Bosch
-
త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్‌లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్పోస్పోలిటా నివేదించింది.జెక్పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్‌లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!రూ.66 వేలకోట్లతో కొనుగోలుబాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. -
బాష్‌కు రూ.399 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఆటో, గృహోపకరణాల సంస్థ బాష్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో లాభాల్లో 14 శాతం వృద్ధిని చూపించింది. రూ.399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.350 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.4,063 కోట్లకు వృద్ధి చెందింది. ఇక 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1,424 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని బాష్ ప్రకటించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,217 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.11,781 కోట్ల నుంచి రూ.14,929 కోట్లకు పెరిగింది. ‘‘2022 సంవత్సరాన్ని భారత్‌లో శతాబ్ది సంవత్సరంగా జరుపుకున్నాం. అదే ఏడాది మార్కెట్లో ఎన్నో సవాళ్లను చవిచూశాం. ఎన్నో అవరోధాలు ఉన్నా బలమైన వృద్ధితో సానుకూలంగా ముగించాం’’ అని బాష్ లిమిటెడ్ ఎండీ సౌమిత్రా భట్టాచార్య తెలిపారు. (చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమోటివ్ మార్కెట్ పట్ల ఆశావహ అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. ఒక్కో షేరుకు తుది డివిడెండ్ కింద రూ.280 చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఒక్కో షేరుకు రూ.480 డివిడెండ్ ప్రకటించినట్టు అవుతుంది. ఇదీ చదవండి: సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే -
బాష్ పెట్టుబడుల బాట ఐదేళ్లలో రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం బాష్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీలపై రానున్న ఐదేళ్లలో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. డిజిటల్ మొబిలిటీ విభాగంలోనూ పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఎండీ సౌమిత్ర భట్టాచార్య పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రెండంకెల వృద్ధిని అందుకోవడంపై ఆశావహంగా ఉన్నప్పటికీ అప్రమత్తతతో వ్యవహరించనున్నట్లు మార్చితో ముగిసిన గతేడాది(2021–22) వార్షిక నివేదికలో భట్టాచార్య తెలియజేశారు. సరఫరా సవాళ్లు, చిప్‌ల కొరత, చైనా లాక్డౌన్, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తదితర పలు సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటున్నట్లు వివరించారు. దీంతో ఓవైపు వడ్డీ రేట్ల పెరుగుదల, మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాల పరిస్థితులు తలెత్తినట్లు అభిప్రాయపడ్డారు. గతేడాది కంపెనీ రూ. 11,105 కోట్ల ఆదాయం, రూ. 1,217 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు. -
‘బాష్’కు భారతీయత
సాక్షి, బెంగళూరు: భారత్‌కు బాష్ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆటోమొబైల్ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా గురువారం బాష్ బెంగళూరులో ‘స్పార్క్ నెక్ట్స్‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్‌లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ డిజిటల్, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేథతోపాటు అనేక అత్యాధునిక టెక్నాలజీలు కలిగిన ‘స్పార్క్ నెక్ట్స్’వంటి భవనాలు దేశంలో రేపటితరం ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశానికి అవసరమైన మరిన్ని ఉత్పత్తులు, టెక్నాలజీలను బాష్ తయారు చేయాలని, రానున్న25 ఏళ్ల కు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. బెంగళూరు ప్రతిష్ట బాష్ ‘స్పార్క్ నెక్ట్స్’తో మరింత పెరిగిందని కర్ణాటక సీఎం బొమ్మై కొనియాడారు. సుస్థిరత... మా తారకమంత్రం: ఫెలీజ్ అల్చెర్ట్ ‘స్పార్క్ నెక్ట్స్‘ నిర్మాణానికి ఐదేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు బాష్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యురాలు ఫెలీజ్ ఆల్చెర్ట్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు. 76 ఎకరాల్లో మొత్తం 10 వేల మంది పని చేయగల ‘స్పార్క్ నెక్ట్స్‘లో ఏటా 5.8 కోట్ల లీటర్ల వాననీటి సంరక్షణ జరుగుతుందని చెప్పారు. వినియోగం తగ్గిందని వివరించారు. భారత్‌లో బాష్ పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని, త్వరలో 25 కోట్ల యూరోలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. బాష్ కంపెనీ దశాబ్దాలుగా ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేస్తోందని ఉత్పత్తుల డిజైనింగ్ మొదలు తయారీ వరకూ అన్నీ చేపట్టడం ద్వారా మేకిన్ ఇండియాకూ ఊతమిస్తున్నామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు. -
హైదరాబాద్‌లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి
మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోం అప్లయెన్స్ విభాగంలో వరల్డ్ లీడర్‌గా ఉన్న జర్మనీకి చెందిన బోస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సై అంది. హైదరాబాద్ నగరంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో పాటు గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విభాగంలోనూ కలిసి పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు బోస్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిసి సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. జర్మన్ కంపెనీ బోస్ ఏర్పాటు చేయబోయే సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బోస్ సంస్థ అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025/26 నాటికి ఈ బోస్ సెంటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. BOSCH in Hyderabad! 😊 German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd — KTR (@KTRTRS) February 8, 2022 బోస్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ జర్మనీకి బయట ఆ కంపెనీకి చెందిన అతి పెద్ద ఆర్ అండ్ డీ సెంటర్‌గా అవతరించనుంది. ఈ సెంటర్లో ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ టెక్నాలజీపై పరిశోధనలు సాగనున్నాయి. చదవండి: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం -
మీరు ఐటీఐ నిపుణులా? అయితే మీకో శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఆటోమోటివ్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రానున్న ఐదేళ్లలో రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంతర్జాతీయ తయారీ కంపెనీ బాష్ చైర్మన్ డాక్టర్ స్టెఫాన్ హటుంగ్ తెలిపారు. ఈ నిధులను స్థానికంగానే తయారీ చేపడతామని, ఐటీఐలతో కలిసి యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు తగిన శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు. డిజిటల్ మొబిలిటీ రంగంలో పెట్టే రూ.వెయ్యికోట్లకు ఇది అదనమని ఆయన అన్నారు. భారత్‌లో బాష్ సంస్థ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా గురువారం ఏర్పాటైన వర్చువల్ విలేకరుల సమావేశాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ జర్మన్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి భారతీయ ఎంట్రప్రెన్యూర్షిప్ తోడు కావడంతోనే బాష్ ఇండియా ద్వారా పలు రంగాల్లో వినూత్నమైన ఉత్పత్తులను అందించడం సాధ్యమైందని చెప్పారు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరణ... 1922లో కోల్‌కతాలో మొదలైన రాబర్ట్ బాష్ కంపెనీ ప్రస్థానం అంచలంచెలుగా ఎనిమిది రాష్ట్రాల్లో 18 తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరిందని, 32 వేల మంది అసోసియేట్లు కంపెనీలో పనిచేస్తున్నారని వివరించారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరిస్తూ... దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్ల కార్ల సర్వీసింగ్ కోసం బాష్ మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని 2025 నాటికల్లా కనీసం వెయ్యి కొత్త సర్వీస్ కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ప్రస్తుతం 400 ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఉండగా... వాటిని 972 ప్రాంతాలకు విస్తరించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వపు బడ్జెట్లో మూలధన వ్యయాన్ని రూ.7.5 లక్షల కోట్లకు పెంచడాన్ని స్వాగతించిన డాక్టర్ స్టెఫాన్ హటుంగ్ ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్‌లో బాష్ గ్రూపు డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భరత, మేకిన్ ఇండియా కార్యక్రమాలకు బాష్ తనదైన రీతిలో సాయం చేస్తోందని చెప్పారు. బాష్ ఉత్పత్తి చేస్తున్న అత్యాధునిక వీడియో నిఘా ఉత్పత్తులు, వీడియో అనాలసిస్ సాఫ్ట్వేర్లు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయని, దేశంలోని యాభై మెట్రో రైలు ప్రాజెక్టుల్లోనూ బాష్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యుత్తు వాహనాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బాష్ వాటిల్లో వాడే బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే దిశగా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. -
బాష్‌లో 2000 ఉద్యోగాలు స్మాష్..
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆటో విడిభాగాల సప్లయర్ బాష్ తన భారత్ యూనిట్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోవడంతో ఇండియన్ యూనిట్లో 2000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది. రానున్న నాలుగేళ్లలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ర భట్టాచార్య వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో బ్లూ, వైట్ కాలర్ సిబ్బంది ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్ పరిశ్రమ అంతటా చోటుచేసుకుంటున్న మార్పుల్లో ఇది ఓ భాగమని అన్నారు. మార్పులకు అనుగుణంగా కంపెనీని మలచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా, ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని బాష్ అంచనా వేస్తోంది. -
బాష్‌లో కొలువుల జోష్
సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్ ఆటోమోటివ్ పరికరాల దిగ్గజం బాష్ భారత్ ఆర్అండ్డీ సెంటర్ కోసం 10,000 మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. రానున్న కొన్నేళ్లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీపై పనిచేసేందుకు వీరిని రిక్రూట్ చేసుకోనుంది. వినూత్న ఉత్పత్తుల తయారీకి, వచ్చే రెండేళ్లలో భారత్‌లో రూ 500 కోట్ల నుంచి రూ 800 కోట్ల వరకూ పెట్టుబడి పెడుతున్నట్టు బాష్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ సౌమిత్ర భట్టాచార్య చెప్పారు. ఐఓటీపై భారీగా వెచ్చిస్తున్నామని, భవిష్యత్‌లో దీనికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఎలక్ర్టిక్ వాహనాలు పెరుగుతున్న క్రమంలో బ్యాటరీల తయారీని చేపట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తోందని, దీనిపై త్వరలోనే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. భారత్‌లో బాష్ తన రెండో అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను బెంగళూర్‌లో నిర్వహిస్తోంది. ఈ సెంటర్లో 18,000 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. -
మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట!
ముంబై: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ రాబర్ట్ బోష్ దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో అసోసియేట్స్‌ను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో 3,200 మందిని తీసుకోవాలని నిర్ణయించినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరు, కోయంబత్తూరులోని ఆర్ అండ్ డి సెంటర్స్ కోసం సమర్ధత, డాటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థుల కావాలని ప్రకటించింది. రాబర్ట్ బోష్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహించిన శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఎండీ విజయ్ రత్నపార్ఖే ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. బెంగళూరు, బెంగళూరుకు చెందిన 1920మందిని నియమించుకున్నా మన్నారు. మిగిలిన రిక్రూట్మెంట్స్ కోయంబత్తూరు తదితర ప్రదేశాలనుంచి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ఆరేళ్లుగా పదివేలమందిని తమ సంస్థలో చేర్చుకున్నామన్నారు. మొత్త ఉద్యోగుల సంఖ్య 18 వేలని వెల్లడించారు. కాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల బోష్ గ్రూపునుకు ఆర్ అండ్ డి సంస్థ రాబర్ట్ బోష్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్. -
3వేల ఇంజనీర్ కొలువులు
బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, ఆటో విడిభాగాలు తయారు చేసే కంపెనీ దేశంలో భారీ ఎత్తున ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ సంవత్సరం లో 3,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో చాలా వేగంగా తాము అభివృద్ధి చెందుతున్నామని ఈ క్రమంలోనే ఈ నియామకాలని బోష్ గ్రూప్ ఇండియా, అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ స్టీఫెన్ బెర్న్స్ చెప్పారు. అడుగొడిలో కొత్తగా ప్రారంభించిన రెండు భవనాల్లో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ , బోష్ గృహోపకరణాలు కేంద్రంలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు అవసరమని తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో తమ విస్తరణ ప్లాంట్ లోని మొదటి భాగాన్ని ప్రారంభించిన సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్ర మధ్య భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఆర్ .వి. దేశ పాండే, రవాణామంత్రి రామలింగారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి దశ విస్తరణలో భాగంగా రూ .350 కోట్ల పెట్టుబడులతో 2014 టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొంది. రెండవ దశలో 2016 సంవత్సరానికి గాను మరో రూ. 1,170 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు బోష్ ఆసియా- పసిఫిక్ అధికారి పీటర్ టైరోలర్ తెలిపారు. అడుగోడి ,బెంగళూరు, కోయంబత్తూరులలో తమ కు 14 వేల మంది రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సిబ్బంది వున్నట్టు చెప్పారు. జర్మనీ తరువాత తమకు భారతే అతిపెద్ద అభివృద్ధి సంస్థ అని బోష్ పేర్కొంది. జీఎస్టీ బిల్లు బిల్లు వల్ల భవిష్యత్తుల్లో కచ్చితంగా మేలు జరుగుతుందన్న బెర్న్స్ అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. . డీజిల్ వ్యవహారంలో ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం క్రమంలో తాము కూడా అప్రతమత్తంగా ,ఆశావాదంతో కొనసాగుతున్నామన్నారు. -
బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం
హైదరాబాద్: ఐరోపా దిగ్గజ గృహోపకరణాల సంస్థ ‘బాష్’ తాజాగా తన నూతన శ్రేణి వాషింగ్ మెషీన్ల కోసం ‘నో డ్యామేజ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. సంస్థ ఇటీవల లాండ్రీ విభాగంలో 6.5-8 కిలోగ్రాముల ఉత్పత్తుల శ్రేణిలో కొత్తగా వాషింగ్ మెషీన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో యూనిక్యూ వేవ్ డ్రాప్లెట్ డిజైన్‌తో కూడిన వరియోడ్రమ్ టెక్నాలజీని ఉపయోగించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వినియోగదారులు ఈ కొత్త మెషీన్ల ద్వారా వారి నూతన, ఖరీదైన దుస్తులను డ్యామేజ్ లేకుండా వాష్ చేసుకోవచ్చని పేర్కొంది.