క్లీనింగ్ టిప్స్
►ఫ్యాబ్రిక్ సోఫాను శుభ్రం చేయడానికి, ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. దీనిలో తగినన్ని వేడి నీళ్లు పోస్తూ బాగా కలపండి. దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఆ తరువాత, ఈ ద్రావణాన్ని చల్లబరచండి.
► చల్లబడిన తర్వాత దానిని బాగా కలిపితే నురగ వస్తుంది. ఇప్పుడు సోఫాపై భాగంలో గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురుగుతో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తదానిలా మెరిసిపోతుంది.
► వెనిగర్‌లో లిన్సీడ్ ఆయిల్ మిక్స్ చేసి ఓ క్లాత్‌తో తుడిస్తే మీ పాత సోఫాలు కొత్తవాటిలా మెరుస్తాయి.
► వెల్వెట్ సోఫాలపై చాలా దుమ్ము పేరుకుపోతుంది. వాటిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్ వాడొచ్చు. లేదా సాఫ్ట్ డిటర్జెంట్ ఉపయోగించి కూడా శుభ్రం చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment