మొరాయించిన చాట్‌జీపీటీ.. ఖంగుతిన్న కస్టమర్లు - కారణం ఏంటంటే? | ChatGPT Down At 90 Minutes Reason | Sakshi
Sakshi News home page

మొరాయించిన చాట్‌జీపీటీ.. ఖంగుతిన్న కస్టమర్లు - కారణం ఏంటంటే?

Published Fri, Nov 10 2023 8:31 AM | Last Updated on Fri, Nov 10 2023 10:01 AM

ChatGPT Down At 90 Minutes Reason - Sakshi

అతి తక్కువ కాలంలో ప్రపంచ దిగ్గజాలను సైతం వణికించిన 'ఏఐ చాట్‌జీపీటీ' ఇటీవల ఒక్కసారిగా డౌన్ అయింది. చాలామంది వినియోగదారులకు 'చాట్‌జీపీటీ నాట్ వర్కింగ్' అంటూ చూపించింది. చాట్‌జీపీటీ డౌన్ అవ్వడానికి కారణం ఏంటి? దీనికోసం టెక్ బృందం తీసుకున్న చర్యలు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్'దే పైచేయి. ఏడాది క్రితం గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన ఏఐ చాట్‌జీపీటీ యాప్ అతి తక్కువ కాలంలోనే చాలామంది జీవితంలో ఒక భాగమారిపోయింది. కవిత్వం నుంచి కంటెంట్ వరకు వినియోగదారునికి ఏమి కావాలన్నా నిముషాల్లో ఈ టెక్నాలజీ ద్వారా పొందగలుగుతున్నాడు. 

ఇటీవల ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. 'ఏదో తప్పు జరిగింది'. ఈ సమస్య కొనసాగితే, దయచేసి help.openai.comలో మా సహాయ కేంద్రం ద్వారా మమ్మల్ని సంప్రదించండి అనే సందేశాన్ని ప్రదర్శిస్తూ.. ఏకంగా 90 నిమిషాల పాటు పనిచేయకుండా పోయింది. దీంతో వినియోగదారులు కొంత ఆందోళన చెందారు.

ఇదీ చదవండి: 14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్‌లైన్ చాట్ సైట్ షట్‌డౌన్‌

కారణం ఇదే
ప్రపంచంలోని చాలా దేశాల్లో దాదాపు 90 నిముషాల పాటు అంతరాయం ఏర్పడిన ఏఐ టూల్ చాట్‌బాట్ DDoSలో ఒకేసారి ఎక్కువ ట్రాఫిక్ ఏర్పాటం, లేదా ఎక్కువ మంది ఒకేసారి వినియోగించడం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని సంబంధిత టెక్ బృందం వెల్లడించింది. ఇలాంటి అంతరాయం మళ్ళీ జరగకుండా చూడటానికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా కంపెనీ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement