ఓపెన్‌ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్‌గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్‌ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్‌ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్‌కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది.
ఓపెన్‌ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్‌లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్‌గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం.
మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్‌లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్‌లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్‌లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్‌గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది.
మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్‌గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి
Comments
Please login to add a commentAdd a comment