మ్యాంగో త్రీ | Mango Tree | Sakshi
Sakshi News home page

మ్యాంగో త్రీ

Published Thu, May 21 2015 11:46 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

మ్యాంగో త్రీ - Sakshi

మ్యాంగో త్రీ

సో స్వీట్
డబ్బులు చెట్లకు కాస్తాయా! కాయవు. కానీ మామిడిపండ్లు కాస్తాయి. పండ్లే కాదు, బాటిల్సూ కాస్తాయి. యాడ్స్‌లో చూడడంలా... మామిడి కొమ్మనుంచి టప్పున బాటిల్ తెంపుకోవడం! అలాగే ఇప్పుడు మనం ఐస్ టీ తెంపుకుందాం. స్వీట్‌రైస్ తెంపుకుందాం. ఐస్‌క్రీమ్ తెంపుకుందాం. ట్రీ నుంచి త్రీ ఐటమ్స్!!
 
మ్యాంగో ఐస్ టీ

3 గ్లాసుల టీ కోసం కావల్సినవి:
మామిడిపండ్లు - 2 (ఒకటిన్నర కప్పు గుజ్జు)
టీ పొడి - 3 టీ స్పూన్లు లేదా 3 టీ బ్యాగ్స్
నీళ్లు - 4 కప్పులు
నిమ్మరసం - అర టేబుల్ స్పూన్
పంచదార - తగినంత
పుదీనా ఆకులు - గార్నిష్‌కి కొన్ని
 
తయారీ:

మామిడిపండు తొక్క తీసి, ముక్కలు కోసి, పంచదార కలిపి గుజ్జు చేసుకో వాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
స్టౌపై నీళ్లు పెట్టి, మరిగాక స్టౌ కట్టేయాలి. నీటిలో టీ పొడి వేసి, మూతపెట్టి 5 ని.లు అలాగే ఉంచాలి.
తర్వాత వడకట్టి, ఈ డికాషన్‌ని కూడా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
టీ డికాషన్ చల్లబడ్డాక బయటకు తీసి... దీంట్లో మామిడిపండు గుజ్జు, నిమ్మరసం కలిపి బ్లెండ్ చేయాలి.
పొడవాటి గ్లాస్‌లో ఈ టీ పోసి, ఐస్‌క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
మ్యాంగో స్వీట్ రైస్
కావల్సినవి:

బియ్యం - ఒకటిన్నర కప్పు
నీళ్లు - 2 కప్పులు
కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు
పంచదార - 1 కప్పు
ఉప్పు - అర టీ స్పూన్
పంచదార - 1 టేబుల్‌స్పూన్
టాపికా స్టార్చ్ (మార్కెట్లో లభిస్తుంది) - 1 టేబుల్ స్పూన్
మామిడిపండ్లు-3 (గుజ్జు తీసుకోవాలి)
తెల్ల నువ్వులు (వేయించినవి) - 1 టేబుల్ స్పూన్

తయారీ:
పాత్రలో నీళ్లు, బియ్యం వేసి సన్నని మంట మీద ఉడికించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక అందులో కొబ్బరి పాలు, పంచదార, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. దీంట్లో మామిడిపండు గుజ్జు వేసి కలపాలి.
విడిగా పాత్రలో అరకప్పు పాలలో టేబుల్ స్పూన్ పంచదార, పావు టీ స్పూన్ ఉప్పు, టాపికా స్టార్చ్ వేసి మరిగించాలి.
ప్లేట్‌లో మ్యాంగో రైస్ తీసుకొని, పైన విడిగా పాత్రలో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసి, ఆపైన నువ్వులు చల్లాలి. ఆపైన సన్నగా కట్‌చేసిన మామిడిపండు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.
రుచిగానూ, పోషకాలు మెండుగా ఉండే ఈ మ్యాంగో రైస్‌ని పిల్లలు బాగా ఇష్టపడతారు.
 
మ్యాంగో ఐస్ క్రీమ్
కావల్సినవి:

పాలు - కప్పు
క్రీమ్- 3 కప్పులు
మామిడిపండు గుజ్జు - కప్పు
మామిడిపండు ముక్కలు (సన్నగా కట్ చేయాలి)- కప్పు
కస్టర్డ్ పౌడర్ - టేబుల్ స్పూన్
వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ - టేబుల్ స్పూన్
పంచదార - 360 గ్రా.లు
 
తయారీ:
పావు కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి.
మిగిలిన పాలను వేడి చేసి, అందులో కస్టర్డ్ కలిపిన పాలను వేసి, బాగా కలుపుతూ మరిగించాలి.
పాలు చల్లారాక మామిడిపండు గుజ్జు, ముక్కలు, క్రీమ్, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓ బౌల్‌లో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి.
⇒  మిశ్రమం బాగా గట్టి పడేంతవరకు ఉంచి, ఐస్‌క్రీమ్ స్కూప్‌తో తీసి, సర్వ్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement