
భువనేశ్వర్: ఖుర్దా జిల్లాలో మద్యం ఆన్‌లైన్ విక్రయాలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి మద్యం డోర్ డెలివరీ సర్వీసు అందుబాటులోకి రానుంది. అబ్కారీ విభాగం మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆన్‌లైన్ మద్యం విక్రయాలు చేపట్టనున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి 17 హోం డెలివరీ సంస్థలతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. orbc.co.in వెబ్‌సైటులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఆర్డర్ చేసిన ఒకటి నుంచి రెండు గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేయస్తామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment