mango fruits
-
భళా.. మామిడి పండ్ల మేళా
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఓర్మాస్ సంస్థ ఆధ్వర్యంలో మామిడి పండ్ల మేళాను కలెక్టర్ స్మృతిరంజన్ ప్రధాన్, ఎస్డీసీ చైర్మన్ మరియం రైయితోలు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 29 వరకు మొత్తం మూడు రోజుల పాటు మేళా జరుగుతుందని అధికారులు తెలియజేశారు. మేళాలో గజపతి జిల్లాలో పండిన మామిడిపండ్లతో పాటు కొరాపుట్, అనుగుల్, బలంగీర్, కలహండి, రాయగడ, సంబల్పూర్ జిల్లాల నుంచి వేర్వేరు రకాలు మామిడి పండ్ల ఉన్నాయి. ముఖ్యంగా ఆమ్రపళ్లి, లెంగడా, దశరీ, బంగినపళ్లి, ఏనుగు తలకాయలు, మల్లికా రకాలు ఉన్నాయి. స్టాల్స్‌ను ఉద్యానవన శాఖ అధికారి సుశాంత రంజన్ మఝి, డిప్యూటీ డైరక్టర్ సుశాంత రంజన్ దాస్, ఓర్మాస్ దిలీప్ కుమార్ సాహు, ఒడిశా జీవనోపాధుల శాఖ డీపీఎం ప్రియంవద బిసాయి, మిషన్ శక్తి డీపీఏ మనస్మితా పాత్రో తదితరులు పాల్గొన్నారు. – పర్లాకిమిడి -
టేస్టీ టేస్టీగా మ్యాంగో పూరి ఇలా చేసుకోండి..
మ్యాంగో పూరీకి కావాల్సినవి: మామిడి పండ్లు – 2 (కడిగి, తొక్క, టెంక తొలగించి ముక్కలుగా చేసుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసుకుని జ్యూస్ చేసుకోవాలి) గోధుమ పిండి – 3 లేదా 4 కప్పులు మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు నూనె – సరిపడా మ్యాంగో పూరీ తయారీ ఇలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మ్యాంగో జ్యూస్, గోధుమ పిండి, మైదాపిండి, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను పొంగే విధంగా ఇరువైపులా వేయించుకోవాలి. వీటిపై తేనె వేసుకుని తింటే భలే ఉంటాయి. -
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
మామిడి ముంచేసింది!
ఏలూరు(మెట్రో): ఈ ఏడాది మామిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలతో మామిడి పంట దిగుబడి బాగా పడిపోయింది. వచ్చిన పంట కూడా నాణ్యంగా లేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో ఈ ఏడాది బాగా నష్టపోయామని రైతు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతు ఈ ఏడాది నష్టపోయాడు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే మామిడికి ప్రస్తుతం సొంత రాష్ట్రంలోనూ సరైన ధర దక్కని పరిస్థితి. అసలే కాపు తక్కువగా రావడం, మూడు దఫాలుగా వచ్చిన గాలి దుమ్ములు, అకాల వర్షాలకు, ఎండ వేడిమికి పూత పిందె, కాయ ఇలా అన్ని దశల్లోనూ రాలిపోయింది. అక్కడక్కడా కొన్ని కాయలు ఉన్నా, ఆ కాయలకు మంగు మచ్చ ఆశించడంతో కనీసం ఎకరాకు రూ.30 వేలు కూడా దక్కని పరిస్థితి. కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి జిల్లాలో బంగినపల్లి, రసాలు అధికంగా ఉత్పత్తి అయ్యేవి. రైతుకు ఈ రకాలే అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టేవి. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాలతో పాటు, ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండల వల్ల పంట దెబ్బతింది. దీంతో కనీసం కూలీ ఖర్చులు కూడా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు, అధిక ఉష్ణోగ్రతలకు మామిడి నాణ్యత లేకుండా రైతును ముంచేసింది. ఇతర రాష్ట్రాలకు తగ్గిన ఎగుమతులు కాయపై మచ్చ ఏర్పడటంతో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి కావాల్సిన మామిడి స్థానికంగానే ఉండిపోతోంది. గతంలో నూజివీడు రసాలు అంటే ఇతర రాష్ట్రాలకు ఎంతో ప్రసిద్ధి. అలాంటి నూజివీడు ప్రాంతంలో రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఆగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి మండలాల్లో 14 వేల హెక్టార్లలో మామిడి విస్తరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైతులంతా నష్టపోయారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి మాట పక్కన పెడితే స్థానికంగా ఉన్న నున్న మార్కెట్లోనూ రైతు ఆశించిన ధర లభించడం లేదు. మొగల్తూరులోనూ అదే పరిస్థితి గతంలో మంచి రంగు, మచ్చలేని మామిడి కాయలను టన్ను రూ.40 వేలకు విక్రయించే వారు. ప్రస్తుతం స్థానిక నున్న మార్కెట్లో మచ్చలున్నవి కనీసం రూ.10 వేలకు కూడా కొనడం లేదు. గతంలో 20 వేల టన్నుల దిగుబడి ఉన్న మామిడి ఈ ఏడాది 3 నుంచి 5 టన్నుల కూడా ఉత్పత్తి రాలేదు. వచ్చిన కాయ సైతం మంగు, మచ్చలతో ఉండటంతో కనీసం కొనే నాథుడే కరవువయ్యాడు. ఇదిలా ఉండగా, ఆలస్యంగా వచ్చే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 2 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న మామిడి కాపు ప్రస్తుతం ఆశాజనకంగా లేదని రైతులు చెబుతున్నారు. మామిడికి ప్రసిద్ధి చెందిన ఉమ్మడి జిల్లాలో రైతు ఢీలా పడ్డాడు. ఇప్పటికే మెట్ట ప్రాంతంలో పూర్తిగా రైతులు మామిడి పంటను తొలగించేశారు. గతంలో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాల్లో మామిడి పంట ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఉన్న అరకొర చెట్లను సైతం పెకిలించేశారు. రానున్న రోజుల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కొనసాగితే జిల్లాలో మామిడి పంట అంతరించిపోయే పరిస్థితి ఏర్పడనుంది. కొనేందుకు ముందుకు రావడం లేదు గతంలో ఎకరాకు రూ. 40 వేలు కౌలు వచ్చేది. అకాల వర్షాలతో వాతావరణ మార్పులతో ప్రస్తుతం పేనుబంక, మంగు మచ్చలు రావడంతో మామిడి కాయ పూర్తి నాణ్యత కోల్పోయింది. ఆశించిన ధర లేదు సరికదా, స్థానికంగా కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. – శీలపురెడ్డి నాగిరెడ్డి, మామిడి రైతు -
హైదరాబాద్.. సీజన్ పూర్తిగా ప్రారంభం కానే లేదు.. మామిడి పండ్లు మహా ప్రియం
సాక్షి, హైదరాబాద్: వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్‌కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్‌సేల్ మార్కెట్లోనే మంచి రకం రూ.60–70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఏప్రిల్ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు. సోమవారం నుంచి మామిడి మార్కెట్‌కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్‌కు సోమవారం 1500–1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 80–100కు లభిస్తోంది. మార్కెట్‌కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. 19 ఎకరాల్లో ఏర్పాట్లు.. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్లో 19.27 ఎకరాల్లో మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మామిడి సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్‌తో పాటు జనరేటర్‌నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. -
మామిడికి పురుగుపోటు వస్తే ఏం చేయాలి?
ఉలవపాడు : ఉలవపాడు బంగినపల్లె మామిడిని పురుగుపోటు పట్టి పీడిస్తోంది. వేసవి వచ్చిందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఉలవపాడు మామిడి కోసం ఎదురు చూస్తుంటారు. ఎన్నడూ లేనివిధంగా గతేడాది ఉలవపాడు మామిడిలో పురుగులు వచ్చాయి. దీనికి కారణం పండుఈగ అని గుర్తించి వాటి నివారణ కోసం ఈ ఏడాది రైతులు పలు మందులను పిచికారీ చేశారు. అయినా ఈ ఏడాది కూడా పండుఈగ ఉలవపాడు ప్రాంతంలోని తోటల్లోకి చేరి కాయల్లో వస్తున్నాయి. దీంతో నల్లటి మచ్చలు ఏర్పడి పురుగులు వస్తున్నాయి. రైతులకు గడ్డు కాలం ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో సుమారు పది వేల ఎకరాల్లో మామిడిసాగు జరుగుతోంది. కందుకూరు డివిజన్ పరిధిలో ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రతి ఏడాది ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు కాయల దిగుబడి వస్తోంది. టన్ను 20 నుంచి 40 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు 90 కోట్లపైనే వ్యాపారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది నుంచి కాయల నాణ్యత సక్రమంగా లేని కారణంగా ఈసారి కూడా వ్యాపారం తగ్గే పరిస్థితి నెలకొంది. రైతులు చేయాల్సింది ఈ పండుఈగ నివారణకు ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. రైతులు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయాలి. దీని వల్ల మగ పండుఈగలు బుట్లలోకి చేరుతాయి. దీని వలన కొంత మేర ఉధృతి తగ్గే అవకాశం ఉంది. పండుఈగ కాయలకు తగలకుండా ఉండాలంటే ప్రతి కాయకు కవర్ కట్టాలి. దీని వల్ల కాయల రంగు కూడా బంగారు రంగులో వస్తాయి. ఈ కవర్ ఒకటి రూ.4 పడుతుంది. పురుగులు వస్తున్నాయి గతేడాది నుంచే మా ప్రాంతంలో కాయల్లో పురుగులు వస్తున్నాయి. ఈ ఏడాది తోటల్లో మందులు కూడా భారీగా పిచికారీ చేశాం. అయినా పచ్చికాయలకు నల్లటి మచ్చగా ఏర్పడి లోపల పురుగులు ఏర్పడుతున్నాయి. – సంకూరి మాచెర్ల రావు, మామిడి రైతు, ఉలవపాడు సలహాలు ఇస్తున్నాం మామిడి తోటల్లో పండుఈగ నివారణకు శాస్త్రవేత్తల సహాయంతో రైతులకు సలహాలు ఇస్తున్నాం. తోటలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలను తీసుకొచ్చి నివారణ చర్యలు చేపడుతున్నాం. – జ్యోతి, ఉద్యాన శాఖాధికారి, ఉలవపాడు -
మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?
వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే భారత్‌లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్‌లోని పాట్నా మార్కెట్లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్ పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. -
ఏపీ మార్కెట్లోకి మధుర ఫలాలు.. అన్ సీజన్లో కిలో మామిడి పండ్లు ఎంతంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలోకి మామిడి పండ్లు అప్పుడే వచ్చేశాయ్! వేసవిలో వచ్చే మామిడి పండ్లు శీతాకాలంలో రావడమేమిటని ఆశ్చర్యపోకండి! నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించిన ఈ మధుర ఫలాలు నగరవాసులకు రుచిచూపించడానికి విచ్చేశాయి. సాధారణంగా ఏప్రిల్ నాటికి మామిడి పండ్లు పక్వానికి వస్తాయి. ఎక్కడైనా ముందుగా కాసిన చోట ఒక నెల ముందు మార్కెట్లో కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నాలుగైదు నెలల ముందుగానే ఇవి దర్శనమిస్తున్నాయి. అనూహ్యంగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ మామిడిని చూసిన వారు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో బంగినపల్లి, సువర్ణరేఖ, పరియా రకాల మామిడి పండ్లు అందుబాటులోకి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతంలో కొంతమంది రైతులు వీటిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి విశాఖ, గాజువాకలకు చెందిన కొందరు పండ్ల వర్తకులు కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు. వీటిలో ఏ రకమైనా కిలో రూ.250 చొప్పున పండ్ల బండ్లపై విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా మామిడి పండ్లపై మోజు పడేవారు అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ సీజనులో వచ్చే మామిడి పండ్లకంటే కాస్త రుచి తక్కువగానే ఉంటున్నా కాలం కాని కాలంలో వీటిని తినడం ఓ తీయని అనుభూతిని కలిగిస్తోందని నగరంలోని శాంతిపురానికి చెందిన ఎంకేఆర్ శర్మ ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు అర టన్ను పండ్లు అమ్మకం నూజివీడు ప్రాంతం నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను నగరంలోని డైమండ్ పార్క్, ఎల్ఐసీ బిల్డింగ్, సీతమ్మధార రైతుబజార్, ఎంవీపీ కాలనీ, పూర్ణామార్కెట్, గాజువాక తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రోజుకు నూజివీడు ప్రాంతం నుంచి అర టన్ను (500 క్వింటాళ్ల) మామిడి పండ్లు తెస్తుండగా 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఈ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. రోజూ తాను 50 కిలోల మామిడి పండ్లను తెస్తే 40 కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని డైమండ్ పార్కు వద్ద బండిపై విక్రయించే పండ్ల వ్యాపారి ఎస్.ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మామిడిపండ్లు డిసెంబర్లో మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారని, సంక్రాంతి వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
ఒకే ఊరు.. 102 రకాల మామిడి కాయలు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు..? ఐదు, పది, ఇరవై...! ఏకంగా వంద రకాల మామిళ్లను తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఓ గ్రామస్తులు. కేరళలోని కన్నూర్ జిల్లా కన్నపురం వెళ్తే.. మీకు మొత్తానికి మామిడిపండ్ల ఉత్సవమే కళ్ల ముందు నిలబడుతుంది. 207పైగా దేశవాళీ మామిడి రకాలుండగా అందులో 102 రకాలు ఈ ఊళ్లో ఉన్నాయి. కన్నపురంలోని కరువక్కువు ప్రాంతంలో 20 కుటుంబాలు కలిసి.. 300 చదరపు గజాల స్థలంలో 102 రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. స్థానిక పోలీసాఫీసర్ శైజు మచాతి 2016 నుంచి ఈ మామిడి రకాలను సంరక్షించడం మొదలుపెట్టాడు. 200 ఏళ్లనాటి మామిడి చెట్టును కొట్టేస్తున్నారని వ్యవసాయ అధికారి అయిన స్నేహితుడి ద్వారా తెలుసుకుని వెళ్లి, అంటుకట్టి దాన్ని రక్షించాడు. తరువాత 39 వెరైటీలను కలెక్ట్ చేశాడు. ఆయనకు గ్రామస్తుల సాయం తోడైంది.. మొత్తానికి 2020 కళ్లా 102 రకాలను సేకరించి, పెంచగలిగారు. ఏటా మే మొదటి ఆదివారం కన్నపురంలో ‘మ్యాంగో ఫెస్ట్’నిర్వహిస్తారు. జూలై 22 వరల్డ్ మ్యాంగో డే సందర్భంగా.. కేరళ బయోడైవర్సిటీ బోర్డు కరువక్కవును ‘దేశీయ మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది. -
ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘సచిన్’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం!
లక్నో: ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాయడం సాధ్యమేనా.. అంటే అవుననే అంటున్నారు భారత మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కలీమ్ ఉల్లా ఖాన్. తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 300 రకాల మామిడి కాయలు కాసేలా చేసినట్లు చెబుతున్నారు. కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఎంతగానే ఉపయోగపడుతుందని అంటున్నారు. అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రార్థనలు చేసుకుని కిలోమీటరున్నర దూరంలోని తన పొలానికి వెళ్తారు కలీమ్ ఉల్లా ఖాన్. అక్కడ ఉన్న మామిడి చెట్టును చూసుకుంటారు. కొమ్మల్లో దాగి ఉన్న మామిడి కాయలను ప్రతిరోజు పరీక్షిస్తారు. 'దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడిన దానికి నా బహుమతి ఇది' అని చెబుతారు 82 ఏళ్ల వృద్ధుడు. ఆయన కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆయన తోటలోని మామిడి చెట్టును చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ, మనసుతో పరిశీలిస్తే.. అది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి కళాశాలగా తారసపడుతుంది. చదువు మధ్యలోనే మానేసిన కలీమ్ ఉల్లా ఖాన్.. యుక్త వయసులోనే మామిడి చెట్టుపై తన తొలి ప్రయోగం చేశారు. కొత్త రకాలను తయారు చేసేందుకు వివిధ రకాల మొక్కలను అంటుకట్టారు. తొలుత ఏడు కొత్త రకాలను ఉత్పత్తి చేసేలా మార్చారు. కాని అది తుపాను ధాటికి నేలకొరిగింది. అయితే.. 1987 సంవత్సరం నుంచి తన ప్రయోగాలను కొనసాగిస్తూ.. 120 ఏళ్ల నాటి చెట్టుపై 300 రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. ఒక్కోటి ఒక్కో రకమైన రుచి, రంగు, ఆకారం ఉండటం వాటి ప్రత్యేకత. సచిన్, ఐశ్వర్యలు ప్రత్యేకం.. తన తొలి నాటి ప్రయోగంతో వచ్చిన కొత్త రకం మామిడి కాయలకు బాలీవుడ్ స్టార్, 1994 మిస్ వరల్డ్ విన్నర్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరుతో ఐశ్వర్యగా నామకరణం చేశారు కలీమ్. ఇప్పటికీ ఆయన అభివృద్ధి చేసిన వాటిలో అవి ప్రత్యేకంగా నిలుస్తాయి. 'ఐశ్వర్యలాగానే ఆ మామిడి పండ్లు సైతం అందంగా ఉంటాయి. ఒక్క మామిడి కాయ కిలోకిపైగా బరువు ఉంటుంది. మందమైన తోలుతో ఎంతో తియ్యగా ఉంటుంది. ' అని పేర్కొన్నారు. మరికొన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ హీరో సచిన్ టెండూల్కర్, అనార్కళీ వంటి పేర్లు పెట్టారు. 'మనుషులు వస్తుంటారు పోతుంటారు. కానీ, మామిడి పండ్లు శాశ్వతం. కొన్నేళ్ల తర్వాత ఎవరైనా ఈ సచిన్ మ్యాంగోను తింటే.. క్రికెట్ హీరోను గుర్తు చేసుకుంటారు.' అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ! -
మామిడి పండు తింటున్నారా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
కర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తూ నోరూరిస్తున్నాయి. పసుపు పచ్చ రంగులో ఆకర్షించే అలాంటి మామిడిని చూసి మోసపోవద్దంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అయితేనే అంతలా ఊరిస్తాయని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా లేదా ఎథ్రిల్ లిక్విడ్‌తోనైనా మాగబెట్టిన పండ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లకు సహజసిద్ధంగా మాగిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. చదవండి: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే! కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు.. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు మొత్తం లేత పసుపు రంగులో ఒకే విధమైన కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. పైకి మాగినట్లు కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి రుచి పుల్లగా ఉంటుంది. పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం తక్కువగా ఉండి, తీపి, రుచి అంతంత మాత్రమే ఉంటాయి. పండు తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. పండు త్వరగా పాడైపోతుంది. సహజసిద్ధంగా మాగిన పండు.. సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తీయగా, రుచిగా ఉంటుంది. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు.. కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తింటే కాన్సర్, అల్సర్, కాలేయం(లివర్), మూత్ర పిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీన్ వాయువు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతులు.. మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాలలో ఉంచాలి. లేదా పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. లేదా తప్పని పరిస్థితుల్లో మామిడి కాయలు మాగబెట్టాల్సి వస్తే ఇథిలిన్ వాయువు(గ్యాస్) 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ఈపద్ధతిని రైపనింగ్ చాంబర్లో వినియోగిస్తున్నారు. ఎథ్రిల్ లిక్విడ్‌లో 5 నిముషాలు పాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గర మాగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్‌ను కాయలకు స్ప్రే చేయవచ్చు. తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీళ్లతో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కాల్షియం కార్బైడ్‌తో మాగించొద్దు ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగించరాదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎలా మాగించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, ఏడీ ఉద్యానశాఖ కర్నూలు -
‘నున్న’ మామిడి ర్యాంపు మీద..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్ వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ.. నున్న మార్కెట్ నుంచి మాత్రం మార్చి 20 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రస్తుతం నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని కల్లూరు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. రోజుకు 300నుంచి 400 టన్నుల పండ్లు దేశంలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇప్పటివరకు నున్న మార్కెట్ నుంచి 2 వేల టన్నులకు పైగా కాయలు ఎగుమతి అయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి తగ్గినా.. ధరలు ఆశాజనకం ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యంగా వచ్చింది. జనవరిలో కొంత పూత వచ్చినప్పటికీ వైరస్ బారిన పడటంతో పిందెకట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి రాగా.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట లభిస్తుందంటున్నారు. గత ఏడాది మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70–80 వేల వరకు ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టన్ను మామిడిపండ్ల ధర రూ.55 వేల వరకు పలుకుతోంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రసాలకు మంచి గిరాకీ ఉంది. కాయలు పక్వానికి రావడంతో తోటల్లోనే కాయ రూ.15– రూ.20 వరకు అమ్ముతున్నారు. పెద్ద రసాలు ఒక్కో కాయ రూ.25నుంచి రూ.30 పలుకుతోంది. సరుకు పూర్తి గా మార్కెట్లోకి వస్తే కొంత మేర ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు. మంచి ధర వస్తోంది ఈ ఏడాది మామిడి పండ్లు మంచి ధర పలుకుతున్నాయి. గతంలో ధరలు తగ్గిపోతాయేమోననే భయంతో రైతులు తొందరపడి పక్వానికి రాని కాయల్ని కోసేవారు. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిగుబడులు తగ్గడంతో సరుకు తక్కువగా ఉంది. అందువల్ల రైతులు కాయలు పక్వానికి వచ్చాకే కోస్తే బరువు పెరుగుతుంది. ధరలు కొంత అటూఇటూ ఉన్నా రైతులకు నష్టం ఉండదు. – శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ, ది మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్, నున్న -
సీడ్ లెస్ మ్యాంగో...ఇంతకీ టెంక ఉందా? లేదా? వైరల్ వీడియో
వేసవికాలం వచ్చిందంటే గుర్తొచ్చే పండ్లలో మామిడిపండుదే అగ్రస్థానం. రకాలు ఎన్ని ఉన్నా.. ఆ మధురమైన రుచికి ఫిదా కాని ఎవరైనా ఉంటారా.అందుకే 4వేల వేళ్లకు పైగా ప్రసిద్ది చెందిన మామిడి ఫలాన్ని వేదాల్లో "దేవతల ఫలం" పేర్కొన్నారు. అయితే టెంక లేని మామిడి పళ్లను ఎపుడైనా చూశారా?. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పచ్చని రంగుతో మెరిసిపోతూ, భలే నోరూరుస్తున్నాయి. అయితే ప్రకృతికి విరుద్ధంగా ఇలాంటి పండించడం వల్ల ప్రకృతిలో లభించేటువంటి పళ్ళు కూరగాయలు అన్నీ మాయమైపోయాయి తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. దీని వలన నష్టమే కానీ లాభం లేదు "టెంక లేని మామిడి పండు అంటే మెదడు లేని శరీరం" అనికొందరు. టెంక లేదు =పోషకాలు లేవు= ఆరోగ్యం లేదు కొందరు కమెంట్ చేస్తున్నారు. అంతేనా.. టెంక లేకుండా థ్రిల్ ఏముందబ్బా. నో ..వే.. మామిడికాయ టెంకతో తింటేనే ఆనందం అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తీపైనా ఉందా? లేదా...నిజంగా ఇలాంటి కాయలున్నాయాంటూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. కాగా భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు ఈ తరహా కొత్త రకాన్ని 2014లోనే అభివృద్ధి పరిచారు. టెంక లేని మామిడి పండ్లు🥭🥭 pic.twitter.com/gxPsLShRmY — 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 (@Kishoredelights) March 29, 2022 -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్‌డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్‌హౌజ్‌లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అల్లాహార్‌లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపిన దీదీ
కోలకతా: దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం ఎవరికైనా ఉందంటే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జినే అని చెప్పాలి. ప్రత్యర్థులపై తనదైన మాటల దాడితో విరుచుకుపడటంలో మమతకు మరెవరు సాటిలేరనే సంగతి తెలిసిందే. రాజకీయాల పరంగా ఎంత సూటిగా, ఘాటుగా వ్యవహరిస్తారో అలానే సంప్రదాయాల పరంగానూ అదే తీరు కనుబరుస్తారని నిరూపించారు దీదీ. తాజాగా మమత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా హిమసాగర్, మాల్డా, లక్ష్మణ్‌భోగ్ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు. కాగా ఈ వరుసలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆమె పశ్చిమ బెంగాల్ మామిడి పండ్లను బహుమతిగా పంపారు. చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం -
డజను మామిడి పండ్లు.. ఒక్కోటి రూ. 10వేలు
రాంచీ: కరోనా కారణంగా స్కూళ్ళన్నీ మూసివేయండంతో, విద్యార్ధులు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు ఆన్ లైన్ తరగతుల్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లిదండ్రులకు ఆన్లైన్ క్లాస్‌లు పెద్ద సమస్యగా మారింది. మూడుపూటల తినడానికే లేని వారికి స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు అంటే కష్టం. దాంతో చాలా మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన తులసి కుమారి అనే పదకొండేళ్ల బాలిక ఆన్లైన్లో చదువుకునేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈమెపై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి చూసి చలించిపోయిన ముంబైకి చెందిన అమెయా హేతే ఆమెకు ఏ విధంగానైనా సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆన్లైన్ క్లాస్‌లు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనే ఆ చిన్నారి కోరిక నేరవేర్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆమె అమ్ముతున్న మామిడి పండ్లను ఒక్కక్కొటి రూ. 10వేలు చొప్పున .. 12మామిడి పండ్లను లక్షా 20వేలకు అమెయా హేతే కొనుగోలు చేశాడు. డజను మామిడి పళ్లు ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడంతో తులసి ఆనందానికి హద్దుల్లేవు. తన కుమార్తె చదవుకునేందుకు సాయం చేసిన అమెయా హేతే కు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు
కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. మామిడికాయలు విరగకాసింది. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఉపాధ్యాయుడు పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రం ఈ అద్భుతానికి వేదికైంది. ఇక్కడ 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఉద్యానవన శాఖాధికారులు, రైతులు ఈ చెట్లను తిలకించారు. –కంకిపాడు -
మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం
సాక్షి, వరంగల్ : వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో కమీషన్ వ్యాపారులు ఒకరిద్దరే దశాబ్దాల కాలంగా శాసిస్తున్నారు. మార్కెట్లో బడా వ్యాపారులుగా పేరు ఉండడంతో వీరు చెప్పిందే ధర.. కాదు కూడదంటే సదరు రైతు, దళారులకు సంబంధించిన మామిడి కాయలను ఎవరు కొనుగోలు చేసేందుకే సాహసం చేయరు. ఈ విషయాన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తామేం చేయలేమన్న సమాధానం వస్తుంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు సైతం ఒకరిద్దరి కనుసన్నల్లోనే లావాదేవీలు జరుపుతుంటారు. ఇక ఓ వ్యాపారి అయితే పండ్ల మార్కెట్లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట నాలుగైదు మడిగెలను సొంతం చేసుకున్నారు. కరోనా సాకుతో పండ్ల మార్కెట్‌ను నగర శివార్లలోకి మార్చడం వెనుక కూడా సదరు వ్యాపారి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గత సంవత్సరం సుమారు రూ.కోటి మేర వ్యాపారులు కట్టాల్సిన మార్కెట్ ఫీజుకు ఎగనామం పెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు వాయిదాల వారీగా చెల్లించక తప్పలేదు. ప్రతీ టన్నుకు క్వింటా తరుగు, కమీషన్ 4శాతానికి బదులు 10శాతం తీసుకుంటున్నా అధికారులు చూస్తున్నారే తప్ప సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టన్నుకు క్వింటా దోపిడీ మామిడి కొనుగోలు చేస్తున్న కమీషన్ వ్యాపారులు టన్నుకు క్వింటాను తరుగుగా తీసివేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మార్కెట్ అధికారిక లెక్కల ప్రకారం 2,57,046 కింటాళ్ల మామిడి కొనుగోలు చేయగా తరుగు కింద 25వేల క్వింటాళ్లకు పైగా వ్యాపారులు రైతుల వద్ద తరుగు పేరుతో దోచేశారు. క్వింటాకు మోడల్ ధరగా రూ.2,500 చొప్పున వేసుకున్నా సుమారు రూ.కోటికి పైగా రైతులు తమ ఆదాయాన్ని కమీషన్ వ్యాపారుల వల్ల కోల్పోయినట్లే. ఖమ్మంతో పాటు ఇతర మార్కెట్లలో టన్నుకు 40కిలోలు తరుగు కింద తీసివేస్తారని తెలిసింది. కానీ ఇక్కడ క్వింటా తీస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మార్కెట్ అధికారులను ప్రశ్నిస్తే కమీసన్ ‘వ్యాపారుల లీడర్ నుంచి మా ఇష్టం.. అమ్మితే అమ్మండి లేకుంటే లేదు’ అనే సమాధానం వస్తోందని చెబుతున్నారట. తరుగు, కమీషన్లపై తాము ఎక్కువగా ఒత్తిడి చేస్తే కొనుగోళ్లు మొత్తం ఆపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నందున ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతుండడం గమనార్హం. చదవండి: ‘ఆర్ఎఫ్సీఎల్’లో లీకవుతున్న గ్యాస్ -
మామిడి మార్కెట్లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ‘మధురఫలం.. చైనా హాలాహలం’ శీర్షిక న మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగిం చింది. సీజనల్ ఫ్రూట్స్‌ను 24 గంటల్లో మగ్గపెట్టి సొమ్ము చేసుకునే లక్ష్యంతో కొంతమంది వ్యాపారులు నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను మోతాదు కు మించి వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పురుగుమందుల మాటున చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎథెఫాన్ పౌడర్‌ను ఇష్టానుసారం వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. ఆహార భద్రతా విభాగం, ఉద్యానశాఖ కమిషనర్లు కాటమనేని భాస్కర్, డాక్టర్ ఎస్. ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో కలిసి ఆహార భద్రతా విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశాలతో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖరరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీకాంత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యాంగో మార్కెట్లను విస్తృతంగా తనిఖీ చేశా రు. రాష్ట్రంలోని ప్రధాన మ్యాంగో మార్కెట్లలో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌తో పాటు జిల్లాలోని ఇతర మార్కెట్లలో దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని మార్కెట్లలోను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా ఎథెఫాన్‌ను విచ్చలవిడిగా విని యోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ మార్కెట్లలో శాంపి ల్స్ సేకరించి కేసులు పెట్టారు. ఈదరలోని కేజీఎన్ మ్యాంగో కంపెనీ, చీమలపాడులోని రసాలు మ్యాంగో కంపెనీ, చీమలగూడెంలో శ్రీరామాంజనేయ ఫ్రూట్ మార్కెట్, ఎ.కొండూరులో కృష్ణ ఆగ్రోస్ (మ్యాంగో యార్డు), నున్న మార్కెట్లోని యశస్వినీప్రసన్నలక్ష్మి ఫ్రూట్ కంపెనీ, కోటేశ్వరరావు ఎస్బీఎఫ్ కంపెనీలపై 9 కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈ దాడులు కొనసాగుతాయి. ఈరోజు కృష్ణాజిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తనిఖీలు మ్యాంగో సీజన్‌కు పరిమితం కాదు. బొప్పాయి, బత్తాయి, జామ, అరటి తదితర పండ్లను మాగబెట్టే విషయంలో ఎథెఫాన్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. – స్వరూప్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ -
