
మ్యాంగో పూరీకి కావాల్సినవి:
మామిడి పండ్లు – 2 (కడిగి, తొక్క, టెంక తొలగించి ముక్కలుగా చేసుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసుకుని జ్యూస్ చేసుకోవాలి)
గోధుమ పిండి – 3 లేదా 4 కప్పులు
మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు
నూనె – సరిపడా
మ్యాంగో పూరీ తయారీ ఇలా..
ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మ్యాంగో జ్యూస్, గోధుమ పిండి, మైదాపిండి, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను పొంగే విధంగా ఇరువైపులా వేయించుకోవాలి. వీటిపై తేనె వేసుకుని తింటే భలే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment