కిచెన్ టిప్స్
►మిరియాలు, ముద్దకర్పూరాలను సమపాళల్లో తీసుకుని పొడిచేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా టూత్‌పేస్టు, కొద్దిగా ఫేస్ పౌడర్ వేసి కలపాలి. చివరిగా నాలుగు వెల్లుల్లి గర్భాలను మెత్తగా నూరి అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో రాస్తే బొద్దింకలు లోపలికి రావు. చూద్దామన్నా ఇంట్లో ఎక్కడా కనిపించవు.
► వంటింట్లో వాడే టవల్స్, మసిబట్టలు జిడ్డుపట్టి ఒక పట్టాన వదలవు. వీటిని ఉతకడానికి పెద్దగా శ్రమపడనక్కర్లేదు. వేడినీటిలో కాస్తంత షాంపు కలపాలి. ఈ నీటిలో జిడ్డుపట్టిన టవల్‌ను నానబెట్టాలి. 20 నిమిషాల తరువాత బ్రష్‌తో రుద్దుతూ ఉతికితే జిడ్డు, దుర్వాసన పోయి టవల్ శుభ్రంగా మారుతుంది. వారానికి ఒకసారి కిచెన్ టవల్స్‌ను ఇలా ఉతికితే జిడ్డుగా అనిపించవు.
Comments
Please login to add a commentAdd a comment