Nuziveedu Mango: లండన్‌కు బంగినపల్లి మామిడి
సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ మామిడి ఎగుమతుల జోరు కొనసాగుతుంది. రెండ్రోజుల క్రితం దక్షిణకొరియాకు తొలి కన్సైన్మెంట్ వెళ్లగా, తాజాగా నూజివీడు నుంచి లండన్‌కు తొలి కన్సైన్మెంట్ వెళ్లింది. లండన్‌కు చెందిన వ్యాపారులు నూజివీడు ప్రాంతంలో పండే బంగినపల్లి రకం మామిడి 50 టన్నుల కోసం ఇక్కడి రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు తొలి కన్సైన్మెంట్గా నూజివీడు మండలం హనుమంతునిగూడెంకు చెందిన రాఘవులుకు చెందిన 1.5 టన్నుల బంగినపల్లి మామిడిలోడు ముంబై మీదుగా విమానంలో లండన్ బయల్దేరింది. రాఘవులు తోటలో పండిన బంగినపల్లి మామిడిని పామర్రు ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌లో ప్రాసెస్ చేయగా, ప్రత్యేక కంటైనర్ ద్వారా విమానంలో ముంబై పంపించారు. అక్కడ నుంచి లండన్‌కు పంపించనున్నారు. ఈ నెలాఖరులోగా ఒప్పందం మేరకు మిగిలిన బంగినపల్లి మామిడిని లండన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నూజివీడు ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. రైతుకు టన్నుకు రూ.32 వేలు చొప్పున చెల్లించారని చెప్పారు. కరోనా ఉధృతి కాస్త తగ్గితే నిర్దేశించిన లక్ష్యం మేరకు యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు. -
ఖండాంతరాలకు నూజివీడు మామిడి
సాక్షి, అమరావతి బ్యూరో: రుచి, నాణ్యతలో నూజివీడు మామిడి పెట్టింది పేరు. అందుకే మామిడి ప్రియులు నూజివీడు మామిడి తినాల్సిందేనంటారు. ఇప్పుడు నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి పనికొచ్చేలా వీటి నాణ్యత ఉండటంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ఉధృత రూపం దాలుస్తుండడంతో మార్కెట్లో మామిడి ధర క్షీణించింది. నెలరోజుల కిందటివరకు టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలికిన బంగినపల్లి రకం ఇప్పుడు స్థానిక మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. ఫిబ్రవరి ఆఖరులో టన్ను తోతాపురి రకం రూ.80 వేల ధర ఉండగా ఇప్పుడు రూ.10 వేలలోపే పలుకుతోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేసేవారు నాణ్యమైన బంగినపల్లిని టన్ను రూ.50 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. 10 రోజుల కిందట అర టన్ను బంగినపల్లి మామిడిని టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేసి ఎగుమతిదార్లు సింగపూర్‌కు పంపారు. 5 రోజుల కిందట కృష్ణాజిల్లా పామర్రులోని ప్యాక్‌హౌస్ నుంచి 12 టన్నుల మామిడిని ఒమన్ దేశానికి ఎగుమతి చేశారు. అలాగే శనివారం మరో 15 టన్నుల బంగినపల్లి మామిడిని దుబాయ్‌కి పంపనున్నారు. తాజాగా నూజివీడు మండలం హనుమంతునిగూడెం నుంచి రాఘవులు అనే రైతు వద్ద 2 టన్నుల బంగినపల్లి మామిడిని టన్ను రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని తిరుపతిలోని ప్యాక్‌హౌస్‌లో ప్రాసెస్ చేసి దక్షిణ కొరియాకు ఎగుమతి చేయనున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేలా ఎగుమతిదారులను ఉద్యానశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఎగుమతిదార్లతో గతనెలలో విజయవాడలో మ్యాంగో బయ్యర్స్, సెల్లర్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా)తో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూజివీడు మామిడి రుచి, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర ప్రాంతాల ఎగుమతిదార్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. 100 టన్నుల ఎగుమతి దిశగా.. గత ఏడాది కృష్ణా జిల్లా నుంచి విదేశాలకు నూజివీడు మామిడి సుమారు 60 టన్నులు ఎగుమతి చేశారు. ఈ సీజనులో ఇప్పటివరకు 12.5 టన్నుల బంగినపల్లి మామిడి సింగపూర్, ఒమన్ దేశాలకు ఎగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో మరో 17 టన్నులు దుబాయ్, దక్షిణ కొరియాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నూజివీడు ఉద్యానశాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఏడాది దాదాపు 100 టన్నుల వరకు నూజివీడు మామిడిని ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
‘కిసాన్ రైలు’ వస్తోంది!
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మామిడికి మంచి రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత ఉండటం తో వీటికి ఉత్తర భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, జమ్ము, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఇప్ప టివరకు లారీల్లో మామిడిని తరలించిన వ్యాపారులు, ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సోమవారం కిసాన్ రైలు జగిత్యాల–లింగంపేట రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకోనుంది. మామిడికాయలు వ్యాగన్లలో లోడ్ కాగానే రాత్రి 11 గంట లకు రైలు ఢిల్లీ బయలుదేరుతుంది. సీజన్ ముగిసే వరకు.. మామిడి సీజన్ ముగిసే వరకు జగిత్యాల నుంచి ఢిల్లీకి కిసాన్‌రైలును నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం సోమవారం 20 వ్యాగన్లలో 460 టన్నుల మామిడికాయలను తరలించనున్నారు. 14న, 19న మళ్లీ కిసాన్ రైలు మామిడి కాయలతో జగిత్యాల నుంచి ఢిల్లీ వెళ్లనుంది. ఇలా సీజన్ ముగిసే వరకు నడిపనున్నారు. ఈ రైలును ఉపయోగించుకుంటే 50% సబ్సిడీ ఇస్తారు. కాగా, కిసాన్‌రైలు ద్వారా రైతులకు, వ్యాపారులకు మేలు జరుగుతుందని రైల్వే అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుభమ్జైన్ అన్నారు. ఎంతవరకు అవసరమైతే ఆ మేరకు కిసాన్ రైళ్లను నడిపిస్తామని చెప్పారు. జగిత్యాలలో కొనుగోలు చేసిన మామిడికాయలను ఎక్కువగా ఢిల్లీ పంపిస్తాం. అయితే, డీజిల్ ధర పెరగడంతో రవాణా భారం ఎక్కువైంది. ఈ సమయంలో కిసాన్‌రైలును ఉపయోగించుకుంటున్నాం. దీని ద్వారా రవాణా ఖర్చు తక్కువ అవడమేకాక ఒక్క రోజులోనే ఢిల్లీకి చేరుతుంది. దీని ఫలితంగా రైతులకు సైతం కొంత రేటు పెరిగే అవకాశం ఉంటుంది. – సాధిక్, మామిడి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి, జగిత్యాల -
ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు
జైపుర్ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్ ఫిలిప్ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్ : ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు దగ్గరి పోలికలు ఉండటం!! క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్ మహారాణి గాయత్రీదేవి, మాన్సింగ్ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్సింగ్ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్సింగ్ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్ లో ఆ జంటదీ ఇదే కథ. ఫిలిప్ క్రికెట్ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్ ఎలిజ బెత్కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్సింగ్ గవర్నర్ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్ ఎలిజబెత్ పుట్టిన లండన్‌లోనే. క్వీన్ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్; గాయత్రిదేవి, మాన్సింగ్ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్ కపుల్’. వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్ కూడా! ప్రిన్స్ ఫిలిప్ వేసవిలో పుట్టారు. ఏటా జూన్ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్ ఫిలిప్ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్: ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ దంపతులతో గాయత్రీదేవి, మాన్సింగ్ -
నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్
ముంబై : సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్ అయిన నటి మలైకా అరోరా. మొదట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ వంటి విషయాలు మలైకాను హైలైట్ చేశాయి. ఇప్పుడు మరోసారి మలైకా పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన మాజీ భర్త కోసం ఓ పోస్ట్ పెట్టడమే. మలైకా కోసం అర్భాజ్ తన తోటలోని రుచికరమైన మామాడి పండ్లు పండ్లను బహుమతిగా పంపాడు. దీంతో అతడికి థ్యాంక్స్ చెబుతూనే, దీన్ని ఆన్లైన్లో సైతం ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతూ మాజీ భర్త బిజినెస్‌ను ప్రమోట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు..మలైకా పోస్ట్‌ను తెగ షేర్ చేస్తుండటంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది సేపటికే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నుంచి దీన్ని డిలీట్ చేసేసింది మలైకా. అయితే అప్పటికే దీన్ని స్ర్కీన్షాట్లు చేస్తూ నెటిజన్లు వైరల్ చేసేశారు. కాగా ఓ యాడ్ షూట్లో ప్రేమలో పడిపోయిన మలైకా- అర్భాజ్ ఖాన్లు 1998లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తడంతో 18 ఏళ్ల వైవివాహిక బంధానికి ఇరువురు గుడ్ బై చెప్పేసుకున్నారు. వీరి విడాకులు అయిన కొద్ది కాలానికే మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉండగా.. అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. తన కన్నా వయసులో 12 ఏళ్ల చిన్నవాడు అయినప్పటికీ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది ఈ హాట్ బ్యూటీ. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్నెస్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఇక అర్జున్- మలైకా రిలేషన్షిప్లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పలు పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతుంటారు. బుధవారం రాత్రి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో వీరిద్దరూ కనపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : డిన్నర్: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి! విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు.. -
5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు ఒప్పందాలు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అగ్రికల్చరల్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) సౌజన్యంతో ఉద్యానశాఖ మంగళవారం విజయవాడలో ఓ హొటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బయ్యర్లు–సెల్లర్ల మీట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన సుమారు వంద మందికి పైగా మామిడి రైతులు, దేశం నలుమూలల నుంచి ఏటా దేశ విదేశాలకు ఎగుమతి చేసే 55 మంది అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు పాల్గొన్నారు. ఈ మీట్లో 5 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు రైతులు–ఎగుమతిదారుల మధ్య జరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టార్‌కు 15 టన్నుల చొప్పున 56 లక్షల టన్నులకుపైగా మామిడి దిగుబడులు రానున్న దృష్ట్యా ఆ స్థాయిలో ఎగుమతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విజయవాడ, తిరుపతిలలో బయ్యర్స్– సెల్లర్స్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ..మామిడి ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. అపెడా ఏజీఎం నాగ్‌పాల్ మాట్లాడుతూ..మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయాలనుకునే రైతులు అపెడా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖాముఖి భేటీలో పలువురు ఎక్స్‌పోర్టర్స్ మాట్లాడుతూ అమెరికా, సింగపూర్, లండన్ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ కార్గోహెడ్ అబ్రహాం లింకన్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి 'మిడే'
సాక్షి, సిటీబ్యూరో: కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలు అన్నట్లు.. అటు కోవిడ్ వైరస్.. ఇటు మార్కెట్ తరలింపు.. ఆపై రవాణా వసతులు సరిగా లేకపోవడంతో నగరానికి పండ్ల దిగుమతులు భారీ స్థాయిలో పడిపోయాయి. ఒకవైపు రైతులు పండించిన పంట చేతికి అందినా సరుకును మార్కెట్లో విక్రయించుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సొంత ప్రాంతాల్లోనే అమ్ముకుంటున్నారు. మరోవైపు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కోహెడకు తరలింపుతోనూ వ్యాపారులకు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ గడ్డిఅన్నారం మార్కెట్. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పండ్ల దిగుబడులు ఇక్కడికే ఎక్కువగా తీసుకువస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ మార్కెట్లో విక్రయిస్తే ఆశించిన ధరలు వస్తాయని రైతులు నమ్మకం. కానీ ఈ ఏడాది మామిడితో పాటు పుచ్చకాయ, బత్తాయి దిగుబడులు బాగానే ఉన్నా.. కరోనాకారణంగా మార్కెట్ కొన్ని రోజులు బంద్.. కొన్ని రోజులుతెరిచి ఉండడంతో రైతులు స్థానికంగానే పండ్లను విక్రయించుకున్నారు. గత ఏడాది వేసవిలో మామిడి, బత్తాయి, పుచ్చకాయలు నిత్యం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రికార్డు స్థాయిలో దిగుమతి అయ్యాయని మార్కెట్ కమిటీ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మామిడి 8.42 లక్షల క్వింటాళ్లు దిగుమతి కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.96 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పుచ్చకాయ, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ దిగుమతులు సైతం సగానికి సగం పడిపోయాయి. ఎక్కడికక్కడే విక్రయాలు.. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో పండ్ల సాగు అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఉంది. కానీ ముందస్తుగా మార్కెటింగ్ శాఖ ఉన్నత అధికారులు ప్రణాళికలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పుచ్చకాయ, మామిడి, బత్తాయి దిగుబడులు చేతికి వచ్చినా.. లాక్‌డౌన్‌తో పాటు కోహెడకు మార్కెట్ తరలింపు, అది కొన్ని రోజులు మూసివేయడంతో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అయినా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ పండ్ల అక్కడికి తరలించారు. ఈదురు గాలులు, భారీ వర్షాలతో మార్కెట్లోని షెడ్డులు నేలకూలాయి. అంతేకాదు అక్కడ ప్లాట్‌ఫాంలు కూడా లేకపోవడంతో మామిడి కాయలు వర్షానికి కొట్టుకుపోయాయి. దీంతోనూ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోహెడలో పూర్తి స్థాయిలో మార్కెట్ పనులు కాకపోయినా ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా మార్కెట్‌ను అక్కడికి తరలించాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలతో అటు రైతులకు, ఇటు వ్యాపారులకు కోలుకోలేని నష్టం జరిగిందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ గడ్డిఅన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చే కాయలను నేలపై పోసేందుకు రైతులకు అనుమతి లేదు. లారీలు, ఇతర వాహనాల్లోనే పండ్లు పెట్టి విక్రయించాల్సిన పరిస్థితి ఉందని ఓ మామిడి రైతు ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఏడాది పండ్ల మార్కెట్ మూడు ప్రాంతాల్లో తరలించడంతోనూ పుచ్చకాయ రైతులు వాహనాల్లోనే సరుకును ఉంచి వచ్చిన ధరలకు అమ్ముకున్నారు. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీకి మార్చి నుంచి మే వరకు మామిడి, పుచ్చకాయ, బత్తాయి, ద్రాక్షతో పాటు ఇతర పండ్ల సీజన్. ఇందులోనూ మామిడి సీజన్‌తో మార్కెట్‌కు కాసుల పంట ఉంటుంది. కానీ ఈ ఏడాది మామిడి దిగుమతులు విపరీతంగా పడిపోవడంతో మార్కెట్ ఆదాయానికి గండి పడింది. మార్కెట్ లెక్కల ప్రకారం గత ఏడాది మార్చిలో రూ.89.32 లక్షలు ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.90.91 లక్షలు సమకూరాయి. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.13 కోట్లు రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 49.28 లక్షలు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరం మే నెలలో రూ.1.49 కోట్లు రాగా.. ఈ ఏడాది మే 27 వరకు రూ.71.17 లక్షల ఆదాయం వచ్చింది. ఏడాది పాటు వివిధ రకాల పండ్లు మార్కెట్‌కు దిగుమతి అయినా వేసవిలో మామిడి సీజన్లతో ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ మార్కెటింగ్ శాఖ, కమిటీ అనాలోచిత నిర్ణయాలతో మార్కెట్ ఆదాయం భారీగా తగ్గిందని ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకోనుంది. -
ఆవకాయ.. టేస్టే వేరు..
ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మహిళలు మార్కెట్‌కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు. దిల్సుఖ్నగర్: మలక్‌పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. మామిడి పచ్చళ్లలో రకాలెన్నో... మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. పెరిగిన మామిడికాయ ధరలు.. గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. -
మామిడి రైతుకు ‘అకాల’ కష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. మొన్నటి దాకా ‘ఫలం’చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానతో కాయలు రాలిపోగా, ఉన్న కొద్దిపాటి మామిడిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షాలకు తోడు గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ తరలింపు, కొత్తగా ఏర్పాటుచేసిన కోహెడ మార్కెట్ కూలడం మామిడి రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమ్మకాలకు డిమాండ్ ఉండే ఈ సీజన్లో లాక్డౌన్ ఉండటం, అమ్మకాలు తగ్గడం వారి కష్టాలను రెట్టింపు చేస్తోంది. ‘తీపి’కరువైన మామిడి రాష్ట్రవ్యాప్తంగా 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాలు ఈ తోటలకు ప్రసిద్ధి. సగటున ఏటా మామిడి దిగుబడి 5 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఈ ఏడాది వడగండ్ల వానలు, అకాల వర్షాలతో పంట దిగుబడి 4 లక్షల టన్నులకు తగ్గిందని అంచనా. జగిత్యాల మామిడికి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మామిడికి మంచి ఆదరణ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, దషేరి, రసాలు వంటి రకాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రకాలన్నీ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతవుతుంటాయి. లాక్డౌన్ కారణంగా ఈసారి దారులన్నీ మూసుకుపోయాయి. హోల్‌సేల్ వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడంతో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్లపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ఉన్న ఒక్క మార్కెట్లో అష్టకష్టాలు.. మామిడి అమ్మకాలకు గడ్డిఅన్నారం మార్కెట్ ప్రధానమైనది. అయితే, ఈ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలతో భౌతికదూరం పాటించే అవకాశాలు లేకపోవడం, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో దీన్ని గత నెల 22 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. మార్కెట్‌ను వికేంద్రీకరణ చేసి మామిడి మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అక్కడ ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్న సమయంలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులకు షెడ్డు కూలిపోవడం కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మార్కెట్‌కు రోజూ 1,500 టన్నులకుపైగా మామిడి వస్తుండటంతో మళ్లీ మార్కెట్‌ను గడ్డిఅన్నారం తరలించారు. మూడ్రోజుల పాటు ఇక్కడే మామిడి అమ్మకాలు కొనసాగనున్నాయి. మళ్లీ మూడ్రోజుల్లో కోహెడ మార్కెట్‌ను పునరుద్ధరించి అక్కడికే తరలిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు సరుకు ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరికి, ఎంతకు అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. కలిసిరాని సీజన్ ఏటా సీజన్ ప్రారంభంలోనే మామిడిపండ్లకు మంచి ధర పలుకుతుంది. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతేడాది క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధరరాగా ఈసారి రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్యనే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మార్చిలో మొదలయ్యే మామిడి సీజన్ జూన్ వరకు కొనసాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లో మామిడి మార్కెట్ కళకళలాడుతుండేది. ఈసారి సీజన్ ఆరంభంలోనే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో పరిస్థితి తారుమారైంది. పచ్చళ్లకు వాడే మామిడిని కొనేవారే లేరు. బేకరీలు, స్వీట్ దుకాణాలు లేక జామ్‌ల తయారీ నిలిచిపోయింది. మామిడి తాండ్ర పరిశ్రమలు మూతపడి మామిడి కొనుగోళ్లు నిలిచిపోయాయి. -
ఫోన్ కొడితే మామిడి పండ్లు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్‌ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్‌చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్ ద్వారా ఆర్డర్ల బుకింగ్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. -
ఫోన్ కొడితే మామిడి పండ్లు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్‌ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్‌చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్ ద్వారా ఆర్డర్ల బుకింగ్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. -
మామిడి.. ఊపందుకున్న రవాణా
సాక్షి, అమరావతి: పండ్లలో రారాజు మామిడికి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. నోరూరించే రసాలు, చూస్తేనే తినాలనిపించే బంగినపల్లి, చెరకును మరిపించే సువర్ణరేఖ.. ఇలా మొత్తం 30 రకాల పండ్లకు రాష్ట్రం నిలయం. లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మామిడి పండ్లను తినగలుగుతామా? అనే బెంగ లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు పండ్లను చేర్చే క్రమంలో మార్కెటింగ్, ఉద్యాన శాఖలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ రకాల కిట్ల రూపంలో అడిగిన వెంటనే పండ్లను సరఫరా చేసే ప్రక్రియ కూడా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రారంభమైంది. అయితే కాయలు పక్వానికి రాకముందే కోస్తే సమస్యలుంటాయని, కొన్ని రోజులు వాయిదా వేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యమని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి సూచించారు. మరో 15 రోజుల్లో సీజన్ ఊపందుకోనున్న తరుణంలో మామిడి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు ► దళారులు లేకుండా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం ► రైతులు, కొనుగోలుదార్ల మధ్య మీటింగ్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీవోలు) అనుసంధానం. ► ఎపెడా(అ్కఉఈఅ– అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) సహకారంతో ఎగుమతులు పెంపొందించడం ► ఇ–రైతు, కిసాన్ నెట్ వర్క్, కాల్‌గుడీ, ఎన్ఇఎం వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారాలపై అవగాహన కల్పించి రైతులు, ఎఫ్‌పీవోల నుంచి నేరుగా ఆన్లైన్లో సరకు కొనుగోలు ► స్థానిక మార్కెట్ల ఏర్పాటు. ఇళ్ల ముంగిటకే సరకును సరఫరా చేయడం ► పండ్ల రవాణాకు తక్షణమే పర్మిట్లు. లాక్డౌన్ ఆంక్షల తొలగింపుతో ఆటంకం లేకుండా రవాణా ► సమస్యలపై స్థానిక అధికారులను లేదా 1902, 1907 నెంబర్లలో సంప్రదించే అవకాశం రాష్ట్రంలో 3.85 లక్షల హెక్టార్లలో సాగు రాష్ట్రంలో సుమారు 3,85,881 హెక్టార్లలో సాగు. ప్రధానంగా కృష్ణా, చిత్తూరు, విజయనగరం,విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు,వైఎస్సార్ కడప జిల్లాలలో అత్యధిక సాగు, ఉత్పత్తి. ► రైతులకు రోజువారీగా ధరల సమాచారం తెలిసేలా చర్యలు. ► అంతర్రాష్ట్ర వాణిజ్యానికి చొరవ. ఎగుమతుల కోసం 54 ఎఫ్‌పీవోలు. ► రవాణాకు ప్రత్యేక రైళ్ల కోసం నాఫెడ్‌తో ఒప్పందం ► చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లతో ఒప్పందం ► శుక్రవారం నాటికి 25, 628 టన్నుల సేకరణ. రాష్ట్రం నుంచి ఎగుమతులు ఇలా ► కృష్ణా, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పలు దేశాలకు ఎగుమతి. ► ఎగుమతి కోసం రైతులు ఎపెడా(అ్కఉఈఅ) రూపొందించిన హార్టీ నెట్ వెబ్ నుంచి ఉద్యాన శాఖ వద్ద నమోదు చేసుకునే అవకాశం. ► 2018–19లో 1471 టన్నుల సరకు ఎగుమతి కాగా, ఈ ఏడాది మూడు వేల టన్నులు లక్ష్యం. ► ఇప్పటికే న్యూజిలాండ్,స్విట్జర్లాండ్‌కు ఎగుమతులు. ► విదేశీ ఎగుమతులను ఉద్దేశించి తిరుపతి, నూజివీడులలో రెండు వాపర్ హీట్ ట్రీట్మెంట్ యూనిట్లు విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు. ► చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో త్వరలో మరో 9 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసులు. రైతుల సమస్యలు ఇవీ ► విమాన రవాణా ఛార్జీలు, ఇతర రాష్ట్రాలకు లారీల కిరాయి అధికం. వీటిని తగ్గించాలని ఎఫ్‌పీవోల వినతి. ► దిగుబడి తక్కువగా ఉన్నా.. ధరలు గత ఏడాది కంటే తక్కువ. ► కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు టన్ను ధర రూ.80 వేలు. ఇప్పుడు రూ.35వేలు మాత్రమే. ► చాలా చోట్ల మార్కెటింగ్ సౌకర్యం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ► రైతులకు కనీస మద్దతు ధరలు లభించేందుకు చర్యలు తీసుకుంటామని, మార్కెటింగ్ సదుపాయాలు అన్ని చోట్లా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. నౌక,విమానయాన సంస్థలతో సంప్రదింపులు పండ్లను నౌకలు, విమానాల ద్వారా పంపేందుకు ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక కార్గోలు నడిపేందుకు ముందుకొచ్చాయి. కాయలను పండించేందుకు కార్బైడ్‌ను నిషేధించాం.ఎథిలిన్ ప్లాంట్లను వినియోగిస్తున్నాం. – పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి టన్నుకు రూ.60 వేలు వస్తేనే లాభం కరోనా వైరస్ మా ఆశలను నీరుగార్చింది. బంగినపల్లికి టన్నుకు కనీసం రూ.60 వేల వరకు ధర ఆశించాం. లాక్డౌన్ సడలింపుతో చెన్నై వ్యాపారులు వచ్చి టన్నుకు సగటున రూ. రూ.35 వేల వరకు ఇస్తున్నారు. కనీసం రూ.60 వేల వరకు ధర ఉంటేనే రాణించగలం. - వెంకటసుబ్బారెడ్డి,ఓర్వకల్ మండలం, కర్నూలు జిల్లా -
స్విట్జర్లాండ్‌కు ఏపీ మామిడి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా తిరుపతి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ హౌస్ సంస్థ నుంచి స్విట్జర్లాండ్‌కు 1.2 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను ఎగుమతి చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ సహకారంతో రైతులు, వ్యాపారులు కలిసి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ సంస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పండే వివిధ పండ్లు, కూరగాయలను ఇది విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా మామిడి దిగుబడి అవుతుండగా అందులో 1000 టన్నుల వరకు అమెరికా, యూరోప్, దక్షిణాసియా దేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా బంగినపల్లి, సువర్ణ రేఖ, ఆల్ఫోన్సా వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది అనడానికి ఇది ఒక శుభసూచికమని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్వీట్ చేశారు. -
కరోనా: తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం
సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్) : మామిడి రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో మామిడి రైతులకు గడ్డు పరిస్థితి నెలకొంది. నానా అవస్థలు పడుతూ.. లక్షల పెట్టుబడి పెట్టి కాపాడుకుంటూ వచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో..? ఏం చేయాలోనని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రకృతి కరుణించకపోవడంతో ఈయేడు మామిడి 30 శాతం వరకే కాత కాసింది. ఆ కాస్త పంటనైనా అమ్ముకోలేక.. ఇతర ప్రాంతాలకు తరలించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకొచి్చన మామిడిని తెంపితే మార్కెట్ లేదు.. తెంపకపోతే వర్షాలు కురిస్తే రాలిపోతాయి. ఇదే బెంగతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. (కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ) 18 వేల ఎకరాల్లో సాగు జిల్లాలోని నెన్నెల, జైపూర్, భీమారం, చెన్నూర్, తాండూర్ మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 6 వేల ఎకరాల్లో నెన్నెలలో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా పరోక్షంగా, ప్రత్యక్షంగా మామిడి తోటలపై 25 వేల మంది రైతులు, కూలీలు ఆధారపడి జీవిస్తుంటారు. ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్, హైదరాబాద్, నిజామాబాద్ పట్టణాల్లోని మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో.. అప్పులు ఎలా తీరుతాయోనని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. కేజీకి రూ.50 చొప్పున సెర్ప్ ద్వారా కొంటే మేలు మామిడికాయలను సెర్ప్ ద్వారా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బంగినపల్లి కాయలు కేజీకి రూ.35 చెల్లించాలని నిర్ణయించారు. కాని ఆ ధర గిట్టుబాటు కాదని ప్రస్తుతం కాత తక్కువగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కేజీకి రూ.50 చొప్పున సెర్ప్ ద్వారా కొనుగోలు చేస్తే కొంత వరకు ఊరట కలుగుతుందని రైతులు అంటున్నారు. బంగినపల్లితో పాటు అన్ని రకాల చిన్న, పెద్ద కాయలను సైతం సెర్ప్ ద్వారా>నే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. (రాష్ట్రపతి భవన్లో కరోనా పాజిటివ్ ) -
ఫలరారాజు విలవిల!
ఉగాది వచ్చేస్తోంది. పచ్చడి చేసుకుందామంటే ఒక్క మామిడి కాయ అయినా కానరావడం లేదు. కారణం ఈ పంటను మంచు ముంచేస్తోంది. దీనినే నమ్ముకున్న వేలాది మంది రైతాంగాన్ని... పరోక్షంగా ఆధారపడిన వ్యాపారులను కలవరపరుస్తోంది. జనవరికి ముందే పూత విరగకాసింది. అది చూసిన అన్నదాత ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంతలోనే ఆరంభమైన పొగమంచుపగబట్టింది. పూతను సమూలంగా మాడ్చేసింది. ఫలితంగా పూత మొత్తం రాలిపోయి... కాయల్లేకుండా తోటలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లక్కవరపుకోట: ఫల రారాజు మామిడికి కష్టమొచ్చింది. ఈ ఏడాది దిగుబడి గగనంగా మారింది. పూత తీవ్రంగా రాలిపోవడంతో మచ్చుకైనా ఓ మామిడి పండు దొరుకుతుందా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం మామిడి తోటలు పూతకు వచ్చినా పూతంతా రాలిపోవడంతో తొడిమలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాణిజ్య పంటలైన జీడి, మామిడి ద్వారా కాసిన్న కాసులు వెనకేసుకోవచ్చనుకున్న రైతాంగానికి నిరాశే మిగులుతోంది. ప్రస్తుత సీజన్లో జీడి, మామిడి చెట్లు పువ్వు, కాయలతో కళకళలాడాల్సి ఉండగా చెట్లు కళావిహీనంగా కన్పిస్తున్నాయి. ఒక పక్కపొగ మంచు, మరో పక్క చీడపురుగులు పట్టడంతో పూత వచ్చినా పిందెలు కాయనీయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పంటకు పెట్టింది పేరు రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో సుమారు 43వేల హెక్టార్లో మామిడి పంట, 16 వేల హెక్టార్లలో జీడి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 35వేల మంది రైతులు మామిడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యాపారులు సుమారుగా 20 వేల మంది ఉంటారు. వీరు రైతులనుంచి డిసెంబర్, జనవరి నెలల్లో మామిడి తోటలను కొనుగోలు చేస్తారు. పూత, నిగారింపును చూసి తోటలను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది మార్చి నెల వచ్చేసినా తోటలు పూతకు రాలేదు. కనీసం వచ్చిన పూత కూడా పిందెకట్టలేదు. అక్కడక్కడ పూత వచ్చినప్పట్టికీ పొగమంచు కారణంగా పూర్తిగా రాలిపోయింది. జిల్లాలో సగటున 4.5లక్షల టన్నుల మామడి దిగుబడి రావాల్సి వుండగా ప్రస్తుత ఏడాది కనీసం సగం దిగుబడైనా వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. జిల్లాలో మామిడి సాగు చేసే మండలాలు మెరకమొడిదాం, దత్తిరాజేరు, రామభద్రపురం, బొబ్బిలి, గంట్యాడ, కొత్తవలస, మెంటాడ, లక్కవరపుకోట, శృంగవరపుకోట, జామి తదితర మండలాల్లో సుమారు 43వేల హెక్టార్లో అత్యధికంగా మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక జీడి మామిడిని కురుపాం, కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస, శృంగవరపుకోట, గంట్యాడ మండలాల్లో అత్యధికంగా 16వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మొదట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కనిపించినప్పటికీ తర్వాత తేనె మంచు పురుగు ఆశించడంతో పూత పూర్తిగా మాడిపోయింది. ఏటా రూ. 40కోట్ల వ్యాపారం జిల్లాలో మామిడి పంటపై సుమారుగా ఏడాదికి రూ.40కోట్ల వరకూ వ్యాపారం సాగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండిన మామిడి పంటకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ వుంది. ముఖ్యంగా ఇక్కడి పంట అరబ్ దేశాలకు ఎగుమతువుతుంది. అలాగే ఢిల్లీ, ముంబాయి, కోల్కత్తా, రాయ్‌పూర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత ఏడాది ఆశించిన పంట లేకపోవడంతో రైతులు, అటు వ్యాపారులు దిగాలైపోయారు. పెట్టుబడి వస్తుందో ,.రాదో నాకు ఐదెకరాల మామిడితోట ఉంది. మరో 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాను. మొత్తం 25 ఎకరాలకు పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా లేదు. ఈ సమయానికి పూర్తిగా కాయలతో ఉండాలి. కనీసం పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. 25 ఎకరాలు బాగా కాస్తే సుమారు రూ. 2.5లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఏడాది తోటల్లో దుక్కి, ఎరువులు, పురుగు నివారణ మందులకు అత్యధికంగా పెట్టుబడులు పెట్టాం. ఫలితం మాత్రం శూన్యమే.– దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం -
మామిడి మధురం.. చైనా నుంచి ఇథిలిన్ పౌడర్
వేసవిలో మామిడి పండ్ల కోసం ఎదురుచూసే వారుండరంటే అతిశయోక్తికాదు. ఆరోగ్యపరంగా తినాల్సిన సీజనల్ పండు కూడా ఇది. వ్యాపారుల అత్యాశ కారణంగా మధుర ఫలం విషతుల్యం అవుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలను వినియోగిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్‌తో మామిడి పండ్లను మగ్గిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదాన్ని కల్గిస్తున్నారు. సాక్షి సిటీబ్యూరో: కాలుష్యకారక కార్బైడ్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. అయితే కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండించి విక్రయించేస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఇందుకు కేంద్ర బిందువుగా మారుతోంది. కోర్టు ఉత్తర్వులు బేఖాతర్... ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలు, రసాయన పౌడర్లను వినియోగించి పండ్లను మగ్గించరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు మార్కెట్లలో హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలున్నాయి. చైనా, కొరియాల నుంచి దిగుమతి... కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా చైనా, కొరియాల నుంచి ఇథిలిన్ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అనుమతి లేకపోయినా కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు ఆపౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్‌ను 5 ఎంఎల్ ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో బాక్స్ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో నీళ్లలో ముంచి మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. ఇథిలిన్ ప్యాకెట్ల ద్వారా మగ్గబెట్టేందుకు తమకు అనుమతి ఉందని వ్యాపారులు పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు చైనా నుంచి తీసుకొచ్చి ఇథిలిన్ అని చేపడుతున్న పౌడర్‌లో కార్బైడ్ ఉన్నట్లు వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల్లోనే కాయ కలర్ మారుతుంది. కార్బైడ్ వాడినప్పుడు ఏవిధంగానైతే వచ్చేదో అలానే పండు రంగు వస్తుంది. పౌడర్ విక్రయాల్లోనూ బ్లాక్ దందా... చైనా నుంచి దిగుమతి చేసిన ఇథిలిన్గా చేప్పే పౌడర్‌ను నాగ్‌పూర్ అడ్రస్ ముద్రించి రీప్యాకింగ్ చేస్తున్నారు. ఇథిలిన్ పౌడర్ ప్యాకెట్ల విక్రయంలోనూ మార్కెట్లో దందా చేస్తున్నారు. పౌడర్ ఒక్కో ప్యాకెట్ రూ. 1.72లకు కొనుగోలు చేస్తున్న ఓ కమిషన్ ఏజెంట్ ఆ ప్యాకెట్‌ను ఒక్కొక్కటి రూ. 5 ప్రకారం బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా 4 రోజులు.. అలా 48 గంటల్లోపే... సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించిన మామిడికాయలు ఆరోగ్యానికి మంచివి. ఇలా మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుతున్నాయి. గడ్డిఅన్నారం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథిలిన్ పౌడర్ ప్యాకింగ్ నిమిత్తం పని చేస్తారు. రుచిలో తేడా... కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. మధుర తీపి ప్రజలు రుచి చూసేవారు. కృతిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి. కఠిన చర్యలు తథ్యం నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. ఇందుకు మార్కెట్లో ఉన్న చాంబర్లను సద్వినియోగం చేసుకోవాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. ఈ సంవత్సరం ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రసాయన పౌడర్లను వినియోగించరాదని స్పష్టం చేశాం. చైనా నుంచి దిగుమతి అయినా ఇథిలిన్ వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం. మార్కెట్, ఆహార భద్రత, హెల్త్ డిపార్ట్మెంట్తో సమావేశం నిర్వహించనున్నాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ -
మామిడి ఉపయోగాలు
►మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం... అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్... శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ►మామిడి పండును తినడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి ►నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది ►మామిడి పండు మంచి జీర్ణకారి ∙ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది ►మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజమైన బరువు పెరిగే అవకాశం ఉంది ►ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుంది ►ఈ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ►వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది ►చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది ►మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది ►శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచే బీటా కెరటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది ►మామిడి పండుకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయఫలం. పాదాల పగుళ్లు: మామిడి జిగురు తీసుకుని, ఆ పరిమాణానికి మూడు రెట్లు నీళ్లు కలిపి పేస్టులా చేసి, ప్రతిరోజు పాదాలకు లేపనంలా పూసుకోవాలి. పంటినొప్పి, చిగుళ్ల వాపు: రెండు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాక, రెండు పెద్ద చెంచాల మామిడి పూతను జత చేసి మరికొంత సేపు మరగనిచ్చి, దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు. కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరు చేసి తడి పోయేవరకు ఆరబెట్టాలి. పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా చేసి, ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కొన్నిరోజుల పాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఆర్శమొలలు: మామిడి జీడిని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేయాలి. పెరుగు మీది తేటకు ఈ పొడి జత చేసి తీసుకోవాలి. జ్వరం: మామిడి వేర్లకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది. బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకుని మామిడికాయలను సంవత్సరం పాటు ఊరబెట్టాలి. ఆ తరవాత ఈ నూనెను తల నూనెగా వాడుకోవాలి. చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కు నుంచి రక్త స్రావం: మామిడి జీడి నుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి. కంటి నొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పుల పైన సుఖోష్టంగా ఉండేలా వేడి చేసి మూసి ఉంచిన కన్ను పైన బట్ట వేసుకోవాలి. దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండబెట్టి, బూడిద అయ్యేంతవరకూ మండించాలి. దీనికి ఉప్పు కలిపి టూత్‌పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవనూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను డస్టింగ్ పౌడర్లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి. వడ దెబ్బ: పచ్చి మామిడి కాయను నిప్పుల మీద వేడి చేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్లను, పంచదారను చేర్చి తాగితే, దప్పిక తీరడమే కాకుండా, శక్తి వస్తుంది. చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్లు పోసి ఉడికించి, చల్లార్చాక, గుజ్జు తీసి∙పంచదార, ఉప్పు కలిపి సేవించాలి. దీని వల్ల శరీరంలో వేడి తగ్గి ఒళ్లు పేలకుండా ఉంటుంది. మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్లను సమాన భాగాలుగా (రెండూ కలిపి అర టీ స్పూను మించరాదు) తీసుకుని మెత్తగా నూరి ముద్ద చేసి, నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. -
పండు తెచ్చావా లొట్టలేశావా?
మామిడి... మ్యాంగో... ఆమ్... ఈ మూడూ దొరికే సీజన్ ఇది. మూడూ ఒకటే కదా అనుకుంటున్నారా? వంటను బట్టి... కోతను బట్టి... చేర్చే తీపిని బట్టి... కలిపే కారాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రుచి. ఎండలకి విసుగ్గా ఉన్నప్పుడు వీటిని ట్రై చేయండి. రొటీన్‌ని మ్యాం‘గో’ అనండి. మ్యాంగోకుల్ఫీ కావలసినవి: మామిడి పండు ముక్కలు – ముప్పావు కప్పు; చల్లటి చిక్కటి పాలు – అర కప్పు (ఫుల్ క్రీమ్ మిల్క్); ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుల్ ఫ్యాట్ క్రీమ్/ మీగడ – అర కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; కుంకుమ పువ్వు నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు. తయారీ: ►మిక్సీలో మామిడి పండు ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►చల్లటి పాలు జత చేసి మరోమారు తిప్పాలి ►చిక్కటి క్రీమ్ జత చేసి మరోమారు తిప్పాలి ►అర కప్పు కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి ►ఏలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి ►కుల్ఫీ మౌల్డ్‌లోకి ఈ మిశ్రమం పోసి, పిస్తా తరుగు, కుంకుమ పువ్వులతో అలంకరించి మూత పెట్టేయాలి ►డీప్ ఫ్రీజ్‌లో సుమారు ఎనిమిది గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. మ్యాంగో హల్వా కావలసినవి: మామిడి పండు గుజ్జు – 2 కప్పులు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; బాదం పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►ఒక పాత్రలో మామిడి పండు గుజ్జు, పంచదార వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి బాగా కరిగాక జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి, అందులో మామిడిపండు గుజ్జు, పంచదార మిశ్రమం వేసి కలియబెట్టాలి ►మంట బాగా తగ్గించి మామిడి పండు గుజ్జు హల్వాలా మారేవరకు ఉంచాలి ►నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముందుగా వేయించిన బాదం పప్పులు, జీడి పప్పుల్ని పైన చల్లాలి ►తీయటి మామిడి హల్వా సిద్ధం. మ్యాంగో ఐస్‌క్రీమ్ కావలసినవి: మామిడిపండు గుజ్జు – ఒక కప్పు; మామిడి పండ్ల ముక్కల తరుగు – ఒక కప్పు; కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; పాలు – ఒక కప్పు; క్రీమ్ – మూడు కప్పులు; పంచదార – ఒక కప్పు. తయారీ: ►ఒక పాత్రలో కొద్దిగా పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచాలి ►మిగిలిన పాలను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి ►పంచదార జత చేసి కలపాలి ►పాలు వేడెక్కాక కస్టర్డ్పౌడర్ కలిపిన పాలను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి ►స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి ►అందులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు ముక్కల తరుగు, క్రీమ్, వెనిలా వేసి బాగా గిలకొట్టి, ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్‌లో మూడు గంటలపాటు ఉంచి ►బయటకు తీస్తే యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్లే. మామిడి పండు శ్రీకరణ కావలసినవి: మామిడి పండ్లు – 2; పాలు – ఒక గ్లాసు; పంచదార – 4 టీ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పు పొడి – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►బాగా పండిన మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క వేరు చేసి, గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►ముద్దలు ముద్దలుగా లేకుండా మెత్తగా అయ్యేలా ఒక స్పూనుతో బాగా మెదపాలి ►చక్కెర జత చేసి మరోమారు కలపాలి ►కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసుడు జతచేసి కలియబెట్టాలి ►జీడిపప్పుల పొడి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి ►ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక గంట ఉంచి బయటకు తీయాలి ►దీనిని చపాతీ, పూరీలలో నంచుకుని తింటే కూడా రుచిగా ఉంటుంది . మామిడి పండు పులుసు కావలసినవి: మామిడి పండు – 1 (దోరగా ఉండాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; టొమాటో తరుగు – ఒక కప్పు; బెల్లం – ఒక టేబుల్ స్పూను; చింతపండు రసం – అర కప్పు (కొద్దిగా చిక్కగా ఉండాలి); ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►ముందుగా మామిడి పండును ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక (మూడు టేబుల్ స్పూన్లు) మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పసుపు జత చేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ►టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి మూత ఉంచాలి ►రెండు నిమిషాల తరవాత మూత తీసి, ధనియా పొడి, మిరప కారం వేసి కలిపాక, కొద్దిగా బెల్లం పొడి వేసి బాగా కలపాలి ►చింతపండు రసం వేసి కలియబెట్టాలి ►మామిడి పండు ముక్కలు జత చేసి రెండు మూడు నిమిషాల పాటు కలిపి మూత పెట్టాలి ►కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి దింపేసి గిన్నె మీద మూత పెట్టాలి ►పదినిమిషాల తరవాత మూత తీసి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడి పండు కూర కావలసినవి: మామిడి పండ్లు – 4; తాజా కొబ్బరి తురుము – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; తరిగిన ఉల్లిపాయలు – 3; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; నీళ్లు – ఒక కప్పు; కొబ్బరి పాలు – 200 మి.లీ.; ఉప్పు – అర టీ స్పూను; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క వేరు చేయాలి ►మామిడి పండ్లను సన్నగా ముక్కలు చేయాలి ►మందపాటి పాత్రలో మామిడి పండు ముక్కలు, నీళ్లు, పసుపు, మిరప కారం, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించాలి ►పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►అర కప్పు నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండ్ల ముక్కలకు జత చేసి, బాగా కలిపి మంట బాగా తగ్గించాలి ►కొబ్బరి పాలు జత చేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ►బాణలిలో కొబ్బరి నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేశాక, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి,కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, ఉడుకుతున్న కూర మీద వేసి దింపేయాలి. మామిడి తాండ్ర కావలసినవి: మామిడి పండు ముక్కలు – రెండు కప్పులు; పంచదార – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►మామిడి పండు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మామిడి పండు గుజ్జు వేసి ఆపకుండా కలుపుతుండాలి ►ఏలకుల పొడి జత చేయాలి ►పంచదార వేసి బాగా కలపాలి ►మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి ►ఒక పెద్ద ప్లేట్‌కి నిండుగా నెయ్యి పూయాలి ►బాగా ఉడికిన మామిడి పండు గుజ్జును ప్లేటులో ►పోసి సమానంగా పరిచి పైన మూత ఉంచి సుమారు పది గంటల సేపు వదిలేయాలి ►ఆ తరవాత చాకుత్ కట్ చేసుకుంటే మామిడి తాండ్ర సిద్ధమైనట్లే. మ్యాంగో మోర్ కుళంబు కావలసినవి: మామిడి పండు – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; ఎండు మిర్చి – 1; పెరుగు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక తగినన్ని నీళ్లు, మామిడి పండు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ►మిక్సీలో కొబ్బరి తురుము, మెంతులు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వేసి, కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు జతచేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండు ముక్కలకు జత చేయాలి ►పెరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పోపు సామాను వేసి వేయించి, సిద్ధమైన మ్యాంగో మోర్ కుళాంబులో వేసి కలపాలి. -
మామిడి వచ్చేసింది..
సాక్షి సిటీబ్యూరో: వేసవికాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ఈ ఏడాది పంట తొందరగా మార్కెట్‌కు రావడంతో మామిడి సీజన్ ముందుగానే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లోనే సోమవారం మామిడి పండ్లు కేజీ రూ. 40–50 పలుకుతున్నాయి. దిగుబడి తగ్గడంతో పాటు పంట తొందరగా రావడంతో బహిరంగ మార్కెట్లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండవచ్చని వ్యాపారుల అంచనా. సోమవారం బహిరంగ మార్కెట్లో బెనిషాన్ కిలో ధర రూ. 70–80 వరకు ధరపలికింది. ఈ యేడాది మార్చిలోనే.. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్‌లో పుంజుకుంటే ఈ ఏడాది మార్చిలోనే జోరందుకుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది పూత సమయంలో వర్షాల కారణంగా పంటకు నష్టం కలగడంతోపాటు అనుకున్న స్థాయిలో మామిడి పంట రాలేదని రైతులు చెబుతున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే తొందరగా మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ మూడవ వారం నాటికి దాదాపు 2వేల టన్నుల మామిడి గడ్డిఅన్నాం పండ్ల మార్కెట్‌కు వచ్చింది. అయితే ఈ ఏడాది ఇప్పటికే 100 టన్నులు దాటింది. మార్చి నెల ముగిసే సరికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి మార్కెట్‌కు రావచ్చని అంచనా. దీంతో మార్కెట్ అధికారులు మామిడి నిల్వకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించారు. -
కార్బైడ్ పండ్లను ఇలా గుర్తించొచ్చు
సాక్షి, అమరావతిబ్యూరో : కొందరు వ్యాపారుల కాసుల కక్కుర్తి సామాన్య ప్రజలను అనారోగ్యం పాలు జేస్తోంది. మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే మామిడి పండ్లు మగ్గబెట్టేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల వీచిన పెనుగాలులకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో అధికంగా మామిడి తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిన మామిడి కాయలే గాక తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విజయవాడలోని నున్న మామిడి మార్కెట్‌కు తరలి వస్తుంటాయి. ఇక్కడి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రకృతి పరంగా కాయలు మగ్గబెట్టకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మాగబెట్టడం వల్ల కాయలు తొందరగా పాడవుతున్నాయి. ఇథలిన్ అమ్మకాలపై కేంద్రం ఆరా రాష్ట్రంలో ఇథలిన్ అమ్మకాలపై ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం అధికారులు ఆరా తీశారు. రాష్ట్రంలో మామిడి పండ్లను మగ్గబెట్టడంతో ఇబ్బడిముబ్బడిగా రసాయనాలు వాడుతున్న సమాచారం రావడంతో దీనిపై ఇక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైనా నుంచి ఇథలిన్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. మామిడి పండ్లు మగ్గబెట్టడంతో పాటు రంగు రావడంలో కీలకపాత్ర పోషించేందుకు కలిపే రసాయనాలలో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇథలిన్ ఏ ప్యాక్‌లో వస్తోంది.. ఎన్ని గ్రాములు ఉంటోంది, దీన్ని ఎలా వాడుతున్నారో పూర్తి వివరాలు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తనిఖీలు నామమాత్రం ప్రజలకు సురక్షిత పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది.ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ఉన్న సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్బైడ్, ఇథలిన్ వాడకాన్ని హైకోర్టు నిషేధించినా లెక్కచేయడం లేదు. వక్రమార్గాల ద్వారా రసాయనాలను తెప్పించుకుని వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు పండ్ల ను తీసుకెళ్లి నిషేధిత రసాయనాలు వాడినట్లు నిర్థారణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి.. తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. స్వచ్ఛమైన పండ్లను ఇలా గుర్తించొచ్చు ♦ పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన గుబాళిస్తుంది. కొద్ది దూరం వరకు పరిమిళమైన వాసన వస్తుంది. కార్బైడ్, ఇథలిన్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపురంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కార్బైడ్, ఇథలిన్‌తో పెను ప్రమాదం సహజసిద్ధంగా పండిన పండ్లను కాకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మగ్గబెట్టిన పండ్లు తినడం వల్ల అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రమాదం చూపడంతో పాటు జీర్ణవ్యవస్థ మందగించడం, తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, విరోచనాలు అవుతాయి. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువగా తింటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. – రత్నగిరి, వైద్యుడు -
ఒకే చెట్టు..12 రకాల కాయలు
కర్నూలు,జూపాడుబంగ్లా: ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నాగశేషులు 1993 నుంచి హార్టిక ల్చర్లో చెట్లకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టు పద్ధతి)లో నైపుణ్యం సంపాదించాడు. తనకున్న అనుభవంతో అతను తనపెరట్లో తినిపారేసిన మామిడిపిచ్చలు మొలకెత్తడంతో ఓ చెట్టుపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బనగానపల్లె, డోన్, పంచలింగాల, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో లభించే అల్ఫాన్స్, పెద్దరసం, నీలిశా, స్వర్ణజాంగీర్, రెడ్డి పసంద్, బేనిషా, మల్లికారసం, అనుపాళి, పెద్దాచారి, చిన్నాచారి, నీల్గోవ, హిమయత్ తదితర 20 రకాల మొక్కలను తెచ్చి చెట్టుకు అంటుకట్టాడు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది నాగశేషులు పెరట్లోని మామిడి చెట్టు గుత్తులు గుత్తులుగా 12 రకాల మామిడి కాయలను కాసింది. ఈ చెట్టును చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగశేషులు తనకున్న నైపుణ్యం వల్ల ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు కాయించగలగటాన్ని అందరూ ప్రశంసిస్తున్నా రు. ఇతని పెరట్లో ఉన్న మరో మా మిడి చెట్టు ఐదేళ్లు కావొస్తున్నా కాపునకురాలేదు. అంటుగట్టు పద్ధతి ద్వా రా త్వరగా చెట్లు కాపునకువస్తాయని నాగశేషులు పేర్కొంటున్నారు. గ్రాఫ్టింగ్ జిల్లాలో కొందరికే వస్తుంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో నైపుణ్యం ఉన్న వారు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను 1993 నుంచి హార్టికల్చర్‌లో పనిచేయడం ద్వారా అప్పట్లోని అధికారులు తెలియజేసిన మెలకువలను నేర్చుకోవడం ద్వారా నైపుణ్యం సంపాదించాను. గ్రాఫ్టింగ్లో కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ కాలంలోనే చెట్లు కాపునకురావటంతోపాటు ఫలాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. – నాగశేషులు, జూపాడుబంగ్లా, (సెల్ 9989491986) -
మండుటెండల్లో పండు వెన్నెల
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. చూస్తే కళ్లకు ఎంత ఇంపుగా ఉంటుందో తిన్నా కళ్లకు అంతే మేలు చేసే మామిడితో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో కొన్ని. ►మామిడిలో బీటా–కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. అది కంటిచూపును చాలాకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. ►మామిడిలో కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్ డీజనరేషన్’ ముప్పును నివారించగల శక్తి ఉంది. ►మామిడిలోని ఆ బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియాతో పాటు ఇంకా అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలనూ నివారిస్తుంది. ►మామిడిలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి మంచి రోగనిరోధక శక్తి సమకూరుతుంది. ►మామిడిలో పీచు ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని స్వాభావికంగానే నివారిస్తుంది. అంతేకాదు... జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పాళ్లను కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది. ► మామిడిలో ఉండే పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అది రక్తపోటును నివారిస్తుంది ►మామిడి గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)ను రాకుండా చేస్తుంది. ►చర్మానికి నిగారింపును ఇచ్చి మిలమిలలాడేలా చేస్తుంది. -
ఆ రసాయనం.. హానికరం
► కాల్సియం కార్బైడ్‌తో పండ్లు మాగపెట్టొద్దు ► నిపుణుల సూచన కడప: మామిడి కాయలు మాగబెట్టే (పక్వానికి తెచ్చే) సీజను వచ్చిందంటే కాల్సియం కార్బైడ్ రసాయన అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆసక్తికర విషయాలను ఉమ్మడి రాష్ట్ర ఉద్యాన శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వేంపల్లె లక్ష్మీరెడ్డి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... కార్భైడ్ ఎందుకు వాడతారంటే.. కాల్సియం కార్బైడ్‌ను 1988 నుంచి నేటివరకు పారిశ్రామికంగా సున్నం, కోక్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నెస్లో సుమారు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తయారుచేస్తున్నారు. ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజనితో కలిసినప్పుడు కాల్సియం సైనమైడ్ ఏర్పడుతుంది. దీనిని రసాయనిక ఎరువుగా వాడతారు. ఉక్కు పరిశ్రమలో కూడా దీనిని వినియోగిస్తారు. కాయలను మాగించేందుకు.. కాల్సియం కార్బైడ్ తేమతో కలిసిప్పుడు ఎసిటిలీన్ అనే వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు మాగే (పక్వానికి తెచ్చే) ప్రక్రియను ప్రారంభింపజేస్తుంది. రానురాను మామిడి, చీనీ (బత్తాయి), నిమ్మలాంటి వాటిని మాగించేందుకు ఈ రసాయనాన్ని వాడుతున్నారు. మామిడి కాయలను మార్కెట్లోకి ముందుగా ప్రవేశపెడితే మంచి ధరలు పలుకుతాయని సరైన పక్వానికి రాకముందే వీటిని కోసి కార్బైడ్ సహాయంతో మాగబెట్టి విక్రయిస్తుంటారు. దీని వల్ల పండ్లు మాగినట్లు కనిపించినా తియ్యగా ఉండవు. ► కాయలను మాగబెట్టేందుకు వాడే కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ► ఇది కాన్సర్‌ను కలుగజేసే ఎసిటాల్డిహైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు కాన్సరుకు గురయ్యే ప్రమాదం ఉంది ► కాల్సియం కార్బైడ్ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్ వాయువు వినియోగదారుల మెదడుకు ప్రాణవాయువు సరఫరాను తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. కాల్సియం కార్బైడ్ వాడకాన్ని నిరోధించేందుకు సూచనలు... ► ఇప్పటికే చాలా దేశాల్లో కాల్సియంకార్బైడ్‌తో కాయలను మాగించడాన్ని నిషేధించారు. మన దేశంలో కూడా దీని వాడకాన్ని నిషేధించారు. ఆహార కల్తీ నిరోధక చట్టం (ప్రివెన్స్ ఆఫ్ పుడ్ అడల్టరేషన్ యాక్ట్) 44 ఏఏ ప్రకారం ఎసిటిలీన్ వాయువుతో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను అమ్మడాన్ని నిషేధించారు. ► అయితే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ► మార్కెటింగ్ శాఖ వారు వారి మార్కెట్ యార్డుల పరిధిలో కాల్సియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించాలి నిషేదాజ్ఞలను ఉల్లంఘించే వ్యాపారస్తుల లైసెన్స్‌లను రద్దు చేయాలి. ► ఉద్యాన, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో కార్బైడ్ వాడకంవల్ల కలిగే నష్టాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం సీజనులో సదస్సులు, మేళాలు నిర్వహించాలి. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలను ఉపయోగించుకుని ఆరోగ్యానికి కలిగే హానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలి. పండ్లను అమ్మే మార్కెట్లో మైకుల ద్వారా ప్రచారం చేయాలి. ► రైతులు, వ్యాపారులు బాగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోస్తే సహజ సిద్ధంగా మాగి మంచి రంగు, రుచి, వాసనను సంతరించుకుంటాయి.కాల్సియం కార్బైడ్ వాడాల్సిన అవసరం ఉండదు. ► వ్యాపారులు కూడా నైతిక,సామాజిక బాధ్యతలు గుర్తించి కాయలను మాగించేందుకు కార్బైడ్‌ను వాడకూడదు. ► వినియోగదారులు కార్బైడ్‌తో మాగించిన పండ్లను వాడటం చాలిస్తే సమస్య దానంతట అదే నివారించబడుతుంది. వినియోదారులు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అలా కాకపోతే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారవుతారు. -
ఏ దిల్ ‘మేంగో’ మోర్..!
నల్లజర్ల : వేసవికాలంలో మామిడి కాయలు కాయడం సహజం. కొన్ని కాలానికి విరుద్ధంగా కాస్తాయి అవి పునాస మామిడి చెట్లు. కానీ ఇక్కడ ఏ కాలంలోనైనా కాయలు కాస్తూ ఓ మామిడి చెట్టు ‘ఏ దిల్ ‘మేంగో’ మోర్ అంటోంది. నల్లజర్ల కొత్తపేట ఎస్సీ కాలనీకి చెందిన గుదే వెంకట సుబ్బారావు ఇంటి వద్ద ఉన్న మామిడి చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంది. కడియపు లంక నుంచి తీసుకువచ్చి మొక్కను నాటినట్టు ఆయన చెప్పారు. రెండేళ్ల నుంచి నిత్యం కాయలు కాస్తూనే ఉందన్నారు. పచ్చిగా ఉన్నపుడు పప్పుల్లోను, పండిన తర్వాత పళ్లుగాను ఈ వీధివారంతా వినియోగిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. -
చైనా రసాయనాలు!
► మామిడి పండ్లు మగ్గించేందుకు వినియోగం ► దాడుల్లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు ► ఇథిలీన్ వినియోగిస్తున్న గోడౌన్స్ నిర్వాహకులు ► కార్బైడ్’ విక్రయాలపై కఠిన చర్యలకు శ్రీకారం ► ఇద్దరు హోల్సేలర్స్పై దాడి, భారీగా స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు ఆదేశాల మేరకు కాల్షియం కార్బైడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వ్యాపారులు ‘చైనా’ బాటపట్టారు. అక్కడ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ఇథిలీన్ రైథ్మర్ అనే పౌడర్‌ను వాడుతున్నట్లు సౌత్‌జోన్ పోలీసులు గుర్తించారు. గురువారం భారీ స్థాయిలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఈ ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. సీజన్ కావడంతో మామిడి పండ్లను మగ్గించేందుకు దీన్ని వాడుతున్నారని తేలింది. మరోపక్క కాల్షియం కార్బైడ్ విక్రయాలను సీరియస్‌గా తీసుకున్న డీసీపీ వి.సత్యనారాయణ గురువారం తొలిసారిగా ఇద్దరు హోల్సేలర్స్ను అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా సౌత్‌జోన్ పోలీసులు గురువారం పాతబస్తీలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని 9 పండ్ల గోడౌన్లపై దాడులు చేశారు. కొన్ని గోదాముల్లో ఇథిలీన్ రైథ్మర్ పేరుతో ఉన్న పౌడర్‌ను గుర్తించారు. ఇథిలీన్ అనేది హాని చేయని కర్బన రసాయనమే అయినప్పటికీ... ఇలా పొడి రూపంలో గుర్తించడం తొలిసారని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. దాని ప్యాకెట్లపై ఉన్న వివరాలను బట్టి చైనాలో తయారైనట్లు గుర్తించారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు చెందిన కొందరు వ్యాపారులు దిగుమతి చేసుకుని, స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయని, లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు. అసలు ఈ రసాయనంలో ఎలాంటి ఇంగ్రిడెంట్స్ ఉన్నాయి? వినియోగించడానికి ఉద్యానవన శాఖ, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? తదితరాలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని నిర్థారించేందుకు శాంపిల్స్‌ను సేకరించి ఉద్యానవన శాఖకు పంపామన్నారు. వారి నివేదిక వస్తేనే ఈ రసాయనం ఎంత ప్రమాదకరమో తేలుతుందని పేర్కొన్నారు. ‘కార్బైడ్’ హోల్సేలర్స్పై దాడులు... కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రి ఎదుట ఉన్న పండ్ల గోడౌన్లో తనిఖీలు చేశారు. తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఆయూబ్ అహ్మద్ ఖాన్ నిర్వహిస్తున్న ఈ గోదాములో ఈది బజార్‌కు చెందిన నసీర్ ఖాన్ పని చేస్తున్నాడు. వీరిద్దరూ కాల్షియం కార్బైడ్ వినియోగించి మామిడి పండ్లను మగ్గిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు రెండు కేజీల కార్బైడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్బైడ్‌ను శాలిబండలో ‘షా ఏజెన్సీస్’ నుంచి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై దాడి చేసిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 25 కేజీల కార్బైడ్ స్వాధీనం చేసుకుని యజమానికి అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కార్బైడ్‌ను అఫ్జల్‌గంజ్‌లోని శ్రీరామ ఏజెన్సీస్ నుంచి ఖరీదు చేసినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో గురువారం రాత్రి ఆ సంస్థపై దాడి చేసిన పోలీసులు యజమాని నందకిషోర్ లడ్డాను అదుపులోకి తీసుకుని అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల కాల్షియం కార్బైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెల్డింగ్ పనుల కోసం ఉద్దేశించిన ఈ కార్బైడ్ ఘజియాబాద్ నుంచి నగరానికి అక్రమ రవాణా అవుతున్నట్లు ఆధారాలు లభించాయని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ పేర్కొన్నారు. ‘నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు కాల్షియం కార్బైడ్ అక్రమ సరఫరా మూలాలు కనిపెట్టడంపై దృష్టిపెట్టాం. గోడౌన్లు, దుకాణాలపై చేస్తున్న దాడులతో పూర్తిస్థాయి ఫలి తాలు లేని నేపథ్యంలోనే కట్టడి కోసం ఈ చర్యలు తీసుకుం టున్నాం. నగరంలోని ఇతర అక్రమ విక్రేతల పైనా దాడులకు సన్నాహాలు చేస్తున్నాం. ఇథిలీన్ రైథ్మర్ పేరుతో ఉన్న పౌడర్‌పై ఉధ్యానవన శాఖ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీసీపీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. -
మామిడికి చేదు కబురు
సాక్షి, చిత్తూరు : అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది జిల్లా నుంచి వేల టన్నుల మామిడి విదేశాలకు ఎగుమతి అవుతుందని కలెక్టర్ మొదలు అధికారులందరూ ప్రకటించారు. వేల టన్నుల సంగతి దేవుడెరుగు ఇప్పటివరకు పట్టుమని 15 టన్నులు కూడా ఎగుమతికి నోచుకోలేదు. శ్రీని ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి వేపర్ వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అధికారుల సమాచారం మేరకు జిల్లా నుంచి ఇప్పటివరకు కేవలం 11.5 టన్నుల మామిడి మాత్రమే సింగపూర్, యూకే దేశాలకు ఎగుమతి అయ్యింది. మరో మూడు టన్నుల మామిడి ప్రాసెసింగ్ పూర్తి చేసుకుని వారంలో జపాన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సీజన్ ముగుస్తుండడంతో మరో ఐదు టన్నులకు మించి ఎగుమతులు ఉండకపోవచ్చు. అయితే ఉద్యానవన శాఖాధికారులు ఇప్పటికే 300 టన్నులు ఎగుమతి అయ్యిందని, మరో 500 టన్నులు వెళ్లనుందని కాకిలెక్కలు చెబుతుండడం గమనార్హం. జిల్లాలో 76 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. గత ఏడాది 5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. వర్షాభావం, మరోవైపు అకాల వర్షం కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గినా 4 నుంచి 5 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో బేనిషా 1.8 లక్షల టన్నుల వరకూ ఉంటుంది. విదేశీ ఎగుమతులు పెంచేందుకు తిరుపతిలోని మామిడి ప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రభుత్వం తెరిపించింది. ఎగుమతులు పెరుగుతాయని రైతులు ఆశపడ్డారు. ఇప్పటివరకు కేవలం 11.5 టన్నులే ఎగుమతి అయ్యింది. ఎగుమతులు, క్వాలిటీకి సంబంధించి జపాన్, సింగపూర్, న్యూజిలాండ్, యురోపియన్ యూనియన్ దేశాల వ్యాపారులతో ప్రభుత్వ పరంగా ఇక్కడి అధికారులు చర్చించిన దాఖలాలు లేవు. కనీస చర్యలు కూడా తీసుకోకుండా వందలాది టన్నులు ఎగుమతి చేసినట్లు అధికారులు డప్పు కొట్టడంపై రైతులు మండిపడుతున్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
మామిడి రూపంలో విషపదార్థం యథేచ్ఛగా విక్రయాలు అనంతపురం అగ్రికల్చర్ : నిగనిగలాడుతూ నోరూరించేలా ఉన్న మామిడి పండ్లనుకొని ఇంటికి తీసుకువెళ్తున్న సగటు వినియోగదారుడు తాను కొన్నది పండ్ల రూపంలో ఉన్న విష పదార్థమని తెలుసుకోలేకపోతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజారోగ్యానికి హాని కలి గించేలా పక్వానికి రాకముందే కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడిని యథేచ్చగా విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా కాల్షియం కార్బైడ్ గుళికలే కనిపిస్తున్నాయి. పండ్లను మాగబెట్టిన గోదాముల్లోకి వెళితే అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మందు ప్రభావం ఏ స్థాయిలో ఉన్న ది దీంతో అర్థమవుతుంది. పచ్చికాయలను కుప్పగా పోసి అందులో కాల్షియం కార్బైడ్ గుళి కలు నింపిన ప్యాకెట్లు వేస్తే కేవలం 12 గం టల్లోనే నిగనిగలాడే రంగుతో కాయలు పళ్లుగా మారిపోతాయి. సాధారణంగా సహజ పద్ధతిలో వరిగడ్డి ద్వారా లేదా రైపనింగ్ చాంబర్లలో ఇథలీన్ గ్యాస్ ద్వారా మాగబెట్టేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. తొందరగా మార్కెట్లో సొమ్ము చేసుకోవాలన్న స్వార్థంతో కొందరు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ గుళికలు లేదా అలాంటిదే మరోరకమైన పిచికారి మందు ద్వారా మామిడి కాయలను మాగబెడుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే అయినా ఇటు ఫుడ్‌సేప్టీ అధికారులు కాని, అటు మార్కెటింగ్ శాఖ అధికారులు కాని ప్రమాదకర మామిడిపండ్ల విక్రయాన్ని అరికట్టడంలో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని సర్వత్రా విమర్శలున్నాయి. -
మ్యాంగో త్రీ
సో స్వీట్ డబ్బులు చెట్లకు కాస్తాయా! కాయవు. కానీ మామిడిపండ్లు కాస్తాయి. పండ్లే కాదు, బాటిల్సూ కాస్తాయి. యాడ్స్‌లో చూడడంలా... మామిడి కొమ్మనుంచి టప్పున బాటిల్ తెంపుకోవడం! అలాగే ఇప్పుడు మనం ఐస్ టీ తెంపుకుందాం. స్వీట్రైస్ తెంపుకుందాం. ఐస్‌క్రీమ్ తెంపుకుందాం. ట్రీ నుంచి త్రీ ఐటమ్స్!! మ్యాంగో ఐస్ టీ 3 గ్లాసుల టీ కోసం కావల్సినవి: మామిడిపండ్లు - 2 (ఒకటిన్నర కప్పు గుజ్జు) టీ పొడి - 3 టీ స్పూన్లు లేదా 3 టీ బ్యాగ్స్ నీళ్లు - 4 కప్పులు నిమ్మరసం - అర టేబుల్ స్పూన్ పంచదార - తగినంత పుదీనా ఆకులు - గార్నిష్‌కి కొన్ని తయారీ: ⇒ మామిడిపండు తొక్క తీసి, ముక్కలు కోసి, పంచదార కలిపి గుజ్జు చేసుకో వాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ⇒ స్టౌపై నీళ్లు పెట్టి, మరిగాక స్టౌ కట్టేయాలి. నీటిలో టీ పొడి వేసి, మూతపెట్టి 5 ని.లు అలాగే ఉంచాలి. ⇒ తర్వాత వడకట్టి, ఈ డికాషన్‌ని కూడా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ⇒ టీ డికాషన్ చల్లబడ్డాక బయటకు తీసి... దీంట్లో మామిడిపండు గుజ్జు, నిమ్మరసం కలిపి బ్లెండ్ చేయాలి. ⇒ పొడవాటి గ్లాస్లో ఈ టీ పోసి, ఐస్‌క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. మ్యాంగో స్వీట్ రైస్ కావల్సినవి: బియ్యం - ఒకటిన్నర కప్పు నీళ్లు - 2 కప్పులు కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు పంచదార - 1 కప్పు ఉప్పు - అర టీ స్పూన్ పంచదార - 1 టేబుల్‌స్పూన్ టాపికా స్టార్చ్ (మార్కెట్లో లభిస్తుంది) - 1 టేబుల్ స్పూన్ మామిడిపండ్లు-3 (గుజ్జు తీసుకోవాలి) తెల్ల నువ్వులు (వేయించినవి) - 1 టేబుల్ స్పూన్ తయారీ: ⇒ పాత్రలో నీళ్లు, బియ్యం వేసి సన్నని మంట మీద ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక అందులో కొబ్బరి పాలు, పంచదార, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. దీంట్లో మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. ⇒ విడిగా పాత్రలో అరకప్పు పాలలో టేబుల్ స్పూన్ పంచదార, పావు టీ స్పూన్ ఉప్పు, టాపికా స్టార్చ్ వేసి మరిగించాలి. ⇒ ప్లేట్లో మ్యాంగో రైస్ తీసుకొని, పైన విడిగా పాత్రలో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసి, ఆపైన నువ్వులు చల్లాలి. ఆపైన సన్నగా కట్‌చేసిన మామిడిపండు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి. ⇒ రుచిగానూ, పోషకాలు మెండుగా ఉండే ఈ మ్యాంగో రైస్‌ని పిల్లలు బాగా ఇష్టపడతారు. మ్యాంగో ఐస్ క్రీమ్ కావల్సినవి: పాలు - కప్పు క్రీమ్- 3 కప్పులు మామిడిపండు గుజ్జు - కప్పు మామిడిపండు ముక్కలు (సన్నగా కట్ చేయాలి)- కప్పు కస్టర్డ్ పౌడర్ - టేబుల్ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - టేబుల్ స్పూన్ పంచదార - 360 గ్రా.లు తయారీ: ⇒ పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. ⇒ మిగిలిన పాలను వేడి చేసి, అందులో కస్టర్డ్ కలిపిన పాలను వేసి, బాగా కలుపుతూ మరిగించాలి. ⇒ పాలు చల్లారాక మామిడిపండు గుజ్జు, ముక్కలు, క్రీమ్, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ బౌల్లో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ⇒ మిశ్రమం బాగా గట్టి పడేంతవరకు ఉంచి, ఐస్‌క్రీమ్ స్కూప్‌తో తీసి, సర్వ్ చేయాలి. -
ఉగాదికి ‘మామిడి’ రెడీ
సాక్షి, ముంబై: మామిడి పండ్ల ప్రియులకు శుభవార్త. ఉగాది నాటికి మార్కెట్లోకి మామిడి పళ్లు రానున్నాయి. కొంకణ్‌లో వర్షాలు నిలిచిపోవడంతో మామిడి కాయలు ఉగాది పండుగ నాటికి సరఫరా అవుతాయని వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం (ఏపీఎంసీ) వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే మార్కెట్‌కి సరఫరా అవుతాయని చెబుతున్నారు. దీంతో నగరవాసులు కూడా తెలుగు నూతన సంవత్సరాన్ని ఇష్టమైన మామిడి పండ్లతో ఆహ్వానం పలకవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయ్‌ఘడ్, రత్నగిరి, సిందుదుర్గ్ జిల్లాల నుంచి ఉగాదికి 50,000 పండ్ల బాక్సులు నగరానికి వస్తాయని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉగాది పురస్కరించుకొని చాలా మంది మామిడిపళ్లు కొనుగోలు చేస్తుంటారని, పండగ వరకు ఏపీఎంసీ మార్కెట్ కళకళలాడాలని వ్యాపారి విజయ్ ధోబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఆల్పోన్సో లాంటి ప్రత్యేక జాతికి చెందిన మామిడి పండ్ల సరఫరా ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఆ మామిడి పళ్లు సరఫరా అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చెందిన పండ్ల వ్యాపారి బాలకృష్ణ షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మామిడి పండ్ల నాణ్యత, పరిమాణం ఆధారంగా వాటి ధర నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. హోల్ సేల్ మార్కెట్లో వీటి ధర డజన్ రూ.200 నుంచి రూ.600 వరకు ఉంటుందన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పండ్ల నాణ్యత బాగానే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మామిడి పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అల్పూన్సన్ అనే జాతి మామిడి పండ్లను రీటైల్ మార్కెట్లో డజన్ రూ.900 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తారని తెలిపారు. అయితే ఏప్రిల్‌లో మామిడి పండ్ల సరఫరా పెరగడంతో... ధరలు తగ్గుముఖం పడుతాయని చెప్పారు. -
రోగాలు కొనుక్కోకండి!
మాధుర్యాన్ని పంచి.. ఆరోగ్యాన్నిచ్చే మామిడి పండ్లు విషతుల్యమవుతున్నాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గడ్డిలో మాగబెట్టాల్సిన వ్యాపారులు త్వరితగతిన సొమ్ము చేసుకోవడానికి రసాయనాలు చల్లి మగ్గిస్తున్నారు. మధురమైన మామిడి పండ్లను విషపూరితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోని జనం రోగాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు. సాక్షి, అనంతపురం డెస్క్ : మామిడి పండ్ల వ్యాపారుల కక్కుర్తికి ‘అనంత’ ప్రజానీకం బలవుతున్నారు. రుచిలో రారాజుగా పేరుగాంచిన మామిడి పండు పసుపు పచ్చని రంగులో నోరూరిస్తుంటే.. జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఆ పండ్లు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినవా.. లేక రసాయనాలతో మగ్గబెట్టినవా అని పట్టించుకోకుండా కడుపారా తిని రోగాల పాలవుతున్నారు. సాధారణంగా పక్వానికి వచ్చిన మామిడి కాయలను వరి గడ్డిలో అవి పండేంత వరకు మగ్గబెట్టాలి. ఇలా చేస్తే అవి కావాల్సినంత రుచి, వాసనను ఇస్తాయి. అయితే కొందరు వ్యాపారులు చెట్టు మీద కాయలు పక్వానికి రాకముందే కోసి మగ్గబెడుతున్నారు. తొందరగా పండడం కోసం కాల్షియం కార్బైడ్, పొగబెట్టి మాగ బెట్టడం ద్వారా పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. పైగా ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యంపై ప్రభావం కార్బైడ్, ఇతర రసాయనాలతో మగ్గించిన మామిడి పండ్లను తింటే జీర్ణావస్థలో తీవ్ర సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లను తింటే గర్భిణుల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నరాల బలహీనత, రక్తహీనత వంటి సమస్యలు తోడవుతాయి. పిల్లలయితే డయేరియా, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లను తింటే గ్యాస్ట్రబుల్, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ, జన్యు సంబంధ వ్యాధులు వస్తాయి. వాంతులు, విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. మామిడి పండుకు పైన తొక్క ఉంటుంది. రసాయనాలతో మాగబెట్టేటప్పుడు ఈ తొక్కపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పు నీటితో కడిగి.. పైన తొక్కను తీసేసి తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాస్త వగరున్నా, సంప్రదాయ రీతిలో మాగబెట్టిన పళ్ల తొక్కను తింటేనే మంచిది. ఎలా మాగబెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారానికి కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైడ్‌ను కొని పొట్లాలుగా తయారు చేసుకుంటారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో.. నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు పొట్లాలను పెడతారు. ఈ కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. ఇలా తయారైన పండ్లను మార్కెట్లో రిటైల్ అమ్మకం దారులుకు విక్రయిస్తారు. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైడ్ విచ్చలవిడిగా లభిస్తోంది. కిలో రూ.80 వరకు ఉంటోంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించినా అమలు కావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైడ్‌ను వినియోగించి మాగబెడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ధర తక్కువని కొంటే.. అనంతపురంలోని రైతు బజార్లో సంప్రదాయ పద్ధతిలో మాగించిన పళ్లను కిలో రూ.40 చొప్పున విక్రయిస్తుంటే.. రోడ్లమీద 3 కిలోలు రూ.100 చొప్పున అమ్ముతున్నారు. దీంతో చాలా మంది ధర తక్కువ అనే కారణంతో రోడ్ల మీద కొనుగోలుకే ఆసక్తి చూపిస్తూ.. అవి తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్యలే అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : త్వరితగతిన కృత్రిమ పద్ధతిలో మాగిం చిన మామిడి పళ్లను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంద ని అనంతపురం ప్రభుత్వ వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ై ఎం.బాబు తెలి పారు. వేసవిలో సంప్రదాయ పద్ధతిలో మాగించిన మామిడి పండ్లను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. ‘రసాయనాలతో మగ్గబెట్టినవి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రసాయనాలతో మామిడి పండ్లను మాగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ మోతాదులో తింటే డీ హైడ్రేషన్ ఏర్పడి మనిషి తనలోని శక్తిని కోల్పోయి నీరసించే మ్రాదం ఉంది. సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్ల వల్ల ఎలాంటి హాని ఉండదు’ అని ‘న్యూస్‌లైన్’కు వివరించారు. -
ఆలోచించి.. ఆరగించండి
*మామిడి రంగుచూసి మోసపోవద్దు * కాల్షియం కార్బైడ్‌తో కాయల పక్వం *తింటే అనారోగ్యమే * పట్టని అధికారులు తాళ్లూరు, న్యూస్‌లైన్: పీచు పదార్థాలతో పాటు ఏ, సీ విటమిన్లు పుష్కలంగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో మామిడి ప్రధానమైంది. మామిడికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్బైడ్ వంటి వాటిని వాడుతున్నారు. మామిడి తోటల్లో నుంచి తెచ్చిన పచ్చి కాయల్ని ఒక గదిలో రాశిగా పోసి..ప్రతి 50 కాయల మధ్య 200 గ్రాముల కార్బైట్ ఉంచుతారు. కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రతలు పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. పచ్చని రంగు వస్తాయి. అనంతరం మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ఉండే పోషక విలువలు వీటిలో ఉండవు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులంటున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే గ్యాస్ట్రబుల్ రావడం, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ నిర్వీర్యమవడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు ముప్పు.... కార్బైడ్‌తో మగ్గించిన పండ్లు తింటే గర్భిణులకు ప్రమాదకరం. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులంటున్నారు. పిల్లలు అంగవైకల్యంతో పుట్టవచ్చని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ఎండు గడ్డితో పండేవి మంచివి... మామిడి కాయలు చెట్టు మీద పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు. వీటిని గంపల్లో వేసి ఎండు గడ్డి కప్పి వారం రోజుల పాటు మగ్గ బెడతారు. తర్వాత గడ్డిని తొలగించి చూస్తే మంచి వాసనతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా.. రుచికరంగా ఉంటాయి. - రసాయనాలతో మాగబెట్టినప్పుడు పండ్ల తొక్కలపై అధిక ప్రభావం ఉంటుంది. తొక్కలోనే రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పునీటిలో కడిగి పైన తొక్కను తీసేసి తింటే కొంత మేలని వైద్యులు పేర్కొంటున్నారు. - ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని గోడౌన్లలో మామిడి కాయల్ని కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి..జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పండ్ల దుకాణాల్లో విక్రయించే వాటిని కూడా అక్కడి నుంచే తెస్తున్నారు. అధికారులు స్పందించి అటువంటి పండ్లను మార్కెట్లోనికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
తింటే ‘రంగు’ పడుద్ది!
విశాఖ::మాధుర్యాన్ని పంచి... ఆరోగ్యాన్ని పెంచాల్సిన మామిడి పండ్లు విషపూరితమవుతున్నాయి. గతంలో పక్వానికి వచ్చిన మామిడికాయలను వారం రోజుల పాటు గడ్డిలో మగ్గిస్తే ఘుమఘుమలాడేవి. అవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరేది. ఇప్పుడంతా వ్యాపారమయమైపోయింది. మార్కెట్లో కనిపించే నిగనిగలాడే మామిడి పండ్ల వెనక వ్యాపారుల మాయాజాలం ఉంది. అవేవీ పక్వానికి వచ్చినవి కావు. మధుర ఫలంలో విషం మామిడి పండ్లపై కాలుష్యం కార్బయిడ్, ఎథోఫాన్, బిగ్‌ఫాన్ తదితర రసాయనాలు జల్లుతున్నారు. రెండు రోజుల్లోనే పచ్చిమామిడి కాయలకు రంగు రప్పిస్తున్నారు. దీంతో పండ్లు సహజత్వం కోల్పోయి విషపూరితం అవుతున్నాయి. రుచి కూడా పెద్దగా ఉండటం లేదు. ప్రస్తుతం మామిడికాయల సీజన్ కావడంతో మామిడికాయలను వ్యాపారులు కార్బయిడ్ రసాయనంలో మగ్గబెడుతున్నారు. చూడగానే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తున్నా రుచి మాత్రం ఉండటం లేదు. సాధారణంగా మామిడికాయలను ఎండుగడ్డిలో పెట్టివారం రోజుల పాటు మగ్గబెట్టాలి. అదీ పక్వానికి వచ్చిన కాయలనే ఉపయోగించాలి. బహిరంగంగా కార్బయిడ్ విక్రయం హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం ప్రభుత్వం నిషేధించిన, కారుచౌకగా దొరికే కార్బయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మార్కెట్లో కిలో రూ.70 నుంచి 90 వరకు దొరుకుతోంది. దీన్ని కాగితంలో చుడతారు. దానిపై గడ్డి వేసి మామిడి కాయలను పేర్చుతారు. కాయలు ఎక్కువగా ఉన్నట్టయితే మధ్యమధ్యలో కార్బయిడ్ పొట్లాలను ఉంచుతారు. గాలి చొరబడకుండా ఉండేందుకు తలుపులు మూసివేస్తారు. రసాయనాల వేడికి రోజు గడవకముందే ఆకుపచ్చని మామిడి కాయలు, పసుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఇది కాకుండా మరో విధానాన్ని కూడా వారు అనుసరిస్తున్నారు. లీటర్ నీటిలో మిల్లీగ్రాము ఎథోఫాన్ ద్రావణాన్ని కలిపి కాయలపై జల్లుతున్నారు. దీంతో రెండ్రోజులకే రంగు మారుతున్నాయి. అనంతరం పండ్లను హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్డ్ వ్యాపారులు, వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఈ పండ్లు తింటే రోగాలు మెండు కార్బయిడ్, ఎథోఫాన్‌తో మగ్గించిన మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, జీర్ణవ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పండ్లను తింటే గర్భిణుల్లో పిండం ఎదుగుదల లోపిస్తుందని, వివిధ రకాల జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. నరాల బలహీనత, రక్తహీనత వంటి జబ్బులు కూడా సంక్రమిస్తాయంటున్నారు. పిల్లలు శ్వాసకోశ, డయేరియా తదితర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. రసాయనాలు జల్లి మగ్గించిన పండ్ల అమ్మకాలను నిరోధించాలని, వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.