seedless mangoes
-
సీడ్ లెస్ మ్యాంగో...ఇంతకీ టెంక ఉందా? లేదా? వైరల్ వీడియో
వేసవికాలం వచ్చిందంటే గుర్తొచ్చే పండ్లలో మామిడిపండుదే అగ్రస్థానం. రకాలు ఎన్ని ఉన్నా.. ఆ మధురమైన రుచికి ఫిదా కాని ఎవరైనా ఉంటారా.అందుకే 4వేల వేళ్లకు పైగా ప్రసిద్ది చెందిన మామిడి ఫలాన్ని వేదాల్లో "దేవతల ఫలం" పేర్కొన్నారు. అయితే టెంక లేని మామిడి పళ్లను ఎపుడైనా చూశారా?. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పచ్చని రంగుతో మెరిసిపోతూ, భలే నోరూరుస్తున్నాయి. అయితే ప్రకృతికి విరుద్ధంగా ఇలాంటి పండించడం వల్ల ప్రకృతిలో లభించేటువంటి పళ్ళు కూరగాయలు అన్నీ మాయమైపోయాయి తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. దీని వలన నష్టమే కానీ లాభం లేదు "టెంక లేని మామిడి పండు అంటే మెదడు లేని శరీరం" అనికొందరు. టెంక లేదు =పోషకాలు లేవు= ఆరోగ్యం లేదు కొందరు కమెంట్ చేస్తున్నారు. అంతేనా.. టెంక లేకుండా థ్రిల్ ఏముందబ్బా. నో ..వే.. మామిడికాయ టెంకతో తింటేనే ఆనందం అని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తీపైనా ఉందా? లేదా...నిజంగా ఇలాంటి కాయలున్నాయాంటూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. కాగా భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు ఈ తరహా కొత్త రకాన్ని 2014లోనే అభివృద్ధి పరిచారు. టెంక లేని మామిడి పండ్లు🥭🥭 pic.twitter.com/gxPsLShRmY — 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 (@Kishoredelights) March 29, 2022 -
టెంక లేని మామిడిపళ్లు!!
మామిడిపళ్లు.. తలుచుకుంటేనే నోరు ఊరుతుంది కదూ. కానీ, రసం మామిడిపళ్లు తినాలంటే మధ్యలో పెద్ద టెంక ఉంటుంది. అది లేకుండా మొత్తం అంతా రసమే ఉంటే ఎంతో బాగుంటుంది కదూ. సరిగ్గా ఇదే ఆలోచన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిందే తడవుగా వాళ్లు పరిశోధనలు మొదలుపెట్టారు. గింజలు లేని ద్రాక్షపళ్లను సృష్టించినప్పుడు.. టెంకలు లేని మామిడిపళ్లు సాధ్యం కాదా అనుకున్నారు. అంతే.. తియ్యటి మధురమైన రసాలూరే టెంకలేని మామిడిపండు సిద్ధం అయిపోయింది. రత్న, ఆల్ఫోన్సో (కలెక్టర్) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో ఈ కొత్త మామిడిపండును రూపొందించినట్లు బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానశాఖ ఛైర్మన్ వీబీ పటేల్ తెలిపారు. ఈ కొత్త రకానికి సింధు అనే పేరు పెట్టారు. దీన్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నాటి.. ఫలితాలు ఒకే రకంగా వస్తున్నాయో లేవోనని చూస్తున్నారు. భారీగా తోటల్లో వేయడంతో పాటు ఇళ్లలో వేసినా ఒకే రకం రుచి వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు. సగటున ఒక్కో పండు 200 గ్రాములు తూగుతుందని, ఇతర రకాల కంటే దీంట్లో పీచు తక్కువగా ఉంటుందని పటేల్ చెప్పారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్‌లో దీన్ని రూపొందించారు. దీని పంట కూడా ఇతర మామిడి రకాల్లా వేసవిలో కాకుండా జూలై మధ్యవారంలో వస్తుందట. 2015 నాటికల్లా రైతులకు ఈ సింధు రకం మామిడి మొక్కలను అందిస్తామని చెబుతున్నారు.