Home Delivery
-
ఇంటి వద్దకే రాములోరి కల్యాణ తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు ఇళ్ల వద్దనే రాములోరి తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఏటీఎం సి.రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్గో సేవా విభాగం ద్వారా ఈ సదుపాయం కల్పించనున్నారు. ఎంజీబీఎస్‌లోని కార్గో, పార్శిల్ బుకింగ్ కౌంటర్లో భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కల్యాణం జరిగిన తర్వాత ముత్యాలతో కూడిన తలంబ్రాలను అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకున్న వారికి పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఎంజీబీఎస్ (MGBS) లాజిస్టిక్స్ ఇన్చార్జి 91542 98741, 91542 98865లలో సంప్రదించవచ్చు. కమనీయం.. రామయ్య నిత్య కల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.బ్రహ్మోత్సవాల అంకురార్పణ జాప్యంపై విచారణభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి (Srirama Navami) బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఈనెల 13వ తేదీన ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ కృష్ణవేణి గురువారం రంగనాయకుల గుట్టపై గల కాటేజీలో విచారణ చేపట్టారు. అర్చకులు, ఈఓను పిలిచి ఆరా తీశారు. ప్రధానార్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాస రామానుజాచార్యులను విడివిడిగా విచారించారు.ఈ వేడుకలకు బ్రహ్మగా వ్యవహరించాల్సిన ఓ అర్చకుడిని పర్ణశాలకు పంపించారని, ఆయన ప్రాముఖ్యతను ముందుగానే లిఖితపూర్వకంగా ఈఓ దృష్టికి తెచ్చామని అర్చకులు వివరించినట్లు తెలుస్తోంది. ఈఓ వ్యవహారశైలితోనే ఆలస్యమైందని వారు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత విచారణకు ఈఓ రమాదేవిని పిలవగా ఆమె తన వాదన చెప్పారని తెలిసింది. టెంపుల్ స్పెషల్ ప్రొటెక్షన్ (Temple Special Protection) వారు నిర్వహించిన తనిఖీలు, దీనిపై ఏఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అర్చకుడిపై డిప్యూటేషన్ చర్యలు తీసుకున్నామని, పాలనాపరమైన నిర్ణయాలు, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని పేర్కొన్నట్లు సమాచారం.చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?కాగా, ఇరు వర్గాల వాదనలపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు కృష్ణవేణి వెల్లడించారు. విచారణలో వరంగల్ డీసీ సంధ్యారాణి, హైదరాబాద్ డీసీ కృష్ణప్రసాద్, ఖమ్మం ఏసీ వీరస్వామి పాల్గొన్నారు. కాగా, కృష్ణవేణిని శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యేకాధికారిగా నియమించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. -
ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్‌తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్‌పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్‌ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. హోటల్‌కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్‌లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్‌ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నవారు 2,564 ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు.–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి (చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!) -
రేషన్ పాయే.. మద్యం డోర్ డెలివరీ వచ్చే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇక మద్యం తాగేందుకు వైన్‌షాపునకు రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపారులు ప్రచారానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతంలోని ఓ వైన్‌షాపు నిర్వహకుడు ఈ రకంగా పోస్టులు పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఘోరం అంటూ పలువురు మండిపడుతున్నారు. సూపర్‌సిక్స్, అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు బరితెగిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటికే రేషన్ ఇస్తే.. ఇప్పుడేమో..ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనాల ద్వారా ఇంటికే రేషన్ సరఫరా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు జేబులు నింపుకొనే పనిలో ఉన్నారే కానీ ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇంటికి మద్యం సరఫరా చేయడం కాదన్నారు. గత ప్రభుత్వంలా గుమ్మం వద్దకే పాలనను తీసుకెళ్లాలని, ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలు అందించాలని హితవు పలుకుతున్నారు.ఎమ్మెల్యే అండతోనేనా..మద్యం హోం డెలివరీ చేసే వారికి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అండతోనే పబ్లిక్‌గా ప్రచారం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మద్యం సిండికేట్లు సైతం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయా? అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటున్నారు. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అనేలా కూటమి పాలన సాగిస్తోందంటున్నారు. -
TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్గో సేవలను ఆదివారం(అక్టోబర్ 26) నుంచి విస్తరించనుంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను ఆదివారం నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పించనున్నారు. తొలుత హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా పార్సిళ్ల హోం డెలివరీ ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. పార్సిళ్ల హోం డెలివరీ ఛార్జీలు.. 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.501.01నుంచి 5 కేజీలకు రూ.60 5.01 నుంచి 10 కేజీలకు రూ.65 10.1 నుంచి 20 కేజీలకు రూ.7020.1 నుంచి 30 కేజీలకు రూ.75 -
బెంగళూరు కంపెనీలో ఉద్యోగాల కోత.. ఇక మిగిలింది 50 మందే!
బెంగళూరు ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీ సంస్థ డంజో (Dunzo) భారీగా ఉద్యోగాల కోత విధించింది. రిలయన్స్ మద్దతు ఉన్న ఈ సంస్థ తమ వర్క్‌ఫోర్స్‌లో 75% మందిని తొలగించిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రధాన సరఫరా, మార్కెట్‌ప్లేస్ టీమ్‌లలో ఇక మిగిలింది కేవలం 50 మంది ఉద్యోగులేనని నివేదిక తెలిపింది.ఖర్చుల నియంత్రణ, పెరిగిపోతున్న అప్పులు, ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిలు, విక్రేత చెల్లింపుల సమస్యలతో పాటు నగదు లభ్యతను పెంచుకోవడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఉద్యోగాల కోతకు పూనుకున్నట్లు తెలుస్తోంది. డంజో ఆగస్టు 31న ఉద్యోగాల కోత విధించినట్లు తొలగింపులకు సంబంధించిన ఆన్లైన్ ట్రాకర్ లేఆఫ్స్.ఫై (Layoffs.fyi) పేర్కొంది.ఉద్యోగులకు ఈ-మెయిల్స్తొలగింపుల గురించి తెలియజేస్తూ తమ ఉద్యోగులకు డంజో ఈ-మెయిల్స్ పంపింది. నివేదిక ప్రకారం.. అవసరమైన నిధులను పొందిన వెంటనే బాధిత సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు, సీవెరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలు చెల్లిస్తామని లేఖలో డంజో హామీ ఇచ్చింది. ఒకప్పుడు 775 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీ, ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటూ కష్టపడుతోంది. కొత్త ఇన్వెస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ,రుణాల మిశ్రమం ద్వారా 22-25 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు దాదాపు దగ్గరికి వచ్చినట్లు ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. డీల్ ముగింపు దశలో ఉందని, 10-15 రోజులలోపు బకాయిలను చెల్లించేస్తామని గత జూలై మధ్యలో ఉద్యోగులకు తెలియజేసింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. -
మద్యం హోమ్ డెలివరీ!.. త్వరలో ఈ రాష్ట్రాల్లో..
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్ డెలివరీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి యోచిస్తున్నారు. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతించాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ విధానంలో మద్యం డెలివరీ చేస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వంద శాతం మంది హైదరాబాద్ వాసులు మద్యం హోమ్ డెలివరీ విధానాలకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.మద్యం హోమ్ డెలివరీ అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, పెద్ద నగరాల్లో మితమైన మద్యం అందించడానికి ఉపయోగపడుతుంది. మహిళలు, సీనియర్ సిటిజన్లు మద్యం కోసం షాప్ ముందు నిలబడాల్సిన అవసరం ఉండదని ఓ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అయితే మద్యం హోమ్ డెలివరీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన ఉందని పలువురు చెబుతున్నారు. -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. -
ఆన్లైన్ పూజలు.. ఇంటికే ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్లైన్ సేవలు, స్పీడ్‌పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు. కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు. సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. -
ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ
ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ జూలై 15న తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లో లక్ష మందికి పైగా బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇది ఒక రికార్డు. ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికే డోర్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ నేరుగా వినియోగదారులకు కొత్త ఈవీ స్కూటర్ అందజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నేరుగా కస్టమర్లను చేరుకోవాలని చూస్తుంది. సంప్రదాయ డీలర్ షిప్ నెట్ వర్క్ ను ఓలా తొలగించాలని చూస్తున్నట్లు ఫస్ట్ పోస్ట్ నివేదించింది. ఓలా ఎలక్ట్రిక్ దీనికోసం ఒక ప్రత్యేక లాజిస్టిక్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది ప్రత్యక్ష కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల డాక్యుమెంటేషన్, లోన్ అప్లికేషన్, ఇతర సంబంధిత సమాచారాన్ని ఆన్ లైన్ లో పూర్తి చేస్తే విధంగా పోర్టల్ రూపొందిస్తుంది. అదేవిధంగా, ఈ లాజిస్టిక్స్ టీమ్ స్కూటర్ రిజిస్టర్ చేసి నేరుగా కొనుగోలుదారుడి ఇంటికి డెలివరీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త విధానంతో ఓలా విస్తృతమైన రిటైల్ గొలుసును ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులను ఆదా చేయాలని చూస్తోంది. అంటే ఓలా భారతదేశంలోని మెట్రో, టైర్-3 నగరంలోని వినియోగదారుడికి చేరుకోవాలని చూస్తుంది. ఇప్పటి వరకు మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్ల తయారీదారులు వినియోగదారులకు వాహనాలను హోమ్ డెలివరీ చేస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1, ఎస్1 ప్రో వేరియెంట్లలో లభ్యం అవుతుందని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ ధర సుమారుగా రూ.80,000 నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. -
దేశంలోనే తొలిసారి, 2 గంటల్లో ‘ఫ్యాషన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్, ఎఫ్‌బీబీ.. రెండు గంటల హోమ్ డెలివరీ సేవలను ఫ్యాషన్‌కూ విస్తరించాయి. ఇప్పటి వరకు బిగ్ బజార్ ఈ సేవల కింద నిత్యావసరాలను తన కస్టమర్లకు అందించింది. ఫ్యాషన్ కలెక్షన్‌ను ఇలా రెండు గంటల్లో వినియోగదార్లకు చేర్చడం దేశంలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 144 నగరాలు, పట్టణాల్లో 352 స్టోర్ల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తారు. షాప్.బిగ్‌బజార్.కామ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. -
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
మందు బాబులకు శుభవార్త: ఇక ఇంటికే మందు చుక్క!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ, నిత్యావసర సరుకుల డోర్ డెలివరీ మాత్రమే తెలుసు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కొత్త పద్ధతికి తెర లేపింది. ఇక నుంచి మద్యాన్ని ఇంటికే పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు ఢిల్లీలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మద్యం విక్రేతలు మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి నిబంధనల ప్రకారం ఎల్ -13 లైసెన్స్ కలిగి ఉండాలి. కాగా ఎల్-13 లైసెన్స్ కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మద్యం ఇంటికి ఆర్డర్ చేసుకునే ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. మద్యం విక్రేతలకు ఎల్ -13 లైసెన్స్ జారీ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం జూన్ 1న ఎక్సైజ్ నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. భారతీయ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని మొబైల్ యాప్స్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్స్ ద్వారా ఇంటికి పంపిణీ చేయడానికి అనుమతించింది. అయితే మద్యాన్ని నేరుగా ఇంటికే పంపిణీ చేయాలని పేర్కొంది. హాస్టల్స్, కార్యాలయాలు, సంస్థలకు డెలివరీ చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మద్యం షాపులు, మాల్స్, మార్కెట్లు మూసివేశారు. చదవండి: వైరల్: ఓ జిడ్డు ద్రావణం.. మరి రికార్డు బద్దలు కొట్టిన వీరుడెవరు? -
మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై మద్యం ఇంటికే డెలివరీ కానుంది. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేస్తే మద్యం ఇంటికి చేరుకొనేలా ఢిల్లీ ప్రభుత్వం చట్టం చేయనుంది. ఢిల్లీ ఎక్సైజు నియమాల సవరణ చట్టం –2021 ద్వారా ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్ ప్రటనను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బహిరంగంగా అమ్మే లైసెన్సు కలిగిన హోటళ్లు, క్లబ్బులు, బార్ల నుంచి సైతం మద్యాన్ని బాటిళ్ల ద్వారా అందుకునే వీలు ఈ చట్టం ద్వారా కలగనుంది. యాప్, వెబ్సైట్ ద్వారా చేసిన ఆర్డర్లకు మాత్రమే డెలివరీ సదుపాయం ఉంటుంది. కేవలం ఇంటి చిరునామాలకు మాత్రమే డెలివరీ చేయనున్నారు. ఆఫీసులు, సంస్థలు, హోటళ్లకు మాత్రం డెలివరీ ఉండదు. ఈ నిర్ణయాన్ని భారత ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) స్వాగతించింది. లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఢిల్లీ ఆర్థిక విభాగం ఈ ప్రకటనను జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. ఇలా మద్యాన్ని ఇళ్లకు డెలివరీ చేయడం దేశ సంస్కృతికి విరుద్ధమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ. నగరంలో కోవిడ్ 19ను అరికట్టడానికి బదులు కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యాన్ని డెలివరీ చేయడంలో బిజీగా ఉందంటూ విమర్శించారు. చదవండి: తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు -
మందుబాబులకు శుభవార్త: ఆర్డర్ పెట్టు.. మందు పట్టు
భువనేశ్వర్: ఖుర్దా జిల్లాలో మద్యం ఆన్లైన్ విక్రయాలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి మద్యం డోర్ డెలివరీ సర్వీసు అందుబాటులోకి రానుంది. అబ్కారీ విభాగం మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆన్లైన్ మద్యం విక్రయాలు చేపట్టనున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి 17 హోం డెలివరీ సంస్థలతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. orbc.co.in వెబ్సైటులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఆర్డర్ చేసిన ఒకటి నుంచి రెండు గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేయస్తామని అధికారులు చెప్పారు. -
CoronaVirus: ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. టోల్ ఫ్రీ నంబర్ 1031 కి ఫోన్‌చేస్తే కేవలం 2గంటల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ గుమ్మం ముందు ఉంటుందని అన్నారు. ఈ సేవను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో 200 కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకరి వద్ద అవసరం తీరిపోయాక, ఆ కాన్సంట్రేటర్‌ను శానిటైజ్ చేసి అవసరంలో ఉన్న మరొకరికి ఇస్తామని చెప్పారు. డాక్టర్ల సిఫారసు మేరకు అవసరమైన పేషెంట్లకు వీటిని అందివ్వనున్నారు. ఓ టెక్నీషియన్ వచ్చి ఎలా వాడాలో వివరిస్తారని తెలిపారు. హోం ఐసోలేషన్ ప్రొటోకాల్‌కు ఎన్రోల్ చేసుకోని వారు కూడా 1031కి ఫోన్ చేసి కాన్సన్ట్రేటర్ తెప్పించుకోవచ్చన్నారు. సరైన సమయంలో ఆక్సిజన్ అందించడం ద్వారా ప్రాణాలను నిలబెట్టుకోవచ్చన్నారు. వీటిని స్పాన్సర్ చేసిన ఓఎల్ఏ ఫౌండేషన్, గివ్ఇండియా సంస్థలను అభినందించారు. -
మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ
రాయ్‌పూర్: లాక్డౌన్ కారణంగా దుకాణాలు మూసేసినప్పటికీ మందుబాబులకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే... మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేందుకు అనుమతించింది. కల్తీ మద్యం, శానిటైజర్లను తాగి ప్రజలు చనిపోతున్నందువల్ల, అక్రమ మద్యం తయారీ, అమ్మకాలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి మద్యం హోం డెలివరీ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా హోం డెలివరీలు ఇవ్వొచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి... మొత్తం డబ్బును చెల్లిస్తే సమీపంలోని వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా జరుగుతుందని చత్తీస్‌గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్) తెలిపింది. సీఎస్ఎంసీఎల్ వైబ్సైట్లో, మొబైల్ యాప్‌లో ఆర్డర్లు పెట్టొచ్చని వివరించింది. హోం డెలివరీ ఇచ్చినందుకు వంద రూపాయలు అదనంగా ఛార్జి చేయనున్నారు. గత ఏడాది దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నపుడు కూడా చత్తీస్‌గఢ్ మద్యం హోం డెలివరీని అనుమతించింది. రాష్ట్ర బీజేపీ దీన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కరోనా చికిత్సకు వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేత ధరమ్‌లాల్ విమర్శించారు. చదవండి: (2 వారాలు సర్వం బంద్.. నేటి నుంచి పూర్తి లాక్డౌన్) -
హోం డెలివరీ బై ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా జంట నగరాల్లో సరుకుల హోం డెలివరీ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే ఏ ప్రాంతం నుంచైనా సరుకులు, పార్శిళ్లను నగరంలో సంబంధిత ఇళ్లకు చేరవేయడానికి అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆర్టీసీ కార్గో విభాగం హోం డెలివరీలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్, స్మార్ట్‌యాప్ లాజిస్టిక్స్, అడ్నిగమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలకోసం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఏజెంట్లను నియమించుకోవటం విశేషం. హోం డెలివరీ చార్జీలు ఇలా.. 10 కేజీల వరకు రూ.80, 11 కేజీల నుంచి 30 కేజీల వరకు రూ.150, 31 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.225, 51 కేజీల నుంచి 100 కేజీల వరకు రూ.300, 101 కేజీలను మించితే అదనపు ప్రతి కిలోకి రూ.2 చొప్పున చార్జీ్జ చేస్తారు. పార్సిల్ కవర్ల ధరలు.. 500 గ్రాముల వరకు రూ.30, 501 నుంచి వేయి గ్రాముల వరకు రూ.50 వసూలు చేస్తారు. -
‘రుచి’ చూపిస్తున్న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో ఆర్నెళ్లుగా విలవిల్లాడిన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రస్తుతం కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రం నలమూలల నుంచి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా వచ్చి ఇక్కడే తిష్టవేయడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ఇక కార్యకర్తల కోసం పార్టీలు బల్క్‌గా ఇస్తున్న ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరగ్గా, మరోపక్క హోమ్ డెలివరీలు పెరుగుతున్నాయని ఈ–కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. (జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా) హోటళ్లకు ఎన్నికల జోష్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ దెబ్బ తగిలింది. పూర్తిగా మూసివేయాల్సి రావడంతో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక యజమానులు నష్టపోయారు. తిరిగి జూన్ రెండో వారంలో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. సామాజిక దూరం పాటించేలా, ‘కోవిడ్’ జాగ్రత్తలు పాటిస్తూ రెస్టారెంట్లలో మార్పుచేర్పులు చేసినా కరోనా కేసుల నేపథ్యంలో వినియోగదారులు పెద్దగా అటు వెళ్లలేదు. దీనికి తోడు చాలా రెస్టారెంట్లలో నిష్ణాతులైన వంటగాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం యజమానులకు కష్టమైంది. కొన్ని రెస్టారెంట్లను లాభాలను పక్కనపెట్టి నడిపించినా, వినియోగదారులు రాక, అద్దెలు కట్టలేక వాటిని మూసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘ఆగస్టు వరకు 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. అనంతరం 21 శాతం మేరకు తెరుచుకున్నా, అవి హోమ్ డెలివరీలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇందులోనూ 17% తక్కువ సామర్థ్యంతో నడిచాయి. అక్టోబర్, నవంబర్లలో పరిస్థితి మెరుగైంది. మూతపడిన రెస్టారెంట్లలోని 52% తిరిగి తెరుచుకున్నాయి’ అని ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికలు రావడంతో తెరుచుకున్న హోటళ్లకు కస్టమర్ల రాక రెట్టింపైంది. పెరిగిన బిర్యానీ ఆర్డర్లు నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో కస్టమర్ల తాకిడి పెరిగిందని, సీటింగ్ సామర్థ్యం సైతం 50 నుంచి 75 శాతానికి పెరిగిందని గచ్చిబౌలిలోని హోటల్ యజమాని ఒకరు తెలిపారు. వారం రోజులుగా బల్క్‌గా రోజుకు రెండు నుంచి మూడు ఆర్డర్లు ఉంటున్నాయని కూకట్‌పల్లికి చెందిన మరో రెస్టారెంట్ యజమాని తెలిపారు. (‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం) ఇక ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ వెరైటీల వంటకాల మెనూని కుదించి, డిమాండ్ ఉన్న వాటినే కస్టమర్లకు అందించగా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో అన్ని వెరైటీలను అందిస్టున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా గ్రేటర్ పరిధిలో హోమ్ డెలివరీలు పెరిగాయని జొమాటో తన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని, ఒకే ఆర్డర్‌పై ఎక్కువ మందికి సరిపోయే భోజనం ఆర్డర్లు ఇస్తున్న వారి సంఖ్య సైతం పెరిగిందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. -
బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ
ప్రస్తుతం ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే వినోదాన్ని హోమ్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేసింది ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ డిస్నీ హాట్‌స్టార్. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ అంటూ ఏడు హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’, అజయ్ దేవగన్ ‘భూజ్’, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్బుల్’, సంజయ్ దత్ ‘సడక్ 2’, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ ‘దిల్ బేచారా’, విద్యుత్ జమాల్ ‘ఖుదా హాఫీజ్’, కునాల్ కేము ‘లూట్ కేస్’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. జూలై నుంచి అక్టోబర్ నెలవరకూ ఈ సినిమాలను ప్రసారం చేయనున్నట్టు హాట్‌స్టార్ తెలిపింది. ఇందులో ‘దిల్ బేచారా’ మొదటిగా జూలై 24న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ సంబంధించి అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ను హోస్ట్ చేశారు వరుణ్ ధావన్. ఈ ఈవెంట్‌కి తమని ఆహ్వానించలేదని విద్యుత్ జమాల్, కునాల్ కేము ట్వీటర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ ప్రజలకు ఎయిర్టెల్ శుభవార్త
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వినుత్న అలోచనకు అంకురార్పణ చేసింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా ఇంటర్నెట్, డీటీఎచ్(టీవీ రీచార్జ్) తదితర సేవలను వినియోగదారులు ఇంటి నుంచే పొందవచ్చని పేర్కొంది. తాజా సేవలపై ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిమ్‌కార్డు జారీ, ఇంటర్నెట్, డీటీఎచ్ తదితర సేవలను కస్టమర్లకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హోమ్ డెలివరీ చేసే ఉద్యోగులకు ప్రుభుత్వ నియమాల ప్రకారం శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించామని.. విస్తృత సేవలందిస్తున్న ఎయిర్టెల్ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుత కష్ట కాలంలో రీచార్జ్ చేసుకోలేనివారి కోసం ‘సూపర్ హీరోస్’ అనే ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. రీచార్జ్ చేసుకోలేని వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే 10 లక్షల మంది కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావడంతో పాటు అవసరమైన వారికి రీచార్జ్ చేశారని గోపాల్ విట్టల్ కొనియాడారు. చదవండి: డిస్నీ+హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్టెల్ కొత్త ప్యాక్ -
సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని గురువారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి. సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్) చేయాలి. అతిథులు, హోటల్ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్/మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మాస్కులు ధరిస్తేనే అనుమతి షాపింగ్ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్ మాల్ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి. మార్కింగ్ చేయాల్సిందే హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్ లోపల, బయట మార్కింగ్ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిచేలా చూడాలి. -
ఆన్లైన్ మద్యం డెలివరీకి స్విగ్గీ సై!
కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో తాగుబోతులకు తిప్పలు పెరిగాయి. గతంలో లాగా విచ్చలవిడిగా కొని, తాగి తూలే అవకాశం లేకపోవడంతో డ్రింకర్ బాబులంతా డీలా పడ్డారు. కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలు షురూ చేయడంతో కరువుబట్టినట్లు మందుబాబులంతా వైన్స్ ముందు క్యూలు కట్టారు. అయితే ఈ అమ్మకాలకు సవాలక్ష పరిమితులుండడం వీళ్లని పాపం బాగా నిరాశ పరిచింది. ఇలాంటి మందుమాలోకాలకు ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు ఫుడ్, గ్రాసరీ, మెడిసన్స్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసిన స్విగ్గీ ఇకపై ఆల్కహాల్ డ్రింక్స్‌ను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తమ యాప్‌లో తాజాగా ‘‘వైన్‌షాప్’’ కేటగిరీని చేర్చింది. ఈ వార్త వినగానే హడావుడిగా స్విగ్గీయాప్ ఓపెన్ చేసి మందు బుక్ చేయాలని కంగారు పడకండి... ప్రస్తుతానికి ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికే పరిమితం. త్వరలో ఈ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీసును అందిస్తామని స్విగ్గీ తెలిపింది. అంతేకాదండోయ్! ఆన్లైన్ లిక్కర్ డెలివరీ కోసం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, వీలును బట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలారంభిస్తామని ప్రకటించింది. ఆషామాషీ కాదు... ఆన్లైన్ లిక్కర్ డెలివరీ అనగానే ఠక్కున యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం కాదని స్విగ్గీ తెలిపింది. ముందుగా కస్టమర్ తన వయసును ధృవీకరించుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీని, ఒక సెల్ఫీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని డెలివరీ సమయంలో చెప్పాల్సిఉంటుంది. అంతేకాకుండా ఝార్ఖండ్ ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక్కో కస్టమర్ చేసుకునే లిక్కర్ బుకింగ్‌కు పరిమితి ఉంటుంది. ఆన్లైన్ డెలివరీ ద్వారా వైన్స్ వద్ద గుంపులుకూడకుండా సాయం చేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి చెప్పుకున్నారు. తమ డెలివరీ పార్టనర్స్‌కు శుభ్రత, సురక్షిత విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. -
స్విగ్గీ, జొమాటోలో మద్యం హోం డెలివరీ
రాంచీ: మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో మందుబాబులు గంటల తరబడి మండుటెండలో క్యూ లైన్లో నిల్చోవాల్సిన పనిలేదు. షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మాటిమాటికీ గడియారం చూడాల్సిన పని అసలే లేదు. చేతిలో ఫోన్, దానిలో రెండు యాప్స్ ఉన్నాయంటే కళ్ల ముందు మద్యం సాక్షాత్కరించాల్సిందే. అదెలాగో వివరంగా తెలుసుకుందాం... లాక్డౌన్లో ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు దాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం అమ్మకాల వైపు మొగ్గు చూపక తప్పలేదు. కానీ మందుషాపులు ఓపెన్ అవగానే కిలోమీటర్ల కొద్దీ లైనులు, సామాజిక దూరం అన్న మాట నామమాత్రం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ క్యూలైన్లో నిల్చోవడాలు.. దీనివల్ల ప్రభుత్వానికి ఖజానా వస్తుందన్న మాట అలా ఉంచితే కరోనా కేసులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీనికో పరిష్కారం కనిపెట్టింది. (మద్యం హోం డెలివరీకి జొమాటో..!) అందులో భాగంగా దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో మద్యం డెలివరీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా నాలుక పిడచకట్టుకుపోయిన మద్యంప్రియుల దాహార్తిని తీర్చడంతోపాటు కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకున్నట్లైంది. ఇప్పటికే జార్ఖండ్ రాజధాని రాంచీలో మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ సదుపాయాన్ని త్వరలోనే మిగతా నగరాలకు సైతం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఓ షరతు కూడా ఉందండోయ్. ముందు మీ వయసు నిర్ధారించుకున్న తర్వాతే ఆర్డర్‌ను స్వీకరిస్తుంది. కూర్చున్న చోటకే మద్యం అందించడంపై మందుబాబులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 'మద్యం-హోం డెలివరీ' అనే అంశంపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి. (ఒకే ట్రక్కులో శవాలతో పాటు కూలీలు) -
మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాల్లో ఆన్లైన్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం నిబంధన పాటించడానికి, జనాలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లాక్డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూసే అవకాశం ఉందని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. (చదవండి : మద్యం హోం డెలివరీకి జొమాటో..!) అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. కానీ రాష్ట్రాలు భౌతిక దూరం నిబంధన అతిక్రమించకుండా ఉండేందుకు మద్యం అమ్మకాల్లో హోం డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ దీపక్ సాయి.. ‘మద్యం షాపుల ముందు భౌతిక దూరం నిబంధన పాటించడం కుదరదు. ఎందుకంటే కొన్ని షాపులు మాత్రమే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో వాటి ముందు పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరారు. మద్యం అమ్మకాల వల్ల సామాన్యుని జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే మా కోరిక. అందుకే మద్యం అమ్మకాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు తప్పకుండా స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు. (చదవండి : లిక్కర్ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ) కాగా, మూడో దశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు.. ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరారు. ముంబైలో ఈ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కేవలం రెండు రోజుల్లోనే మద్యం షాపులను మళ్లీ మూసివేశారు. మరోవైపు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం హోం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే. -
మద్యం హోం డెలివరీకి జొమాటో..!
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కాలంలో మద్యం ప్రియులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలివరీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది. (చదవండి : పోలీస్ స్టేషన్లో మద్యం చోరీ) భారత్‌లో మద్యం హోం డెలివరీకి సంబంధించి ఏ విధమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత హోం డెలివరీ.. బాధ్యయుత మద్యం వినియోగాన్ని ప్రొత్సహించినట్టు అవుతుందని నమ్ముతున్నట్టు జొమాటో సీఈవో మోహిత్ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు లాక్డౌన్ నిబంధనల వల్ల రెస్టారెంట్లు మూసివేయడంతో జొమాటో విభిన్నంగా నిత్యావసరాలు డెలివరీ చేయడం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.(చదవండి : మద్యం ఇక హోం డెలివరీ..!) కాగా, పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలు వాటి ముందు బారులు తీరారు. ఈ రద్దీని తగ్గించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మద్యంపై 70 శాతం స్పెషల్ కరోనా ఫీజు విధించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. ముంబైలో మాత్రం మందుబాబులను అదుపు చేయలేక కేవలం రెండు రోజుల్లోనే మద్యం దుకాణాలు మూసివేశారు. -
మద్యం ఇక హోం డెలివరీ..!
చండీగఢ్/కోల్‌కతా: దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఏడో తేదీ నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ శాఖ తెలిపింది. లిక్కర్ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా రూపొందించిన వెబ్‌సైట్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ప్రారంభించింది. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్ ప్రారంభించింది. చదవండి: తెలంగాణలో మద్యం జాతర -
కార్లు హోం డెలివరీ - మారుతి సుజుకి
సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కరోనావైరస్, లాక్డౌన్ మూసివేసిన 600 డీలర్‌షిప్‌లను తిరిగి తెరిచినట్లు బుధవారం తెలిపింది. వాహనాల డెలివరీలను కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన స్టాక్ తమ దగ్గర వుందని సంస్థ వెల్లడించింది. ప్లాంట్ల కార్యకలాపాలు ప్రస్తుతానికి ఇంకా మొదలుకాలేదని ప్రకటించింది. (కరోనా : అయ్యయ్యో మారుతి!) కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాహనాల కొనుగోలుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేశామని తెలిపింది. అలాగే డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని ఆటో మేజర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తెరిచామని ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. గత కొన్ని రోజులుగా 55 యూనిట్లతో ఇప్పటికే కార్ల డెలివరీలను కంపెనీ ప్రారంభించిందని తెలిపారు. సంబంధిత అనుమతులు తప్పనిసరైన రాష్ట్రాల్లో డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం అమ్మకపు నెట్‌వర్క్‌లో కార్యకలాపాలను ప్రారంభంపై ప్రశ్నించినపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎంత త్వరగా ఆమోదం వస్తుందనే దానిపై ఆధారపడి వుంటుందని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. (కారు.. జీరో) కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ కరోనా కట్టడికి సంబంధించి పూర్తి భద్రత, పరిశుభ్రత, శానిటైజేషన్ చర్యలను విధిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొనుగోలు సమయలో షోరూమ్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు సహాయపడేలా డిజిటల్ ప్రక్రియను కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. వాహనాల డెలివరీకి కూడా షోరూమ్‌లకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డీలర్‌షిప్‌లు టెస్ట్ డ్రైవ్ వాహనాలను పూర్తి స్టెరిలైజేషన్‌ను చేపడతాయని చెప్పారు. కాగా దేశంలోని 1960 నగరాలు, పట్టణాల్లో సుమారు 3080 డీలర్షిప్లున్న ఈ సంస్థ 474 అరేనా అవుట్లెట్లు, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అమ్మకపు దుకాణాలను తెరవగలిగింది. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది. (పెట్రోపై పన్ను బాదుడు) -
ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్
ఛండీగర్ : కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ర్టాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబందనలు గాలికొదిలేసి మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపిస్తున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనల మధ్య మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హామ్ డెలివరీకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వరకు డోర్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. (మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్ ) నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. చాలా ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా, సామాజిక దూరం పాటించడం లేదని దీని ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున లిక్కర్ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నమని వివరించారు. ఇక ఛత్తీస్‌ఘడ్‌లోనూ గ్రీన్జోన్లలో ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్ ) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. (మద్యం డోర్ డెలివరీ : అందుబాటులో యాప్ ) -
ఫోన్ కొడితే మామిడి పండ్లు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ద్వారా ఆర్డర్‌పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్‌ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్‌చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్‌లు కావాలన్న బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్ ద్వారా ఆర్డర్ల బుకింగ్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. -
మీరు మద్యం ప్రియులా.. తాగాలని ఉందా..?
సాక్షి, సిటీబ్యూరో: మీరు మద్యం ప్రియులా...మద్యం తాగాలని ఉబలాట పడుతున్నారా... లాక్డౌన్ వేళ మీకు ఎక్కడా లభించని మద్యాన్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వగానే మీ ఇంటికొచ్చి మరీ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశను క్యాష్‌గా మలచుకొని వారి ఖాతాల్లో డబ్బులను గుల్ల చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలులో మద్యం దుకాణాలు మూసివేసి ఉండటంతో అదే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేస్తున్నారు. ఆధునిక సాంకేతికతపై మంచి అవగాహన ఉన్న వీరు గూగుల్ సెర్చ్ ఆప్షన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాప్‌ల పేరుతో తమ నంబర్లను ఆన్లైన్లో ఉంచుతున్నారు. గూగుల్‌లోని వైన్‌షాప్ నియర్ మీ అని కొడితే గూగుల్‌లో వచ్చేలా చిరునామాలు అందుబాటులో ఉంచారు. (శానిటైజర్లు తాగేస్తున్నారు) అయితే సామాజిక మాధ్యమాల ద్వారా ఇది నిజమేననుకొని కొంతమంది ఆ లింక్ కిక్ చేసి మరీ వారు అడిగిన రెండింతల రేటుకు డబ్బులను బ్యాంక్ ఖాతాల నుంచి ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆయా నంబర్లను సంప్రదిస్తే ఎటువంటి స్పందన ఉండటం లేదు. ఇటువంటి రెండు కేసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. అందుకే ఆన్లైన్ల ద్వారా ఆర్డరిస్తే ఇంటికే మందు అనే లింక్‌లను నమ్మవద్దని, లాక్డౌన్ వేళ అసలు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ రకంగా ప్రజలను మోసం చేసే నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
నేరుగా ఇంటికే రేషన్ సరుకులు..
సాక్షి, గుడివాడ: తెల్లకార్డు దారులు రేషన్ డిపోలకు వెళ్లనవసరం లేదని.. గుడివాడ పట్టణంలో ప్రయోగాత్మకంగా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రెండో విడత ఉచిత రేషన్ సరుకులు అందిస్తున్నామని తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలో ఉన్న 24 వేల తెల్ల కార్డుదారులకు 46 రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెల్ల కార్డు ఉన్న కుటుంబంలో మనిషికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ శనగలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రేషన్‌షాపుకు ఒక్కో వాహనం చొప్పున ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నామని తెలిపారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్ విజృభింస్తున్న నేపథ్యంలో కార్డుదారుల బయో మెట్రిక్ రద్దు చేసినట్లు తెలిపారు. రేషన్‌షాపు పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి బయో మెట్రిక్ ద్వారా వాలంటీర్లు ఇంటికే రేషన్ సరుకులను అందజేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. -
కరోనా: జోన్ల వారీగా కాల్ సెంటర్లు
సాక్షి, కృష్ణా: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధం చేశారు. పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు ఇంటికే పంపేలా చర్యలు చేపట్టారు. రెడ్జోన్ల వారీగా కాల్సెంటర్లను ఏర్పాటు చేశారు. సరుకులు అవసరమైన వారు ఫోన్ చేస్తే చాలు ఇంటికే పంపిస్తున్నారు. ఇళ్ల వద్దకే నిత్యావసరాలు.. నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేసేందుకు కిరాణా, కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలను ఎంపిక చేశారు. ఒక్కో రెడ్‌జోన్‌లో 15–20 వరకు దుకాణాలను ఎంపిక చేసి వాటి యజమానులకు పాసులు జారీ చేస్తున్నారు. వారు బాయ్స్‌ను ఏర్పాటు చేసుకుని.. ఫోన్ చేసిన వారికి సరుకులు ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. బెజవాడలో టోల్ ఫ్రీ నంబరు.. విజయవాడ నగరంలో రాణిగారితోట, పాయకాపురం, విద్యాధరపురం, కుమ్మరపాలెం, ఖుద్దూస్గనర్, ఓల్డ్ రాజరాజేశ్వరీపేట ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలను బారికేడ్లతో మూసేసి.. రాకపోకలను నిలిపివేశారు. అక్కడ నివసిస్తున్న వారికి ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలను వీఎంసీ అధికారులు అందజేస్తున్నారు. ఇందుకోసం వీఎంసీ 0866–2427485 టోల్ ఫ్రీ నంబరును ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ నంబరుకు ఫోన్ చేసి తమ కావల్సినవి చెబితే సూపర్మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారు. అదేకాకుండా ఆయా ప్రాంతాల్లోకి బస్సుల ద్వారా నిత్యావసరాలు, మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు కాలనీల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అలాగే పాలు, పండ్లు, మెడికల్ సంబంధించినవి కూడా అందజేస్తున్నారు. రూరల్ జిల్లాలో వలంటీర్లతో.. కృష్ణా రూరల్ జిల్లా మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, పెనమలూరు పట్టణాల్లో ఇంటింటికీ సరుకులు, మందులు వంటివి వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ∙జగ్గయ్యపేట పట్టణం, నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం, ముప్పాళ్ల గ్రామాలను రెడ్జోన్లుగా ప్రకటించినప్పటి నుంచి ఆయా గ్రామాల్లో వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకు నిత్యావసరాలు, పాలు, పండ్లు, మందులను అధికారులు పంపిణీ చేయిస్తున్నారు. నూజివీడు పట్టణంలో నిత్యావసర, పాలు, మెడికల్ షాపుల యజమానుల నంబర్లును అందరికీ అందజేశారు. అవసరమైన సరుకులను ఫోన్ చేస్తే వారే డోర్ డెలివరీ చేస్తున్నారు. కూరగాయలను మున్సిపాలిటీ సిబ్బంది నాలుగు వాహనాల్లో తీసుకొచ్చి ఆయా వార్డుల్లో విక్రయిస్తున్నారు. ∙ఇక నూజివీడులో మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటింటికీ పాలు అమ్ముతున్నారు. కూరగాయలు, పాలు, నిత్యావసరాలు మాత్రం ఎంపిక చేసిన దుకాణాల నుంచి డోర్ డెలివరీ చేయిస్తున్నారు. నిత్యావసరాలు డోర్ డెలివరీ జోన్ల వారీగా కాల్ సెంటర్లు కంటైన్మెంట్ ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు -
ఫోన్ కొట్టు..పండ్లు పట్టు
లక్డీకాపూల్ (హైదరాబాద్): లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్‌కి వెళ్లి కోరిన పండ్లు కొనుక్కోలేని వారికి వాటిని ఇంటివద్దకే అందించే సదుపాయాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియకు వినియోగదారుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. జంటనగరాల్లో కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్‌లు చొప్పున 7330733212 కాల్ సెంటర్‌కు ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు..కోరిన పండ్లు నేరుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరహా సరఫరాలో పండ్ల ధరలు ఇలా ఉన్నాయి..రూ.300కు మామిడి పండ్లు..1.5 కిలోలు, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కిలో, బత్తాయి 2.5 కిలోలు, డజన్ నిమ్మకాయల ప్యాక్, కలంగిరి 4 కిలోలు చొప్పున సరఫరా చేస్తున్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మొబైల్ రైతు బజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలను సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవి కుమార్, జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంటి వద్దకే పండ్ల సరఫరా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారానికి నగరంలోని 3,500పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల నుంచి కొనుగోలు చేసిన పండ్లను సేకరిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరిస్తున్నారు. -
మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
కోల్‌కతా : లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క అవస్థలు పడుతున్నవారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసకున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసింది. అయితే లాక్డౌన్ వల్ల మూతపడ్డ మద్యం షాపులను తెరవబోమని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నవారికి మాత్రం మద్యం షాపుల నుంచి హోం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. మద్యం విక్రేతలకు స్థానిక పోలీసుల స్టేషన్లలో హోం డెలివరీకి సంబంధించిన పాస్‌లు జారీ చేయనున్నాం. ఇందుకోసం మద్యం షాప్ యజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఒక్క షాపుకు మూడు డెలివరీ పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్డౌన్ ఉన్నప్పటికీ స్వీట్ షాపులను కొన్ని గంటలపాటు తెరచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మందు కావాలా బాబూ!
ముంబై: మద్యం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు, డ్రంకెన్ డ్రైవ్‌లకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. ‘డ్రంకెన్ డ్రైవ్ ఘటనలను తగ్గించాలని నిర్ణయించాం. దీనికోసం మద్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించాం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే ఆదివారం తెలిపారు. ఈ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయం వెల్లడించలేదు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పక్కనున్న 3వేల లిక్కర్ దుకాణాలు మూతబడ్డాయి. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో ఆ ప్రభావం కూడా ఖజానాపై పడింది. దీంతో ఆదాయాన్ని పెంచుకు నేందుకు మద్యం ఆన్లైన్ విక్రయాలు, హోం డెలివరీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది’ అని తెలిపారు. అయితే, మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మద్యాన్ని ఆన్లైన్లో విక్రయించాలనేది ఓ ప్రతిపాదన మాత్రమేనని తెలిపింది. -
రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేయండి
న్యూఢిల్లీ: దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు రేషన్ సరుకుల్ని లబ్ధిదారుల ఇంటికి చేరవేయాలని కేంద్రం కోరింది. అలాగే వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకుల్ని తీసుకెళ్లని వారిపై దృష్టి సారించాలని సూచించింది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంపై పాశ్వాన్ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ జరిగిన సమావేశానికి 15 రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాశ్వాన్ మీడియాతో మాట్లాడారు. ‘వైకల్యం, ముసలితనం కారణంగా రేషన్‌షాపుకు లబ్ధిదారులు రాలేని సందర్భాల్లో రాష్ట్రాలు వారి ఇంటికి రేషన్ సరుకుల్ని చేరవేయాలి’ అని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టతలోభాగంగా ఆన్లైన్లో ఫిర్యాదుచేసే సదుపాయం, టోల్‌ఫ్రీ హెల్ప్లైన్లు వంటి సంస్కరణలను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. -
ఇక ఇంటి వద్దకే ఇంధనం!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ తాజాగా ఇంటి వద్దకే ఇంధనం అందించే సర్వీసులు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను హోమ్ డెలివరీ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం పుణెలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వీసులను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. అలాగే పెట్రోల్ కూడా హోమ్ డెలివరీ చేయాలని యోచిస్తోంది. రవాణాకు అనువైనది కావడంతో పాటు కొంత సురక్షితం అయినందున ముందుగా హోమ్ డెలివరీకి డీజిల్‌ని ఎంచుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎండీ సంజీవ్ సింగ్ తెలిపారు. పెట్రోల్‌ని కూడా అందించాలంటే కొన్ని రిస్కులు ఉన్నాయని.. దీనిపై పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో)తో చమురు కంపెనీలు చర్చిస్తున్నాయని ఆయన వివరించారు. ఇంధనాలను ఇంటివద్దకే అందించే సర్వీసుల అంశాన్ని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దాదాపు ఏడాది క్రితమే ప్రస్తావించారు. 2017 జూన్‌లోనే బెంగళూరుకి చెందిన స్టార్టప్ సంస్థ ఏఎన్‌బీ ఫ్యూయల్స్ సంస్థ .. మైపెట్రోల్పంప్ బ్రాండ్ పేరిట పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ సర్వీసులు కూడా మొదలుపెట్టింది. అయితే, ఈ విధంగా ఇంధనాలను రవాణా చేయడం సురక్షితం కాదని, ఏఎన్‌బీకి ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలంటూ చమురు కంపెనీలకు పెసో సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఉదంతం తర్వాత.. మళ్లీ ఇంధనాల హోమ్ డెలివరీకి ఇండియన్ ఆయిల్ తదితర చమురు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. వీటిలో ముందుగా ఇండియన్ ఆయిల్ సంస్థ ఈ సర్వీసులు ప్రారంభించింది. -
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏదైనా..
హడావుడిగా ఆఫీస్‌కు వెళ్తూ లంచ్ బాక్స్ మర్చిపోయారా? అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్తూ పత్రాలు మర్చిపోయారా? షాపింగ్ చేసిన వస్తువులు తీసుకెళ్లే వీలులేక మాల్స్‌లో ఉంచారా? ఇలా ఏదైనా సరే.. ఎప్పుడైనా సరే.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తాము అందిస్తామంటోంది ‘వీ డెలివరీ’ టీమ్. దీనిని ప్రారంభించిన నగరవాసి శ్రీనివాస్ మాధవం చెప్పిన వివరాలు ఆయనమాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో: నేను మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఐదేళ్లు చెన్నైలో జాబ్. ఉద్యోగ సమయంలో ఓ రోజు తీవ్ర జ్వరం వచ్చింది. మెడిసిన్ తీసుకురావడానికి ఎవరూ లేరు. ఫోన్లో ఆర్డర్ ఇస్తే కొందరు మందుల చీటి చూపించాలని కోరగా... మరికొందరు కనీసం రూ.500 బిల్ చేస్తేనే ఇంటికి డెలివరీ చేస్తామన్నారు. అప్పుడే నేను ఎదుర్కొన్న సమస్యే వీ డెలివర్ ఏర్పాటుకు దారితీసింది. తర్వాత రూ.60వేల జీతమచ్చే జాబ్ వదిలేసి, ఇంట్లో వాళ్లను ఒప్పించి 2014లో మాదాపూర్‌లో ఈ సంస్థను ప్రారంభించాను. ప్రతిరోజూ ఎన్నో పనులతో బిజీగా ఉండే సిటీజనులకు మా వంతు సహకారం అందించడమే మా సంస్థ లక్ష్యం. వెబ్సైట్:www.vdeliver.in కనీస చార్జి రూ.30 నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా... దుస్తులు, ఫుడ్, పండ్లు, మెడిసిన్స్, వస్తువులు, డాక్యుమెంట్స్... ఇలా లీగల్‌గా తీసుకెళ్లడానికి వీలుండే ఏవైనా మేం డెలివరీ చేస్తాం. 5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీగా రూ.30 వసూలు చేస్తున్నాం. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.10 చొప్పున చార్జీ ఉంటుంది. ఇందుకు మొత్తం 80 మంది టీమ్ పని చేస్తోంది. మీరు మా సేవలు వినియోగించుకోవాలనుకుంటే వీ డెలివర్ మొబైల్ యాప్‌లో గానీ, వెబ్సైట్లో గానీ ప్రొడక్ట్ వివరాలు, తీసుకోవాల్సిన ప్రదేశం, అందజేయాల్సిన ప్రదేశం తదితర వివరాలు ఇస్తే చాలు. వెంటనే మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి, డెలివరీ బాయ్‌ని మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మా సేవలు వినియోగించుకోవచ్చు. వయా వీ డెలివర్... అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు.. డెలివరీ బాయ్ ఇంటికి వచ్చే సమయానికి ఆఫీస్‌లో ఉండడమో, పని మీద బయటకు వెళ్లడమో జరుగుతూ ఉంటుంది. దీనికి ‘వయా వీ డెలివర్’ ఒక పరిష్కారం. మీరు వీ డెలివర్ సైట్ నుంచే ‘వయా వీ డెలివర్’ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని ఎంపిక చేసుకుంటే... ఆ ప్రొడక్ట్ మాకు వస్తుంది. దాన్ని మా బాయ్స్ మీకు తీరిక సమయాల్లోనే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు చెప్పిన సమయానికే తీసుకొచ్చి అందజేస్తారు. -
ఆర్డరిస్తే.. ఆడబిడ్డ హోం డెలివరీ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నివసించే రాంరెడ్డి–రవీణ దంపతులకు పిల్లలు లేరు. ఓ ఆడబిడ్డను దత్తత తీసుకుందామని ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. అయితే ఓరోజు పనినిమిత్తం క్యాబ్‌లో బయటకు వెళ్తుండగా రవీణకు ఫోన్ వచ్చింది. ఫోన్లో ఆడపిల్ల కావాలని మాట్లాడుతుండగా ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రవి గమనించాడు. రవీణ ఫోన్ పెట్టయ్యగానే మేడమ్ మీకు ఆడపిల్ల కావాలా? పుట్టిన పిల్లని తీసుకువచ్చి మీకు ఇచ్చే వాళ్లున్నారు అని చెప్పాడు. అయితే కంగారుపడ్డ రవీణ ‘అలా ఎలా ఇస్తారు, విక్రయించడం నేరం కదా?’అని అడగ్గా, అలా ఏంలేదు మేడమ్ మా మరదలు డెలివరీకి ఉంది. స్కాన్ చేయిస్తే ఆడపిల్ల పుడుతుందని వచ్చింది. వాళ్లు చాలా పేదవాళ్లు. మీకోసం నేను ప్రయత్నిస్తా అని చెప్పాడు. సరే అని రవీణ నంబర్ తీసుకున్నాడు. రవి నంబర్ రవీణ తీసుకుంది. ఇలా వారం రోజుల తర్వాత రవి నెంబర్ నుంచి రవీణకు ఫోన్ వచ్చింది. మేడమ్ మీరు కల్వకుర్తి వస్తే మీకు హాస్పిటల్లో మా మరదలికి పుట్టిన అమ్మాయిని చూపిస్తా అన్నాడు. సరే అన్న రవీణ రాంరెడ్డి దంపతులు వెళ్లి చూశారు. అమ్మాయి బాగుంది తీసుకుందాం అని అనుకున్నారు. రవీణ ఈ విషయం తన స్నేహితురాలు, జాతీయ న్యూస్ చానల్ ప్రతినిధి రమాదేవికి చెప్పింది. అయితే ఇదేదో శిశు విక్రయంలాగా ఉందని, అతడి మాటలను నమ్మవద్దని చెప్పడంతో రవీణ ఇంటికి వచ్చింది. రమాదేవి శిశువిక్రయం వ్యవహారాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసింది. అనుకున్నట్టుగానే రవితో కాంటాక్ట్ అయ్యారు. తమకు ఆడపిల్ల కావాలని చెప్పడంతో నమ్మిన రవి వారిని కల్వకుర్తి తీసుకెళ్లి పాపను చూపించాడు. అంతా మాట్లాడుకున్నారు. బాగానే ఉందని రెండు రోజుల్లో పాపను తీసుకురావాలని చెప్పారు. డీల్ రూ.80 వేలు, ఏఎన్ఎమ్కు రూ.50 వేలు రమాదేవి రవితో డీల్ మాట్లాడుకున్నారు. పాప కావాలంటే ఏఎన్ఎమ్ ద్వారా తీసుకొని హోం డెలివరీ చేస్తానని రవి చెప్పాడు. దానికి రూ.80 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో రూ.50 వేలు ఏఎన్ఎమ్కు ఇవ్వాల్సి ఉంటుందని, తన మరదలికి విషయం తెలియకుండా పాప పుట్టి చనిపోయిందని నమ్మించాల్సి ఉంటుందని కట్టుకథ అల్లాడు. సరే అన్న రమాదేవి శనివారం సరూర్‌నగర్‌లోని ఓ దేవాలయం వద్దకు పాపను తీసుకొని రావాలని చెప్పింది. అనుకున్న సమయానికే రవి ఆయన భార్య సరోజ పాపను తీసుకొని వచ్చారు. రూ.80 వేలు ఇవ్వగానే లెక్కబెట్టుకున్న రవి అతడి భార్యకు సైగ చేసి పాపను తీసుకురావాలని చెప్పాడు. వారం రోజులుకూడా గడవని ఆడశిశువును రమాదేవికి ఇచ్చాడు. యాక్షన్‌లోకి రాచకొండ పోలీసులు... రమాదేవి మీడియా ప్రతినిధి కావడంతో ముందస్తుగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ను సంప్రదించారు. జరిగిన డీల్ మొత్తం చెప్పి స్టింగ్ ఆపరేషన్‌కు సహకరించాలని కోరడంతో వారుకూడా ఓకే చెప్పారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని సరూర్‌నగర్ టెంపుల్ వద్ద పెట్టారు. రమాదేవికి పసిపాపను అందించగానే రంగంలోకి దిగిన పోలీసులు రవితోపాటు అతని భార్యను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు పంపినట్టు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. భారీ నెట్వర్క్.. రవి తన మరదలికి పుట్టిన పిల్ల అని చెప్పిన కథ అంతా అబద్ధమని, పసిపిల్లలను విక్రయించే పెద్దముఠానే నడిపిస్తున్నట్టు రాచకొండ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రవిపై నాలుగు కేసులున్నాయని, ఇటీవలే కొల్లాపూర్ జైలు నుంచి విడుదలయ్యాడని తెలిసింది. అంతేకాకుండా నాలుగు నెలలక్రితం మరో పసికందును ఇదే రీతిలో విక్రయించాడని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌గా బయటకు చెప్పుకున్నా, తెరవెనుక పసికందు విక్రయాల నెట్వర్క్ నడిపిస్తున్నట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ శివారులోని వాసుదేవపూర్ తాండాకు చెందిన కేదావత్ రవి, సరోజలు శిశువిక్రయాలకు పాల్పడుతున్నట్టు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు. కల్వకుర్తి, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యే అమాయకుల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. గోతిలో 3 రాళ్లు పెట్టి... పాప పుట్టగానే చనిపోయిందని చెప్పి నమ్మించడంలో రవి దిట్ట అని ఈ ఆపరేషన్‌లో బయటపడింది. స్టింగ్ ఆపరేషన్‌లో రవి ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాప చనిపోయిందని వారి తల్లిదండ్రులను నమ్మించేందుకు గొయ్యి తీసి తెల్లటి టవల్లో మూడు రాళ్లు పూడ్చిపెట్టి, అక్కడ కొద్దిసేపు వారి సంబంధీకులతో ఏడుపు డ్రామా రక్తికట్టించి విక్రయాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. అమ్మడం, కొనడం నేరం పసిపిల్లలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని, ఇలాంటి వారికి 2013 మానవ అక్రమ రవాణా సవరణ చట్టం ద్వారా జీవిత ఖైదు పడుతుందని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఇలా ఎవరైనా పసిపిల్లలను అమ్ముతామని చెప్పినా, బ్రోకర్లున్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఇలాంటి నేరాలను ప్రోత్సహించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. తాను నల్లగొండ ఎస్పీగా ఉన్న సమయంలోనూ తండాలను టార్గెట్‌గా చేసుకొని శిశువిక్రయాలకు పాల్పడ్డ గ్యాంగులను అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టామని గుర్తుచేశారు. – మహేశ్ భగవత్ -
ఫస్ట్ టైం.. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజలకే అందించే ఏర్పాటును కలిపించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తమదేనంటూ కేజ్రీవాల్ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రజల వద్దకే ప్రభుత్వ సదుపాయాలు వచ్చి చేరుతాయన్న మాట. ఉదాహారణకు రేషన్ కార్డు సబ్సిడీ సదుపాయాలు, సర్టిఫికెట్లలలో మార్పులు-చేర్పులు, డ్రైవింగ్ లైసెన్సులు, వివాహ సర్టిఫికెట్లు.. లాంటి సేవలను నేరుగా ఇంటికి వెళ్లి ప్రజలకు అందించటం అన్న మాట. తద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, భారీ క్యూలలో నిలుచునే అవకాశం లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులే ప్రతీ గడప దగ్గరికి వెళ్లి అవసరమైన ప్రక్రియను చూసుకుంటారు. ఒకవేళ దానికి అవసరమైన ఫీజు ఉంటేనే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే లేదు అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయటం తదితరాల కింద మొత్తం 40 సేవలను మొదటి విడతగా ఈ పథకంలో చేర్చారు. ఢిల్లీ ప్రజలు తమ తమ పనుల్లోనే క్షణం తీరిగ్గా లేకుండా బిజీగా గడుపుతున్నారు. అలాంటి సమయంలో వారికి ఊరట ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని సిసోడియా అన్నారు. మరో నెలలో ఇంకో 40 సేవలను చేర్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే కాలుష్యాన్ని నివారించటంలో దారుణంగా విఫలమయ్యాడన్న విమర్శలు.. అది కాకుండా నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణను నిలబెట్టుకునేందుకే ఇలా కంటితుడుపు నిర్ణయాలు తీసుకుంటున్నాడని విపక్షాలు చెబుతున్నాయి. -
అధికార పార్టీది పగటి కల
భువనేశ్వర్(ఒడిశా): పశ్చిమ ఒడిశాలోని బర్గడ్ జిల్లా బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు అందరి దృష్టి మళ్లింది. ఈ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తథ్యమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. బీజేడీ దీర్ఘపాలనతో బిజేపూర్ నియోజకవర్గానికి జరిగిన నష్టం, వెనుకబాటు దృష్ట్యా సానుభూతి ముసుగులో బిజూ జనతా దళ్‌కు ఓట్లు పడి విజయం సాధిస్తారనేది పగటి కల అని మంత్రి ధర్మేంద్ర వ్యాఖ్యానించారు. బిజేపూర్ ఓటర్లు సానుభూతిపట్ల మక్కువ కనబరచరు. దీర్ఘకాలంగా ఈ నియోజకవర్గం ఎటువంటి పురోగతికీ నోచుకోలేదు. రాష్ట్రంలో బిజూ జనతా దళ్ సర్కారు దీర్ఘపాలనపట్ల బిజేపూర్ ఓటర్ల వైఖరి భిన్నంగా ఉంది. ఇక్కడి ఓటర్లు సానుభూతి వలలో చిక్కుకోకుండా విచక్షణతో మార్పు కోసం ఓటు వేయడం తథ్యం. గత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రభంజనం కనిపిం చింది. ఇదే పంథాలో బిజేపూర్‌లో కూడా ఊహాతీతమైన పరిణామాలు తలెత్తి భారతీయ జనతా పార్టీకి అనుకూలిస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అభ్యర్థి ప్రకటన దివంగత నాయకుడు సుబొలొ సాహు అకాల మరణంతో రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో భారీ లోటు ఏర్పడింది. ఈ లోటు భర్తీపట్ల బిజేపూర్ నియోజకవర్గం ఓటర్లు ఆచి తూచి ఓటు వేస్తారు. అందుకు అన్ని విధాలా అనుకూలమై న వ్యూహంతో తమ పార్టీ ప్రజల ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రజల మనోగతాలకు అనుకూలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధి స్తుం దని చెప్పారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో పార్టీ తరఫు అభ్యర్థిని ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. పం చాయతీ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో బిజేపూర్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ శిబిరం నుంచి ఊహాగానాలు విస్తృతంగా ప్రసారంలో ఉన్నాయి. ఆన్లైన్లో పెట్రోల్, డీజిల్ భువనేశ్వర్: సాంకేతిక సమాచారం, టెలికాం రంగాల అభివృద్ధి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పంపిణీ వ్యవస్థ సంస్కరణకు ఆ విభాగం యోచిస్తోంది. అతి త్వరలో పెట్రోల్, డీజిల్‌ను ఆన్లైన్లో పంపిణీ చేయనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విటర్ ఖాతాలో ప్రసారం చేశారు. దైనందిన జీవితంలో డిజిటలైజేషన్‌కు తమ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందని కేంద్ర సాంకేతిక సమాచార శాఖ తరచూ ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ ఆన్లైన్ పంపిణీ యోచన త్వరలో కార్యాచరణకు నోచుకుంటుందనే నమ్మకం వినియోగదారుల్లో కలుగుతోంది. క్లిక్ చేస్తే ఇంటికే పెట్రోల్ పెట్రోల్ బంకు వరకు వెళ్లి బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్థితులకు త్వరలో తెరపడనుంది. క్లిక్ చేస్తే ఇంటి ముంగిట పెట్రోల్, డీజిల్ ప్రత్యక్షమవుతాయనే ఉత్సాహం వినియోగదారుల్లో ఉరకలేస్తోంది. దేశంలో గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్లు రూ.500, రూ.1,000 రద్దును పురస్కరించుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆన్లైన్లో పెట్రో ఉత్పాదనల పంపిణీని ప్రతిపాదించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పెట్రో ఉత్పాదనల్ని ఆన్లైన్లో పంపిణీ చేసేందుకు యోచిస్తున్నట్లు ఆ విభాగం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన పార్లమెంట్ సలహా మండలి సమావేశంలో పేర్కొంది. Using the technological advancements in the IT & Telecom Sector we will soon be starting online home delivery of Diesel & Petrol. — Dharmendra Pradhan (@dpradhanbjp) September 27, 2017 -
ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?
న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్‌లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. స్నాప్‌డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్‌ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్‌ను, ఆధార్ నెంబర్‌ను స్నాప్‌డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్‌డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట. సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు. -
జాతర డాట్ కామ్ వెబ్సైట్ ప్రారంభం
కడప కార్పొరేషన్: నగరంలోని మయూరా గార్డేనియాలో జాతర డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్, కొత్తాస్ ఎండీ నాగకుమార్, మిత్ర యోగాసెంటర్ రంగనాథ్రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తూవులు, ట్యాబ్లెట్స్ వంటి వాటిని హోం డెలీవరి చేయడానికి ఆన్లైన్లో వెబ్‌సైట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వెబ్సైట్లోకి వెళ్లి ఏ వస్తూవులను బుక్ చేసుకున్నా అవి హోం డెలీవరి చేయబడుతాయని తెలిపారు. కార్యక్రమంలో జాతర డాట్ కామ్ ఎండీ అశోక్, మేనేజర్ నాగరాజు, డైరెక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ
-
ఫైర్42ను కొనుగోలు చేసిన హలోకర్రీ
రెండు నెలల్లో ఢిల్లీలోని మరో కంపెనీ టేకోవర్ ఆ తర్వాతే నిధుల సమీకరణపై దృష్టి హలోకర్రీ కో-ఫౌండర్ రాజు భూపతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ హలోకర్రీ మరో కంపెనీని కొనుగోలు చేసింది. రెండు నెలలక్రితమే పరాటాపోస్ట్ను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నగరం వేదికగా పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీ ఫైర్42ను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువ ఎంతనేది చెప్పలేదు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హలోకర్రీ కో-ఫౌండర్ రాజు భూపతి మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. హోమ్ డెలివరీ రంగంలో టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ విషయంలో కస్టమర్లకు ఏ చిన్న అవాంతరం ఎదురైనా వారు నిరాసక్తి చెందుతారు. దాని ప్రభావం కంపెనీ ఎదుగుదలపై పడుతుంది. అయితే ఈ విషయంలో పోటీ కంపెనీలతో ముందుండాలనే క్లౌడ్, మొబైల్ ఆధారితమైన టెక్నాలజీ కంపెనీ ఫైర్42ను కొనుగోలు చేశాం. ఇకపై ఈ కంపెనీ తన సేవలను ఇతర కంపెనీలకు విక్రయించడానికి లేదు. ప్రస్తుతం హలోకర్రీకి హైదరాబాద్‌లో 6, బెంగళూరులో 3 డెలివరీ పాయింట్లున్నాయి. త్వరలోనే వీటిని విస్తరించనున్నాం. ప్రస్తుతం రోజుకు 800-1,000 ఆర్డర్లొస్తున్నాయి. ఈ ఏడాది రూ.10-12 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తాం. గతేడాదితో పోల్చితే ఇది 8-10 శాతం వృద్ధి రేటు. రెండు నెలల్లో ఢిల్లీలోని ఓ హోమ్ డెలివరీ కంపెనీని కొనుగోలు చేసి అక్కడ హలోకర్రీ సేవలను ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ముంబైకి విస్తరిస్తాం. ఇప్పటికే చాలా కంపెనీలు ఫండింగ్ చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. కానీ, మూడు నెలల తర్వాతే నిధుల సమీకరణపై దృష్టిపెడతాం. -
అమ్మ ఫార్మసీ... డోర్‌డెలివరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : అమ్మ ఫార్మసీలకు పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపడంతో, మరిన్ని సేవలను పరిచయం చేయడానికి శ్రీకారం చుట్టింది. సబ్సిడీ ధరలపై పలురకాల పథకాలతో వెలుస్తున్న ‘అమ్మ’ కౌంటర్లు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. ముందుగా ఏర్పడిన అమ్మ క్యాంటిన్లు, ఆ తరువాత వరుసగా ప్రవేశపెట్టిన అమ్మ వాటర్ బాటిళ్లు, అమ్మ ఉప్పు ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. తొలిదిశగా ఏడు జిల్లాల్లో 10 అమ్మ ఫార్మసీలను ప్రారంభించారు. 10శాతం సబ్సిడీపై మందులు సరఫరా చేయడంతో నెలరోజులకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు కోరిన మందులు లేనిపక్షంలో వెంటనే తెప్పించి అందజేస్తున్నారు. మందుల స్టాకు వచ్చిన సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా చేరవేస్తున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా మందులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. అంతేగాక వినియోగదారులు కోరిన పక్షంలో కనీసం రూ.500 విలువైన మందులను డోర్‌డెలివరీ సైతం చేస్తామని చెబుతున్నారు. పైగా ఆయుర్వేదం, సిద్ద, యునానీ రకాల మందులు సైతం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీంతో కేవలం రెండు రోజుల క్రితమే వెలిసిన అమ్మ ఫార్మసీల వద్ద ఉదయం నుంచే జనం క్యూకట్టడం ప్రారంభించారు. నగరంలో ట్రిప్లికేన్, ఆశోక్‌నగర్, బీసెంట్ నగర్, కీల్పాక్, రాజా అన్నామలై పురం, రాయపేట, తేనాంపేట తదితర ప్రాంతాల్లో సహకారశాఖ కౌంటర్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నారు. -
కూరగాయలు.. డోర్ డెలివరీ!
సాక్షి, ముంబై: మీరు నిత్యం తలమునకలయ్యే పనుల్లో పడి ఇంటికి కావాల్సిన కూరగాయలు తెచ్చుకోలేకపోతున్నారా.. తాజా కూరలు దొరక్క ఇబ్బంది పడుతున్నారా! ఏం ఫర్లేదు.. ఒక ఫోన్ కాల్.. 9223433734 సెల్ నంబర్‌కు చేయండి.. తాజా కూరలు మీ ఇంటి ముందుంటాయ్..అని అంటున్నారు మాజ్గావ్లోని ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ కామ్కర్. నగరంలో బతుకు అంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిందే. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి అసలు చెప్పక్కర్లేదు.. ఇటు ఇల్లు, అటు ఉద్యోగం.. తెల్లారిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగుల బతుకు.. ఈ గందరగోళంలో ఇంటికి సరిపడా తాజా కూరగాయలు తెచ్చుకోవడం గగనంగా మారుతోంది. ముంబైకర్లలో సుమారు 80 శాతం ఉద్యోగినుల పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. ఇటువంటివారికి దోహదపడేలా కూరగాయల డోర్ డెలివరీకి నడుం బిగించింది ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ. ‘ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు..వారికి కావాల్సిన తాజా కూరగాయాలు ఇంటిముందు ఉంటాయి. ఈ సేవలకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ ధర కంటే చౌకగానే అందజేస్తాం..’ అని చెప్పారు ప్రవీణ్ కామ్కర్. ‘రైతుల నుంచి మా సంస్థ కూరగాయలు నేరుగా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పేదలే కాదు మధ్యతరగత ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసిన దళారులు ధరలు పెంచి లాభాలు గడిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ నుంచి కూరగాయలు కొనుగోలు చేసి నేరుగా కస్టమర్లకు విక్రయించాలని మా సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా కూరగాయలు కొనుగోలుదార్ల చెంతకే నేరుగా చేరుతుండటంతో మంచి స్పందన వస్తోంద’ని ప్రవీణ్ అన్నారు. తాము అన్ని రకాల కూరగాయలు అందజేస్తామన్నారు. ఫోన్ చేస్తే చాలు వాహనంలో కూరగాయలు చేరవేస్తామని కామ్కర్ తెలిపారు. అందుకు గృహిణులే కాకుండా సొసైటీ యాజమాన్యాలు కూడా తమ నంబర్‌కు సంప్రదిస్తే సరుకులు డెలివరీ చేస్తామన్నారు. మహిళా పొదుపు సంఘాలు, లేదా ఇతర ఎవరైనా ఈ వ్యాపారంపై ఆసక్తి ఉంటే తమని సంప్రదించవచ్చని కామ్కర్ తెలిపారు. ఇప్పటికే వడాల, వర్లీ లాంటి కీలక ప్రాంతాల్లో బొలేరో వాహనంలో కూరగాయలు విక్రయించడం ప్రారంభించామన్నారు. దీనివల్ల సంస్థకు నెలకు రూ.10వేలు వరకు ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో సేవలు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో మహిళా పొదుపు సంఘాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.