సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా జంట నగరాల్లో సరుకుల హోం డెలివరీ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరిగే ఏ ప్రాంతం నుంచైనా సరుకులు, పార్శిళ్లను నగరంలో సంబంధిత ఇళ్లకు చేరవేయడానికి అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆర్టీసీ కార్గో విభాగం హోం డెలివరీలో అనుభవం ఉన్న డుంజో డిజిటల్, స్మార్ట్‌యాప్ లాజిస్టిక్స్, అడ్నిగమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సేవలకోసం ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఏజెంట్లను నియమించుకోవటం విశేషం.
హోం డెలివరీ చార్జీలు ఇలా..
10 కేజీల వరకు రూ.80, 11 కేజీల నుంచి 30 కేజీల వరకు రూ.150, 31 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.225, 51 కేజీల నుంచి 100 కేజీల వరకు రూ.300, 101 కేజీలను మించితే అదనపు ప్రతి కిలోకి రూ.2 చొప్పున చార్జీ్జ చేస్తారు. పార్సిల్ కవర్ల ధరలు.. 500 గ్రాముల వరకు రూ.30, 501 నుంచి వేయి గ్రాముల వరకు రూ.50 వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment