cargo
-
కుప్పకూలిన విమానం..
-
TG: రేపటి నుంచి ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్గో సేవలను ఆదివారం(అక్టోబర్ 26) నుంచి విస్తరించనుంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను ఆదివారం నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పించనున్నారు. తొలుత హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా పార్సిళ్ల హోం డెలివరీ ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. పార్సిళ్ల హోం డెలివరీ ఛార్జీలు.. 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.501.01నుంచి 5 కేజీలకు రూ.60 5.01 నుంచి 10 కేజీలకు రూ.65 10.1 నుంచి 20 కేజీలకు రూ.7020.1 నుంచి 30 కేజీలకు రూ.75 -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. కాగా ఏప్రిల్ 17న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సూచించారు. భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది… pic.twitter.com/POrpO87fEi — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 1, 2024 -
చైనా-పాక్ మధ్య అణు సరుకు రవాణా! వయా భారత్?
ముంబై: భారత సరిహద్దులో ‘అణు’ కలకలం రేగింది. చైనా నుంచి కరాచీ(పాకిస్థాన్) వెళ్తున్న ఓ నౌకను ముంబయి పోర్టులో భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకే నౌకను నిలిపివేసినట్లు సమాచారం. జనవరిలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. నౌకను నిలిపివేసిన తర్వాత.. డీఆర్డీవో(Defence Research and Development Organisation) క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్(CNC)ని గుర్తించారు. పొరుగుదేశం తన అణు కార్యక్రమంలో దీనిని వినియోగించే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా డీఆర్డీవో వెల్లడించింది. సీఎన్‌సీని కంప్యూటర్ ద్వారా నియంత్రించొచ్చు. అది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. దానిని ద్వంద్వ ప్రయోజనాలకు వినియోగిస్తారు అంటూ డీఆర్డీవో ప్రకటిచింది. గతంలో ఉత్తర కొరియా కూడా తన అణు కార్యక్రమంలో సీఎన్‌సీని ఉపయోగించిందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లోను ఈతరహా సీజ్ చోటుచేసుకుంది. -
రెండింట ఒకటి ఎలక్ట్రిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ప్యాసింజర్, కార్గో విభాగంలో 1,04,712 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో 54 శాతం వాటాతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు 56,818 యూనిట్లు నమోదయ్యాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ–త్రీవీలర్ల విక్రయాలు గత నెలలో 58 శాతం పెరగడం విశేషం. 2023 జనవరిలో అమ్ముడైన 70,929 త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా 48 శాతం ఉంది. 2023 జనవరి–అక్టోబర్ మధ్య ఈ–త్రీవీలర్లు 4,71,154 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 అక్టోబర్‌తో ముగిసిన 10 నెలల్లో ఈ సంఖ్య 2,74,245 యూనిట్లు మాత్రమే. అంటే ఏడాదిలో ఈ–త్రీవీలర్ల విక్రయాలు 72 శాతం పెరిగాయన్న మాట. 2023 జనవరి–అక్టోబర్ కాలంలో దేశవ్యాప్తంగా 8,81,355 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి రోడ్డెక్కుతున్న త్రిచక్ర వాహనాల్లో రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ మోడల్ ఉంటోందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. పోటీలో 475 కంపెనీలు.. నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు క్రమంగా భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఆటోరిక్షా డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్ల నుంచి వీటికి డిమాండ్ ఊపందుకుంది. 2023 జనవరిలో 34,333 యూనిట్ల ఈ–త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. జూలై నుంచి ప్రతి నెల 50 వేల పైచిలుకు యూనిట్ల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. భారత్‌లో 475 కంపెనీలు ఈ–త్రీవీలర్ల మార్కెట్లో పోటీ పడుతున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అక్టోబర్‌లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, సేయిరా ఎలక్ట్రిక్ ఆటో, పియాజియో వెహికిల్స్ నిలిచాయి. అక్టోబర్ అమ్మకాల్లో టాప్–12 కంపెనీల వాటా 43 శాతం నమోదైంది. ఇటీవలే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచి్చన బజాజ్ ఆటో అయిదు నెలల్లో 2,080 యూనిట్లను విక్రయించింది. 124 యూనిట్లతో మొదలై అక్టోబర్‌లో 866 యూనిట్ల స్థాయికి చేరుకుంది. త్రీవీలర్లు 40 శాతం.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబర్‌లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,39,232 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–త్రీవీలర్ల వాటా ఏకంగా 40 శాతానికి ఎగబాకింది. 2022లో 1,17,498 ఈవీలు రోడ్డెక్కాయి. ఇందులో 30 శాతం వాటాతో 35,906 యూనిట్ల ఈ–త్రీవీలర్లు ఉన్నాయి. 2023 జనవరి–అక్టోబర్ మధ్య అమ్ముడైన 12.3 లక్షల యూనిట్ల ఈవీల్లో ఈ–త్రీవీలర్లు 38 శాతం ఉన్నాయి. ఇక 2022లో 3,50,238 యూనిట్ల ఈ–త్రీవీలర్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే ఈ ఏడాది 57 శాతం వృద్ధితో 5,50,000 యూనిట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం
శంషాబాద్: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది. గతేడాది డిసెంబర్ 4 రాత్రి దుబాయ్ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్ బెలుగా విమానం(ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) ఒకటి. విమాన ఆకారం ఉబ్బెత్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో.. బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఏఎస్–225 మ్రియా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ప్రస్తుతం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలుగానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు. -
లోడింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు.. ఒక్కరోజులో
దొండపర్తి(విశాఖ దక్షిణ): సరుకు రవాణాలో రికార్డులు సృష్టిస్తున్న విశాఖ పోర్టు తాజాగా లోడింగ్‌లో కూడా చరిత్ర సృష్టించింది. నూతన సాంకేతికత సాయంతో రెండునెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఎంవీ జీసీఎల్ నర్మద కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50,450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసి పోర్టు అధికారులు, సిబ్బంది సత్తా చాటారు. ఈ ఏడాది మార్చి 26న అత్యధికంగా చేసిన 44,374 మెట్రిక్ టన్నుల లోడింగ్ రికార్డును అధిగమించారు. ఈ విషయాన్ని పోర్టు అధికారులు సోమవారం వెల్లడించారు. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు అథారిటీ బుధవారం మరో రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఒకేసారి నిర్వహించిన అతి పెద్ద సింగిల్ పార్శిల్ లోడు రికార్డును అధిగమించింది. ఎంవీ జీసీఎల్ గంగా కార్గో షిప్లో ఒకే రోజులో 1,04,496 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ లోడ్ చేశారు. ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు సంబంధించిన ఇన్నర్ హార్బర్లోని వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఈ లోడింగ్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన 1,02,200 మెట్రిక్ టన్నుల లోడింగ్ ఇప్పటి వరకూ రికార్డు సింగిల్ పార్శిల్‌గా ఉండేది. అత్యధిక మొత్తంలో లోడింగ్ నిర్వహించిన సిబ్బందిని పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు అభినందించారు. -
దేశీ పోర్టుల్లో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రధాన పోర్టులు 2022 - 23లో రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల మేర కార్గోను హ్యాండిల్ చేశాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం అధికం అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా వైజాగ్‌తో పాటు ముంబై, కొచ్చిన్, చెన్నై, పారాదీప్ తదితర 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ (ఏఐ)ను ఉపయోగించి పోర్టుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు వీలుందని మంత్రి చెప్పారు. హరిత హైడ్రోజన్ హ్యాండ్లింగ్, నిల్వ, రవాణా కోసం ప్రధాన పోర్టులను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద 2035 నాటికి అన్ని పెద్ద పోర్టుల్లోనూ హరిత హైడ్రోజన్ / అమోనియం బంకర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు సోనోవాల్ చెప్పారు. -
కార్గో పార్శిళ్లపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, గుట్కా, లిక్కర్, ఇతర చట్టవిరుద్దమైన వస్తువుల రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. కార్గో ద్వారా బుక్ చేసే పార్శిళ్లపై నిఘా పెంచాలని ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల, జోన్ల ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అనుమతి లేని లగేజ్ తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే చర్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిధిలోని అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు, పేలుడు పదార్థాలు, చట్టబద్ధంగా నిషేదించబడిన అన్నిరకాల వస్తువులను అనుమతించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కార్గోలో బుక్ చేసే ప్రతి పార్శిల్‌ను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. వినియోగదారుని ఆధార్, అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ అంశాల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, ఓఎస్డీ రవివర్మ, సీటీఎం చంద్రశేఖర్, నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎం త్రినాథ్ పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ) -
ఇక ఆ రెండు వేరువేరు: స్పైస్‌జెట్
ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 51 కోట్ల నికర లాభం నమోదు చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) డీల్ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్ ఏవియేషన్ పార్ట్నర్ చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్ల రుణాన్ని గత నెల పునర్వ్యవస్థీకరించుకున్నామని అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్ విభాగం విడదీతతో స్పైస్‌జెట్ బ్యాలెన్స్ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
ఐబీఎస్ సాఫ్ట్వేర్ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్
తిరువనంతపురం: యాక్సెంచర్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ (ఏఎఫ్‌ఎల్‌ఎస్)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్ సాఫ్ట్వేర్ తెలిపింది. అయితే డీల్ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ సర్వీసులను (ఎస్ఏఏఎస్) ఐబీఎస్ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్‌లో తమకు నాలుగోదని వివరించింది. -
చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం
బీజింగ్: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. హైనన్ దీవుల్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండెజవస్ నిర్వహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది. -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
నాటి పరిస్థితుల దృష్ట్య అది సరైనదే! కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్
US forces from Afghanistan has been cleared of wrongdoing: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో చాలామంది అఫ్గాన్ వాసులు భయంతో పారిపోయేందకు ప్రయత్నించారు. ఈ మేరకు పెద్ద గుంపులుగా జనసందోహం కాబోలు విమానాశ్రయంలో రన్‌వే పై పరుగులు తీసి యూఎస్ వైమానిక దళానికి చెందిన కార్గో విమానాలను చుట్టుముట్టారు. గత్యంతరం లేని నాటి భయానక పరిస్థితుల్లో యూఎస్దళాలు జనసముహం విమానాల వద్దకు వెళ్లకుండా నిరోధించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ జనం విమానం రెక్కలను పట్టుకుని ఎక్కడం వంటివి చేశారు. తప్పనసరి పరిస్థితుల్లో అమెరికన్ సైనికులు, ఫైలెట్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో పైలెట్లు గాల్లో విమానాలను ప్రయాణించేందుకు రెడీ చేశారు. అంతే ఒక్కసారిగా విమానాలను గాల్లోకి దూసుకెళ్లిన వెంటనే విమాన రెక్కలను పట్టుకుని ఎక్కిన జనం పిట్టల్లా కిందకి రాలిపోయారు. దీంతో వేలాదిమంది అఫ్గాన్ పౌరులు మృతిచెందరు. ఐతే నాటి ఘటనలో ఎంతమంది చనిపోయారనేది స్పష్టత లేదు. నాటి దురదృష్ట ఘటనకు కారణమైన విమానాల్లో సీ17 కార్గో విమానం ఒకటి. ఐతే ఆగస్టు16, 2021న జరిగిన ఈ విషాదకర ఘటనపై యునైటెకడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు యూఎస్ వైమానిక దళ ప్రతినిధి ఆన్ స్టెఫానెక్ విచారణలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ...కార్గో ఎయిర్‌లైన్ సిబ్బంది క్షీణిస్తున్న భద్రతల నడుమ గాల్లో ప్రయాణించాలని తీసుకున్న నిర్ణయం సరైనదే. నాటి ఘటనలో కార్గో విమానా అంచనాకు మించి సుమారు 650 మంది ప్యాసింజర్లతో బయలుదేరినట్లు కూడా వివరించారు. ఆ సమయంలో తగిన విధంగానే వ్యవహరించారంటూ కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్ ఇచ్చింది. (చదవండి: అసాధారణం: భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు! పక్షుల్లాగా..) -
‘బుల్లెట్’లా.. రైల్ కార్గో!
సాక్షి, అమరావతి: కొత్త ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా రాష్ట్రం నుంచి రైల్ కార్గో అవకాశాలను విస్తరించడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఏడాది విజయవాడ డివిజన్ రికార్డుస్థాయిలో కార్గో రవాణా చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే తాజాగా .. గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు ఉన్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. సత్ఫలితాలిస్తున్న బీడీయూ.. రైల్ కార్గో టర్నోవర్‌ను పెంపొందించుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు (బీడీయూ) ఏర్పాటు చేసింది. డివిజన్‌స్థాయి, క్షేత్రస్థాయిలో ఈ బీడీయూల ద్వారా వ్యవసాయ, పారిశ్రామికవర్గాలతో సమావేశమవుతోంది. రోడ్డు మార్గంలో వస్తు రవాణా చేస్తున్న వ్యాపార సంస్థలు, ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. రైల్ కార్గో రవాణా ద్వారా తాము అందిస్తున్న రాయితీలను వివరిస్తూ వ్యాపార అవకాశాలను పెంపొందించుకుంటోంది. రైతు సంఘాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైళ్ల సౌలభ్యంపై అవగాహన కల్పిస్తోంది. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను రవాణా చేస్తే ఫ్రైట్ చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తూ.. సానుకూల ఫలితాలను రాబట్టింది. రికార్డు స్థాయిలో రైల్ కార్గో.. 50 శాతం రాయితీతో కిసాన్ రైళ్లు ప్రవేశపెట్టడంతో రైల్ కార్గో రవాణా రికార్డుస్థాయిలో పెరిగింది. మామిడి, ఉల్లిపాయలు, ఆక్వా, డెయిరీ ఉత్పత్తులు, కూరగాయలు, ఇతర పండ్లు రికార్డు స్థాయిలో రవాణా చేశారు. 2020–21లో విజయవాడ డివిజన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఏకంగా 40,121 మెట్రిక్ టన్నుల రవాణా చేయగా.. 2021–22లో సెప్టెంబర్ 15నాటికే 9,810 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, గువహతి, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు ఎక్కువుగా రవాణా చేశారు. కిసాన్ రైళ్లలో కాకుండా ఇతర రైళ్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మరో 1,060 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు ప్రణాళిక.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవాడ డివిజన్ నుంచి పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాపై దృష్టి సారించారు. ప్రధానంగా గ్రానైట్, ఫ్లైయాష్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు ఒంగోలు జిల్లా నుంచి భారీస్థాయిలో గ్రానైట్‌ను, థర్మల్ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్‌ను రవాణా చేసేందుకు.. రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వాటిని రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు రైల్వే అధికారులు జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. వారానికి ఐదు ర్యాక్‌ల చొప్పున గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. -
ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ కారణంగా ఆర్టీసీకి ప్రజారవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే భాగంగా కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది. మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. రేపటి నుంచి.. ఆర్టీసీ కొరియర్ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్ డెలివరీ సేవలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు అందరూ తమ ఇళ్ల వద్దే సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది. డోర్ డెలివరీని ప్రస్తుతానికి బుకింగ్ ఏజెంట్ కాంట్రాక్టర్లే చేయనున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరగనుంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్ చేసిన పార్సిల్ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. పెరుగుతున్న ఆదాయం... జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు తదితరాలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో రూ.98.28 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.172.17 లక్షలకు పైగా సమకూరింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా కార్గో కొంత వరకుఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. అందుకే సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో డోర్ డెలివరీని కూడా అందుబాటులోకి తేవడానికి సిద్ధమయ్యారు. రోజుకు రూ.3 లక్షల ఆదాయమే లక్ష్యం సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత నగరం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 10 కేజీల వరకు డోర్ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. విడతల వారీగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకూ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. డోర్‌డెలివరీ సేవలను కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆర్టీసీకి కార్గో ద్వారా ప్రస్తుతం సరాసరి రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది, దీన్ని రూ.3 లక్షలకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఎస్టీపీ రాఘవ కుమార్, ఆర్ఎం, గుంటూరు -
పోటెత్తిన మిర్చి.. రైతుల్లో ఆనందం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు భారీ ఎత్తున కొత్త సరుకు వస్తోంది. దీనికి తగ్గట్టుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చికి అధిక ధర పలుకుతోంది. ముఖ్యంగా బాడిగ, తేజ రకం మిర్చికి మంచి రేటు లభిస్తోంది. ఇతర రకాలకూ చెప్పుకోదగిన ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచేగాక కర్ణాటక నుంచీ రైతులు పెద్దఎత్తున మిర్చిని యార్డుకు తీసుకొస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారితోపాటు కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు భారీగా కొత్త సరుకు వస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచీ రైతులు యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు. రోజుకు సరాసరిన 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల మిర్చి యార్డుకు వస్తోంది. 2020–21లో ఇప్పటికే యార్డుకు 43,27,820 బస్తాల సరుకు వచ్చింది. ఈ మార్కెట్ యార్డులో ఏడాదికి రూ.6 వేల కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుంది. సెస్సు ద్వారా రూ.60 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి దిగుబడులు బాగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎకరాకు 35 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. అలాగే మిర్చిని ప్రధానంగా సాగు చేసే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. బాడిగ, తేజ రకాలకు మంచి ధరలు.. మిర్చిలో నాణ్యమైన బాడిగ, తేజ రకాలకు ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయి. 2019 డిసెంబర్, 2020 జనవరిలో ఉన్న ధరల కన్నా ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేల ధర అదనంగా లభిస్తోంది. బాడిగ రకాలు క్వింటాలు రూ.17 వేల నుంచి 21 వేలు, తేజ రకం రూ.15,500, మిగిలిన అన్నిరకాలు రూ.13 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. గతేడాది కరోనా వల్ల యార్డు మూతపడటంతో అమ్ముకునే వీల్లేక ఎక్కువమంది రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 22న మార్కెట్ యార్డులో డబ్బి బాడిగ మిర్చి క్వింటా రూ.36 వేల వరకు పలకడం విశేషం. ధరలు ఆశాజనకం నేను ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాను. దిగుబడి 25 క్వింటాళ్లకుపైగా వస్తుందని భావిస్తున్నాను. గతేడాది క్వింటా రూ.11 వేలే. ప్రస్తుతం యార్డుకు 100 బస్తాలు తీసుకొచ్చా. క్వింటా రూ13,500 చొప్పున విక్రయించా. –జయశంకరరావు, గుంటూరు జిల్లా సరుకు బాగా వస్తోంది యార్డుకు సరుకు భారీగా వస్తోంది. రోజుకు 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల సరుకు యార్డుకొస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ధరలు అధికంగానే ఉన్నాయి. డబ్బి బాడిగ రకం ధర క్వింటా రూ.20 వేలకుపైగా పలుకుతోంది. బాడిగ రకాలతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు కూడా బాగానే ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ చదవండి: శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
కోవిడ్ సమయంలోనూ దూసుకుపోయిన పోర్టులు
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో కూడా ఏపీలోని మైనర్ పోర్టులు అద్భుత పనితీరును కనబరుస్తున్నాయి. లాక్డౌన్ వల్ల కొన్ని నెలల పాటు సరుకు రవాణా ఆగిపోయినా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో పోర్టులు గరిష్ట స్థాయిలో సరుకు రవాణా నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఆరు మైనర్ పోర్టులైన కాకినాడ యాంకరేజ్, డీప్ వాటర్, రవ్వ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల ద్వారా ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 49.457 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఈ ఏడు నెలల్లో మొత్తం రూ.1,923.24 కోట్ల వ్యాపార లావాదేవీలను పోర్టులు నిర్వహించగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.130.90 కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరింది. గతేడాది పూర్తి కాలానికి ఈ ఆరు పోర్టుల ద్వారా జరిగిన సరుకు రవాణా 99.44 మిలియన్ టన్నులు కాగా, రూ.3,639.81 కోట్ల వ్యాపార లావాదేవీలతో రాష్ట్ర ఖజానాకు రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కాకినాడలోని యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు సమర్థ పనితీరును కనబరిచాయి. బియ్యం, సిమెంట్ ఎగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణంగా మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ముడి చమురు, కంటైనర్లు, స్టీల్, ముడి ఇనుము దిగుమతులు పెరగడంతో పోర్టుల వ్యాపారం పూర్వస్థితికి చేరుకున్నట్లు పేర్కొంటున్నారు. మేజర్ పోర్టుపై కూడా ప్రభావం తక్కువే.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ మేజర్ పోర్టుపై కూడా కోవిడ్ ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబర్) సరుకు రవాణాలో క్షీణత నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 34.75 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 32.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. గత 2 నెలల నుంచి సరుకు రవాణా పెరగడంతో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి వృద్ధి నమోదు చేయగలమన్న ధీమాను పోర్టు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మైనర్ పోర్టుల్లో ఇలా.. పోర్టు 2019-20 సరుకు ఆదాయం 2020-21 సరుకు ఆదాయం (అక్టోబర్ వరకు) యాంకరేజ్ 1.143 34.24 1.378 20.78 రవ్వ 0.735 3.96 0.334 1.80 డీప్ వాటర్ 14.97 534.00 9.03 326.00 కృష్ణపట్నం 48.142 1,965.43 21.345 1,024.74 గంగవరం 34.45 1,102.18 17.37 549.92 మొత్తం 99.44 3,639.81 49.457 1,923.24 నోట్: సరుకు రవాణా మిలియన్ టన్నుల్లో, ఆదాయం రూ.కోట్లలో -
హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకే కాదు సరుకులకు సైతం రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఒక ఊరు నుంచి మరో ఊరుకు ప్రయాణికులను చేరవేసినట్లుగానే సరుకులను చేరవేస్తున్నాయి. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు మొదలుకొని అత్యవసరమైన మందులు, ఆహార పదార్థాలు, పిండివంటల వరకు కార్గో బస్సుల్లో పరుగులు తీస్తున్నాయి. టికెట్టేతర ఆదాయ సముపార్జనలో భాగంగా కార్గో, పార్శిల్ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేక హస్తకళా వస్తువులు, ఆహార పదార్థాలు, పిండి వంటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఇప్పటి వరకు గ్రేటర్లో 5.2 లక్షలకుపైగా పార్శిళ్లను వినియోగదారులకు అందజేసింది. జూన్ నుంచి రూ.2కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి సంస్థల తరహాలో నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే వస్తువులను చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది. కొద్దిరోజుల్లో ఆర్టీసీ పార్శిల్, కార్గో సేవలు ఆన్లైన్లోనే లభించనున్నాయి. అంకాపూర్ టు హైదరాబాద్... నిజామాబాద్‌లోని అంకాపూర్‌లో లభించే చికెన్‌కు హైదరాబాద్‌లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ ఊళ్లో చికెన్ కర్రీను తయారు చేసి విక్రయించే వ్యక్తులకు ఇటీవల కాలంలో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా డిమాండ్ పెరిగింది. ప్రత్యేకమైన మసాలాలతో, ఎంతో రుచిగా వండడం వల్ల అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు వందలాది పార్శిళ్లు రవాణా అవుతున్నాయి. పార్శిల్ చార్జీలతో సహా కిలోకు రూ.650 చొప్పున తీసుకుంటున్నారు. “వీకెండ్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఒకటి, రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా పార్విళ్లు జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్‌లకు చేరుతాయి. ప్రతిరోజూ 30 నుంచి 50 కిలోల చికెన్ హైదరాబాద్‌కు పార్శిల్ చేస్తున్నారు. పిండివంటల నుంచి.. హస్తకళల దాకా.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే పిండివంటలను కూడా ఆర్టీసీ వినియోగదారులకు చేరువ చేస్తోంది. సిద్దిపేట సకినాలు, అప్పచ్చులు, కరీంనగర్లో ప్రత్యేకంగా వండే సర్వపిండి వంటివి ఇప్పుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా పొందవచ్చు. “ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తే తయారీ సంస్థల నుంచి సేకరించి వినియోగదారులకు అందజేస్తాం’ అని చెప్పారు ఆర్టీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్. నిర్మల్ బొమ్మలు, పెంబర్తి హస్తకళా వస్తువులు, పోచంపల్లి, గద్వాల్ చీరలు, చేనేత వస్త్రాలను వినియోగదారులకు చేరవేసేందుకు ఆర్టీసీ పార్శిల్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 150 కార్గో బస్సుల ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. నేరుగా ఇంటి వద్దకే సేవలు.. ఇటు వినియోగదారుల నుంచి అటు తయారీదారులు, వ్యాపార సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించడంతో నేరుగా వినియోగదారులకు ఇంటి వద్దే పార్శిళ్లను అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకొంటే చాలు. ఆయా సంస్థల నుంచి అందిన వెంటనే పార్శిల్ సర్వీసుల ద్వారా ఆర్టీసీ ఏజెంట్లకు, అక్కడి నుంచి వినియోగదారుల ఇంటికి చేరుస్తారు. చార్జీలు చాలా తక్కువ.. సిరిసిల్లకు కొన్ని వస్తువులను పంపిస్తున్నాను. బయట కంటే చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.150తోనే పని అయిపోయింది. చాలా బాగుంది. – శ్రీపతిరావు, వినియోగదారు ఇదే మొదటిసారి.. కార్గో సేవలను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి. ఇంటి నుంచి కొన్ని వస్తువులను నిర్మల్‌కు పంపిస్తున్నా. మిగతా సంస్థల కంటే ఆర్టీసీని నమ్ముకోవడం మంచిది కదా. – బూదయ్య, వినియోగదారు ఆర్టీసీ వల్లే పార్శిల్ ఆలోచన.. అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు చికెన్ పంపించవచ్చనే ఆలోచన ఆర్టీసీ పార్శిల్ సేవల వల్లే వచ్చింది. అప్పటి వరకు లోకల్‌గానే విక్రయించేవాళ్లం. ఇప్పుడు చాలా బాగుంది. – చంద్రమోహన్, చికెన్ తయారీదారు, అంకాపూర్ స్పందన బాగుంది.. పార్శిల్ సేవలకు స్పందన చాలా బాగుంది. జేబీఎస్ నుంచి ప్రతిరోజూ రూ.85 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. వందలాది పార్శిళ్లను వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నాం, – ప్రణీత్, డిపో మేనేజర్, పికెట్ -
కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు వృద్ధి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో గతేడాదికంటే 4 శాతం వృద్ధి సాధించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 61.02 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేయగా ఈ ఏడాది (2017–18లో) 63.54 మిలియన్ టన్నులు చేయగలిగింది. ఇది గత సంవత్సరంకంటే 2.52 మిలియన్ టన్నులు అదనం. అలాగే ర్యాంకింగులోనూ వీపీటీ పురోగతి సాధించింది. అలాగే 2017–18 సంవత్సరంలో రూ.250 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం దేశంలోని పోర్టుల్లో విశాఖ పోర్టు ట్రస్టు 5వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది అది 4వ స్థానంలో నిలిచిందని వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. స్టాకు యార్డులకు ఉక్కు రవాణా.. భారత ప్రభుత్వం కోస్టల్ షిప్పింగ్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా వీపీటీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉక్కును అహ్మదాబాద్, ముంబై, కొచ్చిల్లోని స్టాకు యార్డులకు రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో భాగంగా 2.25 లక్షల టన్నుల ఉక్కును షిప్పుల్లో రవాణా జరుగుతుందని చెప్పారు. 2020 నాటికి విశాఖ పోర్టు పూర్తి సామర్థ్యం 133 మిలియన్ టన్నులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీంతో నిర్వహణ సామర్థ్యం 75 నుంచి 80 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. -
పట్టాలు తప్పిన కార్గో రైలు: 5 మంది మృతి
-
విమానాశ్రయంలో రేడియోయాక్టీవ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ వద్ద రేడియోయాక్టీవ్ పదార్థం లీక్ కావడం ఆదివారం కలకలం సృష్టించింది. విమానాశ్రయ సిబ్బంది సమాచారం మేరకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్(ఏఈఆర్బీ) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా వచ్చిన మెడికల్ పార్సిల్లో ఈ లీక్ సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా కార్గో టెర్మినల్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. లీక్ అయిన రేడియోయాక్టీవ్ పదార్థం క్యాన్సర్ చికిత్సలో వాడే న్యూక్లియర్ మెడిసిన్‌కు సంబంధించినది అని, అయితే దీని రేడియోయాక్టివ్ తీవ్రత చాలా తక్కువ అని ఏఈఆర్బీ అధికారులు తనిఖీల అనంతరం వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహన సంస్థ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి హానిలేదని తెలిపారు. -
మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ (ఇ-సుప్రో)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది కార్గో, ప్యాసింజర్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. జీరో ఎమిషన్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకునే లక్ష్యంలో భాగంగా కంపెనీ ఈ వాహనాలను మార్కెట్లోకి తెచ్చింది. ఇ-సుప్రో కార్గో వ్యాన్ ప్రారంభ ధర రూ.8.45 లక్షలుగా ఉంది. ఇక ఇ-సుప్రో ప్యాసింజర్ వ్యాన్ ధర రూ.8.75 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. బ్యాటరీ ఫుల్ చార్జ్‌కి 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుందని, ఒక ఫుల్ చార్జ్‌తో ఈ వాహనాలు 112 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. కంపెనీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన మూడవ వాహనం ఇది. మహీంద్రా ఇదివరకే ఇ-20, ఇ-వెరిటో అనే రెండు వాహనాలను మార్కెట్లోకి తె చ్చింది.