ఉద్యోగాల్లోనే కాదు, ఆఫీస్‌లో జరిగే మీటింగ్స్‌లో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ (ఏఐ) పెత్తనం చేయనుంది. ఆఫీస్ మీటింగ్స్‌లో ఉద్యోగులు చేసే అన్నీ కార్యకలాపాల్ని ఇప్పుడు ఏఐతో తయారు చేసిన అవతార్‌లు చేయనున్నాయి.
అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఓట్టర్. ఏఐ ఫౌండర్, సీఈఓ సాం లియాంగ్ ఏఐ అవతార్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నెలకు 10 రోజుల పాటు ఆఫీస్ మీటింగ్స్‌లో పాల్గొనాల్సి వస్తుంది. మీటింగ్స్ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటి నుంచి బయట పడేందుకు ఏఐ అవతార్‌లను సృష్టించబోతున్నా. ఈ ఏఐ అవతార్‌లు ఆఫీస్ మీటింగ్స్‌లో ఉద్యోగులు ఏం చేస్తారో.. ఈ ఏఐ అవతార్‌లు మాట్లాడటం, పనిచేయడం, సమస్యలను చక్కదిద్దడం వంటివి చేస్తాయని చెబుతున్నారు.
కానీ ఏఐ అవతార్‌లను తయారు చేయడం అంత సులభమేమి కాదని, రికార్డెడ్ మీటింగ్ నోట్స్, ఎవరినైతే ప్రతిబింబించాలో నిర్ధిష్ట వ్యక్తుల వాయిస్ డేటాపై శిక్షణ ఇవ్వాలని లియాంగ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై తాము ప్రయోగం చేయగా అందులో 90 శాతం ప్రశ్నలకు ఏఐ అవతార్‌లు దీటుగా సమాధానం ఇచ్చాయని తెలిపారు.
అదే సమయంలో ఆఫీస్ మీటింగ్స్‌లో పాల్గొనే కస్టమర్ సపోర్ట్, సేల్స్, టీం స్టేటస్ అప్‌డేట్స్ వంటి సమావేశాలకు వీటికి పంపడం ద్వారా ఉద్యోగులు ఇన్నోవేటీవ్, ప్రొడక్టివిటీతో పనిచేస్తారని అన్నారు. పైగా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే మానవ ఉద్యోగాల్ని ఆక్రమించేస్తున్న ఏఐ.. రానున్న రోజుల్లో ఆఫీస్ మీటింగ్స్‌లో ఏఐ అవతార్‌ల పెత్తనం ఎటుకి దారి తీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment