సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు  | Visakhapatnam port is another record in cargo loading | Sakshi
Sakshi News home page

సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు 

Published Thu, Jun 22 2023 4:29 AM | Last Updated on Thu, Jun 22 2023 4:29 AM

Visakhapatnam port is another record in cargo loading - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సరుకు లోడింగ్‌లో విశాఖపట్నం పోర్టు అథారిటీ బుధవారం మరో రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఒకేసారి నిర్వహించిన అతి పెద్ద సింగిల్‌ పార్శిల్‌ లోడు రికార్డును అధిగమించింది. ఎంవీ జీసీఎల్‌ గంగా కార్గో షిప్‌లో ఒకే రోజులో 1,04,496 మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ పెల్లెట్స్‌ లోడ్‌ చేశారు.

ఆర్సిలర్‌ మిట్టల్‌ నిపాన్‌ స్టీల్‌ ఇండియా(ఏఎంఎన్‌ఎస్‌)కు సంబంధించిన ఇన్నర్‌ హార్బర్‌లోని వెస్ట్‌ క్యూ–1 బెర్త్‌లో ఈ లోడింగ్‌ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన 1,02,200 మెట్రిక్‌ టన్నుల లోడింగ్‌ ఇప్పటి వరకూ రికార్డు సింగిల్‌ పార్శిల్‌గా ఉండేది. అత్యధిక మొత్తంలో లోడింగ్‌ నిర్వహించిన సిబ్బందిని పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ అంగముత్తు అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement