ఏ దిల్ ‘మేంగో’ మోర్..!
నల్లజర్ల : వేసవికాలంలో మామిడి కాయలు కాయడం సహజం. కొన్ని కాలానికి విరుద్ధంగా కాస్తాయి అవి పునాస మామిడి చెట్లు. కానీ ఇక్కడ ఏ కాలంలోనైనా కాయలు కాస్తూ ఓ మామిడి చెట్టు ‘ఏ దిల్ ‘మేంగో’ మోర్ అంటోంది. నల్లజర్ల కొత్తపేట ఎస్సీ కాలనీకి చెందిన గుదే వెంకట సుబ్బారావు ఇంటి వద్ద ఉన్న మామిడి చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంది. కడియపు లంక నుంచి తీసుకువచ్చి మొక్కను నాటినట్టు ఆయన చెప్పారు. రెండేళ్ల నుంచి నిత్యం కాయలు కాస్తూనే ఉందన్నారు. పచ్చిగా ఉన్నపుడు పప్పుల్లోను, పండిన తర్వాత పళ్లుగాను ఈ వీధివారంతా వినియోగిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు.