాపాడతామంటూ కొన్నేళ్ల పాటు తమ ఏజెన్సీతో కలిసి పని చేస్తామని ఒప్పందపత్రంలో సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒక్కసారి ఒప్పందం కుదిరాక ఇక వాళ్లకు ఏ హక్కూ ఉండదు. కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ల చేతిలో ఉండవు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కార్మికుడిలా తక్కువ పారితోషికానికి పని చేయాలి. పోనీ ఎలాగోలా ఈ ఏజెన్సీ నుంచి తప్పించుకుని ‘రేపు’ బాగుంటుందనే నమ్మకంతో వేరే ఏజెన్సీ దగ్గరికి వెళితే ఆ ‘రేపు’ఎప్పటికీ రాదు. ఇలాంటి అనుభవాలు నేను చాలా ఎదుర్కొన్నాను. అర్బాజ్ ఖాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ‘దబాంగ్’ (2010) సినిమాకి దర్శకత్వం వహించిన పదేళ్లకు నా అనుభవాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ‘దబాంగ్’ తర్వాత ‘దబాంగ్ 2’ ఒప్పుకుని ఆ సినిమా నుంచి నేను తప్పకోడానికి కారణం అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ మరియు అతని కుటుంబం. నా కెరీర్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్లు ట్రై చేశారు. నా రెండో చిత్రాన్ని శ్రీ అష్టవినాయక ఫిలింస్ సంస్థతో చేయడానికి సైన్ చేశాను. కానీ ఆ సంస్థ అధినేత రాజ్ మెహతాకి ఫోన్ చేసి, ‘అతనితో సినిమా చేస్తే జాగ్రత్త’ అని బెదిరించారు. దాంతో నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వయాకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ అధినేత విక్రమ్ మల్హోత్రాకి ఫోన్ చేసి, బెదిరించారు. దాంతో తీసుకున్న 7 కోట్ల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో పాటు 90 లక్షలు వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సపోర్ట్ వల్ల ‘బేషరమ్’ (2013) సినిమాకి దర్శకత్వం వహించగలిగాను. అయితే ఆ సినిమా విడుదలకు ముందు సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనడానికి భయపడ్డారు. కానీ రిలయన్స్, నేను ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాళ్లం కాబట్టి సొంతంగా సినిమాని విడుదల చేయాలనుకున్నాం. అప్పుడు అసలు యుద్ధం మొదలైంది. నా శత్రువులు బాక్సాఫీస్ దగ్గర నా సినిమా పరాజయం పాలు కావడానికి సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేశారు. అయితే థియేటర్ల నుంచి ఎత్తేసే నాటికి నా సినిమా 58 కోట్లు వసూలు చేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బందిపెట్టారు. ఇక ఆ తర్వాత నా ప్రతి ప్రయత్నాన్ని చెడగొట్టే పనులు చేశారు. నన్ను బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న స్త్రీలను అత్యాచారం చేస్తామని బెదిరించారు. దాంతో నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. చివరికి 2017లో నా భార్య, నేను విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత కూడా నన్ను వదిలిపెట్టలేదు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. నా శత్రువులు చాలా చురుకైనవాళ్లు. వెనక నుండి నాపై దాడి చేస్తున్నారు. నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సహించేది లేదు. ఓపెన్‌గా చాలెంజ్ చేస్తున్నాను. అమాయకులు బలి కాకూడదు సుశాంత్ సింగ్ వెళ్లిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నాను. కానీ అలాంటి అమాయకులు ఇక బాలీవుడ్లో బలి కాకూడదు. ఇబ్బంది పడుతున్న నటీనటులు, క్రియేటివ్ పీపుల్ నా ఈ పోస్ట్‌ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి’’ అంటూ ‘మీటూ బాయ్‌కాట్ సల్మాన్‌ఖాన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించారు అభినవ్ కశ్యప్. కాగా నో స్మోకింగ్, బాంబే వెల్వెట్, రమణ్ రాఘవ్, మన్మర్జియాన్.. ఇలా ఓ 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్. తన సోదరుడు అభినవ్, సల్మాన్ ఖాన్‌కి మధ్య జరుగుతున్న వివాదం గురించి తాను స్పందించదలచుకోలేదని అనురాగ్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడటానికి మీడియావారు నాకు ఫోన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దని అభినవ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందుకని తను చేస్తున్నవాటికి, చెబుతున్నవాటి గురించి నేను స్పందించలేను’’ అని అనురాగ్ ట్వీట్ చేశారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది – నటుడు వివేక్ ఒబెరాయ్ ‘‘సుశాంత్ తండ్రి కళ్లల్లో బాధ చూస్తుంటే భరించలేని విధంగా ఉంది’’ అంటూ నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్వీటర్ ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నారు. చిత్రపరిశ్రమ మేల్కొనాల్సిన సమయం ఇది అని వివేక్ చెబుతూ – ‘‘ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమా పరిశ్రమ అడుగులు వేయాలి కానీ ప్రతిభను నాశనం చేసే దిశగా కాదు. నా ఈ ప్రయాణంలో నేను కూడా ఎన్నో బాధలు అనుభవించాను. ఆ బాధలు చెప్పి సుశాంత్ బాధని తగ్గించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మన ప్రయాణం చీకటిలో కొనసాగవచ్చు లేదా ఒంటరి ప్రయాణం కావొచ్చు. కానీ మరణం దానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కానే కాదు. సుశాంత్ తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది మంది అభిమానుల గురించి ఆలోచించడం మానేశాడనుకుంటున్నాను. అందుకే ఈరోజు అతన్ని మనం కోల్పోయాం. అతని తండ్రి బాధ వర్ణనాతీతం. ఇక సుశాంత్ అక్క అయితే ‘వెనక్కి వచ్చెయ్’ అంటూ కన్నీటి పర్యంతం కావడం నన్ను కలచివేసింది. సుశాంత్ మరణం సినిమా పరిశ్రమకు ఓ మేలుకొలుపు లాంటిది’’ అన్నారు. – డి.జి.భవాని -
ఓరి దేవుడా..అచ్చం నాన్నలాగే ఉన్నావు : మలైకా
‘ఓహ్ మై గాడ్.. నువ్వు మీ నాన్నకు అచ్చం జిరాక్స్ కాపీలాగా ఉన్నావ్’ అంటూ బాలీవుడ్ నటి మలైకా అరోరా తన కుమారుడి ఫోటోను, మాజీ భర్త అర్బాజ్‌ఖాన్ చిన్నప్పటి ఫోటోను పక్కపక్కనే పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అర్బాజ్‌ఖాన్‌ను కూడా ట్యాగ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. మలైకా, అర్బాజ్ఖాన్లకు 1998లో వివాహం కాగా వీరు 2017లో విడిపోయారు. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. అర్బాజ్‌తో విడిపోయాక కొన్నాళ్లకు ‘అవును నేను అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నానని బాంబు పేల్చింది’ మలైకా. తాజాగా వీరి పెళ్లిపై వస్తున్న పుకార్లపై మలైకా స్పందిస్తూ.. ‘అర్జున్ కపూర్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు. తన కొడుకు అర్హాన్ భవిష్యత్తును గూర్చి ప్రస్తావిస్తూ.. ‘అతనికి సినిమాలు చూడటం, వాటిని అనుసరించడమంటే ఇష్టమని, దానికి అతను పెరిగిన వాతావరణం ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. అయితే అర్హాన్ భవిష్యత్తులో ఏమవుతాడో అనే దానిపై అతనికి స్పష్టత లేదని, ప్రస్తుతానికి తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. అర్బాజ్‌ఖాన్ కూడా ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో నాకు మలైకాకు మధ్య ఉన్న బంధం అర్హాన్ మాత్రమేనని, ఇప్పటికీ మలైకాతో మంచి రిలేషన్ ఉందని పేర్కొన్నారు. అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో డేటింగ్లో ఉన్నారు. -
చుల్‌బుల్‌పాండే రిటర్న్స్
చుల్‌బుల్‌పాండే.. విలన్లకే విలన్. సీరియస్‌గా కనిపించే సరదా పోలీస్. అందుకే బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన పోలీసులకు ప్రత్యేకం చుల్బుల్. 2010లో ‘దబాంగ్’ సినిమాలో చుల్బుల్ పాండేగా కనిపించారు సల్మాన్ ఖాన్. ‘దబాంగ్’ చిత్రం బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దబాంగ్ 2’ కూడా హిట్టే. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో ఇన్స్టాల్మెంట్ ‘దబాంగ్ 3’ చిత్రం ఏప్రిల్ 1న ప్రారంభమైంది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇండోర్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘నేను, అన్నయ్య (అర్బాజ్ ఖాన్) ఇండోర్లోనేపుట్టాం. ‘దబాంగ్ 3’ చిత్రాన్ని ఇక్కడే మొదలుపెట్టడం సంతోషంగా ఉంది’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. మొదటి రెండు భాగాల్లో హీరోయిన్గా కనిపించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ హీరోయిన్గా కనిపిస్తారు. -
అందుకే విడాకులు తీసుకున్నాం : మలైకా
పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్ జంట మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల విషయంలో మొదట కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నానని మలైకా తాజాగా వ్యాఖ్యానించారు. తన స్నేహితురాలు కరీనా కపూర్ హోస్ట్ చేసిన ఓ రేడియో షోలో ఆమె మాట్లాడుతూ... ‘ నేను విడాకులు తీసుకునే ముందు రోజు రాత్రి కూడా.. నా కుటుంబం మొత్తం నా చుట్టూ కూర్చొని నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ అందరూ ప్రశ్నించారు. ఈ విషయంలో మరోసారి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే నా ఇబ్బందిని పూర్తిగా అర్థం చేసుకున్న అనంతరం.. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మా దృష్టిలో నువ్వెల్లప్పుడూ ధైర్య వంతురాలైన మహిళగానే ఉండిపోతావు అని భుజం తట్టారు. ఆ సమయంలో వారి మద్దతు నాకెంతో సాంత్వన కలిగించింది’ అని చెప్పుకొచ్చారు. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ...‘మేమిద్దరం(మలైకా-అర్బాజ్) ఒకరినొకరం అస్సలు సంతోషంగా ఉంచలేకపోయాం. ప్రతీ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తేవి. ఈ కారణంగా మాతో పాటు మా చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ఇబ్బంది కలిగింది. అది వారిపై ప్రభావం చూపింది. అందుకే విడాకులు తీసుకున్నాం’ అని మలైకా పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కారణంగానే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని బీ- టౌన్లో వార్తలు వినిపించాయి. విడాకులకు ముందు గుట్టుచప్పుడుగా ఉన్న మలైకా- అర్జున్‌లు ఇటీవల బాహాటంగానే కలిసి తిరుగుతున్నారు. ఇక అర్బాజ్ ఖాన్ కూడా జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
హీరోతో రిలేషన్‌పై స్పందించిన హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో తనకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై మలైకా అరోరా స్పందించారు. అర్జున్‌తో సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు పుకార్లని కొట్టిపారేశారు. అర్బాజ్ ఖాన్‌తో మలైకా గతేడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఓ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయంపై పెదవి విప్పిన మలైకా.. బిపాసా, సూసన్లతో పాటు తన గురించి మాట్లాడటానికి ఇంతకన్నా మంచి విషయాలు ఉన్నాయని అన్నారు. తాము ఎంత స్వతంత్రంగా జీవిస్తున్నామో మాట్లాడుకోవాలని సూచించారు. నిజాల గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. అందరూ తమ గురించి నవ్వుకుంటూ మాట్లాడుతున్నారని.. మంచి గురించి ఎంతైనా మాట్లాడొచ్చని అన్నారు. పుకార్ల గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు.