సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది.
కంపెనీ 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించిన వెంటనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్‌మన్' తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఒకే రోజులు జరిగిన ఈ సంఘటనలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.
ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో వారిద్దరూ (శామ్ ఆల్ట్‌మన్ & గ్రెగ్ బ్రాక్‌మన్) ఎమ్మెట్ షియర్ అండ్ ఓఏఐ (Emmett Shear and OAI) కొత్త బృందానికి నాయకత్వం వహించనున్నట్లు సీఈఓ 'సత్య నాదెళ్ళ' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇదీ చదవండి: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్
ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని.. శామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్‌లో చేరబోతున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారి విజయాలకు అవసరమైన వనరులను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సత్య నాదెళ్ల వెల్లడించారు.
We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023
Comments
Please login to add a commentAdd a comment