మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట! | Bosch To Hire Over 3,000 Associates This Year | Sakshi
Sakshi News home page

మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట!

Published Sat, Nov 12 2016 11:39 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట! - Sakshi

మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట!

ముంబై: ప్రముఖ టెక్నాలజీ  సేవల సంస్థ రాబర్ట్‌  బోష్ దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో అసోసియేట్స్‌ను నియమించుకోనున్నట్టు  ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో 3,200 మందిని తీసుకోవాలని నిర్ణయించినట్టు సంస్థ  సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  బెంగళూరు, కోయంబత్తూరులోని ఆర్ అండ్ డి సెంటర్స్ కోసం సమర్ధత, డాటా  ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్  రంగాల్లో  అనుభవం ఉన్న అభ్యర్థుల కావాలని ప్రకటించింది.
 
రాబర్ట్‌  బోష్ ఇంజనీరింగ్ అండ్  బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహించిన  శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఎండీ విజయ్ రత్నపార్ఖే ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.  బెంగళూరు,  బెంగళూరుకు చెందిన 1920మందిని నియమించుకున్నా మన్నారు. మిగిలిన  రిక్రూట్మెంట్స్ కోయంబత్తూరు తదితర ప్రదేశాలనుంచి  పూర్తి చేయనున్నట్టు తెలిపారు.

గత ఆరేళ్లుగా పదివేలమందిని  తమ సంస్థలో చేర్చుకున్నామన్నారు. మొత్త ఉద్యోగుల సంఖ్య 18 వేలని   వెల్లడించారు. కాగా  ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల  బోష్ గ్రూపునుకు ఆర్ అండ్ డి  సంస్థ రాబర్ట్‌  బోష్ ఇంజనీరింగ్ అండ్  బిజినెస్ సొల్యూషన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement