వంటింటి చిట్కాలు
► అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపా. ఈ పేస్టుని అవెన్‌లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్‌తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్‌లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది.
► పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి.
► మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.
► అన్నం మెత్తగా ఉడికినప్పుడు క్యారెట్‌ను అత్యంత సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.అప్పుడు అన్నం మరీ మెత్తగా అనిపించదు.
► పకోడి చేసేప్పుడు చేసేప్పుడు పిండిలో కాస్త నూనే మరియు చిటికెడు వంట సోడ కలిపితే పకోడిలు క్రిస్పీగా వస్తాయి.
► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా ఉండటమే కాకుండా రుచిగానూ ఉంటుంది.
► వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కాస్త ఇంగువ ఒక గుడ్డలో కట్టి వేస్తే వాటిని వేయించే సమయంలో మంచి వాసన రుచి ఉంటాయి.
► రసం తీసేసిన నిమ్మకాయలను, సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచం ఉప్పు కారం, బెల్లం వేసి పోపు వెయ్యండి. నోరూరించే ఇన్‌స్టంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ.
Comments
Please login to add a commentAdd a comment