ఇంటి గోడలపై మరకలు పడితే వదిలించడం కాస్త కష్టమే. కొన్నిసార్లు అయితే వీటిని లగించడానికి ఎంతో కష్టపడాలి, అయిన సరిగ్గా వదలవు, కొన్ని సార్లు గోడు రంగు కూడా ఊడిపోతూ ఉంటుంది.కొన్నిసార్లు ఈ మరకలు పోవాలంటే మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మరకలు పడ్డప్పుడల్లా పేయింటింగ్ వేయలేం కదా.ఇది ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు ఖర్చులేకుండా సింపుల్ చిట్కాతో మరకల్ని పోగొట్టి కొత్త ఇంటిలా మెరిసేలా చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో ఎలాంటి మొండి మరకల్ని కూడా ఈజీగా పోగొట్టొచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..
►హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బేకింగ్ సోడాతో 1:1 నిష్పత్తిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి గోడలపై అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయండి. కాసేపటి తర్వాత తడి గుడ్డతో తుడిస్తే గోడలపై ఎలాంటి మరకల్ని వదిలిస్తుంది.
► బేకింగ్ సోడా స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.పెరాక్సైడ్ బ్లీచింగ్‌లా పనిచేసి మరకల్ని సులభంగా పోగొడుతుంది. ఒకవేళ గోడలపై మరకలు లేకపోయినా ఈ కెమికల్‌ను స్ప్రే చేస్తే దుమ్ము, దూళి కూడా క్షణాల్లో వదలగొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment