న్యూఢిల్లీ: దేశీయంగా ప్రధాన పోర్టులు 2022 - 23లో రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల మేర కార్గోను హ్యాండిల్ చేశాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం అధికం అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
దేశీయంగా వైజాగ్‌తో పాటు ముంబై, కొచ్చిన్, చెన్నై, పారాదీప్ తదితర 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ (ఏఐ)ను ఉపయోగించి పోర్టుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు వీలుందని మంత్రి చెప్పారు. హరిత హైడ్రోజన్ హ్యాండ్లింగ్, నిల్వ, రవాణా కోసం ప్రధాన పోర్టులను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద 2035 నాటికి అన్ని పెద్ద పోర్టుల్లోనూ హరిత హైడ్రోజన్ / అమోనియం బంకర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు సోనోవాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment