ఇంటిప్స్:
►రెండు టేబుల్ స్పూన్ల కర్బూజా గుజ్జులో టీస్పూను నిమ్మరసం, టేబుల్ స్పూను శనగ పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్ తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.
► కెచప్‌లో కొద్దిగా అయోడిన్ వేసి కలపాలి. అయోడిన్ వేసిన తరువాత కెచప్ రంగు మారితే పాడైపోయినట్టు. అంతేగాక ఇతర రసాయనాలు కలిసిన కల్తీ కెచప్ మాత్రమే ఇలా రంగు మారుతుంది.
► చీజ్ ముక్కను మంట దగ్గర పెట్టినప్పుడు మండితే చీజ్ నకిలీది. ఇలా కాకుండా నిప్పు సెగకు చీజ్ కరిగితే స్వచ్ఛంగా ఉన్నట్టు.
► నిమ్మకాయలను ముప్పైసెకన్ల పాటు మైక్రోవేవ్‌లో పెట్టి, ఆ తరువాత పిండితే రసం బాగా వస్తుంది.
► కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్‌లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది.
► బ్రెడ్ లేదా బిస్కెట్స్‌ను పాలల్లో ముంచుకుని తినేటప్పుడు...చేతితో కాకుండా... ఫోర్క్‌తో పట్టుకుని ముంచితే పాలల్లో చక్కగా మునిగి మరింత రుచిగా ఉంటాయి.
► బాస్కెట్‌లో అడుగున కొన్ని పేపర్ ముక్కలు వేసి బంగాళదుంపలు వేయాలి. దుంపలపైన మరికొన్ని పేపర్ ముక్కలు వేసి నిల్వచేస్తే ΄ాడవకుండా తాజాగా ఉంటాయి.
► మిగిలిపోయిన నిమ్మచెక్కలకు ఉప్పు అద్ది ఉంచితే పాడవకుండా తాజాగా ఉంటాయి.
► మిగిలిపోయిన బ్రెడ్ ప్యాకెట్‌ను క్లాత్ బ్యాగ్‌లో ఉంచితే బూజు పట్టకుండా తాజాగా ఉంటుంది.
► ఉల్లిపాయను ముక్కలు తరిగిన తరువాత చేతులు ఉల్లి వాసన వస్తుంటే... కొద్దిగా టూత్ పేస్టుని తీసుకుని దానితో చేతులను రుద్ది కడగాలి. ఇలాచేస్తే ఉల్లిఘాటు వదిలిపోతుంది.
► పేపర్ బ్యాగ్‌కు రంధ్రాలు చేసి లోపల వెల్లుల్లిని పెడితే నెలల పాటు నిల్వ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment