Chip Design Firm Ceremorphic Opens First Development Centre in Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సూపర్‌ కంప్యూటర్‌? రెడీ అయిన అమెరికా కంపెనీ!

Published Wed, Jan 26 2022 3:03 PM | Last Updated on Fri, Jan 28 2022 3:04 PM

Chip Design Firm Ceremorphic opens first development centre in Hyderabad - Sakshi

అమెరికన్‌ చిప్‌ మేకర్‌ కంపెనీ సెరీమోర్ఫిక్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ సూపర్‌ కంప్యూటర్‌ తయారీలో నిమగ్నమై ఉంది. దీనికి తగ్గట్టుగా చిప్‌సెట్‌ను హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో రూపొందించనుంది. నగరంలో 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్యాంపస్‌లో ఈ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ 2021 జనవరి 25న ప్రారంభమైంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ సెంటర్‌ని మరింతగా విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 400లకు పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం సెరేమోర్ఫిక్‌ భారీగా పెట్టుబడులకు రెడీ అయ్యింది.

2024కి సిద్ధం
సెరీమోర్ఫిక్‌ కంపెనీనీ 2020 ఏప్రిల్‌లో మట్టెల వెంకట్‌ ప్రారంభించారు. ఇప్పటికే ఈ కంపెనీ పేరు మీద 100కు పైగా పేటెంట్స్‌ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పేటెంట్స్‌ సంఖ్య 250కి చేరుకోవచ్చని అంచనా. హైదరాబాద్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ గురించి మాట్లాడుతూ సూపర్‌ కంప్యూటర్‌ని తయారు చేయడమే తమ టార్గెట్‌ అని తెలిపారు. 2023 నాటికి ప్రొటోటైప్‌ రెడీ అవుతుందని. 2024 నుంచి కమర్షియల్‌ ప్రొడక‌్షన్‌ ఉండవచ్చని తెలిపారు. 

చదవండి:  టీనేజర్ల బ్రౌజింగ్‌.. కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement