న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సపోర్ట్, సర్వీసుల సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (Vertex Global Services) తాజాగా భారత్‌లో గణనీయంగా నియామకాలు (Jobs) చేపట్టనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే 3–5 ఏళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 4,000 మంది పైగా లాంగ్వేజ్ నిపుణులను నియమించుకోనున్నట్లు (recruit) సంస్థ వెల్లడించింది.
చిన్న నగరాల్లో ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సవాళ్లను యువత అధిగమించడంలో తోడ్పాటు అందించే దిశగా రిక్రూట్‌మెంట్ తలపెట్టినట్లుగా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో గగన్ ఆరోరా తెలిపారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ తదితర అంతర్జాతీయ భాషలతో పాటు కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర ప్రాంతీయ భాషల్లోనూ సర్వీసులను అందిస్తున్నట్లు వివరించారు.
వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ భారత్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, నైజీరియా, నేపాల్, ఫిలిప్పీన్స్, యూఏఈలలో కార్యకలాపాలను కలిగి ఉంది. బిజినెస్ వర్టికల్స్‌లో వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్, వెర్టెక్స్ నెక్స్ట్, ఐఎల్‌సీ సొల్యూషన్స్, వెర్టెక్స్ లెర్నింగ్, వెర్టెక్స్ టెక్నాలజీస్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment