
కోల్‌కతా : లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క అవస్థలు పడుతున్నవారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసకున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసింది. అయితే లాక్‌డౌన్ వల్ల మూతపడ్డ మద్యం షాపులను తెరవబోమని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నవారికి మాత్రం మద్యం షాపుల నుంచి హోం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు.
మద్యం విక్రేతలకు స్థానిక పోలీసుల స్టేషన్‌లలో హోం డెలివరీకి సంబంధించిన పాస్‌లు జారీ చేయనున్నాం. ఇందుకోసం మద్యం షాప్ యజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఒక్క షాపుకు మూడు డెలివరీ పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్ ఉన్నప్పటికీ స్వీట్ షాపులను కొన్ని గంటలపాటు తెరచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment