వేసవికాలం వచ్చిందంటే గుర్తొచ్చే పండ్లలో మామిడిపండుదే అగ్రస్థానం. రకాలు ఎన్ని ఉన్నా.. ఆ మధురమైన రుచికి ఫిదా కాని ఎవరైనా ఉంటారా.అందుకే 4వేల వేళ్లకు పైగా ప్రసిద్ది చెందిన మామిడి ఫలాన్ని వేదాల్లో "దేవతల ఫలం" పేర్కొన్నారు. అయితే టెంక లేని మామిడి పళ్లను ఎపుడైనా చూశారా?. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పచ్చని రంగుతో మెరిసిపోతూ, భలే నోరూరుస్తున్నాయి.
అయితే ప్రకృతికి విరుద్ధంగా ఇలాంటి పండించడం వల్ల ప్రకృతిలో లభించేటువంటి పళ్ళు కూరగాయలు అన్నీ మాయమైపోయాయి తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. దీని వలన నష్టమే కానీ లాభం లేదు "టెంక లేని మామిడి పండు అంటే మెదడు లేని శరీరం" అనికొందరు. టెంక లేదు =పోషకాలు లేవు= ఆరోగ్యం లేదు కొందరు కమెంట్ చేస్తున్నారు. అంతేనా.. టెంక లేకుండా థ్రిల్ ఏముందబ్బా. నో ..వే.. మామిడికాయ టెంకతో తింటేనే ఆనందం అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తీపైనా ఉందా? లేదా...నిజంగా ఇలాంటి కాయలున్నాయాంటూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.
కాగా భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు ఈ తరహా కొత్త రకాన్ని 2014లోనే అభివృద్ధి పరిచారు.
టెంక లేని మామిడి పండ్లు🥭🥭 pic.twitter.com/gxPsLShRmY
— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 (@Kishoredelights) March 29, 2022
Comments
Please login to add a commentAdd a comment