TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు | Telangana Rtc Cargo Home Delivery From October 27 2024 | Sakshi
Sakshi News home page

TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు

Published Sat, Oct 26 2024 7:44 PM | Last Updated on Sat, Oct 26 2024 8:19 PM

Telangana Rtc Cargo Home Delivery From October 27 2024

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసి కార్గో సేవలను ఆదివారం(అక్టోబర్‌ 26) నుంచి విస్తరించనుంది. కార్గోలో బుక్‌ చేసిన వస్తువులను ఆదివారం నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పించనున్నారు. తొలుత హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా పార్సిళ్ల హోం డెలివరీ ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. 

పార్సిళ్ల హోం డెలివ‌రీ ఛార్జీలు.. 

  • 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
  • 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60
  •  5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65
  •  10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70
  • 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement