మామిడి రూపంలో విషపదార్థం
యథేచ్ఛగా విక్రయాలు
అనంతపురం అగ్రికల్చర్ : నిగనిగలాడుతూ నోరూరించేలా ఉన్న మామిడి పండ్లనుకొని ఇంటికి తీసుకువెళ్తున్న సగటు వినియోగదారుడు తాను కొన్నది పండ్ల రూపంలో ఉన్న విష పదార్థమని తెలుసుకోలేకపోతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజారోగ్యానికి హాని కలి గించేలా పక్వానికి రాకముందే కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడిని యథేచ్చగా విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా కాల్షియం కార్బైడ్ గుళికలే కనిపిస్తున్నాయి. పండ్లను మాగబెట్టిన గోదాముల్లోకి వెళితే అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది.
ఈ మందు ప్రభావం ఏ స్థాయిలో ఉన్న ది దీంతో అర్థమవుతుంది. పచ్చికాయలను కుప్పగా పోసి అందులో కాల్షియం కార్బైడ్ గుళి కలు నింపిన ప్యాకెట్లు వేస్తే కేవలం 12 గం టల్లోనే నిగనిగలాడే రంగుతో కాయలు పళ్లుగా మారిపోతాయి. సాధారణంగా సహజ పద్ధతిలో వరిగడ్డి ద్వారా లేదా రైపనింగ్ చాంబర్లలో ఇథలీన్ గ్యాస్ ద్వారా మాగబెట్టేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. తొందరగా మార్కెట్‌లో సొమ్ము చేసుకోవాలన్న స్వార్థంతో కొందరు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ గుళికలు లేదా అలాంటిదే మరోరకమైన పిచికారి మందు ద్వారా మామిడి కాయలను మాగబెడుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే అయినా ఇటు ఫుడ్‌సేప్టీ అధికారులు కాని, అటు మార్కెటింగ్ శాఖ అధికారులు కాని ప్రమాదకర మామిడిపండ్ల విక్రయాన్ని అరికట్టడంలో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని సర్వత్రా విమర్శలున్నాయి.
ప్రజారోగ్యంతో చెలగాటం
Published Mon, Jun 8 2015 4:02 AM | Last Updated on Fri, Jun 1 2018 9:10 PM
Advertisement
Advertisement