మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోం అప్లయెన్స్ విభాగంలో వరల్డ్ లీడర్‌గా ఉన్న జర్మనీకి చెందిన బోస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సై అంది. హైదరాబాద్ నగరంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో పాటు గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ విభాగంలోనూ కలిసి పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు బోస్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిసి సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు.
జర్మన్ కంపెనీ బోస్ ఏర్పాటు చేయబోయే సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బోస్ సంస్థ అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025/26 నాటికి ఈ బోస్ సెంటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది.
BOSCH in Hyderabad! 😊
— KTR (@KTRTRS) February 8, 2022
German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd
బోస్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ జర్మనీకి బయట ఆ కంపెనీకి చెందిన అతి పెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌గా అవతరించనుంది. ఈ సెంటర్‌లో ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ టెక్నాలజీపై పరిశోధనలు సాగనున్నాయి.
చదవండి: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment