బాణలిలో ఫ్రై చేస్తున్నారా? ఇలా చేస్తే అడుగు అంటుకోదు | Simple Home Made Kitchen Tips For Effective Usage | Sakshi
Sakshi News home page

బాణలిలో ఫ్రై చేస్తున్నారా? ఇలా చేస్తే అడుగు అంటుకోదు

Published Tue, Dec 26 2023 1:18 PM | Last Updated on Tue, Dec 26 2023 1:23 PM

Simple Home Made Kitchen Tips For Effective Usage - Sakshi

 వంటింటి చిట్కాలు    

గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలు చేసి వేయాలి. దీనిలో బోరిక్‌ యాసిడ్‌ రెండు టీస్పూన్లు వేసి మూడు గంటలపాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్‌లో పోస్తే బొద్దింకలు రావు.

 నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్‌క్యూబ్‌ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్‌క్యూబ్‌ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్‌లో వేస్తే దుర్వాసన పోతుంది. 
► పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాం. చాలాసార్లు అవి పొంగి స్టవ్‌ మొత్తం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాల గిన్నె మీద ఓ చెక్క చెంచాను ఉంచండి.

► పప్పు త్వరగా ఉడకాలన్నా మరింత రుచిగా ఉండాలన్నా అందులో ఒక టీస్పూన్ నువ్వులనూనె వేయాలి.

► వెల్లుల్లి, ఉల్లిపొట్టు అంత సులభంగా రాదు. దీనికోసం వేడి నీళ్లలో వీటిని కాసేపు వేసి ఆ తర్వాత పొట్టు తీయండి. ఇలా చేస్తే పొట్టు సులువుగా వస్తుంది.

  టొమాటో చుట్టూ చిన్నగా గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్‌వాటర్‌లో వేయాలి. నిమిషం తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది.

► మనం దోసెలు వేసేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. వంకాయలతో ముందుగా పెనం పై వంకాయ ముక్కతో రుద్దండి.
 బాణలిలో కొద్దిగా నీళ్లుపోసి అవిరైపోయేవరకు వేడిచేయాలి. బాణలిలో ఒక్క నీటిచుక్క కూడా లేనప్పుడు నూనె వేసి ఫ్రైచేస్తే ఏ పదార్థమైనా బాణలికి అంటుకోదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement