నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్‌ గిఫ్ట్‌ | Arjun kapoor Girl friend Malaika Arora Receives Gift From Ex-Hubby Arbaaz Khan | Sakshi
Sakshi News home page

షేర్‌ చేసిన కొద్ది సేపటికే పోస్ట్‌ డిలీట్‌ చేసిన మలైకా

Published Thu, Mar 25 2021 6:18 PM | Last Updated on Thu, Mar 25 2021 8:25 PM

Arjun kapoor Girl friend Malaika Arora Receives Gift From Ex-Hubby Arbaaz Khan - Sakshi

ముంబై :  సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్‌ అయిన నటి మలైకా అరోరా. మొదట బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ వంటి విషయాలు మలైకాను హైలైట్‌ చేశాయి. ఇప్పుడు మరోసారి మలైకా పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన మాజీ భర్త కోసం ఓ పోస్ట్‌ పెట్టడమే. మలైకా కోసం అర్భాజ్‌ తన తోటలోని రుచికరమైన మామాడి పండ్లు పండ్లను బహుమతిగా పంపాడు. దీంతో అతడికి థ్యాంక్స్‌ చెబుతూనే, దీన్ని ఆన్‌లైన్‌లో సైతం ఆర్డర్‌ చేసుకోవచ్చని చెబుతూ మాజీ భర్త బిజినెస్‌ను ప్రమోట్‌ చేసింది.

ఇది చూసిన నెటిజన్లు..మలైకా పోస్ట్‌ను తెగ షేర్‌ చేస్తుండటంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది సేపటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ నుంచి దీన్ని డిలీట్‌ చేసేసింది మలైకా. అయితే అప్పటికే దీన్ని స్ర్కీన్‌షాట్లు చేస్తూ నెటిజన్లు వైరల్‌ చేసేశారు. కాగా ఓ యాడ్‌ షూట్‌లో ప్రేమలో పడిపోయిన మలైకా- అర్భాజ్‌ ఖాన్‌లు 1998లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తడంతో 18 ఏళ్ల వైవివాహిక బంధానికి ఇరువురు గుడ్‌ బై చెప్పేసుకున్నారు.


వీరి విడాకులు అయిన కొద్ది కాలానికే మలైకా బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉండగా.. అర్భాజ్‌ ఇటాలియన్‌ మోడల్‌ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. తన కన్నా వయసులో 12 ఏళ్ల చిన్నవాడు అయినప్పటికీ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది ఈ హాట్‌ బ్యూటీ. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్‌నెస్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఇక అర్జున్‌- మలైకా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పలు పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతుంటారు. బుధవారం రాత్రి బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహించిన ఓ పార్టీలో వీరిద్దరూ కనపించిన ఫోటోలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : డిన్నర్‌: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి!
విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement