super computer
-
పని మొదలెట్టిన పరమ్ రుద్ర!
సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! పరమశివుని పేరుతో పరమ్ రుద్ర పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి. నవ్యావిష్కరణకు రాచబాటలు యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. అర్క, అరుణిక పనేంటి? వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. ఏఏ పనుల్లో వాడతారు? → వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్ కంప్యూటర్లను వాడతారు. → పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్ను జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ కోసం వినియోగంలోకి తెచ్చారు. → వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. → సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్ రేడియో బరస్ట్) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. → ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలిరేటర్ సెంటర్లో మరో పరమ్ రుద్రను ఏర్పాటుచేశారు. → మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కేంద్రంలోనూ పరమ్రుద్రను ఏర్పాటుచేశారు. → దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
2025 నాటికి సూపర్ కంప్యూటర్.. పక్కా ప్లాన్‌తో సిద్దమైన మస్క్
టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI ప్రణాళికలను పంచుకున్నారు. అంతే కాకుండా సూపర్ కంప్యూటర్ను తయారు చేయడానికి సంబంధించిన విషయాన్ని కూడా పంచుకున్నారు.మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కోసం 2025 నాటికి సూపర్‌కంప్యూటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని డెవలప్ చేయడానికి ఒరాకిల్‌తో భాగస్వామ్యాన్ని xAI పరిశీలిస్తోందని మస్క్ పేర్కొన్నారు. ఒరాకిల్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2025 చివరి నాటికి సూపర్ కంప్యూటర్ లాంచ్ అవుతుంది. రాబోయే సూపర్ కంప్యూటర్ ఎన్విడియా టాప్-ఆఫ్-ది-లైన్ H100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సమూహాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీయూ క్లస్టర్ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి వేగవంతమైన పనితీరును అందిస్తాయి.ఇప్పటికే అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ, గూగుల్ ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి మస్క్ xAI స్థాపించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి మస్క్ సన్నద్ధమవుతున్నారు. ఇక రాబోయే సూపర్ కంప్యూటర్ ఎలా ఉండబోతోందో చూడాలంటే ఇంకో ఏడాది వేచి ఉండక తప్పదు. -
'స్టార్గేట్' ఏఐ సూపర్ కంప్యూటర్: టెక్నాలజీలో మరో అడుగు..
ఓపెన్ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్‌కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది. ఓపెన్ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్‌లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్‌లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్‌లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది. మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి -
రిలయన్స్ నుంచి ఏఐ సూపర్ కంప్యూటర్స్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance), యూఎస్ టెక్నాలజీ దిగ్గజం ఎన్వీడియా (NVIDIA) చేతులు కలిపాయి. ఇరు సంస్థలు కలిసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ఆధారిత సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేస్తాయి. ఇటీవలే ఎన్వీడియా ఫౌండర్, సీఈవో జెన్సెన్ హ్యా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో 2004లో అడుగుపెట్టిన ఎన్వీడియాకు హైదరాబాద్, గురుగ్రామ్, పుణే, బెంగళూరులో డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,800 పైచిలుకు ఉంది. ‘విస్తృత, వేగవంతమైన వృద్ధి కోసం డేటా వినియోగం నుండి సాంకేతిక మౌలిక సదుపాయాలను సృష్టించే దిశగా భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. డిజిటల్ వృద్ధిలో ఎన్వీడియా తో కలిసి అభివృద్ధి చేసే కంప్యూటింగ్, టెక్నాలజీ సూపర్ సెంటర్లు మన దేశానికి జియో మాదిరిగా ఉ్రత్పేరక వృద్ధిని అందిస్తాయి’ అని ఈ సందర్భంగా రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ అన్నారు. -
7 ఖండాలు కాదు ఏక ఖండమే..!
భూమ్మీద ఇప్పుడున్నవి ఏడు ఖండాలు.. కావాలంటే గబగబా పేర్లు కూడా చెప్పేస్తుంటారు. అందులో పెద్ద ఖండం ఏదంటే ఆసియా అని టక్కున చెప్పేస్తారు.. మరి భవిష్యత్తులో అతిపెద్ద ఖండం ఏమిటో తెలుసా ‘అమేషియా’. ఇప్పుడు వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఖండాల కన్నా పెద్దగా అతిపెద్ద ఖండంగా అది నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోయి.. భూమ్మీద భవిష్యత్తు పరిణామాలు, ఖండాలపై ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. భూమ్మీద సుమారు 20, 30 కోట్ల ఏళ్లలో పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోయి.. ఖండాలన్నీ కలిసి అతిపెద్ద ఖండం ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. దానికి ‘అమేషియా’ అని పేరుపెట్టారు. సూపర్ కంప్యూటర్ సాయంతో.. భూమ్మీద ఒకప్పుడు ఖండాలన్నీ ఒకే దగ్గర ఉండేవని.. తర్వాత విడిపోయాయని తెలిసిందే. ఇప్పటికీ ఖండాలు కదులుతూనే ఉన్నాయి కూడా. ఈ క్రమంలో సముద్రాల అడుగున ఉన్న భూభాగాలు పైకి తేలడం, ఇప్పుడున్న భూభాగాలు మునగడం జరుగుతుందని అంచనా. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ సాయంతో.. భవిష్యత్తులో భారీ ఖండాలు ఎక్కడ ఏర్పడవచ్చన్న దానిపై పరిశోధన చేశారు. అందులో గత పది కోట్ల ఏళ్లలో ఏర్పడిన అట్లాంటిక్, హిందూ సముద్ర ప్రాంతాల కంటే.. బాగా పురాతనమైన పసిఫిక్ ప్రాంతానికి పైకితేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి కొత్త ఖండాలు భూమి ఏర్పడి సుమారు 200 కోట్ల ఏళ్లు అయిందని అంచనా. అప్పటి నుంచి ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి భూమిపై ఉన్న ఖండాలు కదులుతూ, ఢీకొడుతూ కొత్తగా ఖండాలు ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడున్న ఖండాలు ఏర్పడి ఇప్పటికే 30, 40 కోట్ల ఏళ్లు అయిందని.. మరో 20, 30 కోట్ల ఏళ్లలో కొత్త ఖండాలు ఏర్పడుతాయని చెబుతున్నారు. ‘అమేషియా’ పేరే ఎందుకు? ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు కదిలి వచ్చి ఆసియాను ఢీకొట్టడం వల్ల పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోయి కొత్త భారీ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఆస్ట్రేలియా ఖండం ఈ రెండింటి మధ్యకు వచ్చి ఇరుక్కుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఆసియా పేర్లు కలిసేలా ‘అమేషియా’ అని కొత్త ఖండానికి పేరు పెట్టారు. సముద్రాలు తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. అమేషియా అతి భారీ ఖండంగా ఏర్పడినప్పుడు.. భూమిపై సముద్రాల ఎత్తు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారీ ఖండం కావడం వల్ల చాలా ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉంటాయని.. ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుతాయని పేర్కొంటున్నారు. ఇంతకు ముందూ ఇలాంటి థియరీ కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే భూభాగంగా ఉండేవి. దాన్ని పాంజియాగా పిలుస్తుంటారు. భవిష్యత్తులోనూ అలా ఖండాలన్నీ కలిసి ‘పాంజియా ప్రాక్సిమా’గా ఏర్పడతాయని 1982లో అమెరికన్ భూతత్వ నిపుణుడు క్రిస్టోఫర్ స్కాటిస్ ప్రతిపాదించారు. అయితే సముద్రాలు, ఖండాల కలయిక ఎలా ఉంటుందన్న అంచనాలేమీ వెలువరించలేదు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) కోసం సీ-డీఏసీ మరొక అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసింది. 3.3 పెటాఫ్లాప్స్ సామర్థ్యాన్ని ఈ సూపర్ కంప్యూటర్ కలిగి ఉంది. పరమ్ ప్రవేగా అని పిలిచే ఈ సూపర్ కంప్యూటర్ భారతీయ విద్యా సంస్థలో ఇన్స్టాల్ చేసిన వాటిలో అతిపెద్దది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(సీ-డీఏసీ) రూపొందించింది. సూపర్ కంప్యూటర్లో ఉపయోగించే చాలా భాగాలు భారతదేశంలో అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ సహాయంతో తయారు చేశారు. దేశవ్యాప్తంగా విభిన్న పరిశోధన & విద్యా అన్వేషణల కోసం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్(ఎన్ఎస్ఎమ్) కింద ఈ సూపర్ కంప్యూటర్ నియమించబడింది. ఎన్ఎస్ఎమ్ ఇప్పటివరకు 17 పెటాఫ్లాప్స్ క్యుమిలేటివ్ కంప్యూటింగ్ శక్తితో భారతదేశం అంతటా 10 సూపర్ కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. "ఈ సూపర్ కంప్యూటర్లు అధ్యాపక సభ్యులు & విద్యార్థులు ప్రధాన ఆర్ అండ్ డి కార్యకలాపాలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడ్డాయి. వీటితో జెనోమిక్స్ & ఔషధ ఆవిష్కరణ, పట్టణ పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయడం, వరద హెచ్చరిక & అంచనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, టెలికామ్ నెట్ వర్క్స్ కోసం ఆప్టిమైజ్ చేయవచ్చు" అని ఐఐఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పరమ్ ప్రవేగా అంటే ఏమిటి? పరమ్ ప్రవేగా అంటే హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లాస్ ఆఫ్ సిస్టమ్స్ కలిగిన ఒక సూపర్ కంప్యూటర్. సీపీయు నోడ్స్ కోసం ఇంటెల్ జియోన్ కాస్కేడ్ లేక్ ప్రాసెసర్లు, జిపియు నోడ్స్ పై ఎన్ విడియా టెస్లా వి100 కార్డులు ఉన్నాయి. సీ-డీఏసీ అందించే హార్డ్ వేర్ పైన సాఫ్ట్ వేర్ సహాయంతో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్(హెచ్‌పిసి) అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో విజయ్ పాండురంగ్ భట్కర్ అనే వ్యక్తి పరం సూపర్ కంప్యూటర్ అభివృద్ధికి పునాది వేశారు. ఆలా 1991 సంవత్సరంలోనే మొదటి పరం -8000 అనే సూపర్ కంప్యూటర్ను తయారుచేశారు. ఆ తర్వాత 1998వ సంవత్సరంలో పరం-10000 పేరుతో కొత్తగా అభివృద్ధి చేశారు. అప్పటినుండి పరం సిరీస్ నుండి వచ్చిన శివాయ్, పరం-బ్రహ్మ, ప్రతుష్ ,మిహిర్ అనే సూపర్ కంప్యూటర్లు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ ని పూనేలోని సీ-డీఏసీ రూపొందించింది. పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోచింనందుకు గాను భారత ప్రభుత్వం పరం సూపర్ కంప్యూటర్ పితామహకు విజయ్ పి భట్కర్ ని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!) -
హైదరాబాద్‌లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ!
అమెరికన్ చిప్ మేకర్ కంపెనీ సెరీమోర్ఫిక్ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ సూపర్ కంప్యూటర్ తయారీలో నిమగ్నమై ఉంది. దీనికి తగ్గట్టుగా చిప్‌సెట్‌ను హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ సెంటర్లో రూపొందించనుంది. నగరంలో 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్యాంపస్‌లో ఈ డెవలప్మెంట్ సెంటర్ 2021 జనవరి 25న ప్రారంభమైంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ సెంటర్‌ని మరింతగా విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 400లకు పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం సెరేమోర్ఫిక్ భారీగా పెట్టుబడులకు రెడీ అయ్యింది. 2024కి సిద్ధం సెరీమోర్ఫిక్ కంపెనీనీ 2020 ఏప్రిల్‌లో మట్టెల వెంకట్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ కంపెనీ పేరు మీద 100కు పైగా పేటెంట్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పేటెంట్స్ సంఖ్య 250కి చేరుకోవచ్చని అంచనా. హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ గురించి మాట్లాడుతూ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడమే తమ టార్గెట్ అని తెలిపారు. 2023 నాటికి ప్రొటోటైప్ రెడీ అవుతుందని. 2024 నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ఉండవచ్చని తెలిపారు. చదవండి: టీనేజర్ల బ్రౌజింగ్.. కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్ -
హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు.. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు. -
ఆలోచించే సూపర్‌కంప్యూటర్
లండన్: మానవుని మెదడులాగే ఆలోచించే సరికొత్త సూపర్ కంప్యూటర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ సూపర్ కంప్యూటర్ను బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవే త్తలు రూపొందించారు. ఇటీవలే దీన్ని స్విచ్చ్ ఆన్ చేశారు. మిలియన్–ప్రాసెసర్– న్యూరల్ కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ (స్పిన్నకర్) ఆధారంగా పని చేసే ఈ కంప్యూటర్ సెకన్‌కు 200 మిలియన్ మిలియన్ల విశ్లేషణలు చేయగలదు. ఇందులో వాడిన ఒక్కో చిప్ 10 కోట్ల ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీకి మొత్తం 30 ఏళ్లు పడితే ఇందులో పరిశోధనకే 20 ఏళ్లు, నిర్మాణానికి మరో పదేళ్లు పట్టడం విశేషం. ఈ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసేందుకు మొత్తం రూ.141 కోట్లు ఖర్చయినట్లు పరిశోధకులు తెలిపారు. మానవ మెదడులోని న్యూరాన్స్ లాగే ఈ కంప్యూటర్ స్పందనలు కలిగి ఉంటుందని, ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మానవుని మె దడులోని రహస్యాలను ఛేదించి, విశ్లేషించడాని కి న్యూరో శాస్త్రవేత్తలకు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానోఉపయోగపడుతుందని వర్సిటీకి చెందిన స్టీవ్ ఫర్బర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అతి తక్కువ శక్తితో రోబోలు కూడా మానవుని వలే మాట్లాడేందుకు, నడిచేందుకు ఈ కంప్యూ టర్ దోహదపడుతుందని ఆయన అన్నారు. -
శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమ్మిట్’
వాషింగ్టన్: ప్రపంచంలో సాంకేతికంగా అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్ సెకన్‌కు 2 లక్షల ట్రిలియన్ గణనలను చేస్తుందని తెలిపారు. ఇంధన రంగం, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో మరింత పరిశోధనలకు ఈ సూపర్ కంప్యూటర్ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ పేరు ‘సమ్మిట్’. ఇప్పటివరకు సూపర్ కంప్యూటర్‌గా ఉన్న టైటాన్ కంటే సమ్మిట్ ఎనిమిది రెట్లు శక్తిమంతమైనదని దీనిని అభివృద్ధి చేసిన యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. కొన్ని రకాల పరిశోధన విభాగాల్లో సెకన్‌కు మూడు బిలియన్ బిలియన్ల మిశ్రమ గణనలను కూడా చేయగలగడం దీని ప్రత్యేకత. -
అంతరిక్షంలోకి సూపర్ కంప్యూటర్
మయామి: డ్రాగన్ అనే మానవరహిత సరకు రవాణా అంతరిక్ష నౌకలో ఒక సూపర్ కంప్యూటర్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపేందుకు స్పేస్ఎక్స్ సిద్ధమైంది. హెచ్‌పీ కంపెనీ తయారుచేసిన ఈ సూపర్ కంప్యూటర్...భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలపై వ్యోమగాములకు దిశానిర్దేశం చేయగలదు. అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కేనవెరల్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.31 గంటలకు ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. రాకెట్‌ను ప్రయోగించిన దాదాపు 10 నిమిషాల్లోనే అది మళ్లీ కేప్ కేనవెరల్కు వచ్చి ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తుంది. రాకెట్‌ను ప్రయోగించిన ప్రతిసారి, దానిని మళ్లీ అదే ప్రదేశానికి రప్పించి అందులోని పరికరాలను పునర్వినియోగించాలని స్పేస్–ఎక్స్ గతంలో నిర్ణయించింది. -
‘సూపర్’ కంప్యూటర్
బీజింగ్: చైనాకు చెందిన ఓ కంప్యూటర్ ప్రపంచంలోని సూపర్ కంప్యూటర్లలో ప్రథమ స్థానానికి పోటీ పడుతోంది. దీని గణన సామర్థ్యం ఒక సెకనుకు 93 కోట్ల కోట్లు. దీనికి సన్వే తైహూ లైట్ అని నామకరణం చేశారు. చైనాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎన్ఆర్సీపీసీ) సంస్థ తయారు చేసింది. ఇందులోని ప్రాసెసర్లన్నీ చైనాలోనే తయారయ్యాయి. ఇప్పుడు కూడా ప్రపంచంలోని టాప్ సూపర్ కంప్యూటర్లలో చైనాకే చెందిన టియాన్హీ-2 ఉంది. దీని సామర్థ్యం సెకనుకు 33.86 కోట్ల కోట్లు. దీనికంటే దాదాపు మూడు రెట్లు ప్రభావవంతంగా పనిచేసే కంప్యూటర్ను చైనా తయారు చేయడం విశేషం. అమెరికాకు చెందిన టైటాన్ కంప్యూటర్ సెకనుకు 17.59 కోట్ల కోట్ల సామర్థ్యంతో దీని తర్వాత స్థానంలో ఉంది. జపాన్‌కు చెందిన సీక్వోయా, రికెన్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. తాజా జాబితాలో అత్యధికంగా 167 కంప్యూటర్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 165 కంప్యూటర్లతో రెండో స్థానంలో ఉంది. -
వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా కేంద్రం.. సూపర్ కంప్యూటర్ను దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు అందించనుంది. దేశ తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ను తయారు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతల అప్పగించారు. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూ. 4,500 కోట్లు కేటాయించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది.