హీరోతో రిలేషన్‌పై స్పందించిన హీరోయిన్‌ | Malaika Arora Khan REACTS to link-up rumours with Arjun Kapoor! | Sakshi
Sakshi News home page

హీరోతో రిలేషన్‌పై స్పందించిన హీరోయిన్‌

Published Sat, May 6 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

హీరోతో రిలేషన్‌పై స్పందించిన హీరోయిన్‌

హీరోతో రిలేషన్‌పై స్పందించిన హీరోయిన్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌తో తనకు సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై మలైకా అరోరా స్పందించారు. అర్జున్‌తో సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు పుకార్లని కొట్టిపారేశారు. అర్బాజ్‌ ఖాన్‌తో మలైకా గతేడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయంపై పెదవి విప్పిన మలైకా.. బిపాసా, సూసన్‌లతో పాటు తన గురించి మాట్లాడటానికి ఇంతకన్నా మంచి విషయాలు ఉన్నాయని అన్నారు.

తాము ఎంత స్వతంత్రంగా జీవిస్తున్నామో మాట్లాడుకోవాలని సూచించారు. నిజాల గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. అందరూ తమ గురించి నవ్వుకుంటూ మాట్లాడుతున్నారని.. మంచి గురించి ఎంతైనా మాట్లాడొచ్చని అన్నారు. పుకార్ల గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement