న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance), యూఎస్ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌వీడియా (NVIDIA) చేతులు కలిపాయి. ఇరు సంస్థలు కలిసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ఆధారిత సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేస్తాయి.
ఇటీవలే ఎన్‌వీడియా ఫౌండర్, సీఈవో జెన్సెన్ హ్యా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో 2004లో అడుగుపెట్టిన ఎన్‌వీడియాకు హైదరాబాద్, గురుగ్రామ్, పుణే, బెంగళూరులో డెవలప్‌మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,800 పైచిలుకు ఉంది.
‘విస్తృత, వేగవంతమైన వృద్ధి కోసం డేటా వినియోగం నుండి సాంకేతిక మౌలిక సదుపాయాలను సృష్టించే దిశగా భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. డిజిటల్ వృద్ధిలో ఎన్‌వీడియా తో కలిసి అభివృద్ధి చేసే కంప్యూటింగ్, టెక్నాలజీ సూపర్ సెంటర్లు మన దేశానికి జియో మాదిరిగా ఉ్రత్పేరక వృద్ధిని అందిస్తాయి’ అని ఈ సందర్భంగా రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment