Research and Development centre
-
ఏఐపై ఎరిక్సన్ ఫోకస్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, జియోతో ఎరిక్సన్కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి. -
అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న నోకియా
ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణల కోసం నోకియా అతిపెద్ద గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం భారత్‌లోని చెన్నైలో రూ.450 కోట్ల పెట్టుబడికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు నోకియా, చెన్నై రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఫిన్లాండ్కు చెందిన నోకియా దేశంలో ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయలనే ఉద్దేశంతో రూ.450 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలిపింది. ఈ ల్యాబ్‌లో రానున్న రోజుల్లో 10జీ, 25జీ, 50జీ, 100 జీ(జీపొన్-గిగాబిట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్) నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేస్తామని నోకియా ఆసియా పసిఫిక్ ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల హెడ్ విమల్ కుమార్ కోదండరామన్ తెలిపారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా అడ్వాన్స్డ్ నెట్వర్క్ టెక్నాలజీ సేవలందించేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అతిపెద్ద ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల ల్యాబ్ చెన్నైలో ఏర్పాటు చేయడంవల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం.. -
భారత్‌పై వోల్వో ఫోకస్.. దేశంలో తొలిసారిగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, ట్రక్కుల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో గ్రూప్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వెహికల్ టెక్‌ల్యాబ్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేసింది. ల్యాబ్‌లో వర్చువల్ రియాలిటీ, హ్యూమన్ బాడీ మోషన్ ట్రాకింగ్ ఆధారిత సిమ్యులేటెడ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయంగా ఉన్న వోల్వో ఇంజనీర్లు ఈ వేదికపైకి వచ్చి వాహనాల అభివృద్ధిలో వర్చువల్‌గా పాలుపంచుకుంటారు. వాహనాల అభివృద్ది సమయం గణనీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది. దేశీయ వాహన తయారీ రంగంలో ఇటువంటి ల్యాబ్ స్థాపించడం ఇదే తొలిసారి. బెంగళూరులో సంస్థకు ఆర్అండ్డీ కేంద్రం ఉంది. స్వీడన్ వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా భారత్ అవతరించిందని వోల్వో తెలిపింది. 2024 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం లక్ష్యమని వెల్లడించింది. ఆటోమేషన్, ఎలక్ట్రోమొబిలిటీ, కనెక్టివిటీ విభాగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, కొత్త వ్యాపార నమూనాలను అవలంబించే పనిలో ఉన్నట్టు వివరించింది. -
హైదరాబాద్‌లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి
మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోం అప్లయెన్స్ విభాగంలో వరల్డ్ లీడర్‌గా ఉన్న జర్మనీకి చెందిన బోస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సై అంది. హైదరాబాద్ నగరంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో పాటు గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విభాగంలోనూ కలిసి పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు బోస్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిసి సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. జర్మన్ కంపెనీ బోస్ ఏర్పాటు చేయబోయే సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బోస్ సంస్థ అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025/26 నాటికి ఈ బోస్ సెంటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. BOSCH in Hyderabad! 😊 German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd — KTR (@KTRTRS) February 8, 2022 బోస్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ జర్మనీకి బయట ఆ కంపెనీకి చెందిన అతి పెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌గా అవతరించనుంది. ఈ సెంటర్లో ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ టెక్నాలజీపై పరిశోధనలు సాగనున్నాయి. చదవండి: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం -
ఆర్ అండ్ డీ అడ్డాగా హైదరాబాద్.. మూడో ల్యాబ్‌కి రెడీ అటున్న ప్రముఖ కంపెనీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే స్టార్టప్ కల్చర్ ఇక్కడ బలపడుతుండగా ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం కూడా అదే దారిలో పయణిస్తుంది.భౌగోళిక అనుకూలతలు హుమన్ రిసోర్స్ లభ్యతలలు హైదరాబాద్‌కి అనుకూలంగా మారాయి. మెరుగైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కలిగిన కంపెనీల్లో ఒకటైన ఓప్పో హైదరాబాద్‌లో మరో ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీ బ్యాకప్ పెంచేందుకు అనువైన టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. రానురాను డిజిటలైజేషన్ పెరిగిపోవడం థర్డ్‌పార్టీ యాప్‌ల వినియోగం పెరగడంతో మెరుగైన బ్యాటరీ అవసరం ఏర్పడుతోందని అందుకే ఈ విషయంలో హైదరాబరాద్‌లో ఆర్ అండ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒప్పో ఇండియా ఆర్ అండ్ డీ హెడ్ తస్లీమ్ ఆరీఫ్ తెలిపారు. 280 పేటెంట్లు? ఇప్పటికే ఒప్పో సంస్థకు హైదరాబాద్‌లో రెండు ఆర్ అండ్ డీ సెంటర్లు ఉన్నాయి. 2020 డిసెంబరులో 5జీ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా 2021 ఆగస్టులో కెమెరా ల్యాబ్ ప్రారంభమైంది. తాజాగా 2022 మొదటి త్రైమాసికంలో బ్యాటరీ ల్యాబ్ కూడా మొదలుకానుంది. ఒప్పో హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్లో 450 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా ఇప్పటి వరకు పేటెంట్ హక్కుల కోసం 280 దరఖాస్తులు చేసింది. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేస్తుంది. చదవండి:హైదరాబాద్‌లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ! -
హైదరాబాద్‌లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ!
అమెరికన్ చిప్ మేకర్ కంపెనీ సెరీమోర్ఫిక్ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ సూపర్ కంప్యూటర్ తయారీలో నిమగ్నమై ఉంది. దీనికి తగ్గట్టుగా చిప్‌సెట్‌ను హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ సెంటర్లో రూపొందించనుంది. నగరంలో 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్యాంపస్‌లో ఈ డెవలప్మెంట్ సెంటర్ 2021 జనవరి 25న ప్రారంభమైంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ సెంటర్‌ని మరింతగా విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 400లకు పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం సెరేమోర్ఫిక్ భారీగా పెట్టుబడులకు రెడీ అయ్యింది. 2024కి సిద్ధం సెరీమోర్ఫిక్ కంపెనీనీ 2020 ఏప్రిల్‌లో మట్టెల వెంకట్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ కంపెనీ పేరు మీద 100కు పైగా పేటెంట్స్ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పేటెంట్స్ సంఖ్య 250కి చేరుకోవచ్చని అంచనా. హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ గురించి మాట్లాడుతూ సూపర్ కంప్యూటర్ని తయారు చేయడమే తమ టార్గెట్ అని తెలిపారు. 2023 నాటికి ప్రొటోటైప్ రెడీ అవుతుందని. 2024 నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ఉండవచ్చని తెలిపారు. చదవండి: టీనేజర్ల బ్రౌజింగ్.. కీలక నిర్ణయం ప్రకటించిన గూగుల్ -
భారత్‌లో ఆ చిప్ దిగ్గజం 3వేల ఉద్యోగాలు
బెంగళూరు : ప్రపంచంలో చిప్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ కార్పొరేషన్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బెంగళూరులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో రూ.1,100 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీనిలో భాగంగా 3వేలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నామని పేర్కొంది. వచ్చే 18నెలల్లో ఈ ఉద్యోగాల కల్పించనున్నట్టు చెప్పింది. ఎనిమిది ఎకరాల క్యాంపస్ లో ఈ కొత్త ఆర్ అండ్ డీ సెంటర్ ను ఇంటెల్ ఏర్పాటుచేస్తోంది. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, హార్డ్‌వేర్ డిజైన్ సర్వీసు సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించనుంది. భారత్ లో తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు ఇంటెల్ ఇండియా జనరల్ మేనేజర్ నివృతి రాయ్ న్యూస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గేలు కూడా పాల్గొన్నారు. ఇంటెల్ 2016 వరకు భారత్ లో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఈ కొత్త పెట్టుబడులు అదనం. కంపెనీ భారత సబ్సిడరీలో దాదాపు 7వేల మంది టెక్కీలు తన గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్నట్టు ఇంటెల్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హార్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ వాలిడేషన్, తర్వాతి తరం డిజిటల్ డివైజ్ లకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై కంపెనీ కార్యకలాపాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయని ఇంటెల్ చెప్పింది. ఇంటెల్ బెంగళూరులో పెట్టుబోయే పెట్టుబడులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని హై-లెవల్ క్లియరెన్స్ కమిటీ 2016 ఫిబ్రవరి 1నే ఆమోదం తెలిపింది. ఈ సెంటర్ స్థాపన కోసం కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు భూమిని కూడా కేటాయించింది.