ఫోన్‌ కొడితే మామిడి పండ్లు.. | Horticulture Department Starts Mango Fruits Home Delivery Hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కొడితే మామిడి పండ్లు..

Published Tue, Apr 28 2020 10:10 AM | Last Updated on Tue, Apr 28 2020 10:10 AM

Horticulture Department Starts Mango Fruits Home Delivery Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్‌ బాక్స్‌ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్‌చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్‌ సర్వీస్‌ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్‌ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్‌ చేసుకోవచ్చు. ఆర్డర్‌ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్‌ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్‌ ద్వారా ఆర్డర్ల బుకింగ్‌ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement