language
-
తగ్గేదేలే!
మతం, కులం, భూమి... ఇండియాలో ఇవి ఉద్రిక్తమైన అంశాలు. భాష కూడా ఇలాంటిదే. కేవలం రాజకీయ ప్రసంగాలకు చర్చలకు పరిమితమై ఉండి నట్లయితే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ అది స్వాతంత్య్రా నికి పూర్వం, ఆ తర్వాత కూడా ఉద్యమాలను లేవదీసింది. భౌగోళిక సరి హద్దులను మార్చేసింది. ప్రాంతీయ అధినేతల తలరాతలు మార్చేసింది. ఉదాహరణకు సి రాజగోపాలాచారిని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి పీఠం నుంచి పడదోసింది.భాషతో ఆడుకునే ఉన్మాదులకు తమిళనాడు పురిటిగడ్డగా మారింది. ఒకప్పుడు వేర్పాటువాదానికి ఊపిరిపోసింది. ఇప్పుడు అధికారం కాపాడుకోవడానికి సాధనంగా మార్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్... మోదీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ–2020)ని తెర మీదకు తెచ్చారు. కేంద్రం నుంచి సమగ్ర శిక్షా స్కీము కింద వచ్చే రూ 2,152 కోట్ల నిధులను వదులుకోడానికి సిద్ధపడి మరీ ఆయన ఎన్ఈపీని తిరస్కరించారు. రాష్ట్రంలోని 14,500 మోడల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయడం... ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ఉద్దేశం. కేంద్రం ఎన్ఈపీని శిలాశాసనంలా రూపుదిద్దింది. పథకంలో గొప్పగా పొందుపరచిన ‘ఆశయాలు’ డీఎంకేకి మోసపూరితాలుగా కనబడుతున్నాయి. 1968 ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రాన్నే ఎన్ఈపీ– 2020 ద్వారా తిరిగి ప్రవేశపెడుతున్నామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. అయితే, హిందీని రాష్ట్రాలపై రుద్దే దురుద్దేశపూర్వక ప్రయత్నంగా డీఎంకే దాన్ని పరిగణిస్తోంది. నిజానికి ఎన్ఈపీ– 2020 పాతదానితో పోల్చితే చాలా వరకు వెసులు బాటు కల్పిస్తోంది. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ రుద్దే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. పిల్లలు నేర్చు కోవలసిన మూడు భాషలు ఏవన్నదీ ఆ యా రాష్ట్రాల, ప్రాంతాల, పిల్లల ఇష్టానికే విడిచి పెట్టింది. కాకుంటే, ఈ మూడింటిలో రెండు మాత్రం దేశంలోని ‘నేటివ్‘ భాషలు అయ్యుండాలి. అంటే రాష్ట్ర భాషకు అదనంగా మరొక భారతీయ భాషను నేర్వవలసి ఉంటుంది. అది హిందీయే కానవసరం లేదు. రాజకీయ పెనం మీద హిందీనిజానికి డీఎంకే, కేంద్రం మధ్య ఘర్షణకు మూలం ఇది కాదు. తమిళనాడు రాజకీయ పెనం మీద హిందీ ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటుంది. అయినా, స్టాలిన్ సహజంగానే ఎన్ఈపీని తోసిపుచ్చినప్పుడు కేంద్రం ఆయనతో చర్చలు జరిపి ఉండాలి. అలా కాకుండా రెచ్చగొట్టే విధానం అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ముందు నిలిచి కయ్యానికి కాలు దువ్వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్ విభజన జరగాలన్న ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆయన స్వరాష్ట్రం ఒడిశా ముందుండి నడిపిన విషయం ఆయనకు గుర్తు లేకపోవడం నిందార్హం. ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని హెచ్చరిస్తూ, డీఎంకే ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. ఇది జరిగి నెల గడవక ముందే, మార్చి 11న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ‘నిజాయితీ లేని’, ‘మోసకారి’ పార్టీ అని డీఎంకేని నిందించారు. దీనికి స్పందనగా, మంత్రి ‘పొగరుబోతు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రధాన్ ఆ తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఇరు పక్షాలూ బరిలోకి దిగాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి ఈ పోరులో డీఎంకేకు మద్దతు పలికారు. ఎప్పుడో 1937 లోనే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి రాజగోపాలాచారి (రాజాజీ) సెకండరీ స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంతో జస్టిస్ పార్టీ మండిపడింది. తలముత్తు, నటరాజన్ అనే ఇద్దరు యువ ఉద్యమకారులు పోలీసుల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. భాష కోసం ప్రాణా లొడ్డిన అమరులుగా వారు నివాళులు అందుకున్నారు. తర్వాత రాజాజీ రాజీనామా చేశారు. బ్రిటిష్ పాలకులు నాటి హిందీ నిర్బంధం ఉత్తర్వును ఉపసంహరించారు. 1965కి వద్దాం. హిందీని అధికార భాషగా అమలు చేసేందుకు కేంద్రం పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. మరోసారి తమిళనాడు భగ్గుమంది. రాష్ట్రం అంతటా హింస చెలరేగింది. 70 మంది అసువులు బాశారు. 1967లో అధికార భాషల (సవరణ) చట్టాన్ని, 1968లో అధికార భాషల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన సందర్భంలోనూ ఉద్యమం తిరిగి ప్రాణం పోసుకుంది. హిందీకి అదనంగా ఇంగ్లీష్‌ను కూడా కమ్యూనికేషన్ భాషగా కొనసాగించేందుకు, హిందీ ఒక్కటే అధికారిక లింకు భాషగా ప్రకటించిన తొలి విధానాన్ని వాయిదా వేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. మూడు భాషల ఫార్ములాను తిరస్కరిస్తూ అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై నాయకత్వంలో 1968 జనవరి 26న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళాన్ని, ఇతర భాషలను అధికార భాషలుగా క్లాసిఫై చేసేవరకు ఇంగ్లీషు ఒక్కటే ఏకైక అధికార భాషగా కొనసాగితీరాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే ఒక మాట. గతంలోకీ ఇప్పటికీ తమిళుల స్పందనలో మార్పు కనబడుతోంది. అప్పట్లో హిందీ–తమిళ్ జగడం తమిళ ఓటర్లను భావోద్వేగంతో కదిలించేది. నేడు మరొక కోణం తెర మీదకు వచ్చింది. అది ఆర్థికం. తమిళనాడు ఆర్థిక సంస్కరణల నుంచి పూర్తి ప్రయోజనం పొందింది. ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. రాజకీయ పోరాటాలు స్థానికులు, వలసదారుల మద్య సామాజిక సంబంధాలను ప్రభావితం చేయలేక పోవడం ఒక సానుకూల పరిణామం. ‘మరాఠీ మనూస్’ (మరాఠీ మాట్లాడే మనుషుల) తరహా యుద్ధోన్మాదం లేదు. అయినప్పటికీ, భాష ఒక సెన్సిటివ్ ఇష్యూనే!రాధికా రామశేషన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘తమిళభాష అభివృద్ధి కోసం స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి?’
హైదరాబాద్: త్రిభాషా పాలసీ అనేది కొత్తది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటునుండి ఈ విధానం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని, నచ్చిన భాషను చదువుకోవచ్చని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చాం. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలను రచ్చ కొట్టి అధికారం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి.దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. నియోజకవర్గ పునర్విభజన పై కొత్త నియమాలు రాలేదు.జనగణన జరగలేదు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేస్తా అని అంటున్నారు. దక్షిణ భారత ప్రజలు తన్యవంతులయ్యారు అక్షరాస్యత పెరిగింది.. మీ పిచ్చి మాటలు నమ్మరు. రాజకీయ దురుద్దేశంతో ప్రజల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.కాగా, త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు మిగతా పార్టీలకు మధ్య వార్ నడుస్తోంంది. ఇదే అంశంపై పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానాన్ని సమర్ధించారు. ఎలాగు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది కాబట్టి సమర్థిస్తూ మాట్లాడారు పవన్. దీనిపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. -
పవన్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.మరోవైపు, పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హిందీ వ్యతిరేకత ఎందుకు?
మత, భాష, ప్రాంతీయ ఉన్మాదాలు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు గొడ్డలి పెట్టు అనే విషయంలో దేశ హితాన్ని కోరే అందరి వ్యక్తుల అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషపై అవాకులు చవాకులు పేలడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా హిందీనీ విద్యాలయాల్లో బోధించ డాన్ని వ్యతిరేకించడం తమిళ రాజకీయాలలో ఒక భాగమే.దేశంలో తెలివైన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, విద్యార్థుల్లో ‘ఈ దేశం నాది’ అనే భావనను నిర్మాణం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ‘నవోదయ’ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు తమిళనాడుకు అవసరం లేదని ద్రవిడ పార్టీల నాయకులు అడ్డు కున్నారు. ఆ పాఠశాలల్లో హిందీని ఒక భాషగా బోధించడమే ఇందుకు కారణం. ‘సర్వ శిక్షా అభియాన్’ నిధులను తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం విషయంలో కేంద్రానికి– రాష్ట్రానికి మధ్య చోటుచేసుకున్న వివాదం కారణంగా త్రిభాషా సూత్రం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం వీలు కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేయడంతో త్రిభాషా సూత్రం అమలు విషయంపై రాద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ విషయంపై అభ్యంతరాలు లేవు. త్రిభాషా సూత్రం అమలులో భాగంగా దక్షిణాదిలో రాష్ట్ర భాష, ఇంగ్లీషు, హిందీ బోధించేటట్లు; ఉత్తరాదిలో హిందీ, ఇంగ్లీషు, ఏదైనా దక్షిణాది రాష్ట్రాల భాష (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏదో ఒకటి) బోధించేటట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభి ప్రాయంతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే తమిళులు దీన్ని వ్యతిరేకించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈనాటిది కాదు. 1937లో ‘ద్రావిడార్ కళగం’ పేరుతో ఈవీ రామస్వామి తమిళ ప్రజలను రెచ్చగొట్టి, ‘ఉత్తరాది వారి భాష హిందీ మనకెందు’కంటూ, తమిళ ప్రజల్లో హిందీ భాషపై ద్వేషాన్ని నూరి పోశారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి రాజ గోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం రాజీనామా చేయడంతో ఉద్యమం చల్లారింది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఇంగ్లీషు స్థానంలో హిందీని జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని ఆలోచించడంతో 1965లో ‘ద తమిళనాడు స్టూడెంట్స్ యాంటీ హిందీ యాజిటేషన్ కౌన్సిల్’ పేరుతో తమిళ నాయకులు పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమాన్ని లేవదీశారు. ఉద్యమాన్ని అణచడానికి పారా మిలటరీ దళం రంగ ప్రవేశం చేయడంతో 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. నాటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి బలవంతంగా హిందీని తమిళ ప్రజలపై రుద్దే అవకాశం లేదని ప్రకటించడంతో ఉద్యమం ఆగి పోయింది.ఈ ఉద్యమ ప్రభావంతో 1967 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఉత్తరాది ప్రజలు ఆర్య సంస్కృతికి చెందిన వారనీ, వారి భాష హిందీ అనీ, ఆ భాషను మాట్లాడటం తమిళుల ఆత్మగౌరవానికి భంగం అనే భావనను తమిళ ప్రజల మనసులో బాగా చొప్పించారు బ్రిటిష్ పాలకులు. పాశ్చాత్య కోణంలో హిందూ సంస్కృతిని దునుమాడడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈవీ రామ స్వామి బ్రిటిష్ పాలకులకు ఒక పనిముట్టుగా దొరికారు. ఆయన ప్రియ శిష్యుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శ్రీరామునిపై, రామాయణంపై దుర్వా్యఖ్యలు చేయడం, ఆయన మనుమడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిదని మాట్లాడటం బ్రిటిష్ వాళ్ళు నూరి పోసిన ఆర్య ద్రావిడ వాద ప్రభావమే! తమిళులే హిందీని వ్యతిరేకించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే!ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
మరాఠీయే ముంబై భాష
ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు విజయ్ వడేట్టివార్, భాయ్ జగ్తాప్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. బుధవారం ఘట్కోపర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు. ఎంవీయే అగ్రనేతలు -
నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) పార్టీ అధినేత కమల్ హాసన్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కమల్.. మూడు భాషల పాలసీకి వ్యతిరేకంగా స్టాలిన్ పోరాడటాన్ని అభినందించారు.నూతన జాతీయ విద్యా విధానం(National Education policy)లో భాగంగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు భాషల పాలసీని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే-బీజేపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే తమిళ భాషా పరిరక్షణకు స్టాలిన్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందని కమల్ హాసన్ అంటున్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశా. తమిళనాడు, తమిళ భాష, తమిళ సంప్రదాయం అన్నివైపులా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ.. డీఎంకే దిగ్గజాల పోరాటపటిమనే స్టాలిన్ కనబరుస్తున్నారు. తమిళనాడుకు ఓ కోటగా ఆయన రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని కమల్ ట్వీట్ చేశారు. అంతకుముందు.. நாளை பிறந்த நாள் காணும் மாண்புமிகு தமிழ்நாடு முதல்வர், திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைவர், என்னுடைய அருமை நண்பர் திரு. மு.க. ஸ்டாலின் அவர்கள் நல்ல ஆரோக்யத்துடன், நீண்ட காலம் வாழ்ந்து மக்கள் பணியாற்ற வேண்டுமென இன்று நேரில் சந்தித்து வாழ்த்தினேன். தமிழக மக்களும், தமிழ்… pic.twitter.com/jsZ6AfgsQ3— Kamal Haasan (@ikamalhaasan) February 28, 2025ఎన్‌ఈపీను కమల్ హాసన్(Kamal Haasan) సైతం బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తన ఎంఎన్ఎం పార్టీ వార్షికోత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘‘భాష కోసం గతంలో తమిళులం ప్రాణాలొదిలేశాం. ఆ విషయంలో మాతో ఆటలొద్దూ’’ అంటూ కేంద్రానికి హెచ్చరిక పంపారాయన. 👉ఇదిలా ఉంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది నూతన జాతీయ విద్యా విధానం(NEP). ఈ పాలసీలో ‘త్రిభాష’ను అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ప్రాంతీయ భాషలను అణచివేసే ప్రయత్నమని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఎన్ఈపీ అమలు చేస్తేనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్టాలలిన్ చెబుతున్నారు. 👉మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.. హిందీ అమలు తప్పనిసరేం కాదని చెబుతోంది. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఎన్ఈపీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై.. డీఎంకే ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయితే త్రిభాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు బీజేపీ నుంచి పలువురు రాజీనామాలు చేస్తుండడం గమనార్హం. 👉 2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. అయితే కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించింది ఎన్ఎంఎం. కూటమి భాగస్వామి డీఎంకే తరఫున కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొనగా.. అన్ని లోక్‌సభ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో.. కమల్ హాసన్‌ను రాజ్యసభను పంపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: భాషా యుద్ధం.. అనవసర భయమా? లేక.. -
Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’
మరాఠీ భాషా దినోత్సవాన్ని(Marathi Language Day) ప్రతీయేటా ఫిబ్రవరి 27న జరుపుకుంటారు. ప్రముఖ మరాఠీ కవి విష్ణువామన్ శివాడ్కర్(Vishnuvaman Sivadkar) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. విష్ణువామన్ శివాడ్కర్ను ‘కుసుమాగ్రజ’ అని కూడా అంటారు. ఈ రోజున మరాఠీ సాహిత్యానికున్న గొప్పదనాన్ని గుర్తిస్తూ, మరాఠీ భాషా రచయితలను సన్మానిస్తుంటారు.మరాఠీ భాష ఆధునిక ఇండో- ఆర్యన్ భాషలలో అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. క్రీస్తు శకం 900 నుంచి మరాఠీ భాష మనుగడలో ఉంది. 1999లో కుసుమాగ్రజ మరణానంతరం ప్రభుత్వం ‘మరాఠీ అధికారిక భాషా గౌరవ దినోత్సవం’ను ఆయనకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తోంది. అలాగే ఈరోజు మరాఠీ భాషా సాహిత్యంలో విశేష కృషి చేసినవారిని సన్మానిస్తుంటారు. మరాఠీ భాషా దినోత్సవం సందర్భంగా ఈ భాషకున్న కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.మరాఠీ ప్రత్యేకతలు1. హిందీ, బెంగాలీ తరువాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష మరాఠీ. మరాఠీ భాషను తొమ్మిది కోట్లమంది మాట్లాడుతుంటారు.2. మరాఠీలో మొత్తం 42 రకాల యాసలు ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాలను అనుసరించి మారుతుంటాయి.3. మరాఠీని కూడా దేవనాగరి లిపి(Devanagari script)లో రాస్తారు. మరాఠీకి లిపి ఉంది. దీనిని మోదీ లిపి అని అంటారు.4. మరాఠీ లిపిని గుర్తిస్తూ పోస్టల్ శాఖ(Postal Department) ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.5. 11వ శతాబ్ధంలో మరాఠీ భాషలో తొలి గ్రంథం వెలువడింది.6. మరాఠీ భాషకు ప్రత్యేక వ్యాకరణం కూడా ఉంది. మరాఠీ భాషను మహారాష్ట్రీ, మరహట్టీ అని కూడా పిలిచేవారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ.. -
భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
‘ఆది వాణి’ ఏఐతో భాష పదిలం
దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది.సాంకేతికతతో సాధికారతఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.భాష పరిరక్షణకు..భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.ఇదీ చదవండి: రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్విద్యార్థులకు ఎంతో మేలు..ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?
అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు. ఊహలతో, ఊసులతో ప్రపంచాన్ని వీక్షించేవారు. వీరు సమాజంతో సంబంధాలు నెరవేర్చేందుకు ఏర్పడినదే బ్రెయిలీ లిపి. ఇది అంధులకు వరంలాంటిదని చెప్పుకోవచ్చు.ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతీఏటా జనవరి 4న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. లూయిస్ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవకుండా ఉండేందుకే ఈ బ్రెయిలీ లిపిని రూపొందించారు. అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారు. లూయీస్ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కింది. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం.లూయిస్ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సైమన్ రాలీ బ్రెయిలీ. అతను నాటిరోజుల్లో రాజ గుర్రాలకు జీనులు తయారు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో లూయిస్ తన మూడేళ్ల వయసు నుండే తన తండ్రితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కత్తి అతని ఒక కన్నుకు గుచ్చుకుని, అతని చూపు దెబ్బతింది. కొద్దికాలానికి మరో కంటి చూపు కూడా పోయింది. సరైన వైద్యం అందక లూయీస్ ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిగా చూపు కోల్పోయాడు. తరువాత లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరాడు. చీకట్లో కూడా మెసేజ్‌లను చదవడంలో సహాయపడే సైనిక కోడ్ గురించి లూయిస్‌కు బాగా తెలుసు. అంధుల కోసం అలాంటి స్క్రిప్ట్ రూపొందించాలనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో అతను బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఇది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయుక్తమయ్యే ఒక స్పర్శ కోడ్. ఈ లిపి కోసం ఎంబోస్డ్ పేపర్‌ను వినియోగిస్తారు. దానిపై ఉన్న చుక్కలను స్పర్శిస్తూ చదవవచ్చు. బ్రెయిలీ లిపిని టైప్‌రైటర్‌తో సమానమైన బ్రెయిల్రైటర్ ద్వారా రాయవచ్చు. ఇదేకాకుండా స్టైలస్, బ్రెయిలీ స్లేట్ ఉపయోగించి కూడా రాయవచ్చు. బ్రెయిలీ లిపిలో ఉపయోగించే చుక్కలను సెల్ అని అంటారు.ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. సుమారు 253 మిలియన్ల మంది దృష్టిలోపానికి గురయ్యారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది. అదిమొదలు ప్రతీయేటా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు -
వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్‌లో 4000 ఉద్యోగాలు..
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సపోర్ట్, సర్వీసుల సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (Vertex Global Services) తాజాగా భారత్‌లో గణనీయంగా నియామకాలు (Jobs) చేపట్టనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే 3–5 ఏళ్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 4,000 మంది పైగా లాంగ్వేజ్ నిపుణులను నియమించుకోనున్నట్లు (recruit) సంస్థ వెల్లడించింది.చిన్న నగరాల్లో ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సవాళ్లను యువత అధిగమించడంలో తోడ్పాటు అందించే దిశగా రిక్రూట్మెంట్ తలపెట్టినట్లుగా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో గగన్ ఆరోరా తెలిపారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ తదితర అంతర్జాతీయ భాషలతో పాటు కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర ప్రాంతీయ భాషల్లోనూ సర్వీసులను అందిస్తున్నట్లు వివరించారు.వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ భారత్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, నైజీరియా, నేపాల్, ఫిలిప్పీన్స్, యూఏఈలలో కార్యకలాపాలను కలిగి ఉంది. బిజినెస్ వర్టికల్స్‌లో వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్, వెర్టెక్స్ నెక్స్ట్, ఐఎల్సీ సొల్యూషన్స్, వెర్టెక్స్ లెర్నింగ్, వెర్టెక్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. -
ఇంగ్లిషే నంబర్ వన్
‘ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఇంగ్లిష్‌కే మా ప్రాధాన్యం’ అంటోంది వర్తమాన ప్రపంచం. ఏకంగా 135 దేశాల్లోని వారంతా ఇంగ్లిష్ భాషకే అగ్రస్థానం ఇస్తున్నారని ‘డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024’ వెల్లడించింది.అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో ఇంగ్లిష్ మొదటి స్థానంలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్‌గా గుర్తింపు పొందిన డ్యూలింగో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల అభ్యాసనంపై తాజా నివేదిక విడుదల చేసింది. రెండో స్థానంలో స్పానిష్ , మూడో స్థానంలో ఫ్రెంచ్ ఉన్నాయని తెలిపింది. డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024లోని ప్రధానాంశాలివీ.. – సాక్షి, అమరావతిప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష⇒ ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లిష్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు మొదటి స్థానం ఇచి్చన దేశాలు 10 శాతం పెరిగాయి. 2024లో 135 దేశాలు ఇంగ్లిష్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చాయి. ⇒ మలేíÙయా, అల్బేనియా, మోనాకో, ఇరాన్, మంగోలియా, ఎరిత్రియా, రువాండా దేశాల్లో గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. శ్రీలంక, మయన్మార్, క్రొయేషియా, ఇథియోపియా, కిరిబతి, మలావి దేశాల్లో గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు తమ మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు.⇒ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఇంగ్లిష్ సరి్టఫికేషన్ కోర్సు చేస్తున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చైనా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి. ⇒ అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో హిందీ పదో స్థానంలో ఉంది. -
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా?
బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది.బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్ ఆర్డర్ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్నర్లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్ చేశారు.Bengaluru is in Karnataka or Pakistan @Swiggy ?Your delivery guy is neither speaking nor understanding #kannada ,not even #English. Do you expect us to learn his state language #Hindi in our land? Stop imposing things on us and make sure your delivery persons know #Kannada. pic.twitter.com/smzQ6Mp7SV— Rekha 🌸 (@detached_98) September 12, 2024అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి : ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది -
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్‌లు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్. మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట. -
బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పట్టరాని కోపం, చిరాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష, వైఖరీ మారిపోతుంది. అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తా గానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు. కోపం, భాధ, ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరూ ఆపుకోలేరు. ఏదైన ఎక్స్‌ప్రెస్ చేసేయాల్సిందే. అయితే ఇలా మనసులో బాధ, కోపాన్ని వెళ్లగక్కడమే మంచిదంటున్నారు. ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం వంటివి చేస్తాం. ఇలా చేయడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ఇదేంటీ..బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా అని కోప్పడకండి. ఇలా అనడానకి కారణం ఏంటంటే..కోపం, ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడూ బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కొందరూ ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాలం రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు. ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ, కోపం, ఒత్తిడి తగ్గిపోయి రీలిఫ్ అయిపోతారట. ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇదో ఒక గొప్ప మార్గం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు, దాదాపు 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు. వారిలో కొందరూ భావోద్వేగాలను అణుచుకుని బయటకు ఎక్స్ప్రెస్చేయకపోవడంతో..వారిలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. తమ కోపాన్ని, చిరాకుని వెళ్లగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడే పురుషులు, స్త్రీలల్లో ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచేసుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు వైద్యుడు హుస్సేన్.అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్‌గా లేదా కోపంగా చిరాకులో మాట్లాడే కఠిన పరుష పదజాలం.. మన స్నేహితులు, బంధువుల మనసులు గాయపడేలా చేస్తాయి. ఒక రకంగా బంధాలు దూరమవుతాయి. అందుకే మన పెద్దలు కోపంలో వచ్చే ప్రతి మాట మనిషి వినాశనానికి హేతువు అని నొక్కి చెబుతుంటారు. కోపంగా ఉన్నప్పుడూ ఏదో ఒక పని చేయడం లేదా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవడం వంటివి చేయమంటారు. సైంటిఫిక్‌గా ఇలా వెళ్లగక్కడం వల్ల లోపలున్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో..అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరిని చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి, చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోమని సూచిస్తున్నారు. అవేంటంటే..స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, కంప్యూటర్లతో గడిపే సమాయాన్ని ఏదో విధంగా తగ్గించడంకెఫిన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండియోగా, మెడిటేషన్ వంటివి చేయండిబ్రీథింగ్ ఎక్సర్సైజులు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది. అతిగా కాఫీ లేదా టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇవి ఆందోళనకు, నిద్రలేమికి కారణమవుతాయి. అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించడం మంచిది. దీని వల్ల బ్రెయిన్లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. ఇలాంటి వాటితో భావోద్వేగాలను జయించి.. ఆరోగ్యకరమైన ఆనందకర జీవితాన్ని గడపండి అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్లు వీరే..!) -
ఎన్నికల పోరులో ఇదేం భాష?
ఈ సృష్టిలో మాట్లాడగలిగే మహ ద్భాగ్యం మనిషికే ఉంది. ఆ మాటను సవ్యంగా ఉపయోగిస్తే మాటే మంత్రమై గొప్ప గొప్ప పనులు నెరవేరుస్తుంది. లేదంటే ఆ మాటే కార్చిచ్చు అవుతుంది. నేటి ఎన్నికల సమరాంగణంలో భాషా ప్రయోగం ఎలా ఉంది? దాని పాత్ర ఏంటో చూద్దాం.భాష అంటే మనసులో ఉన్న భావాన్ని మాటల రూపంలో వ్యక్తం చేసే సాధనం. ప్రస్తుత ఎన్నికల వ్యవ హారం చూస్తుంటే అమ్మ భాషకు తూట్లు పొడుస్తున్నట్లుంది. ఎన్నికల్లో పోటీచేసే ప్రతీపార్టీ ప్రతినిధులూ ఓటరు వద్దకు వెళ్లి, ఓటు కోసం అభ్యర్థించడం సర్వసాధారణమైన అంశం. అభ్యర్థించడం అంటేనే ఒక విన్నపం. విన్నపం అంటేనే వినయంగా అడిగేది. కానీ పార్టీ ప్రచార సభల్లో నాయకులు తమ తమ విద్యాస్థాయులు, హోదాలు మరచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం శోచనీయం.నేటి ఎన్నికల ప్రచార సభల్లో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి అజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తారు? వారి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి, ఇతర పార్టీ నాయకులను దుయ్యబట్టడమే అజెండాగా కనిపిస్తోంది. ‘నీ తోలు తీస్తా, నీ పళ్లు రాలగొడతా, చెప్పుతో కొడతా, చిప్పకూడు తినిపిస్తా...’ వంటి అప్రజాస్వామిక భాషను వాడడం ఎంతవరకు సబబు? కొంతమంది నేతలు, వేరే నాయకులను దూషిస్తూ, కించపరుస్తూ, కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నిన్ను పాతాళానికి తొక్కేస్తా’ అంటారొకరు. ఒక వ్యక్తిని అధికార పీఠం ఎక్కించాలా, దించాలా, పాతాళానికి తొక్కేయాలా అనేది నిర్ణయించేది వీళ్లు కాదు, కేవలం ఓటరు మాత్రమే. రాజకీయ నాయకులు ఒకరినొకరు పాతాళానికి తొక్కె య్యడం వల్ల ఓటరుకు ఒరిగేదేముంది? ఒకరు మరొక నాయకుడిని ‘నీ అంతు చూస్తా’ అంటాడు. ప్రజాస్వామ్య పాలనలో ఎవరి అంతుచూడాలన్నది ‘ఓటరన్న’కే సాధ్యం అనే గ్రహింపు కలిగి ఉండాలి. ప్రజా సమస్యలను తుంగలో తొక్కేసి, పర నింద, పరుష నింద వల్ల ఒరిగేదేమిటో వారికే ఎరుక!మరో నాయకుడు ‘ప్రతి అవ్వకు, ప్రతి తాతకు’అంటూ బంధుత్వాన్ని కలుపుతారు. ఈ మాటలు ఆ నాయ కుడికీ, ఓటరుకీ మధ్య ఒక మనోబంధాన్ని ఏర్పరుస్తాయి. తద్వారా ప్రజలకు ఆ నాయకుడిపై ఒక నమ్మకం, ఒక భరోసా కలిగిస్తాయి.పార్టీ అజెండా ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థ మయ్యే విధంగా వివరించాలి. గతకాలంలో చేసిన వాగ్దా నాలు, వాటి నెరవేర్పు ఏమేరకు జరిగింది, వాటి మధ్య ఉన్న అంతరమెంత, ఆ అంతరాన్ని పూరించడానికి ఈ సారి అధికారంలోకొస్తే ఎలాంటి కార్యాచరణ చేస్తారు అనే అంశాలను విశదీకరించాలి. అంతే కాని, మన మాటలు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చేవిగా, లేదా ఇతరులను దిగ జార్చేదిగా ఉండకూడదు. మన నైతికత మనకు సిబిల్ స్కోర్ లాంటిది. అది ఎంత ఎక్కువైతే అంత లాభిస్తుంది. అది ఎంత తక్కువైతే అంత పరోక్ష నష్టం వాటిల్లుతుంది. ఇటీవల కాలంలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై, ఆయన ప్రత్యర్థులు అతనిని ‘హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన తమ ప్రతివాదులను తిరిగి ఒక్క పరుషమైన మాట మాట్లాడక పోవడం చూపరులను ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. ఇది ఆయన సంస్కార స్థాయిని వ్యక్త పరుస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినవారు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారు. రాజకీయ నాయకులు వాడే అవాంఛనీయ భాష పార్టీల మధ్య కంటే, సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సామా న్యుడు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అలాగే నాయకులు భాషను భ్రష్టు పట్టించకుండా ఉండాలి. అదే భాషా ప్రేమికుల ఆశ. మాతృ దేవోభవ, పితృ దేవో భవ అనే సంస్కృతిలో పుట్టి పెరిగిన మనం అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మన సంస్కారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.భాషను మనం సునిశితంగా పరిశీలించినట్లయితే, భాషలో పబ్లిక్ భాష, ప్రైవేట్ భాష, తక్కువ స్థాయి భాష, ఎక్కువ స్థాయి భాష, ప్రజాస్వామ్య భాష అనే రకాలు న్నాయి. ప్రజల్లో మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక భాష మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భాష అనేది రెండు అంచులు గల కత్తి లాంటిది. మనం మంచిగా భాషను వాడితే సత్ఫలితాలనిస్తుంది. లేదంటే దుష్ఫలితాల నిస్తుంది. నాయకులు తమ నాయకత్వాన్ని వర్ధిల్ల చేసు కోవాలంటే, మంచి ‘భాషా శైలి’ ముఖ్యం అనే అంశాన్ని గ్రహించాలి.డా‘‘ యు. ఝాన్సీ వ్యాసకర్త తెలుగు అధ్యాపకురాలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, నూజివీడు -
ఇలా ‘భాషించారు’!
మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్‌గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్‌గేట్స్‌కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్‌ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట. భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్టాలిన్‌కు చైనా భాషలో శుభాకాంక్షలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాష్ట్ర బీజేపీ విభాగం శుక్రవారం చైనా భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘బీజేపీ తమిళనాడు విభాగం గౌరవ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది’అని ‘ఎక్స్’లో పేర్కొంది. అందులో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలై చిత్రాలు, ఆపక్కనే స్టాలిన్ చిత్రం కింద చైనీస్ భాషలో ఒక సందేశం ఉంది. రాష్ట్రంలో ఇస్రో కాంప్లెక్స్ సముదాయం ప్రారంభం సందర్భంగా ఇటీవల డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో చైనా జెండా కనిపించడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ మేరకు స్పందించడం విశేషం. అయితే, ఆ ప్రకటనలో పొరపాటున చైనా జెండా అచ్చయిందే తప్ప, ఉద్దేశపూ ర్వకంగా చేసింది కాదని ఆ ప్రకటన ఇచ్చిన మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
TS: సీఎం రేవంత్‌కు కడియం సవాల్
సాక్షి,వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ‘సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో. సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో తుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు. ఇదీ చదవండి.. తెలంగాణకు మరోసారి మోదీ.. రెండు రోజులు ఇక్కడే -
తెరమరుగవుతున్న తెలుగు లిపి!
దక్షిణాది భాషలైన తమిళ, మలయాల, కన్నడ, తెలుగు భాషలలో మన తెలుగు భాష తెరమగయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక రాను రాను ఇంగ్లీష్ భాష ప్రభావంతో పిచ్చి తెలుగుగా మారుతుందో లేక అర్థరహితమైన భాషగా మారిపోతుందో తెలియదు. ఏదో చేయాలనుకున్నా ప్రకటనలకే పరిమితవుతుందే తప్ప కార్యరూపం దాల్చే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే అది సాధ్యం కాదే కూడా. కనీసం ఇవాళ ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష గురించి దానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుందాం. ఈ విధంగానైన మన తెలుగు భాష, లిపి ఒక్కప్పుడూ ఉండేదని గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. నిజానికి ఒక లిపి ఏర్పడటానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. ఒక రాయి నీటిలో ఒరుసుకుని మొనదేలి గుండ్రంగా అయినట్లు మన తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఉంటుంది. అసలు మన వర్ణమాలలోని అక్షరాలను గమనిస్తే..'అ' అక్షరం నవ్వుతున్నట్లుగానూ, 'ఖ' అంక్షరం నెమలి పురివిప్పినట్లు, 'ఠ' అక్షరం బుగ్గన సొట్టలా ఎంత అందంగా ఉంటాయి. అలాగే వర్ణమాలలో అచ్చులు, హల్లులు ఏర్పడ్డ పద్దతి భాషను శాశ్వతంగా నిలిపేలా ఉంటుంది తెలుగు లిపి. మాట్లాడే భాష మొత్తం లిపి కాకపోవచ్చు కానీ దాదాపుగా మాట్లేడ భాషకు దగ్గర దగ్గరగానే వర్ణమాలలానే ఉంటుంది. అంతలా ఇమిడిపోయి ముత్యాల్లా ఉండే మన తెలుగు లిపి ఇప్పుడెందుకనో చాలామందికి వెగటుపుడుతోంది. అసహస్యించుకోవాల్సినవిగా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మన తెలుగుని తెలుగు లిపిలో రాస్తే బావుండు దాన్ని ఇంగ్లీష్‌లో రాసి తెగులు పట్టించేస్తున్నారు. ఇలా రాసి.. రాసి.. అసలు తెలుగు లిపి కాస్త ఇంగ్లీష్ మిక్స్డ్ తెలుగు లిపిగా మార్చేసి అర్థరహిత భాషగా తయారవ్వుతుందేమో! అని భాషావేత్తలు బాధపడుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయులంతటి వారే "తేనేలూరు తెలుగు భాష దేశా భాషలందు లెస్సా" అన్న మాట విలువలేనిదిగా అయ్యిపోతుందని ఆందోళన చెందుతున్నారు. మన మనుగడ కోసం, జీవనోపాధి రీత్యా, తప్పక ఇతర భాషలను నేర్చుకోవాలి. అలానే మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. అవసరం కూడా. అదే సమయంలో మన మాతృభాషకు తిలోదకాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయం. మన తల్లి లాంటి భాషని మనమే చంపేసుకోవడం సమంజసమా?. ఇలా తెలుగును ఇంగ్లీష్ లిపిలో రాసే సమస్య సినిమా పాటలకు కూడా అంటుకుంది. పక్క రాష్ట్రాల నుంచి సింగర్ల నుంచి తెప్పించుకుని పాటలు పాడిస్తారు. ఇక్కడే అసలైన సమస్య వస్తుంది. వారికి పాటా అర్థమయ్యేలా తెలుగులోని పాటనే ఇంగ్లీష్‌లో లిప్యంతరీకరణ చేసి కూనీ చేసేస్తారు. ఇక వారు దాన్ని చదివి ఉచ్ఛారణనే మార్చేసి కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. అంతేగాదు ఆ మహానుభావుల పాడిన పాటను నేర్చుకుంటూ మన వాళ్లు కూడా ఇలానే పలకాలేమో లేక సంగీతంలో ఇలా పలకాలేమో అన్నట్లుఫాలో అయిపోతున్నారు. ఇలా తెలుగు భాషను కూనీ చేయడం ఎంతవరకు వెళ్లిపోయిందంటే..రాబోయే తరాలను కన్ఫ్యూజ్ చేసి వద్దురా బాబాయో! అనేంతకు వచ్చేసింది. ఇలా మనలా మాతృ భాషను ఇంత దారుణంగా కూనీ చేస్తున్నావారెవ్వరూ ఉండరేమో!. ఇదంతా చూస్తుంటే ఇంకో రెండొందల ఏళ్లలోనే తెలుగు లిపి అదృశ్యమయ్యిపోతుందేమో!. మహా అయితే మాట్లాడే భాషగా ఇంకొంత కాలం బతకవచ్చేమో!. అది కూడా తెలుగు మాట్లాడే వాళ్లు బతికి ఉంటేనే. ఆ తర్వాత మన తెలుగు భాష తర్వాతితరాలకు శ్రీనాథుడి పద్యం వలే గందరగోళంగా ఉండొచ్చు. ఎవరో విడమరిచి చెబితే గానీ అర్థం కాకపోవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంగ్లీష్ మాట్లాడటం రాక తెలుగు మాట్లాడొచ్చేమో గానీ ప్రత్యేకంగా తెలుగు భాష మాట్లాడే వారు ఉండరేమో!. అంతేగాదు భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరనే భరోసా కూడా లేదు. కనీసం ఇలాంటి దినోత్సవం పేరుతో అయినా ఈ తెలుగు భాష వైభవం గురించి భావితరాలు తెలుసుకునేలా చేద్దాం!. ఎలాగో మనభాషను మనమే చేజేతులారా అంతం చేసుకుని నిరక్షరులుగా మిగిలిపోయే గొప్పోళ్లం కదా! మనం. కనీసం ఈ సందర్భంగానైనా మన తెలుగుని స్మరించుకుందాం. అలాగే తెలుగును తెలుగులో రాస్తే అమ్మభాష అని, ఇంగ్లీష్ లిపిలో రాస్తే అది అర్థరహితమైన చెత్త భాష అవుతుందని చెబుదాం!. తెలుగు తెరమరుగవ్వకుండా ఈ విధంగానైనా కాపాడుకుందాం. బావితరాలు కనీసం మన పూర్వీకులు ఈ తెలుగు భాషలో మాట్లాడేవారని, ఇది తెలుగు లిపి అని గుర్తించేలా చేద్దాం!. --పమిడికాల్వ మధుసూదన్ మొబైల్ నెం: 9989090018 (చదవండి: ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!) -
కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూషణల పర్వంపై వాడీ వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఆయన అన్నారు. బుధవారం ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా.. ఆయన మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపైనా తీవ్రంగా స్పందించారు. సీఎం భాషకు అభ్యంతరం చెబుతున్నారు కదా( అసెంబ్లీలో కడియం అభ్యంతరాన్ని ప్రస్తావిస్తూ..). మరి మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపై చర్చ చేద్ధామా?. కేసీఆర్ భాష కూడా సభ్యుల్ని అవమానించేలా ఉంది. ఓ మాజీ సీఎం అయ్యి ఉండి ఓ సీఎంను పట్టుకుని ఏం పీకడానికి పోయాడని అనొచ్చా?(నల్గొండ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి). ఇది పద్ధతా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బొక్కబోర్లా పడ్డా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని.. చర్చలకు రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు పారిపోయారని ఎద్దేవా చేశారాయన. .. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు ఫిలర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. రేపు సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. .. ప్రాజెక్టులపై చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేత పత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు. కాళేశ్వరం చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అని బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో సీఎం రేవంత్ నిలదీశారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. -
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు: కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు మొదలయ్యాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా(ನಾಮ ಫಲಕಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರ) ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. #WATCH | Bengaluru: Kannada Raksha Vedhike holds a protest demanding all businesses and enterprises in Karnataka to put nameplates in Kannada. pic.twitter.com/ZMX5s9iJd0 — ANI (@ANI) December 27, 2023 ఈ మధ్యే యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్ బ్యూటీఫుల్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు ఇచ్చింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా హోటల్స్‌పైనా కన్నడ సంఘాలు దాడులకు దిగాయి. ఇంగ్లీష్‌లో నేమ్ ప్లేట్స్ ఉన్న హోటళ్లలోకి దూసుకెళ్లాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉంటే.. దుకాణాలకు ఫిబ్రవరి చివరికల్లా కన్నడ భాషలో నేమ్ ప్లేట్స్ గనుక ఉండకపోతే చట్ట పరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది కూడా. -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్‌బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!
‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్‌కామ్స్ నుంచి చాట్‌జీపీటి టూల్స్ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది... సిట్కామ్ (సిచ్యువేషనల్ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్ స్పీచ్‌పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్కామ్లలోని విజువల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్కామ్స్లో కొన్ని... చీర్స్ (1982–1993) థీమ్ సాంగ్ ‘ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్’ నుంచి చివరి డైలాగ్ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్లలో కాకుండా ఒకటే లొకేషన్లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రైజర్ (1993–2004) చీర్స్లోని ఎపిసోడ్లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్ కష్టమేమీ కాదు. ఈ సిట్కామ్లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్ మార్టిన్ల క్లీన్ యాక్సెంట్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్’ నిండా ఇంటెలిజెంట్ హ్యూమర్ వినిపించి కనిపిస్తుంది. ది సింప్సన్స్ (1980) ది సింప్సన్ టీవీ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్ సిట్‌కామ్‌లో క్యారెక్టర్ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్‌పై ఉంటాయి. రియల్–లైఫ్ ఫ్రేజ్లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు. ది వండర్ ఇయర్స్ (1988–93) మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్ అర్నాల్డ్ అనే టీనేజర్ ప్రధాన పాత్రలో కనిపించే సిట్కామ్ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్ అతని ఫ్రెండ్స్ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్ ఆటోమేటిక్‌గా రిలేట్ అవుతారు. యంగ్ పీపుల్ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్–ఎయిర్ (1990–1996) ఈ హిట్ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్ విల్ స్మిత్. ఫన్నీ డైలాగులు, జోక్స్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ క్లాస్ స్పీకింగ్ ఇంగ్లిష్ నుంచి స్ట్రీట్ ఇంగ్లీష్ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ (1989–1998) ఈ సిట్‌కామ్‌లో కనిపించే రకరకాల ఎక్స్ప్రెషన్లు, గెశ్చర్ లెర్నర్న్కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్ ఇడియమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ది నానీ (1993–1999) రకరకాల యాక్సెంట్లను ఈ సిట్‌కామ్‌లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్కమ్స్ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్కామ్లు ఎన్నో ఉన్నాయి. అప్–టు–డేట్ ఇంగ్లిష్ లెసన్స్ ఫ్లాట్‌ఫామ్ ‘సెన్సేషన్ ఇంగ్లిష్’పై కూడా యూత్ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్ ద్వారా 5 లెవెల్స్‌లో భాషను మెరుగు పరుచుకోవచ్చు. ప్రాక్టీస్ యువర్ ఇంగ్లిష్ టుడే’ అంటోంది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్డ్ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్ప్రెషన్స్ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్ లెసన్స్, కాన్వర్జేషన్ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్ టాస్క్స్, సోషల్ లెర్నింగ్ గేమ్స్, లెర్నింగ్ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్ వరల్డ్స్ ఇమార్స్. లాంగ్వేజ్ లెర్నింగ్‌లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్డ్ కరికులమ్‌ను, లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్‌ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది. ఇంగ్లిష్ లిరిక్స్ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్ ప్రోనన్సియేషన్కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్ ప్రెస్లీ, మైకెల్ జాక్సన్ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు. ‘ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్ ఇన్ప్రోగ్రెస్. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!) -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!
మంచిర్యాల: ఆధునిక కాలంలో కాలానుగుణంగా తమ భాష, సంస్కృతి ఎక్కడ కనుమరుగవుతుందేమోనన్న తపనతో ఆదివాసీ కొలాం తెగ యువత ముందడుగు వేసింది. కొలామి భాష, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో వికీపీడియాను వేదికగా ఎంచుకున్నారు. భవిష్యత్ తరాలకు తమ భాష, సంస్కృతి, పదజాలం, జానపద పాటలు, నృత్య కళారూపాలు, చారిత్రాత్మక అస్తిత్వ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తూ తెలుగు లిపితో కొలాం భాషను వికీపీడియాలో పొందుపరుస్తూ.. పలువురు మన్ననలు పొందుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది వరకే ఉట్నూర్ కేబీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీవో పాల్గొని కొలామి భాషను వికీపీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయడంపై ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయి బోలిచేతో (భాష చైతన్యం) ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 46,677 మంది కొలాం జనాభా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన తెగ ఆదివాసీ కొలాం. వారి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కొలాం తెగకు చెందిన యువకులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి భాషను నేరుగా వికీపీడియాలోకి మార్చి తమ ఔనత్యాన్ని చాటుతున్నారు. కొలామి భాషతో పాటు మహానీయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల చరిత్రను కొలామిలో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. కొలాం సంస్కృతి.. గిరిజన తెగల్లో కొలాం సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కొలాం ఆదివాసీలు కొలిసే ఆరాధ్యదైవం భీమయ్యక్, నడిదమ్ము, ముత్తేలమ్మ, దండారీ, దూరడి, పొలకమ్మ దేవతులు ముఖ్యమైనవి. వివాహ వేడుకల్లో పాడే జానపదులు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం మహిళలు, పురుషులు ఉత్సవాల సందర్భంగా కొలామి మాతృభాషలో పాడే పాటలు, నృత్య కళారూపాలను కాలానుగుణంగా వివిధ ఉత్సవాలకు సంబంధించిన నృత్యాలు సేకరించి పొందుపర్చనున్నారు. కొలామి వికీపీడియా ప్రస్థానం.. కొలామి వికీపీడియాను జూన్ 28న నేతి సాయి కిరణ్ ప్రారంభించారు. ప్రపంచంలో లిపి లేని ఆదివాసీ భాషలు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. భాష పదజాలం కోసం సంస్కృతి పరిరక్షణకు బోలిచేతో ఫౌండేషన్ స్థాపించారు సాయికిరణ్. భాష కోసం, ఆదివాసీలు సంస్కృతిక పంటలైన చిరుధాన్యాల బాహ్య ప్రపంచానికి తెలియచేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతరిస్తున్న భాషలపై పరిశోధన.. యునెస్కో ప్రకారం ప్రపంచంలో 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితాలోని చాలా భాషలు అంతరిస్తున్నాయి. వైవిధ్యంగా ఉన్న భాషలు ప్రపంచ భాష వైవిధ్యతను కోల్పోయే దిశలో ఉన్నాయి. భాషను డిజిటల్ మాద్యమాల ద్వారా పునరుద్ధరణ చేయడమే నా లక్ష్యం. – నేతి సాయికిరణ్, తెలుగు వికీపీడియా, బోలిచేతో ఫౌండేషన్, వ్యవస్థాపకుడు, అస్సాం భవిష్యత్‌కు కొలామి వికీపీడియా అవసరం.. తెలుగు వికీపీడియాలోని తెలంగాణలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేస్తున్నాం. సమకాలిన అంశాలపై రచనలు కొనసాగుతున్నాయి. వికీ బుక్స్‌లో నేను రచించిన కొలాం వీరుడు కుమురం సూరు, దండారీ కై తికాలు, దంతన్‌పల్లి భీమయ్యక్ మహాత్మ్యం, మోతీరాము శతకం పుస్తకాలు పొందుపర్చుతాను. – ఆత్రం మోతీరాం, కొలామి వికీపీడియా, కవి మా జీవన విధానాన్ని వికీలో భద్రపరుస్తాం.. మా కొలాం సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు, దేవుళ్లు, జానపద నృత్యాలు, పాటలు, మా చరిత్రాత్మక స్థానాలు, మా జీవన విధానం, పల్లెలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వికీ కామన్స్‌లో భద్రపరుస్తాను. – ఆత్రం రాజ్‌కుమార్, కొలామి వికీపీడియా ఇష్టంతో అనువాదం.. తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేయడం నాకెంతో ఇష్టం. జాతీయ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో తెలుగు లిపితో అనువాదం చేస్తున్నాం. మా మాతృభాష కొలామి భాషకు సేవా చేయడం నాకెంతో గర్వకారణం. – మడావి జంగు, కొలామి వికీపీడియా వికీపీడియాలోకి.. తెలుగు లిపిని అలంబన చేస్తూ కొలామి భాషకు జీవం పోసి వందలాది వ్యాసాలతో ముందుకు సాగుతూ అంతర్జాతీయ వేదికగా నిర్మితమవుతున్న కొలామి వికీపీడియా అక్షర సేద్యంగా నిలువనుంది. కొలాం తెగ ప్రజలు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో నివసిస్తున్నారు. వీరిది ద్రావిడ భాష అయినా కొలామి భాషను మాట్లాడతారు. ప్రభుత్వ రికార్డుల్లో కొలామ్స్ అని నమోదు చేసింది. -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
ప్రపంచంలో ఎక్కడా లేదు.. ఆ వీధిలో అడుగుపెడితే 70 భాషలు వినిపిస్తాయ్!
ప్రపంచంలోని చాలా నగరాల్లో బహుభాషలు వినిపిస్తుంటాయి. నగర విస్తీర్ణం, ప్రాధాన్యం బట్టి అలా వినిపించే భాషలు పదుల సంఖ్యలో ఉండటమూ మామూలే! చిన్నా చితకా పట్టణాల్లోనైతే సాధారణంగా రెండు మూడు భాషలు; మహా అయితే, అరడజను భాషలు వినిపిస్తాయి. బ్రిటన్‌లోని ఒక చిన్న నగరంలో ఉన్న ఆ వీథి భాషావైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ వీథిలోకి అడుగుపెడితే, ఏకంగా డెబ్బయి భాషలు వినిపిస్తాయి. ఇంతటి భాషా వైవిధ్యమున్న వీథి ప్రపంచంలోని మరే నగరంలోనూ, పట్టణంలోనూ లేదు. ఇంతటి వైవిధ్యభరితమైన వీథి బ్రిటన్‌లోని గ్లూసెస్టర్ నగరంలో ఉంది. ఈ నగర జనాభా 1.32 లక్షలు. ఈ నగరంలోని బార్టన్ స్ట్రీట్‌లో రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన వారు, నానా దేశాల వారు నివాసం ఉంటుంటారు. ఈ వీథి సందుల్లో పేదలు ఉండే నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ స్థానిక ఇంగ్లిష్ ప్రజలతో పాటు తూర్పు యూరోప్‌లోని నానా దేశాల వారు, కరీబియన్ దీవుల నుంచి వచ్చినవారు, ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన వారు, మన భారతీయులు ఉంటుంటారు. ఈ వీథిలో పశ్చిమాసియా నుంచి వలస వచ్చిన ముస్లింలు పెద్దసంఖ్యలోనే కనిపిస్తారు. ఇక్కడి వారు బయట ఇంగ్లిష్ మాట్లాడినా, ఇళ్లల్లో తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ వీథిలో కనిపించే భాషావైవిధ్యం ఇంకెక్కడా కనిపించదని ఇక్కడి స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు. -
భాషలను కాపాడుకోవాలి
‘భాష మన ఆలోచనలకు వాహకం మాత్రమే కాదు, మన ఆలోచనా సరళికి దోహదపడే గొప్ప పరికరం కూడా’ అన్నాడు బ్రిటిష్ ఆవిష్కర్త హంఫ్రీ డేవీ. ప్రస్తుత ప్రపంచంలో దాదాపు ఐదువేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. వాటిలో మూడోవంతు కేవలం ఆఫ్రికా ఖండంలోనే మనుగడలో ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడువేలకు పైగా భాషలు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మన దేశంలోనే 192 భాషలు కొన ఊపిరితో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. మన దేశంలో ఇప్పుడు 780 భాషలు మనుగడలో ఉన్నాయి. పాపువా న్యూగినీ విస్తీర్ణంలోను, జనాభా లోను చిన్న దేశమే అయినా, అక్కడ ఏకంగా 840 భాషలు మనుగడలో ఉన్నాయి. మన రాజ్యాంగం ఇరవైరెండు భాషలను గుర్తించింది. ప్రస్తుత ప్రపంచంలో రకరకాల భాషా కుటుంబాలకు చెందిన భాషలు మనుగడలో ఉన్నాయి. వాటిలో కొన్ని బలంగా ఉనికి చాటుకోగలుగుతున్నాయి. ఇంకొన్ని, క్రమంగా మరుగునపడే స్థితికి చేరుకుంటున్నాయి. భాష పుట్టుక గురించిన కచ్చితమైన వాస్తవాలు చరిత్రలో నమోదు కాలేదు. సమూహాలు సమూహాలుగా విడిపోయిన భాషా కుటుంబాలన్నీ ఒకే మూలభాష నుంచి విడివడిపోయినవనీ, ఒక్కో భాషా కుటుంబం నుంచి వేర్వేరు భాషలు పుట్టా యనీ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. అన్ని భాషలకు మూలమైన తొలి భాష ఎప్పుడు ఎలా పుట్టిందో, ఎప్పుడు ఎలా అంతరించిపోయిందో చెప్పడానికి సరైన ఆధారాల్లేవు. మానవ సమూహాలు మనుగడ కోసం నేల నలు చెరగులా విస్తరించిన క్రమంలో ఏర్పడిన వేర్వేరు భాషా కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన భాషల గురించిన సమాచారం మాత్రమే మనకు తెలుసు. ‘తన సొంత భాషను ప్రేమించని వాడు జంతువు కన్నా, దుర్గంధం వెదజల్లే చేప కన్నా నీచమైన వాడు’ అన్నాడు ఫిలిప్పినో రచయిత జోస్ రిజాల్. పుట్టి పెరిగిన నేలను, తొలి పలుకులు నేర్చిన మాతృభాషను ప్రేమించని వాళ్లు అరుదు. మాతృభాషల మనుగడ కోసం ప్రజలు రాజకీయ ఉద్యమాలు, ఆందోళనలు సాగించిన సందర్భాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇదివరకు తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నకాలంలో అక్కడి ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దే ప్రయత్నాలు జరిగాయి. మిగిలిన జనాల కంటే భాషాభిమానం కాస్త ఎక్కువ మోతాదులో ఉన్న బెంగాలీలు దీనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. తమ భాషకు గుర్తింపు కోసం పోరాటం సాగించారు. వారు తమ భాషకు గుర్తింపునే కాదు, స్వతంత్ర దేశాన్ని కూడా సాధించుకున్నారు. బెంగాలీలు తమ భాష కోసం పోరాటం ప్రారంభించిన ఫిబ్రవరి 21వ తేదీని ‘యూనెస్కో’ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకునే భాషలన్నింటి సంరక్షణ, పరిరక్షణలే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ధ్యేయమని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2007 మే 16న ప్రకటించింది. భాషల సంరక్షణ, పరిరక్షణల బాధ్యతను ఐక్యరాజ్య సమితి నెరవేర్చలేదు. ఆ బాధ్యతను నెరవేర్చాల్సింది వివిధ దేశాల ప్రభుత్వాలే! ఒక భాషలో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు ఆ భాష అంతరించిపోతుంది. ఒక భాష అంతరిస్తే, ఆ భాషకు చెందిన సంస్కృతీ సాహిత్యాలు కూడా అంతరించిపోతాయి. వలస రాజ్యాలు మొదలైన తర్వాత ప్రపంచంలో చాలా భాషలే అంతరించిపోయాయి. ‘ఒక జాతిని అంతమొందించాలంటే, ఆ జాతి మాట్లాడే భాషను అంతమొందించాలి’ అనే నానుడి ఉంది. ఖండాంతరాలకు పాకి వలస రాజ్యాలను స్థాపించుకున్న పాలకులు చాలావరకు చేసిన పని ఇదే! ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్, పోర్చుగీస్ తదితర యూరోపియన్ వలస రాజ్యాల్లో వందలాది స్థానిక భాషలు కనుమరుగైపోయాయి. వలస రాజ్యాల కాలంలో బలవంతులైన పాలకుల భాషలకు విపరీతంగా ప్రాబల్యం పెరిగింది. ఉపాధి కోసం పాలకుల భాషలను నేర్చుకోవడం జనాలకు అనివార్యంగా మారింది. తమ తమ మాతృభాషలను కాపాడుకోవడం పెను సవాలుగా మారింది. రెండు మూడు తరాలు గడిచే సరికి చాలా భాషలు కొడిగట్టిపోయాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, యూరోపియన్ వలస పాలకుల దెబ్బకు గడచిన నాలుగు శతాబ్దాల్లో కేవలం ఉత్తర అమెరికాలోనే దాదాపు రెండువందలకు పైగా స్థానిక భాషలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషకు చెందిన సంస్కృతి అంతరించిపోతుంది. ఆ భాషలో నిక్షిప్తమైన జ్ఞానసంపద కనుమరుగైపోతుంది. ఒక్కొక్కసారి ఒక నాగరికత సైతం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఆ భాషా సంస్కృతులకు చరిత్రతో లంకె తెగి పోతుంది. ఒకటికి మించిన భాషలను నేర్చుకోవడం, ఒక భాష నుంచి మరొక భాషకు సాహితీ సంపదను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా భాషలు చిరకాలం మనుగడ సాగించగలుగుతాయి. ‘నా భాష పరిమితులంటే, నా ప్రపంచం పరిమితులే’ అన్నాడు ఆస్ట్రియన్ తత్త్వవేత్త లుడ్విగ్ విట్గెన్స్టీన్. ఒకటికి మించిన భాషలు తెలిసి ఉన్నప్పుడు లేదా ఒకటికి మించిన భాషల్లోని సాహిత్యం మన భాషలోనే మనకు అందుబాటులో ఉండటం జరిగినప్పుడు మన పరిమితులు తొలగి, మన ప్రపంచం మరింతగా విస్తరిస్తుంది. బహుశా ఇందుకే కాబోలు ‘ఇంకో భాష తెలిసి ఉండటమంటే, రెండో ఆత్మను కలిగి ఉండటమే’ అన్నాడు రోమన్ చక్రవర్తి షాలమేన్. మనం మన చరిత్రను కాపాడుకోవాలంటే, మన భాషలను కాపాడుకోవడమే మార్గం. -
ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!
మనుషుల మధ్య అంతరాలను పెంచుతున్నప్పుడు అందరం కలిసి మానవీయ సమాజాన్ని కాపాడు కోవాలి. ఏకమైతేనే నిలుస్తామన్న సత్యానికి అల్లుకుపోవాలి. విడి విడిగా విడిపోతే మనకు మనంగా కృంగిపోతాం. సామూహిక తత్వం నశించిపోయిన వ్యవస్థ గడ్డకట్టుకు పోతుంది. కరోనా కాలంలో మాస్క్నే భరించలేని వాళ్ళం మనుషుల మధ్య దూరాలను పెంచుకొని ఎట్లా బతుకుతాం! మనుషులుగా మనం ఎడం ఎడంగా, ఎడమొఖం పెడమొఖంగా, గోడకు కొట్టిన మేకుల్లాగా విడిపోయి ఎట్లా జీవించగలం! వేష భాషలు ఎన్ని ఉన్నా, ఈ ప్రపంచానికి మహా బోధితత్వపు సంఘజీవన భాష ఉంది. మనిషిని మనిషి ద్వేషించుకునే విద్వేష భావజాలం చాలా ప్రమాద కరమైనది. విభిన్న తత్వాల కలయికగా ఉన్న దేశ ప్రజలు... ద్వేషరూపులుగా మారితే మిగిలేది బూడిదే కదా! నువ్వూ నేను, వాడు వీడు, అతను ఆమె ... అందరం పిల్లల మనసులపై కుల విభజన రేఖలు, మతం పచ్చ బొట్లు పొడిస్తే సమతుల్యత అల్ల కల్లోలమై సమాజం గందరంగోళం కాదా? దేన్నైనా భరిస్తాం. దేన్నైనా సహిస్తాం. మన ఇంటి వెనుక, ఇంటి ముందు ఎవరికి వాళ్లుగా కలువలేని గోడలను కట్టుకుంటే మనందరం బావిలో కప్పలుగా మారిపోతాం. ఇట్లే ఎవరి కులం వారిదనీ, ఎవరి మతం వారిదనీ; రంగు, రూపు, ఊరు, వాడ పేర్లతో విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఆటవిక సమాజ మూలాల దగ్గరకు పోతాం. వేల సంవత్సరాల సాంస్కృతిక మానవ పరిణామ క్రమాన్నీ, మన ఐకమత్య సమాజ ఉన్నత తత్వాన్నీ... విభేదాల, విద్వేషాల పేరుతో మనకు మనమే కూల్చుకుంటూ పోతే చివరకు మిగిలేదేమిటి? మానవ సంబంధాల వనంలో మానవీయ ప్రేమ మొక్కలు నాటటానికి మారుగా విద్వేషపు మొక్కలు నాటితే దేశమే విద్వేషాల కుంపటిగా మారుతుంది. సమస్త వృత్తుల, సకల కులాల, మతాల ఐక్యమత్య సమాజాన్ని విభజించి చూడగలమా? హుస్సేన్ సాగర్ కీవల ఆవల, గండిపేటకు అటువైపు ఇటువైపు, చార్మినార్‌కు ముందు వెనక బెర్రలు గీసి.. మసీదుకు, మందిరానికి భేదాలు పెట్టి; చర్చిలకు, గుళ్లకు పోటీలు పెట్టి చూసే దుస్థితిని ఊహల దరిదాపులకు సైతం రానివ్వలేం కదా! గుడి, మసీదు, చర్చి అన్నీ ఒకటే. నమ్మకాలు, విశ్వాసాలన్నీ ఎవరి మదిలో వాళ్ళం భద్రంగా గుండె గుండెల్లో దాచు కుందాం. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరి వేషధారణలు వారివి. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి భాషలు వారివి. దేవుళ్ళందరూ ఒకటే. మనుషులందరూ సమానమేనన్న సర్వమత సమానత్వ లౌకికతత్వం మన దేశానికి ప్రాణవాయువు. దాన్ని రక్షించుకుందాం. పరిరక్షించుకుందాం. పరమత సహనం పవిత్ర జెండాగా, మనందరి సామూహిక లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదాం. కలలో కూడా మన మానవీయ సమాజ గూడుపై ఎవరు చెయ్యేసినా వదిలేది లేదు. ‘గంగా జమునా తెహాజీబ్’ అని గొప్పగా కీర్తించబడ్డ ఈ నేల మీద మత ముద్రల విభజనలను గీస్తే సహిస్తామా? ఐకమత్య దారులపైనే అభివృద్ధి సగర్వంగా నడుచుకుంటూ పోతుంది. మనందరం ఐకమత్య సమాజానికి చిహ్నాలుగా నిలవాలి. సోదరభావంతో ఎదగాలి. అందర్నీ ఆదరించి అక్కున చేర్చుకునే హైదరాబాద్ మహాసంస్కృతి ఇంకో వేయ్యేళ్లు వర్ధిల్లే విధంగా మనందరం మానవీయ మహా మొక్కల్ని ఎద ఎదలో నాటడాన్ని ఒక మహోద్యమంగా చేపడదాం. విభిన్న సంస్కృతుల సంగమ స్థలిని విష సంస్కృతుల కూడలిగా మార్చే కుట్రలను తిప్పికొడదాం. తెలంగాణ అంటే కలిసి జీవించే ఆత్మీయతల అలయ్ బలాయ్ సంస్కృతి. సబ్బండ వర్ణాల ఐక్య సంస్కృతే తెలంగాణ అసలు అస్తిత్వం. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చెదరగొట్టే కుట్రలు ఎవరు చేసినా వారిని తెలంగాణ సమాజం విడిచిపెట్టదని గుర్తుపెట్టుకోవాలి. తెగించి తెలంగాణను బెర్రగీసి తెచ్చుకున్నోళ్లం సమాజాన్ని ఛిద్రంచేసే మత దురహంకారాన్ని తిప్పికొట్టి తీరాలి. విచ్ఛిన్నకర మత, కుల ఆధిపత్య కుట్రలను చూసి తెలంగాణ విలపిస్తోంది. సమూహాల, గుంపుల తలలు లెక్కలు కట్టుకొని; పోటీపెట్టి, విద్వేషాల్ని రెచ్చగొడుతున్న విచ్ఛిన్నకర శక్తుల్ని చూసి తెలంగాణ తల్లడిల్లుతోంది. సబ్బండ వర్ణాల సంస్కృతిని పరిరక్షించుకోవటానికి తెలంగాణలో జరగాల్సిందేమిటో అభ్యుదయ తెలంగాణ సమాజమే నిర్ణయించుకుని ముందుకు సాగుతది. అలసత్వం వద్దు. చూద్దాంలే చూసుకుంటూ కాసేపా గుదాం అనుకోవద్దు. నాకెందుకులే, మనకెందుకులే, నాదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అందరూ అయిపోయినాక ఆ మతభూతం చివరివానిగా నిన్ను కూడా వదిలిపెట్టదు. విషవాయువులు వ్యాపించిన ప్రాంతమంతా విషకోరల బారిన పడకతప్పదు. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు పెట్టుకోవాలి. కన్నీళ్లను తుడుచుకుని, ఇప్పటిదాకా పడ్డ కష్టాల పట్టె నుంచి బైట పడుతూ, నెర్రలు బాసిన నేలల్లో పచ్చటి పంటలను చూసి పరవశిస్తూ ముందుకు సాగుతోంది తెలంగాణ. కలహాల చిచ్చులు పెడ్తున్న కుట్రపూరిత రాజకీయ మత పిచ్చిగాళ్ల నుంచి తక్షణం ఈ నేలను రక్షించుకోవాలి. తెలంగాణను కలహాల రణస్థలంగా మార్చే వారిని గుర్తుపట్టాలి. ఆదర్శాలకు అగ్గి పెట్టేవాళ్ల నుంచి తెలంగాణను కాపాడుకోవాలే! (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) ‘మనిషిని ద్వేషించడానికి సరిపడా మతం వుంది మనకు. ప్రేమించడానికి కావలసినంత మతం లేదు’ అన్నాడు జోనాథన్ స్విఫ్ట్. అంటే మనుషులు మను షులుగా బతకడానికి ఇప్పుడున్న మతం సరిపోదు. కాస్త ప్రేమను అరువు తెచ్చుకోవాలి. మనిషిని మనిషితో కలిపి కుట్టే కన్నీటి దారం పేరు ప్రేమ. మనిషిని మనిషితో కలిపి బంధించే ఆనంద ఉద్వేగం పేరు ప్రేమ. ఇప్పుడు మరింత ప్రేమ కావాలి! మరింత సహనం కావాలి!! (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - జూలూరు గౌరీశంకర్ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు
ఒకే దేశం, ఒకే భాష పేరుతో గతంలో హిందీని ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రాంతీయ భాషా రాగం అందుకున్నారు. భారతీయుల ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రజానీకాన్ని వెనుకబాటుతనంలో ఉంచే సిద్ధాంతం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం అర్థం చేసుకుంది. ఈ అవగాహనతోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాయి. ఇంగ్లిష్ వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ఏపీ ప్రజానీకం చూస్తోంది. అదే రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓట్లు తేనుంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా టీఆర్ఎస్ ఇంకా మల్చుకోవాల్సి ఉంది. ఒకే దేశం, ఒకే భాష సూత్రానికి నిరంతర సమర్థకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరించి ఎక్కువ కాలం కాలేదు. ఆ ఒకే భాషగా హిందీని షా పదేపదే ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రతిపాదన పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడం; ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కూడా అన్ని భారతీయ భాషలూ సమాన ప్రాధాన్యత కలిగినట్టివే అని ప్రకటించడంతో అమిత్ షా కాస్తా గేర్లు మార్చారు. మోదీ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలకు ప్రధాని అభ్యర్థి అమిత్ షాయేనని అన్ని సంకేతాలూ వెలువడుతున్నాయి. భారతీయ ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అనే అభిప్రా యాన్ని ఆయన కలిగివున్నారు. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపీ) రెండో వార్షికోత్సవం సందర్భంగా అమిత్ షా ఆగస్టు 19న ఢిల్లీలో మాట్లాడారు. న్యాయ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్ వంటివాటిని భారతీయ భాషల్లోనే బోధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైనా తమ సొంత భాషలో ఆలోచించినప్పుడే పరిశోధన, అభివృద్ధి సాధ్యపడతాయన్నారు. సొంత భాషలో ఆలోచించకపోవడమే పరిశోధనా రంగంలో భారత్ వెనుకబడి ఉండటానికి ఒక కారణంగా చూపారు.ప్రత్యేకించి కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలమని ఆరెస్సెస్, బీజేపీ కూటమి పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ కొత్త సిద్ధాంతంతో అమిత్ షా దక్షిణాదిలో కూడా ఆమోద నీయమైన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించిన చైతన్యం గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో మరింత ఎక్కువగా విస్తరించింది. అంత ర్జాతీయ ఉపాధి మార్కెట్లలో స్థానం సంపాదించాలని దక్షిణాదిలోని ప్రతి గ్రామమూ ఆకలిగొని ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ప్రాంతీయభాషా ప్రాతిపదికన ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ వీరిని తమ భాషా రాష్ట్రాన్ని దాటి ముందుకు పోనీయడం లేదు. అదే సమయంలో ఎగువ, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే ప్రాంతీయ భాషా విద్యను దాటి ముందుకెళ్లిపోయాయి. వారిలోని ఈ కొత్త శక్తికీ, అధికార సంపదలకూ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యే ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు వీరు ప్రాంతీయ భాషా విద్య వైపు వెనక్కు మళ్లరు. ఈ అవగాహనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యవైపు మరలేట్టు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం తిరిగి తెలుగుకు మారుతుందా? అమిత్ షా ఆంతర్యం సరిగ్గా ఇదే మరి. కానీ అదే జరిగితే తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ వర్గాలు దెబ్బతిని పోతాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెలుగుకు మళ్లితే– రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆగిపోవడం కంటే కూడా ఎక్కువ ప్రతికూలతను అది ప్రజల మీద కలిగిస్తుంది. తన కుమారుడైన జయ్ షాను ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివించిన అమిత్ షాకు... తన కార్పొరేట్ స్నేహితు లందరూ సంపన్నుల కోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభిస్తున్నారని చక్కగా తెలుసు. అమిత్ షా ప్రాంతీయ భాషా విద్యా అజెండా ఈ సంపన్నుల కోసం ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ భాషల్లోనే తమ పిల్లలను చదివిం చాలని గ్రామీణ ప్రజానీకాన్ని కోరడం ద్వారా, భాషా ప్రయోజనాలు ఏవీ పొందలేని చారిత్రక వెనుకబాటుతనంలో వీరిని ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. నాణ్యమైన వసతులు, బోధనా సిబ్బందితో కూడిన ఇంగ్లిష్ మీడియం చదువు అంతర్జాతీయంగా అనుసంధానం కలిగి ఉండి, నాణ్యమైన జాతి నిర్మాణానికి పెట్టుబడిగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ద్వారా విద్యాపరమైన సమానత్వం సాధించడానికి ఆరెస్సెస్, బీజేపీ కూటమి వ్యతిరేకం. ఇంగ్లిష్‌ను రహస్యంగా ఉపయోగిస్తూ, సంస్కృతం, హిందీని వీరు సైద్ధాంతి కంగా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లుగా ప్రజానీకం అంతర్జాతీయ అనుసంధానం కలిగిన నాణ్యమైన విద్యకు మద్దతు తెలుపుతున్నారు. పరిశోధన, వైద్యం, ఇంజనీరింగ్, తదితర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే సాగించాలని అమిత్ షా చెబుతున్న సిద్ధాంతం ఆ వ్యవస్థలో భాగమైన వారికి విధ్వంసకరంగా పరిణమిస్తుంది. తెలంగాణలోని పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగపర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయవలసింది చాలానే ఉన్నప్పటికీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం సైద్ధాంతికంగా చదువులో సమానత్వం వైపు వేసిన తొలి అడుగు. కానీ తాము ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా బీజేపీ విద్యా విధానం ఉందని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ పాఠశాల విద్యా వ్యవస్థ గురించిన ప్రచారం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడవేసిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీని విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయి ప్రచారంగా మలిచారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, ప్రత్యేకించి ఇంగ్లిష్ వ్యతిరేకి అయిన అమిత్ షాతో, సాధార ణంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో పోరాటానికి తగిన శక్తిమంతమైన సైద్ధాంతిక సంక్షేమ పథకంగా దీన్ని టీఆర్ఎస్ పరిగణించడం లేదు. ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉన్న అరకొర అవగాహన కారణంగా అతి పెద్ద సంఖ్యలో ఓట్లు రాబట్టే శక్తిగా దాన్ని గుర్తించడం లేదు. దక్షిణాదిలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే... ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసు కున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కొంత శాతం మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండగా, జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఏపీలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కూడా వైఎస్ జగన్ సంవత్సరం క్రితం ప్రకటించారు. అమ్మ ఒడి పథకంతో కూడిన ఇంగ్లిష్ విద్య కారణంగా ఏపీలో టీడీపీ సంకటస్థితిలో పడిపోయింది. పిల్లలందరికీ మెరుగైన ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య అనేది ‘ఉచితాల’లో భాగమేనని ఆరోపించడానికి ఎవరూ సాహసించలేరు. పాఠశాల విద్యపై పెట్టే వ్యయాన్ని ‘ఉచితాలు’ అని చెప్పి ఏ కోర్టూ, ఏ శాసన సభ కూడా ఖండించలేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య 2024లో భారీ స్థాయిలో ఓట్లను సమీకరించబోతోంది. ప్రధానంగా స్కూల్ విద్యపై వైఎస్ జగన్ రోజువారీ ప్రాతిపదికన చేసిన పోరాటం కారణంగా టీడీపీ, బీజేపీ రెండింటికీ పరాజయాలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇంగ్లిష్ విద్య వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ప్రజానీకం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పోరాటమే... తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేసింది. కానీ దీన్ని ఇంకా ఓట్లుగా మల్చుకోవడం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా తన పాఠ శాల విద్యకు సంబంధించి సరైన ప్రచారం చేసుకోగలిగితే, ప్రతి తల్లీ తన పిల్లల శత్రువును ఓడించడానికి పోలింగ్ బూతుకు వెళ్తుంది. ప్రతి గ్రామీణ మహిళా కూడా అమిత్ షా కంటే ఉత్తమమైన జాతీయవాది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా..
‘ఓ నటిగా భాషాపరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్ కాలేదు’ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ– ‘‘రాత్రికి రాత్రే నాకు సక్సెస్ రాలేదు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్‌పై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన నా ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది ఈ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు. కాగా రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రాలు ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘వారసుడు’, ‘యానిమల్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు రష్మిక. -
PM Modi: ప్రధాని కామెంట్లపై కిచ్చా సుదీప్ స్పందన
బెంగళూరు: హిందీ భాషాధిపత్య వ్యవహారం.. రాజకీయంగా ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణం అయ్యింది. ఈ విషయంలో కన్నడ స్టార్ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ మధ్య జరిగిన ట్వీట్ల రచ్చ జరిగింది. ఒకానొక దశలో ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో అనిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ఆదిపత్య రగడపై పరోక్షంగా స్పందించారు. దేశంలోని ప్రతి భాషను బీజేపీ సంప్రదాయ ప్రతిబింబంగానే చూస్తుందని, ప్రతీ భాషను గౌరవిస్తుందని అన్నారు. భాషా ప్రతిపాదికన వివాదాలు ప్రేరేపించే అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ తరుణంలో.. ప్రధాని ఇలాంటి ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు. ‘‘ప్రతీ ఒక్కరూ తమ భాషను గొప్పగా భావించాలి. ఆయన(ప్రధాని) ఇలా మాట్లాడటాన్ని గౌరవిస్తున్నా. ఇది అన్ని భాషలకు సంబంధించి విషయం. కేవలం కన్నడ గురించి మాత్రమే నేనేం మాట్లాడలేదు. ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని కేవలం ఒక రాజకీయవేత్తగా మాత్రమే చూడొద్దు.. ఈ వ్యాఖ్యలతో ఆయన్ని ఒక నేతగా చూడాల్సిన అవసరం ఉంది’’ అని సుదీప్ అభిప్రాయపడ్డాడు. ఏదో చర్చ జరగాలనో, గొడవలు జరగాలనో నేను ప్రారంభించలేదు. ఎలాంటి ఎజెండా లేకుండానే అలా జరిగిపోయింది. నా అభిప్రాయం మాత్రమే వినిపించా. ఇప్పుడు ప్రధాని నోట నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంతోషంగా ఉంది అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సుదీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: చిచ్చు పెట్టిన ‘హిందీ’ భాష -
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన తానా పూర్వ అధ్యక్షుడు
సాక్షి, నెల్లూరు: ‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’ తెలుగు భాషా అభివృద్ధికి గొప్ప కృషి చేస్తుండడం ప్రసంశనీయమని తానా పూర్వ అధ్యక్షులైన డా.తోటకూర ప్రసాద్ అన్నారు. బుధవారం నాడు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల వివరాల్ని ఆయన పరిశీలించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య డి. మునిరత్నం నాయుడు కేంద్రంలో పూర్వం జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే ప్రాజెక్టుల వివరాల్ని వాటి ఉద్దేశ్యాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత డా. తోటకూర ప్రసాద్ అక్కడి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ...తానా అనే సంస్థ తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న కృషిని కూలంకషంగా వివరించారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను చదువుతున్న విద్యార్థులకు, పరిశోధకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంతో కలిసి పనిచేస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా మాతృభాషా ఔన్నత్యాన్ని దశదిశల వ్యాపింపజేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషిని చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, విద్యాత్మక సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంగ్లంతోనే అనుసంధానం
సుమారు 1500 సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా మూడు తెగలు మాత్రమే ఆంగ్లాన్ని మాట్లాడేవి. ఈ రోజు అనేక దేశాలలో ఆంగ్లం అధికార భాషగా చలామణి అవుతోంది. పది దేశాలలో ఇది ప్రత్యేక భాష హోదా పొందింది. దాదాపు వందకు పైగా దేశాలలో ఇంగ్లిష్ ప్రథమ భాషగా ఉంది. కోట్లాది మంది ప్రజలు ఇంగ్లిష్‌ను మాతృభాషగా కలిగి ఉన్నారు. ఒకప్పుడు గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, సంస్కృతం గొప్ప భాషలుగా, రాజ భాషలుగా చలామణి అయ్యాయి. బ్రిటిష్ వారు అనుసరించిన వలస విధానం వలన ఆంగ్లం అంతర్జాతీయ భాషగా ఎదిగింది. షేక్స్పియర్, జీబీ షా, టీఎస్ ఇలియట్ వంటి ఎందరో రచయితలు ఆంగ్లంలో గొప్ప రచనలు చేసి ఆంగ్లభాషకి వన్నె తెచ్చారు. ఆక్స్ఫర్డ్ నిఘంటవులో ప్రతి సంవత్సరం 1000కి పైగా పదాలు కొత్తగా చేరతాయి. మధ్యయుగంలో సామ్రాజ్య వాదానికీ, మత వ్యాప్తికీ ఆంగ్లం దోహదపడగా; ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాలకు ఊతం ఇచ్చింది. రవీంద్రనాధ్ టాగూర్, ఆర్కే నారాయణన్, సరోజినీ నాయుడు వంటి భారతీయ రచయితలు ఇంగ్లిష్‌లో రచనలు చేసి ఆ భాషని సుసంపన్నం చేశారు. ఏ భాషకైనా రచనలే ఊపిరి. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం) అయితే ఆంగ్ల భాషా ప్రవాహంలో ప్రాంతీయ భాషలు కొట్టుకుపోకుండా చూడాలి. పేద విద్యార్థులకు ఆంగ్లంలో నాణ్యమైన విద్య అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు నిఘంటువులని పంపిణీ చేస్తున్నది. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంగ్లాన్ని ఉద్యోగ ఉపాధి వనరులని కల్పించే భాషగానే చూడకుండా ప్రపంచ చరిత్ర, వర్తమాన పరిస్థితులు తెలుసుకునేందుకు ఉపయోగపడే అనుసంధాన భాషగా చూడాలి. – ఎం. రాంప్రదీప్ ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్, తిరువూరు (ఏప్రిల్ 23న ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం) -
ఒక్క భాషకు పెత్తనమా?
దేశంలో హిందీకి పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా 1970 లలో పెద్ద ఉద్యమమే సాగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ తెరపైకి తేవడంతో వాతా వరణం వేడెక్కింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని వాడాలని అమిత్ షా చేసిన ప్రతిపాదనపై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపించింది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో హిందీని అనుసంధాన లేదా ‘అధికార భాష’గా అంగీకరించడానికి ప్రజలు సానుకూలంగా లేరు. డీఎంకే అధినేత దివంగత కరుణానిధి నాయకత్వంలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఉద్యమ ప్రభావం సమసి పోలేదు. నేటి అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌పై శ్రద్ధ వహించాలన్న ఆకాంక్ష తల్లిదండ్రులలోనూ వ్యక్తమవుతోంది. ఉన్నతస్థాయి చదువులు చదివినా తగిన ఉద్యోగాలు స్వదేశంలో లభించడం లేదని భావిస్తున్న యువత విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లిష్ అంతర్జాతీయ అనుసంధాన భాషగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండే ఇంగ్లిష్ బోధించాలనీ, తద్వారా అణగారిన తరగతుల ప్రజలకూ, యువతకూ ఉద్యోగావకాశాలు పెరుగు తాయనీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ‘త్రిభాషా సూత్రా’న్ని ప్రవేశపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ త్రిభాషా సూత్రంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దేశ వ్యాప్తంగా 57 శాతం మంది హిందీని మొదటి భాషగా చదువు తున్నారు. బహుశా ఈ కారణం వల్లనే హిందీని అను సంధాన భాషను చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చి ఉండవచ్చు. భిన్న సంస్కృతులూ, భాషలూ, జీవన విధానాలూ విలసిల్లుతున్న మన దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందీ పట్ల వ్యతిరేకత ఉంది. కేంద్రమంత్రి హిందీని ప్రతిపాదించిన తర్వాతనే గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో సైన్ బోర్డులన్నింటినీ గుజరాత్ భాషలో రాయాలని నిర్ణయించింది. అలాగే ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో 15 వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనా భాషగా ఉంటుందని యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయమూ గమనార్హం. ఇంగ్లిష్‌కు చైనా, తదితర దేశాలు కూడా ప్రాధాన్యమివ్వడాన్నీ గమనించవచ్చు. ఇంగ్లిష్ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయి. ఫలితంగా ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వృద్ధి జరుగుతుంది. (క్లిక్: ఆలస్యమే! అయినా అభిలషణీయమే!) అయితే మాతృభాషలను నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలను వదిలేస్తే ఆయా భాషలు అంతరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక భాషలు అంతరించాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందీని బలవంతంగా అమలు చేయాలని భావిస్తే హిందీ మాట్లాడేవారు, హిందీ మాతృభాష కాని వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు వ్యతిరేకించే విధానాలను అమలు చేయకపోవడమే మంచిది. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) – టి. సమత, సీనియర్ పాత్రికేయులు -
ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని, స్థానిక భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. గత వారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భారతదేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాల’ని అమిత్ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దడం మానుకుని.. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడు నుంచి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా మోదీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బలంగా గళం వినిపించారు. హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో #StopHindiImposition హాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేశారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. (క్లిక్: నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..) కేవలం హిందీ భాష ద్వారా మాత్రమే భారతదేశానికి గుర్తింపు వస్తుందన్న కేంద్రం వాదనలో పస లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదని అంటున్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదని.. సంస్కృతి, గుర్తింపు కూడానని వివరించారు. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఏక భాష విధానం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. (క్లిక్: ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా) -
అడవి చెప్పిన కథ.. అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం
అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని అరుదైన కోవెలలు. ఆ మందిరాల్లో మంత్రాలు లేకుండా పూజలు. ఆ అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం. తమ ఉనికికి ఊపిరి పోసేందుకు, వేల ఏళ్ల నాటి భాషను బతికించుకునేందుకు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు నట్టడవిలో వెలగించిన చైతన్య దివిటీలు ఈ దేవాలయాలు. సకల దేవతల సమాహారంగా అక్షరాలు కొలువై ఉన్న ఈ ఆలయాలను చూడాలంటే జనాలను దాటి వనంలోకి వెళ్లాలి. సిక్కోలు మన్యంలోని భామిని మండలాన్ని పలకరించాలి. అక్కడ అడవి చెప్పే స్ఫూర్తి కథను వినాలి. భామిని: భామిని మండలంలోని మనుమకొండ, పాలవలసలో రెండు ఆలయాలు విభిన్నంగా ఉంటాయి. ముక్కోటి దేవతల్లో ఒక్కరిని కూడా అక్కడ ప్రతిష్టించలేదు. అష్టోత్తరాలేమీ రాయలేదు. ప్రత్యేక ప్రార్థనలంటూ ఏమీ లేవు. అక్కడ కనిపించేవి కేవలం అక్షరాలు. అవును.. అచ్చంగా అక్షరాలే. సవర లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి వాటిని పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఈ రెండు గ్రామాల్లో కనిపిస్తోంది. ఆదివాసీలు చిత్రాల్లో దైవ రూపాలను గుర్తించి పూ జించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అందుకే తమ అమ్మ భాషను లిపి రూపంలో ఆరాధిస్తున్నా రు. ఈ ఆలయాల ఆలోచన వె నుక ఓ ఉద్యమమే దాగి ఉంది. ఆ ఉద్య మం పేరు మతార్బనోమ్. మత్ అంటే దృష్టి, తార్ అంటే వెలుగు, బనోమ్ అంటే విస్తరించడం కలిపి.. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. అక్షర జ్ఞానం కోసం.. సవర భాష చాలా పురాతనమైనది. కానీ లిపి లేకపోవడంతో సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఆ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఓ ఉద్యమమే జ రిగింది. అందులో భాగమే ఈ అక్షర బ్రహ్మ ఆల యాలు. ఎప్పుడో 1936లో సవర పండిత్ మంగ య్య గొమాంగో ఈ లిపికి అక్షయ తృతీయ నాడు రూపం ఇచ్చారు. పుష్కర కాలం కష్టపడి తయారు చేసిన ఈ లిపి గిరిజనుల ఇళ్లకు చేరాలంటే ఏం చే యాలని ఆలోచించగా.. తట్టిన మహత్తర ఆలోచనే అక్షర బ్రహ్మ దేవాలయాలు. గిరిజన గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించి వాటి ద్వారా గిరిజనులను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించారు. దాని ఫలితంగా లిపి ఇంటింటికీ చేరింది. అంతే కాదు ఆదివాసీల్లో గల మద్యం, వివిధ రకాల మాంస భక్షణ వంటి దురాచారాల నుంచి దూరం చేసేందుకు కూడా ఈ మందిరాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. విగ్రహాలు ఇవే.. సవర పండిత్ మంగయ్య గొమాంగో 24 అక్షరాలను రూపొందించి వాటిని చిత్రాల రూపంలో మలిచి ఆలయాల్లో ప్రతిష్టించారు. ఈ 24 అక్షరాలలో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. అప్పట్లో అక్షర బ్ర హ్మ ఉద్యమం సరిహద్దులు దాటి అడవి గుండా వ్యాపించింది. ఆ సందర్భంలోనే భామిని మండలం మనుమకొండ, పాలవలసలోనూ అక్షరబ్రహ్మ ఆల యాలు ఏర్పాటయ్యాయి. సతివాడ సమీపంలో బొడమ్మమెట్టపై కొత్తగా అక్షరబ్రహ్మ ఆలయం ఇటీవల ఏర్పాటైంది. సీతంపేట మండలం నౌగడ, ముత్యాలు, శంభాంలలోనూ, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడలోనూ తర్వాత అక్షరబ్రహ్మ అలయాలు వెలిశా యి. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామా ల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాలు పేరున ప్రచార మందిరాలు వెలిశాయి. జాతీయ స్థాయిలో.. ఇటీవల మనుమకొండలో జరిగిన అక్షరబ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం జాతీయ స్థాయి సదస్సులో ఐదు రాష్ట్రాల ప్రతినిధులు, మతార్బనోమ్ ప్రచారకులు సవరభాషను జాతీయ భాషగా తీర్చిదిద్దడానికి తీర్మానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరవభాషా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో, మాజీ ఎమ్మెల్యే రామూర్తి గొమాంగో, సవర భాషను ఆవిష్కరించిన మంగయ్య కుమారు డు, సవర లిపి ప్రచార జాతీయ అధ్యక్షుడు డిగాన్సిమ్ గొమాంగో, అసోం నుంచి వచ్చిన పాగోని బోయా, గాబ్రియల్ బోయా, లోక్మి బోయాలు చర్చించారు. సవర భాష ప్రాచుర్యానికి చెందిన పుస్తకాల స్టాల్స్, సవర లిపి కరపత్రాలు, మేగజైన్లు, పోస్టర్లు ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రతి ఆదివాసీ ఇంట.. మా భాషకు లిపిని అందించిన సవర పండిత్ మంగయ్య గొమాంగో మాకు ఆరాధ్య దైవం. అక్షర బ్ర హ్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఆదివాసీ ఇంటికీ చేర్చుతున్నాం. అక్షర బ్రహ్మ ఆలయాలు నిర్మించలేని చోట అక్షర బ్రహ్మ ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. – సవర కరువయ్య, జిల్లా కోఆర్డినేటర్, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం, సతివాడ సవర భాషలో బోధిస్తాం.. సవర భాషలోని పదాలు, వాడుక వస్తువులను సవర లిపిలో వివరిస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఇతర భాషలతో పాటు సవర భాష అక్షరాలతో పదాలు, అర్థాలు బోధిస్తున్నాం. సవర భాషకు గుర్తింపు తీసుకురావడానికి రాత్రింబవళ్లు కొండలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. – పత్తిక సాయన్న, ప్రచారకుడు, అక్షరబ్రహ్మ యువసేవా సంఘం, మనుమకొండ -
మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం దీనికి కారణం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు. ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్‌ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్‌ప్రెసివ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిజార్డర్)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్) ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ లేదా స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లిదండ్రుల భూమిక ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
ఏపీ విద్యాశాఖ మరో సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన..
-
TS: అంగన్వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి. వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. భాషల వారీగా కేంద్రాల గుర్తింపు.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 17.04 లక్షల మంది పిల్లలు నమోదు కాగా, రోజుకు సగటున 6 లక్షల మంది హాజరవుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారి మాతృభాషలో బోధన నిర్వహించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లోని అంగన్వాడీల్లో ఉర్దూ, గిరిజన తండాల్లో లంబాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండు, కోయ, కొలామ్ భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీడీపీఓలకు ఒక ప్రణాళికను తయారు చేసి పంపించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించి ఆశ్రమ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు సంబంధిత అధికారులతో శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి పిల్లల మాతృ భాషలో బోధనను ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది. -
అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష
సాధారణంగా ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష కూడా అవుతుంది. ఆ ఊళ్లో మాత్రం రెండు భాషలు మాట్లాడుతారట. అది కూడా మహిళలకు ఓ భాష. పురుషులు మరో భాష. అదేం వింత, ఎక్కడా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలు భాష విషయంలో పాటిస్తున్న ఆచారం ఇది. ఎందుకంటే వారు ఇలా వేర్వేరు భాషలు మాట్లాడటం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తారట. ఆ ఉరిలో.. వ్యవసాయం చేసుకునే ఉబాంగ్ అనే తెగ వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయితే.. వాళ్లు రెండు భాషలు మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఉదాహరణకు, ఒక స్త్రీ యమ్‌ను 'ఇరుయ్' అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను 'అరిగా' అని పురుషులు దీనిని 'ఎన్కి' అని పిలుస్తారు. ఇలా పురుషులకు, మహిళలకు వేర్వేరు భాషలు ఉన్నా వారి మధ్య భాషపరంగా ఏ సమస్యలు తలెత్త లేదని అక్కడి ప్రజలు చెప్తుతున్నారు. ఇలా వాళ్లకి భాషలు విభజించినప్పటికీ కొన్ని పదాలు మాత్రం కామన్‌గా ఉంటాయట. చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏ భాష మాట్లాడినా పట్టించుకోరు కానీ.. మగ పిల్లలు మాత్రం 10 ఏళ్లు దాటితే ఖచ్చితంగా పురుషుల భాషనే మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయకపోయినా మహిళల భాషను పురుషులు మాట్లాడితే మాత్రం వింతగా చూస్తారట. అందుకే అక్కడి నియమాలు తెలిసిన వాళ్లు ఎవ్వరూ తమ భాష కాకుండా వేరే మాట్లాడరు. చదవండి: Siddharth: హీరో సిద్ధార్థ్ మృతి అంటూ సంతాపం, స్పందించిన హీరో -
భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన
హైదరాబాద్ : కేరళా నర్సుల వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజ్యాంగం తెలుగు, తమిళ్, మళయాళం ఇలా మొత్తం 22 భాషాలను అధికారిక భాషలుగా గుర్తించదని చెప్పారు. తమకు సౌకర్యంగా ఉన్న భాషలో మాట్లాడుకోవడం భారతీయుల హక్కని ఆయన అన్నారు. ఫలానా భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇదీ వివాదం ఢిల్లీలోని జిప్మర్లో పనిచేసే మలయాళీ నర్సులు తమ మాతృభాషలో మాట్లాడకూడదంటూ జూన్ 5న జిప్మర్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. కేరళా నర్సులు ఇకపై ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ ఆ సర్య్కులర్‌లో పేర్కొంది. దీనిపై మళయాళీ నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తమ మాతృభాషను అవమానించడమే అవుతుందన్నారు. జిప్మర్ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ని తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక్కడ చదవండి: 'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే' వెహికల్ ఇంజన్లకు ఇథనాల్ టెన్షన్ This directive reeks of language chauvinism 👇 India has 22 official languages & Malayalam, Telugu, Tamil, Hindi etc are included Every Indian should have the right to converse in a language of their choice & no one should infringe on that basic right pic.twitter.com/noIVoCZtBQ — KTR (@KTRTRS) June 6, 2021 -
‘రెవెన్యూ’ భాష!
సాక్షి, అమరావతి: భూ రికార్డులు, సర్వే సెటిల్మెంట్ రికార్డుల్లో ప్రత్యేక పదాలను వాడుతున్న విషయం మనకు తెలిసిందే. స్థిరాస్తి క్రయ, విక్రయ దస్తావేజుల్లోనూ ఈ పదాలే రాస్తారు. అందుకే దీన్ని రెవెన్యూ పదజాలం అంటారు. రాజుల కాలంలోనే రెవెన్యూకు ప్రత్యేక పదజాలం రూపుదిద్దుకుంది. తర్వాత బ్రిటిషర్ల కాలంలో ఆంగ్ల పదాలు చేరాయి. చాలామందికి అర్థాలు తెలియకపోయినా ఈ పదాలను వాడుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ముఖ్యమైన రెవెన్యూ పదాల గురించి తెలుసుకుందాం. రాజుల కాలం నుంచీ రాజ్యానికి ప్రధాన ఆదాయవనరు భూమిశిస్తు. అందువల్లే రెవెన్యూ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. తర్వాత కాలంలో భూమిశిస్తు ఆదాయం నామమాత్రంగా మారింది. కాలక్రమంలో మన రాష్ట్రంలో ప్రభుత్వం భూమిశిస్తునే రద్దుచేసింది. అసైన్డ్ భూమి: నాడు భూమిపై హక్కు రాజ్యానిదే. వంశపారంపర్యంగా పంటలు పండించుకోవడానికే రైతులకు హక్కుండేది. అందుకే ప్రభుత్వం భూమిశిస్తు వసూలు చేసేది. భూమిలేని వారికి వ్యవసాయానికి, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా భూమి పట్టా ఇచ్చేది. దీన్నే అసైన్డ్ భూమి అని, దరఖాస్తు పట్టా (డీకేటీ) అని అంటారు. ఈ భూమిపై పట్టాదారులకు వంశపారంపర్యంగా అనుభవహక్కులు మాత్రమే ఉంటాయి. ఇతరులకు విక్రయించడం, బదలాయించడం నిషేధం. ఎఫ్ఎంబీ: సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం వివరాలున్న పుస్తకాన్ని ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ) అంటారు. గ్రామంలోని సర్వే నంబర్లు, ఎంత భూమి ఉందనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామపటం: గ్రామంలోని మొత్తం భూమికి సంబంధించిన మ్యాపునే గ్రామపటం అంటారు. దీన్లో ఆ గ్రామంలోని సర్వే నంబర్ల వారీగా భూమి ఆకారాలతో స్కేల్ మ్యాపు ఉంటుంది. అడంగల్: దీన్నే భూ అనుభవ పుస్తకం అంటారు. ఏయే సర్వే నంబర్లలో ఎవరెవరి అనుభవంలో ఎంతెంత భూమి ఉందనే సమాచారం ఇందులో ఉంటుంది. ప్రభుత్వ, దేవదాయ భూముల వివరాలు కూడా దీన్లోనే ఉంటాయి. ఆర్వోఆర్: దీన్నే భూ యాజమాన్య హక్కుల పుస్తకం అంటారు. ఆర్‌వోఆర్‌నే- 1బి అని కూడా అంటారు. గతంలో దీన్నే టెన్‌వన్ అడంగల్ అనే వారు. ఎవరెవరికి ఎంతెంత భూమి ఏవిధంగా సంక్రమించిందనే సమాచారం ఇందులో ఉంటుంది. ఆర్ఎస్ఆర్: దీన్నే రీసర్వే రిజిస్టర్ అంటారు. సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, హక్కుదారుల వివరాలతో దీన్ని తయారు చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది. గ్రామకంఠం: గ్రామ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమినే గ్రామకంఠం అంటారు. ఈ భూములపై గ్రామ పంచాయతీకే హక్కు ఉంటుంది. సర్కారు పుంజి: ప్రభుత్వ భూమి చుక్కలభూమి: దీన్నే డాటెడ్ ల్యాండ్ అంటారు. ఖాళీగా ఉన్న బంజరు భూమికి భూమిశిస్తు చెల్లించలేక కొందరు ఈ భూములను తమవని క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో అప్పటి అధికారులు దీనిపై అనుభవదారులు హక్కులు కోరినప్పుడు వారి పేర్లు నమోదు చేద్దామనే ఉద్దేశంతో ఆ భూముల ఎదుట చుక్కలు పెట్టి వదిలేశారు. జమాబందీ: ఇది భూమిశిస్తు వసూలుతోపాటు రికార్డులు అప్డేట్ చేసే కార్యక్రమం. రెవెన్యూ ఆడిటింగ్ లాంటిది. ఫసలీ: జూలై ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు 12 నెలల కాలాన్ని ఫసలీ అంటారు. ఆ సంవత్సరంలో వచ్చిన రెవెన్యూను ఫసలీగా లెక్కగడతారు. మన రాష్ట్రంలో భూమిశిస్తు రద్దు అయినందున జమాబందీ, ఫసలీ పదాలు ఇప్పుడు వాడుకలో లేవు. -
చైనీస్ భాష మనకొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో షాక్ ఇచ్చింది. కొత్తగా ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020లో (ఎన్ఈపీ) చైనా భాషకు చోటు దక్కలేదు. సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. గత ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది. -
మాయామాటల బజార్
తెలుగు.. ఇంగ్లిష్ అయిపోతోంది అని ఇంగ్లిష్ పదాలను పలకడానికి.. మట్లాడ్డానికి వీల్లేని తెలుగు పదాలతో సమం చేస్తే సబబా? బాగుంది.. మరి తెలుగు తేనెలూరేదెట్లా? బహు బాగుంది.. మాయాబజార్ ఎన్ని కొత్త తెలుగు పదాలను కనిపెట్టలేదు? పింగళి నాగేంద్రరావు, కేవీ రెడ్డితో కలిసి సృష్టించిన ఆ మాటల మాయలో పడి ఇంకా కొట్టుకుపోతూనే ఉన్నాం! ఆ నిఘంటువు ఆంగ్లపదాలకు తెలుగు సమానార్థకాలను కనిపెట్టే క్లూ ఇస్తుందేమో ..చదువుదాం.. అస్మదీయులకు వ్యతిరేక పదం యుష్మదీయులు. సంస్కృతంలో ఉన్న అస్మత్, యుష్మత్ శబ్దాలకు కొత్త భాష్యం చెప్పారు పింగళి. అరవయ్యేళ్ల కిందటే కొత్త భాషను సినిమాలో పరిచయం చేశారు కె. వి. రెడ్డి, పింగళి నాగేంద్రరావు జంటగా. అచ్చతెలుగు పేర్లతో సినిమాలు వచ్చే రోజుల్లోనే మాయా బజార్ అనే ఉర్దూ పదంతో ఉన్న తెలుగు పౌరాణికాన్ని వెండి తెర మీద మెరిపించి ప్రేక్షకులను మురిపించారు. కొత్త కొత్త పదాలను కనిపెట్టి, ప్రయోగించారు..వాటితో ఆడుకున్నారు. అవి నిజంగా ఉన్న పదాలేమో అన్నంతగా మాటల్లో కలిపేశారు. పింగళి నాగేంద్రరావు సంస్కృతం బాగా అధ్యయనం చేసి, పాణినిని ఔపోసన పట్టి ఉంటారు. అందుకే సంస్కృత వ్యాకరణంలోని ఎన్నో పదాలను, ప్రత్యయాలను తెలుగు చేసేశారు. అస్ మస్ థస్, ఏ భ్యామ్, భ్యస్... అంటూ సంస్కృత ప్రత్యయాల గురించి తెలియనివారికి ఇవి నిజంగా మంత్రాలే అన్నంతగా భాషలో ఇమిడిపోయేలా చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కాని, ప్రత్యయాలు మాత్రం మంత్రాలుగా వచ్చి కూర్చున్నాయి. కోపధారి.. హైహై నాయకా శ్రీకృష్ణుడు వాసుదేవుడైతే, బలరాముడు మాత్రం తక్కువా! ఆయన్ని బలరారామదేవుని చేశారు మాయాబజార్లో పింగళి. ‘ముక్కోపాని’ కి విరుగుడుగా ‘ముఖస్తుతి’ని కనిపెట్టారు. శరధారి, బాణధారి లాగ ‘కోపధారి’ అంటూ సంకర ప్రయోగం చేశారు. ఘటోత్కచుని అనుయాయుడికి ‘దుందుభి’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలోని ‘బహుబాగుంది’ అనే పదప్రయోగాన్ని నలభై సంవత్సరాల తరవాత వచ్చిన ‘భైరవద్వీపం’ అనే సినిమా కూడా వాడుకున్నది. ‘మీరన్నది బాగుంది నేనన్నది బహుబాగుంది’ అంటూ! ఇంగ్లిష్ హాయ్‌ని తెలుగైజ్ చేసి ‘హైహైనాయకా’ అంటూ గొప్పనాయకుడికి జేజేలు పలికించారు. పాండవుల ప్రతాపాలు, దేవగురుడు, కొండాడవలదే, ఘనకీర్తి కొట్టవలదే అంటూ కొంగొత్త పదాలను చెక్కారు. అన్నమయ్యలాగ ‘చిన్నమయ్య’ పేరును సృష్టించారు. ‘శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం... మిత్రులను రక్షించాలి శత్రులను భక్షించాలి’ అంటూ శత్రువు, మిత్రువులలోని ‘వు’ ని లోప సంధి చేశారు. దుషటచతుషటయం మనిషిని పలకరించగానే ‘ఏంటి’ అనడాన్ని ఆంగ్ల ‘వై’ తో ‘వై నాయకా’ అంటూ ఆనాడే టెంగ్లిష్ను భాషించారు. బకాసురుడు, శకటాశురుడు వీళ్లేనా రాక్షసులు, నేనూ ఒక రాక్షసుడిని సృష్టిస్తాను అంటూ ‘‘కుడ్యాసురా’ అనే గోడ రాక్షసుడిని పుట్టించారు. ‘కోర్ కోర్ శరణు కోర్’ అంటూ తెర వెనకాల పలికించిన పద్ధతిని నేటికీ దర్శకులు అనుసరిస్తున్నారు. ‘అసమదీయులు’ అంటే ‘మనవాళ్లు’ అని నాడు మాయాబజార్ చెప్పిన కొత్త అర్థం ఈరోజు రాజకీయాల్లో మనవాళ్లకు ఓ పర్యాయపదంగా ఎలా స్థిరపడిందో వేరే చెప్పాలా? పైగా ‘ఎవడూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?’ అంటూ కొత్త పదాల ప్రయోగాన్ని సమర్థించుకున్నారు కూడా. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులను కలిపి దుష్టచతుష్టయమని కాక ‘దుషటచతుషటయం’ అని సినిమాలో లంబూజంబూలు విడివిడిగా తప్పుగా పలికిన మాటనూ ‘‘ఆ దుష్టచతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడిపొడి చేసేయాలి’ అని ఘటోత్కచుడి సమయస్ఫూర్తితో సరిచేశారు. ‘తక్షణ కర్తవ్యం’ని ప్రయోగిస్తూనే ‘తక్షణ సమస్య’నూ వదిలారు. తండ్రి పితృపాదులైతే తాతను ‘తాతపాదులు’ చేశారు. అంతేనా లక్ష్మణకుమారుడి నోట ‘సభాపరికి’ అనే మాటను పలికించి దాన్నీ పాపులర్ చేశారు. అం..అః .. ఇం.. ఇః... ఉం..ఉః అచ్చులలో ఆఖరి అక్షరాలు ‘అం అః’ లకు మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘ఇం ఇః ఉం ఉః’లను జన్మకునిచ్చారు. ఎవరైనా జైత్రయాత్రకు వెళ్తారు, తీర్థయాత్రకు వెళ్తారు. కాని ఇందులో ‘యుద్ధయాత్రకు’ బయలుదేరుతారు. ‘ఏనుగులు మింగావా! పర్వతాలు ఫలహారం చేశావా’ అని వృద్ధరూపంలో ఉన్న శ్రీకృష్ణులవారితో కోపంగా సరసపలుకులు ఆడించారు. ‘వంకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయ’ అనగానే పసుపుతాడు, పలుపుతాడు, పడతాడు గుర్తు రాకమానదు. ‘వహ్వారే అప్పడాలు’, ‘మఝారే అప్పళాలు’ అంటూ తెలుగు వంటకాలకు ఉర్దూ కితాబులిచ్చారు. ‘ఓహోరే అరిసెలుల్ల’, ‘భళీరే లడ్డులందు’ అంటూ కొత్త విశేషణాలతో తీపిని అద్దారు. ఇక కంబళి గింబళి, తల్పం గిల్పం... ఇంటింటా వాడుక పదాలు అయిపోయాయి. కంబళికి అప్పగారు గింబళి, తల్పం కంటె పెద్దది గిల్పం అంటూ ఆ పదాలకు అర్థాలూ చెప్పేశారు. అస్తు అస్తు, ‘గోభ్రాంతి, సమాధి భ్రాంతి’.. ఇలా ఎన్నని గుర్తుపెట్టుకోగలం! ఈ పదాలతో ఒక నిఘంటువునే తయారుచేయొచ్చు. పాదపీడనం తరవాత కరపీడనం చేయించాలి. కాని మాయాబజార్లో పింగళి.. పాణిగ్రహణం బదులుగా పాణిపీడనం చేయించారు. కన్నుల వెన్నెల కాయించారు, మనసున మల్లెలు పూయించారు.ఈ పదాల లాహిరిలో తెలుగు జగమంతా ఊగుతూనే ఉంది.– వైజయంతి పురాణపండ -
త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు?
విశ్లేషణ విద్యను సంపూర్ణంగా హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ ప్రకటించిన నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. సంపన్నులు కార్పొరేట్ బిజినెస్ స్కూళ్లలో చదువుతూ ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు కైవసం చేసుకోవడం, సాధారణ ప్రజలు హిందీ, తదితర ప్రాంతీయ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతూ చౌకీదారులుగా, ఛాయ్‌వాలాలుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇకనైనా మారాలంటే ఇంగ్లిష్‌ను భారత జాతీయ భాషగా గుర్తించి దానిలో బోధన చేస్తూ దాంతో పాటు ఒక ప్రాంతీయ భాషలో బోధించే తరహా విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలన్నింట్లోనూ ఇంగ్లిష్‌ను ప్రవేశపెడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన హామీని నెరవేర్చితే ఆంధ్రప్రదేశ్ ఈ అంశంలో దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం భారతదేశ భాషా విధానం గురించి విస్పష్టంగా ప్రకటించింది. మొట్టమొదటగా ఈ విధానం జాతి మొత్తాన్ని హిందీ మాట్లాడే జాతిగా మార్చాలని ఆశించింది. అయితే దక్షిణ భారతదేశంలో తీవ్ర నిరసనల తర్వాత తమకు హిందీ వద్దంటున్న రాష్ట్రాలపై హిందీని రుద్దకుండా కేంద్రం తన భాషా విధానాన్ని త్రిభాషా విధానంగా సవరించింది. ఏదేమైనా, దేశంలోని పిల్లలందరూ ఇప్పుడు మూడు భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, తాము పుట్టిన రాష్ట్రానికి చెందిన భాష, ఇతర రాష్ట్రాలకు చెందిన మరొక భాష. హిందీ మాట్లాడే రాష్ట్రాల కంటే ఎక్కువగా హిందీ మాట్లాడని రాష్ట్రాలు ఉంటున్నందున మొట్టమొదటిసారిగా హిందీతోపాటు హిందీ యేతర భాషను కూడా పిల్లలు నేర్చుకోవలసి ఉంటుందని ఈ విధానం తేల్చి చెబుతోంది. ఈ విధానంలో భాగంగా దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు కూడా ఇంగ్లిష్, తమిళంతోపాటు మరొక రాష్ట్రానికి చెందిన భాషను (దక్షిణభారత్కి చెందిన మలయాళం, కన్నడ లేక తెలుగు లేదా హిందీనికూడా) నేర్చుకోవలసి ఉంటుంది. దక్షిణ భారత్ నుంచి తమ ప్రభుత్వంలోకి తీసుకున్న సొంత పార్టీ మంత్రులు కూడా హిందీ పెద్దగా మాట్లాడలేకపోవడంపై బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు కలవరపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పరిశీలించండి. దక్షిణాదికి చెందిన నిర్మలా సీతారామన్, సదానంద గౌడ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలపైనా హిందీని రుద్దేందుకు పథకం రచించారు. కానీ కొంతకాలం వరకు ఈ విధానానికి కొన్ని ఆటంకాలు తప్పేటట్టు లేవు. కాబట్టి, వీరు హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం నుంచి వెనక్కు మళ్లారు కానీ భాషా విధానం మాత్రం త్రిభాషా సూత్రంగానే కొనసాగనుంది. బీజేపీ విద్యా విధానం మొట్టమొదటి సారిగా ఇంగ్లిష్‌ను దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే విషయంపై అంగీకారం తెలిపింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది కానీ బోధనా మాధ్యమంగా ఆ రాష్ట్రానికి చెందిన భాషే కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో బోధనా భాషగా ఇంగ్లిషే ఉంటుంది. అదే సమయంలో రెండు భారతీయ భాషలను బోధించే విధానం అమలులోకి వస్తుంది. అంటే ప్రైవేట్ కంపెనీలకు చెందిన ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్స్’ (క్లాస్ స్కూళ్లు) నిర్వహించే పాఠశాలలు గతంలో ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ వగైరా విదేశీ భాషలను ఒక సబ్జెక్టుగా బోధించడానికి బదులుగా ఇకనుంచి రెండు ఇతర భారతీయ భాషలను బోధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాకాలంలో విద్యా విధానం విదేశీ భాషలను నేర్చుకునే అవకాశాన్ని ఖాన్ మార్కెట్ గ్యాంగ్స్ (సంపన్నుల పిల్లలు చదివే) పాఠశాలలకు మాత్రమే కల్పించింది. కానీ మండీ బజార్ (మాస్) పాఠశాలలు హిందీ లేదా మరొక ప్రాంతీయ భాషా మాధ్యమంలోనే బోధించవలసి వచ్చేది. సారాంశంలో కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఇంగ్లిష్‌ను బోధించవలసిన అవసరమున్న ప్రధాన భాషగా గుర్తిం చింది. అయితే ఇంగ్లిష్‌ను ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో మంచి నాణ్యతతో సంపూర్ణంగా బోధించనున్నారు. అదే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను భాషా సబ్జెక్టుల్లో ఒక భాషగా బోధించనున్నారు. అయితే నిస్సందేహంగానే బీజేపీ ఒక ప్రగతిశీలమైన చర్యను చేపట్టింది. అదేమిటంటే భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధించడాన్ని అనుమతించడమే. విద్యను హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. లోహియా సోషలిజం ప్రకారం పేదపిల్లలు ప్రాంతీయ భాషా మీడియంకే పరిమితం కావాలి, సంపన్నుల పిల్లలకు కోరినంత డబ్బు ఉంటుంది కాబట్టి వారు మంచి ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌లో చదువుకోవచ్చు. భారతీయ కమ్యూనిస్టులు తాము పాలించిన రాష్ట్రాలన్నింటిలో ఉప– జాతీయ సెంటిమెంటును మిళితం చేసి మరీ ఈ రకమైన భాషా విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీనికి చక్కటి ఉదాహరణ 40 లక్షల జనాభా కలిగిన త్రిపుర రాష్ట్రం. ధారాళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే కామ్రేడ్ మాణిక్ సర్కార్ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచమంతటా కూడా ఉద్యోగాలు కైవసం చేసుకోగలిగిన సంపన్నులకు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు త్రిపురి మీడియంలో బోధన జరిపేలా చేశారు. అంటే ఈ పాఠశాలల్లో చదువుకున్నవారు 40 లక్షల జనాభాతో కూడిన పారిశ్రామికేతర అర్థ–గిరిజన ఆర్థిక వ్యవస్థలో వేతన జీవులుగా మాత్రమే అవకాశాలు సాధించుకునేవారు. మాణిక్ సర్కార్ పాతికేళ్ల పాలన పొడవునా ఇలాగే జరుగుతూ వచ్చింది . ఈ తరహా విధానంతో త్రిపురలో గిరిజనులెవ్వరూ చక్కటి ఇంగ్లీషును మాట్లాడటం, మార్క్స్, లెనిన్ గురించి మాట్లాడటం చేయలేకపోయారు. దీనివల్లే 34 శాతం గిరిజన జనాభా ఉన్న త్రిపురలో ఒక్క గిరిజనుడు కూడా సీపీఎంలో పాలిట్ బ్యూరో సభ్యుడు కాలేకపోయారు. అలాగే పశ్చిమబెంగాల్లో కూడా శ్రామిక ప్రజానీకాన్ని 34 ఏళ్లపాటు ఇంగ్లిష్ విద్యకు దూరం చేసిన తరహా విద్యావిధానాన్ని సీపీఎం కొనసాగించింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీరికి ఏం మిగిలిందో మరి! మరోవైపున సంపన్నులైన భద్రలోక్ కామ్రేడ్లు ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదువుకోగలిగారు. వీరివద్ద ప్రైవేట్ విద్యకు చెల్లించేటంత డబ్బు ఉంది మరి. అదేసమయంలో బెంగాలీ మీడియంతోపాటు ఒక ఇంగ్లిష్ సబ్జెక్టుతో కూడిన భాషా విధానాన్ని రుద్దడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతం మొత్తాన్ని వీరు వెనుకబాటుతనంలో ముంచెత్తారు. ఈ రాష్ట్రంలోనూ జనాభాలో 65 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారే ఉంటున్నారు. వీరిలో ఎవరికీ ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రతిభ లేదు కాబట్టే వీరినుంచి ఒక్క కమ్యూనిస్టు నేత కూడా సీపీఎం పాలిట్‌బ్యూరోలోకి ప్రవేశించలేకపోయారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకుని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ కూడా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏకీకృత బోధనా భాషను ప్రవేశపెడతానని హామీ ఇవ్వలేకపోయారు. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం నమూనాను, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మీడియంను ప్రవేశపెట్టటం నెహ్రూ పాలనా విధానాల్లో భాగమే కదా. మన దేశంలోని ఘనతవహించిన సెక్యులర్, ఉదారవాద కమ్యూనిస్టు మేధావులు సంపూర్ణంగా ఈ ద్విభాషా విధానాన్ని ఆమోదించేశారని మనం మర్చిపోకూడదు. నరేంద్రమోదీ అభిప్రాయంలో ఖాన్ మార్కెట్, మండీ బజార్ విద్యావిధానం రెండూ ప్రత్యేకమైనవి. బడా బిజినెస్ స్కూళ్ల నుంచి ఇటలీ, ఫ్రెంచ్ భాషలను తొలగించి మరొక ప్రాతీయ భాషలో బోధించాలని చెప్పడం ద్వారా ఇప్పుడు బీజేపీ కూడా అదే విధానాన్ని కాస్త ఎక్కువగానో లేక తక్కువగానో ఆమోదించేసింది.ఇంతకు ముందు నెహ్రూవియన్ విద్యావిధానాన్ని మనం చూశాం. ఈ విధానం ప్రకారం ఖాన్ మార్కెట్ సంపన్నులు ఇంగ్లిష్ మీడియంలోనూ, మండీ బజార్ సాధారణ ప్రజలు హిందీ మీడియంలోనూ చదువుకునేవారు. ఇప్పుడు మనకు భారత మాత స్మృతి ఇరానీ విద్యా విధానం ఉంది. దీని ప్రకారం కూడా స్మృతి పిల్లలు, ఆమె ప్రత్యర్థి ప్రియాంకా గాంధీ పిల్లలు ఖాన్ మార్కెట్ కాలేజ్ అయిన సెయింట్ స్టీఫెన్స్‌లో చదువుకుంటూ ఉంటారు, ఇకపోతే మండీబజార్ మాస్ పిల్లలు ప్రభుత్వ హిందీ మీడియం కాలేజీల్లోనే చదువుకుంటూ చౌకీదార్లుగా, ఛాయ్‌వాలాలుగా అవతరిస్తుంటారు. ఇప్పుడు మనకెదురవుతున్న ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, ఇంగ్లిష్ భారతదేశమంతటా అమలులో ఉన్న భాషగా ఉంటున్నప్పుడు, దాన్ని భారత జాతీయ భాషగా గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సబ్జెక్టులలో ఇంగ్లిష్ బోధనను ఎందుకు విస్తరించకూడదన్నదే. ఇంగ్లిష్తో పోలిస్తే మన ప్రాంతీయ భాషలు పొలాల్లో పనిచేసే కూలీల మాతృభాషగా మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడు సంఘ్ పరివార్‌కి చెందినవారు అత్యధిక సంఖ్యలో విమాన ప్రయాణీకులుగా ఉంటున్నారు. వీరి పిల్ల లందరూ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు.క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉంటున్నప్పుడు, మనం ద్విభాషా విధానాన్ని (ఇంగ్లిష్ ఒక ప్రాంతీయ భాష) ఎందుకు చేపట్టకూడదు? ఇంగ్లిష్‌ను గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు కూడా విçస్తృతస్థాయిలో ఎందుకు బోధించకూడదు? అలాగే ప్రైవేటు పాఠశాలలన్నింట్లో సమాన స్థాయిలో ఈ రెండు భాషలను ఎందుకు బోధించకూడదు? ఇది సాకారమైనప్పుడు భారతదేశవ్యాప్తంగా మన ప్రజలు భవిష్యత్తులో పరస్పరం ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరు, తమ రాష్ట్రం పరిధిలో వీరు అటు ఇంగ్లిష్‌లో, ఇటు ప్రాంతీయ భాషలో మాట్లాడుకోవచ్చు. తమిళనాడు చేస్తున్నది ఇదే మరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే గ్రామీణ ప్రజానీకానికి వాగ్దానం చేసి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తాననీ, ఒక సబ్జెక్టును తప్పకుండా తెలుగులో బోధించేలా చేస్తానని ఆయన నొక్కి చెప్పారు. ఈ హామీని ఆయన నెరవేర్చిన రోజున ఆంధ్రప్రదేశ్ దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
హిందీని బలవంతంగా రుద్దొద్దు
బెంగళూరు: హిందీయేతర రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి హిందీని బోధించాలన్న ముసాయిదా ప్రతిపాదనపై అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడగా, తాజాగా కర్ణాటక సీఎం కుమారస్వామి ఆయనకు తోడయ్యారు. త్రిభాషా ఫార్ములా పేరుతో ఓ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం సరికాదని తెలిపారు. త్రిభాషా ఫార్ములాను తిరస్కరించడం సమస్యకు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ‘దక్షిణాది రాష్ట్రాల్లోని చాలామంది హిందీని రెండో భాషగా నేర్చుకుం టారు. కానీ ఉత్తరాది వాళ్లెవరూ తమిళం, లేదా మలయాళంను నేర్చుకోవడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే త్రిభాషా ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలి’ అని చురకలు అంటించారు. భారత విభజన శక్తులు ఈ ప్రతిపాదనను చూసి భయపడుతున్నాయని బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ నేత తేజస్వీ సూర్య విమర్శించారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దితే తీవ్రమైన భాషాదురభిమానానికి దారితీస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం
ఆదిమజాతులకు జరిగే అన్యాయాన్ని అందరి దృష్టికీ తీసుకొచ్చి, వారి జీవించే హక్కును రక్షించడం, వారికి అభివృద్ధి ఫలాలు దక్కేలా చూడటం అవసరమని సమస్త సమాజాలకూ గుర్తు చేయడం కోసం ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మూడు దశాబ్దాలక్రితం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మన దేశం ఆ తీర్మానంపై సంతకం చేసినా, దాన్ని మన పార్లమెంటు ఇంతవరకూ ధ్రువీకరించలేదు. ప్రపం చవ్యాప్తంగా సుమారు ఐదు వేల రకాల ఆదిమ తెగలున్నాయని ఒక అంచనా. వీరి భాషలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. మన దేశంలో 700కు పైగా తెగలుండగా అందులో సుమారు 500 తెగలు మాత్రమే మిగిలాయి. వీరి భాషల్లో 197 కనుమరుగు కానున్నాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తోటి, చెంచు, కొండరెడ్డి, కులియ, దులియ తదితర తెగలతో పాటు, కొలాం, సవర వంటి భాషలు కూడా కనుమరుగుకాను న్నాయి. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమ తెగల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల దీనావస్థలు చెప్పనక్కరలేదు. మనుషులుగా ఆదిమ జాతులకే లేని భద్రత వారి భాషలకు, సంస్కృ తులకు ఎలా ఉంటుంది? వివిధ దేశాల్లో సాగిన వలస పాలన స్థానిక ఆదిమ జాతుల్ని అణచివేసి, వారి రాజ్యాలతోపాటు వారి భాషల్ని, సంస్కృతుల్ని ధ్వంసం చేసింది. దానివల్ల ఇంతవరకూ కలిగిన నష్టాన్ని గుర్తించబట్టే యునెస్కో ఈ ఏడాదిని ప్రపంచ ఆదివాసీ భాషా సంవ త్సరంగా ప్రకటించబోతున్నది. ఈ నెల 28న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో దీనిపై ప్రకటన వెలువడుతుంది. ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించు కోవడం విశ్వమానవాళి బాధ్యత అని ఈ ప్రకటన గుర్తుచేస్తుంది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమ జాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే వారి భాషా సంస్కృతు లను, జీవన విధానాన్ని సజీవంగా కొనసాగేలా చూడటం. అది వీలై నంత తొందరగా జరగాలి. విశ్వవిద్యాలయాలు సైతం నిజాయితీగా వాస్తవ మూల భాషా జ్ఞాన అన్వేషణ మొదలుపెట్టాలి. చారిత్రక వాస్తవ నిర్ధారణలు జరగాలి. ఈ ఆదివాసీ భాషా సంవత్సరం పొడవునా వర్సిటీలు మూల భాషలపై అధ్యయనాలు, మేధోమథనాలు నిర్వహించాలి. ఆదివాసీ భాషల పరిరక్షణకు యునెస్కో ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. 2005లోనే యునెస్కో, మన జాతీయ విద్యా పరి శోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ), కేంద్ర భారతీయ భాషల సంస్థ (సీఐఐఎల్)లు మైసూర్లో సెమినార్ నిర్వహించాయి. ఆదివాసీ భాషల పరిరక్షణతోపాటు ఆ తెగల్లో విద్యాపరంగా ఉన్న వెనకబాటును, వారి మాతృభాషల్లోనే ప్రాథమిక విద్యా బోధన జరిగితే అధిగమించవచ్చునని తేల్చారు. ఆవిధంగా 2006లో ఆదివాసీలు అధికంగా నివసించే రాష్ట్రా లను ఎన్నుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చ టగా మిగిలిపోయింది. ఆదిమజాతుల పిల్లలకు వారి భాష, సంస్కృతు లపై పాఠ్యాంశాలు లేకపోవడం, తమది కాని భాష నేర్చుకోవాల్సి రావడంవంటి కారణాలతో మధ్యలోనే అనేకులు చదువు మానేస్తున్నారు. వారి పండుగలు, ఇతర సందర్భాల్లో ఆ పిల్లలు పాల్గొనేందుకు వీలు కల్పించకపోవడం వల్ల అటువంటివారు తమ భాషాసంస్కృతులకు దూరమవుతున్నారు. సామాజిక ఆదరణ, ఆచరణ ఉంటేనే ఏ భాషైనా సజీవంగా ఉంటుంది. ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి వాటికి లిపి లేకపోవడమే కారణమన్న వాదన సరికాదు. మన దేశంలోని హిందీ, తెలుగు సహా అనేక భాషల్లో ఆదివాసీ భాషా పదాలు వచ్చిచేరాయి. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడలో 80 శాతం కోయ భాషాపదాలున్నాయి. భర్త చనిపో యిన మహిళను తెలుగులో వితంతువు అంటారు. దీనికి సమానార్థక పదం దాదాపు అన్ని భాషల్లో ఉంది. కానీ అండమాన్ దీవుల్లో నివసించే ఒక ఆదిమ తెగ భాషలో చనిపోయిన వ్యక్తి రక్తసంబంధీకులందరినీ సంబోధించేందుకు వేర్వేరు పదాలున్నాయి. ఇలా సమృద్ధంగా పద జాలం ఉండటం ఆదిమ జాతుల భాషల ప్రత్యేకత. అందుకే ఆ భాషల్ని, వారి సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. (ఈ ఏడాదిని ఆదివాసీ భాషా సంవత్సరంగా యునెస్కో రేపు ప్రకటించబోతున్న సందర్భంగా) మడివి నెహ్రూ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త, కోయభాష ప్రామాణీకరణ సభ్యులు -
అసహ్యకరం.. మీ భాష
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష అసహ్యకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ కృష్ణదాస్ తదితరులతో కలిసి ఆయన పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయ విధానాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు వంటివాటిపై కాకుండా వ్యక్తిగత అంశాలపై, దిగజారుడు భాషతో విమర్శించుకోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక ల షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్‌పార్టీ అవకాశవాద రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. మార్పుకోసం బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉం దని, ఈసారి గెలుగు గుర్రాలకే టికెట్లు ఇస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. అభ్యర్థులను విడతల వారీగా నవంబర్ 12లోపే ప్రకటిస్తామన్నారు. ఈ నెల 10న కరీంనగర్లో బీజేపీ సమరభేరీతో సభను నిర్వహిస్తున్నామని, దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో యువ మోర్చా సమ్మేళనం నిర్వహిస్తామని, 28న జరిగే సభకు అమిత్ షా హాజరవుతారన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్లు దొందూదొందే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నాటకాలాడటంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూదొందేనని లక్ష్మణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందన్నారు. ఐటీ దాడులకు రాజకీయ రంగు పులమడం సరైంది కాదన్నారు. కాం గ్రెస్‌తో టీడీపీ పొత్తు అనైతికమన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో జరిగినవి కావా అని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి టీఆర్ఎస్ లాభం పొందాలనుకుంటుందన్నారు. టీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ అని, కాంగ్రెస్ మునిగిపోయిన పడవ అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం కోరలు పీకేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. -
లంబాడి భాషకు లిపి
ఇందల్వాయి : గిరిజన తెగలలో ఒకటైన లంబాడీలకు మాట్లాడటానికి భాషా ఉన్నా రాయడానికి సరైన లిపి లేదు. దీని పర్యావసనంగా లంబాడి భాషా, సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావించిన ఓ గిరిజన యువకుడు.. తమ భాష మీద ప్రేమ, తమ సం స్కృతిపై మమకారంతో ప్రత్యేక లిపి రూపొందించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆరు సంవత్సరాలు గా ఇతర భాషల లిపిలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అకుంఠిత దీక్షతో చివరకు ఎలాంటి లోపాలు లేని 50 అక్షరాలతో కూడిన లిపిని లంబాడి భాష కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశాడు. అతడే ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండా గ్రామ పంచాయతీకి చెందిన జగత్ సింగ్ పవార్. డిగ్రీ వరకు చదువుకున్న జగత్సింగ్.. లిపి లేని ఎన్నో భాషలు అంతరించి పోతున్నాయని గుర్తించి, లంబాడి భాషా కూడా అలా అంతరించి పోకుండా కాపాడేందుకు పూనుకున్నాడు. తండ్రి నూర్సింగ్ పవార్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రత్యేక లిపిని తయారు చేసేందుకు సిద్ధమయ్యాడు. శోధించి.. సాధించి.. దేశంలో 10 శాతం జనాభా ఉన్న లంబాడీలకు ప్రత్యేక లిపి లేక ఇతర భాషలపై ఆధారపడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో లంబాడి భాషకు ప్రత్యేక లిపి అవసరమని జగత్సింగ్ లిపి రూపకల్పనకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం దేవనాగరి, హిందీ తదితర ప్రాచీన భాష ప్రావీణ్య పుస్తకాల నుంచి ఆధారాలు సేకరించాడు. అలాగే, భాషా పండితుల ఆత్మకథలను చదివి, పలువురు భాషా పండితుల సూచనలు తీసుకొని అహర్నిషలు శ్రమించి చివరికి ఇతర భాషాల లిపిలతో పోలిక లేని విధగా లంబాడి భాషా లిపికి రూపకల్పన చేశాడు. 13 అచ్చులు.. 37 హల్లులు.. జగత్సింగ్ రూపొందించిన లంబాడి భాష లిపిలో 13 అచ్చులు, 37 హల్లులు ఉన్నాయి. వీటికి వొత్తు లు కూడా ఉన్నాయని, వీటి ఆధారంగా మహాభారతంలోని కొన్ని శ్లోకాలు కూడా రాశానని జగత్ సింగ్ తెలిపాడు. ఈ లిపితో లంబాడి భాషలో మాట్లాడే ఏ పదాన్నైనా సులభంగా రాయవచ్చని అతడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ లిపిని ప్రభుత్వం గుర్తించి, లిపిలో మరింత పరిపక్వత సాధించేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నాడు. లంబాడ యువత ఈ లిపిని ఆదరించాలని, ఆసక్తి ఉన్న వారికి అవగాహన, శిక్షణ ఇస్తానంటున్నాడు జగత్సింగ్. ఈ లిపితో తమ భాషా, సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. లిపిపై ఆసక్తి ఉన్న వారు ఫోన్ నెం.83281 72129లో సంప్రదించాలని కోరాడు. -
స్వాతి గారు
నిందితురాలి గురించి చెబుతున్నప్పుడు పోలీసులు ‘తమదైన శైలి’కి భిన్నంగా మర్యాదకరమైన భాషను ఉపయోగిస్తుండగా.. ‘తనది కాకూడని శైలి’లో మీడియా అమర్యాదకరమైన రీతిలో నిందితురాలిని ఆడిపోసుకుంటోంది. విచారణ జరగక ముందే నిందితురాలిని పరమ దుర్మార్గురాలిగా చిత్రీకరించే ‘మోరల్ బైనరీ’ ఇది! ఈసబెల్ అయాండే చిలీ సంతతి అమెరికన్ రచయిత్రి. ‘భూత నిలయం’, ‘మృగ నగరం’ అని అర్థం వచ్చే రెండు నవలల్తో తొలిసారి ఈసబెల్ పేరు అందరికీ తెలిసింది. భూత నిలయంలో భూతాలు ఉండవు. మృగ నగరంలో మృగాలు ఉండవు. మానవ జీవితంలోని సహజ భావనలే ఆ భూతాలు, మృగాలు. ‘మేజికల్ రియలిజం’ ఆమె రచనాశైలి. అంటే ఏం లేదు. కల్పన కల్పనలా ఉండదు. వాస్తవం వాస్తవంలా ఉండదు. పుస్తకంలోని పేజీల్లోపల ఏం జరగాలో అదే జరుగుతుంది. రచయిత్రి వచ్చి జరిపించరు. మోరల్ బైనరీస్ ఉండవు. తప్పు, ఒప్పు తప్ప ఇంకేం అయ్యేందుకు అవకాశమే లేదనే ఆలోచనకు ప్రభావితం చెయ్యడం మోరల్ బైనరీ. అది ఉండదు ఈసబెల్ రచనల్లో. ఈసబెల్ నవలలతో సమానంగా ఆమె మాట ఒకటి బాగా వాడుకలో ఉంది. ‘వాట్ ఐ ఫియర్ మోస్ట్ ఈజ్ పవర్ విత్ ఇంప్యూనిటీ. ఐ ఫియర్ అబ్యూజ్ ఆఫ్ పవర్, అండ్ ది పవర్ టు బ్యూజ్’. శిక్షల నుంచి మినహాయింపు పొందిన అధికారం అంటే ఆమెకు భయం. అధికారం ఇచ్చి, నువ్వేం చేసినా శిక్ష ఉండదని చెప్తే అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. దుర్వినియోగం చెయ్యడానికే నీకీ అధికారం అని చెప్పినట్లూ అవుతుంది. అదీ ఈసబెల్ భయం. ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’ని చట్టం ఎవరికీ ఇవ్వదు. తీసుకుంటారంతే! ఎందుకు తీసుకుంటారూ అంటే.. అధికారం ఉంది కాబట్టి తీసుకోవాలనిపిస్తుందేమో. పోలీసులకు అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థకు అధికారం ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అధికారం ఉంటుంది. ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే అధికారం ఉండాలి కనుక ఉండే అధికారాలివన్నీ. అంతే తప్ప, అధికారం ఉంది కదా అని ప్రజల్ని ఏమైనా చెయ్యడానికి ఉండే అధికారాలు కావు. మీడియా కూడా మిగతావాటిలా తనకూ అధికారం ఉందనుకుంటుంది. నిజానికి మీడియాకు ప్రజల తరఫున తనకై తానుగా తీసుకున్న ‘సుమోటో’ లాంటి హక్కు తప్ప, ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఏమీ ఉండదు. కానీ ఉందనుకుంటుంది! ఉందనుకున్న ఆ అధికారంతో ఒక్కోసారి జడ్జిలా తీర్పులు ఇస్తుంటుంది. పోలీసులా ప్రశ్నలు వేస్తుంటుంది. బాబాలా ప్రవచనాలు చెబుతుంటుంది. పొలిటీషియన్ల మీద సెటైర్లు వేస్తుంది. ఏ విషయాన్నైనా తను తప్పనుకుంటే తప్పనిపించేలా చెబుతుంది. తను ఒప్పనుకుంటే ఒప్పనిపించేలా చెబుతుంది. తను దారుణం అనుకుంటే దారుణం అనిపించేలా చెబుతుంది. ఇదే ‘మోరల్ బైనరీ’. దారుణాన్ని దారుణం అని చెప్తే చాలు. దారుణంగా చెప్పాలా! భాషను మార్చుకుంటున్న ఏజ్‌లో ఉన్నాం మనం. ‘తమదైన శైలిలో విచారించగా..’ అని పోలీసుల గురించి మీడియా చెప్పడం కూడా సరికాదు. పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఒక శైలిగా సూత్రీకరించడం అది. నాగర్‌కర్నూల్‌లో భర్త హత్య కేసు విషయంలో స్వాతిని అరెస్ట్ చేసిన వార్తను చెబుతున్నప్పుడు మీడియా.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిందనీ, భర్త ప్లేసులో ప్రియుడితో దర్జాగా పుణే చెక్కేద్దామనుకుందనీ, సిగ్గు లేదనీ, శరం లేదనీ.. అసలు ఆడ మనిషే కాదనీ తిట్టిపోస్తుంటే.. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసు గురించి మీడియాకు వివరాలు ఇస్తూ.. స్వాతిని అనేకసార్లు ‘స్వాతి గారు ఇలా చేశారు’, ‘స్వాతి గారు అలా చేశారు’ అని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమకు తెలియకుండానే నేరానికి ‘ఫీల్‌గుడ్’ నేరేషన్ ఇవ్వడం టీవీలో చూస్తున్నవాళ్లందరికీ కొత్తగా అనిపించింది. పోలీసులపై సదభిప్రాయం కూడా కలిగించింది. సమాజాన్ని మెరుగు పరచాలని నిరంతరం పరుగులు తీస్తుండే మీడియా.. ఒక రోజు సెలవు పెట్టయినా తన పద్ధతులను మెరుగు పరచుకునే ఆలోచనలు చేస్తే.. వార్త, వార్తలా ఉంటుంది. రచనల్లోని ‘మేజికల్ రియలిజం’.. వార్తలు చెప్పడంలో కనిపించకూడదు. కనిపిస్తే అది ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’నే అవుతుంది. అబార్షన్ వార్తల్ని రాసేటప్పుడు జర్నలిస్టులు ఎంత సున్నితంగా ఆలోచించాలో ‘నేర్పించే’ సెషన్ ఒకటి ‘గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్’ ఆధ్వర్యంలో ఈమధ్య న్యూఢిల్లీలో జరిగింది. పిండాన్ని పిండమనే రాయండి తప్ప శిశువు అని రాయకండనీ, రాసేటప్పుడు తప్పొప్పుల ‘మోరల్ బైనరీస్’ ఇవ్వకండనీ ఆ సెషన్లో చెప్పారు. నేరుగా చెప్పండి తప్ప వేరుగా చెప్పకండి అన్నారు. కరెక్టు మాట. అబార్షన్ని అబార్షన్ అని చెబితే చాలు. ‘దేవుడితో ఆటలు’ (ప్లేయింగ్ విత్ గాడ్) అనక్కర్లేదు. గర్భాన్ని ఉంచుకుంటే గర్భాన్ని ఉంచుకున్నట్లు చెబితే చాలు. ‘మాతృత్వాన్ని కాపాడుకోవడం’ (సేవింగ్ మదర్‌హుడ్) అనక్కర్లేదు. - మాధవ్ శింగరాజు -
మన కులతూరు భాష.. సాయిమంతే!
నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం.. – బుట్టాయగూడెం :భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధానమైనది. వీరి భాష, సంస్కృతి, సంప్రదాయ విధానం భిన్నంగా ఉంటుంది. కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు. మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు–దేవుని వర్గం), రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరిగానే తమను తాము వారి పరిభాషలో “కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ, కమ్మరకోయ, ముసరకోయ, గంపకోయ, పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7 వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధకులు చెప్తున్నారు. డోలు కోయలు, కాక కోయలు, మట్ట కోయలు, లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి “్ఙదూడ తింతిన్ఙే్ఙ, నీ పేరు ఏంటి అనడానికి “మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి “మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి “మీకు ఎరికి వత్తే ‘, ఇటురా అని పిలవడానికి “ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడుతున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70 శాతం కోయ భాష మాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60 వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు. అతి ప్రాచీన భాషల్లో ఒకటి తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేకపోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ తెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటున్నారు. -
ఉత్తమ్ భాష తీరు మారాలి: తలసాని
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాడిన భాషను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ ప్రసంగంలో కేసీఆర్ అన్నీ నిజాలే చెప్పారని, దాంతో కాంగ్రెస్ నేతలు భయాం దోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలే పొగుడుతున్నారని, కానీ రాష్ట్ర నేతలకు ఇవేవీ కనిపించడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తన భాష తీరును మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. -
భారత్‌కు షాక్: మూడు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు హ్యాకర్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. భారత ప్రభుత్వ రంగ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు భారత రక్షణ శాఖ వెబ్‌సైట్‌తో పాటు హోం శాఖ, న్యాయ శాఖ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. రక్షణ శాఖ వెబ్సైట్ హోం పేజీపై చైనీష్ గుర్తు కనిపిస్తోంది. దీనిని ట్విటర్ ట్రాన్సిలేట్ సహాయంతో తర్జుమా చేయగా 'ధ్యానం' అనే అర్థం వచ్చే విధంగా ఉందని జాతీయ వార్తా సంస్థ దిక్వింట్ ప్రచురించింది. ఈ విషయంపై రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. వెబ్సైట్ పునరుద్ధరణకు భారత్ బృందం రంగంలోకి దిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వార్తలపై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ స్పందించింది. వెబ్సైట్లు హ్యాక్ అవలేదని, సాంకేతిక కారణాలతో డౌన్ అయ్యిందంటూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అవడం కొత్తేంకాదు. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకూ సుమారు 144 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యకింగ్‌కు గురయ్యాయి. ఈవిషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వమే ప్రకటించింది. గత ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వెబ్‌సైట్‌ను హ్యక్ చేశారు. కాశ్మీరలను ప్రధాని మోదీ, పోలీసులు వేధిస్తున్నారంటూ ఫ్రీ కాశ్మీర్ అని వచ్చేలా హ్యాక్ చేశారు. అంతే కాకుండా హోంశాఖ వెబ్‌సైట్‌ను సైతం ఇదే విధంగా హ్యాక్ చేశారు. Action is initiated after the hacking of MoD website ( https://t.co/7aEc779N2b ). The website shall be restored shortly. Needless to say, every possible step required to prevent any such eventuality in the future will be taken. @DefenceMinIndia @PIB_India @PIBHindi — Nirmala Sitharaman (@nsitharaman) April 6, 2018 -
హింగ్లిష్... వింగ్లిష్..!
హింగ్లిష్ భాషకు క్రేజ్ పెరుగుతోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా బ్రిటన్ తదితర దేశాలకు విస్తరిస్తోంది. మనదేశంలోని ఏ నగరంలోనైనా బ్రిటన్ పౌరులు ఎదురుపడి, హిందీ, ఇంగ్లిష్ కలగలిపిన భాష హింగ్లిష్‌లో ఏదైనా అడ్రస్ లేదా సమాచారాన్ని కోరితే ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఇదేదో కొత్త భాష అనుకుంటున్నారా... అదేం లేదు. ఇప్పటికే మన దేశంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి రోజువారి కార్యకలాపాల్లో కూడా భాగమై పోయింది. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాషలో ఇంగ్లిష్ పదాలు అలవోకగా అమరిపోయి వ్యవహారంలోకి వచ్చేశాయి. అంతేస్థాయిలో తెలుగు, బెంగాలీ, ఇతర ప్రాంతీయ భాషల్లో ఇంగ్లిష్ మిళితమై పోయింది. అన్నిస్థాయిల్లోని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ భాషలు రూపాంతరం చెందాయి. హైబ్రీడ్ భాషగా... ప్రస్తుత విశేషం ఏమంటే... హిందీ, ఇంగ్లిష్ కలగలిసి హైబ్రీడ్ భాషగా మారిన నేపథ్యంలో దీనిని ప్రత్యేకంగా బోధించేందుకు బ్రిటన్‌లోని ఒక కాలేజీ ఏకంగా ఓ కోర్సును కూడా ప్రవేశపెట్టేసింది. ఇంగ్లండ్‌లో పేరు ప్రఖ్యాతులున్న పోర్ట్స్మౌత్ కాలేజీ విలక్షణమైన ఈ భాషను బోధిస్తోంది. భారత్‌లో లేదా బ్రిటన్‌లోని భారత కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న ఇంగ్లిష్ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతుండడంతో భారత్‌లో మనుగడ సాధించేందుకు, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకునేలా ఇతరదేశాల వారు ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో హింగ్లిష్ సంభాషణలు పెరగడం, లవ్ ఆజ్ కల్, జబ్ వీ మెట్ వంటి ఫిల్మ్ టైటిళ్లతో సినిమాలు రావడం వీక్షకుల్లో ఒకింత క్రేజ్‌ను పెంచాయి. దీనితో పాటు టెలివిజన్, వార్తాపత్రికలు, మొత్తంగా మీడియా సంబంధిత కార్యక్రమాల్లో రెండు విడిదీయరానంతగా కలిసిపోయాయి. ఇప్పటికే ‘యే దిల్ మాంగే మోర్’ వంటి టీవీ వాణిజ్య›ప్రకటనలు ప్రజాదరణ పొందాయి. మంచి స్పందన... హింగ్లిష్ కోర్సుకు వచ్చిన స్పందన కూడా కాలేజీ యాజమాన్యాన్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ‘ఈ కోర్సు పట్ల ఎక్కువ సంఖ్యలోనే ఆసక్తిని కనబరిచారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని మొదలుపెట్టినపుడు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఫీడ్‌బ్యాక్ బాగా ఉండడంతో వచ్చే సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలిక కోర్సును ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్నాము’ అని కోర్సు బోదనాధిపతి జేమ్స్ వాటర్స్ వెల్లడించారు. హింగ్లిష్ వినియోగం గణనీయంగా పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్ మాట్లాడేవారి సంఖ్య కంటే హింగ్లీస్ సంభాషించే వారు పెరిగిన ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని భాషా శాస్త్రవేత్త డేవిడ్ క్రిస్టల్ అభిప్రాయపడ్డారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రెండు వారాలకో భాష అంతం
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పది వేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. 50 ఏళ్లలో 220 భాషలు కనుమరుగు... మనదేశంలో 780 భాషలకు పైగా ఉనికిలో ఉండగా, గత 50 ఏళ్లలోనే 220 భాషలు కనబడకుండా పోయాయి. దీనిని బట్టి భారతీయ భాషలు ఎంత వేగంగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నది స్పష్టమవుతోంది. ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ ప్రకారం భారత్‌లోని 197 భాషలు ఈ కోవలోకే వస్తాయి. వల్నరబుల్, డెఫినెట్లి ఎండేంజర్డ్, సివియర్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ఆ సంస్థ వర్గీకరించింది. వీటిలో బొరొ, మీథీ మాత్రమే భారత్‌లో అధికారికంగా గుర్తించినవి. ఇతర భాషలకు రాత (లిఖిత) వ్యవస్థ లేదు. జనన గణన డైరెక్టరేట్ నివేదిక ప్రకారం...మనదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలతో పాటు, లక్షకు పైగా మంది మాట్లాడే వంద నాన్–షెడ్యూల్డ్ భాషలున్నాయి. అయితే యునెస్కో రూపొందించిన కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషలు,మాండలికాల జాబితాలో 40 భారతీయ భాషలున్నాయి. ఈ భాషలను పదివేల మంది కంటే తక్కువ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ భాషలు అంతరించే ప్రమాదముందని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. యునెస్కో జాబితాలోని 40 భారతీయ భాషలివే ►అండమాన్, నికోబార్ దీవుల్లో మాట్లాడే 11 భాషలు... గ్రేట్ అండమానీస్, జరావా, లామొంగ్సే, లూరో, మ్యుయొట్, ఒంగో, పు, సెనెన్యో, సెంటిలీస్, షోంపెన్, తకహనియిలాంగ్. ►మణిపూర్‌లోని 7 భాషలు...ఐమల్, అక, కొయిరెన్, లామ్‌గంగ్, లాంగ్రాంగ్, పురుమ్, తరావ్. ►హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు భాషలు...బఘతి, హందురి, పంగ్వలి, సిర్‌మౌది. ►మండ, పర్జి,పెంజో(ఒడిశా) కొరగ, కురుబ (కర్ణాటక), గదబ, నైకీ (ఆంధ్రప్రదేశ్), కోట, తోడ, (తమిళనాడు), మ్రా, నా (అరుణాచల్‌ప్రదేశ్), తై నోరా, తైరాంగ్ (అసోం), బంగాని (ఉత్తరాఖండ్), బిర్హొర్ (జార్ఖండ్), నిహాలి (మహారాష్ట్ర), రుగ (మేఘాలయ), టొటొ (పశ్చిమ బెంగాల్). భాషల పరిరక్షణ ఏ విధంగా.. సమస్య తీవ్రత నేపథ్యంలో అంపశయ్యపై ఉన్న భాషలను కాపాడుకోవాలి. ఇలాంటి భాషల ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌తో పాటు వాటిలోని ముఖ్యమైన కథలు చెప్పడం, జానపద,మౌఖిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర వంటి సాంఘిక,సాంస్కృతిక అంశాలను నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డిజిటలైజ్ చేయడం ద్వారా ఆయా భాషల వనరులను సంరక్షించుకోవాలి. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు తయారుచేసుకోవాలి. ఈ వనరుల ద్వారా భాషాపరమైన పరికరాలు,పనిముట్లను తయారుచేసుకుని ఈ భాషల వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఈ కోవలోని భాషల పదకోషాలు తయారుచేసి, వాటిలోని పదాలను ఏ విధంగా పలకాలన్న దానిపై గ్రంథాలయాల ద్వారా అవగాహన కల్పించాలి. ఆడియో, వీడియో ఉపకరణాల ద్వారా ఇలాంటి భాషలపై విస్తృత ›ప్రచారం చేయాలి. ప్రతీ భాషలో మౌఖిక సాహిత్య భాండాగారం నిక్షిప్తమై ఉన్నందున కనుమరుగయ్యే భాషలపై ఈ విషయంలో ప్రత్యేక దృష్టి నిలపాలి. ప్రస్తుతం చౌకధరలకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆడియో, వీడియోలు రికార్డ్ చేసి, ఫొటోలు తీసుకుని డేటాను తయారుచేసుకునే వీలుంది. -
పొద్దున్నే లేస్తా.. కొత్త భాష మాట్లాడుతా!
ఉదయం నిద్ర లేచిన వ్యక్తి రాత్రి పడుకునే వ్యక్తి వేర్వేరు అని అంటుంటారు. అలా ఎలా అంటే ఆ రోజు మొత్తం ఏదో ఒకకొత్త విషయాన్ని నేర్చుకుంటాం కాబట్టి ఓ కొత్త వ్యక్తిగా పడుకుంటాం అన్నమాట. అయితే రాత్రి పడుకుని ఉదయం లేచే సరికి అదే మార్పు ఉంటుందా.. సాధారణంగా అందరి సంగతేమో కానీ అమెరికాలోని అరిజోనాకు చెందిన 45 ఏళ్ల మిషెల్ మైర్స్ మాత్రం పూర్తిగా మారిపోయింది! మారిపోవడం అంటే ఆమె రూపురేఖలు మారడం కాదు. ఆమె భాష..! ఆ అందులో విశేషం ఏముంది.. స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్లకో.. లేదా 30 రోజుల్లో వేరే భాష నేర్చుకునే పుస్తకం చదువుతోందో అని పొరపడకండి. అది కూడా కనీసం ఆ భాషలు.. యాసలు ఉంటాయని కూడా ఆమెకు తెలియదట. ఓ రోజు రాత్రి తనకు నొప్పిగా ఉందని పడుకోవడం.. తెల్లారి లేచే సరికి వేర్వేరు భాషలు, యాసల్లో మాట్లాడటం.. ఇలా 2015 నుంచి జరుగుతోందట. ఆస్ట్రేలియన్, ఐరిష్, బ్రిటిష్ యాసలు మాట్లాడుతోందట. ఇలా వేరే భాష మాట్లాడటం వారం.. రెండు వారాల పాటు ఉండేదట. బ్రిటిష్ యాస మాత్రం రెండేళ్లుగా మాట్లాడుతోందట. ఇదో వింత వ్యాధి. దీని పేరు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. మెదడులోని బేసల్ గాంగ్లియాన్ భాగానికి దెబ్బ తగిలినప్పుడు కానీ.. షాక్ తగిలినప్పుడు కానీ ఇలా భాషలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని షెలియా బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే బాధపడుతాం.. కానీ ఈ వ్యాధి వచ్చినందుకు మిషెల్ సంతోషపడుతోంది కావొచ్చు.. ఎంతైనా కోచింగ్ లేకుండా.. పైసా ఖర్చు లేకుండా కొత్త భాషలు నేర్చుకోవడమంటే కాస్త అదృష్టమే కదూ! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారు 60 మంది మాత్రమే ఉన్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ పేర్కొంది. -
మోరీల్లో పడేది టీఆర్ఎస్ కార్యకర్తల తలలు కాదు...
నల్గొండ : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. నల్గొండ సభలో కాంగ్రేస్ నేతల ప్రసంగాలపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. మోరీలలో పడేది టిఆర్ఎస్స్ కార్యకర్తల తలలు కాదని..కాంగ్రెస్ పార్టీ నేతల పదవులు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ బాషను మార్చుకోకపోతే ప్రజలే కాంగ్రెస్ నేతల బట్టలు పీకి మోరీలలో వేసే రోజులు ముందున్నాయన్నారు. అటువంటి బాషను వాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్న సీనియర్ నేత జానారెడ్డి వారించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతల మాటలతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటుందని వ్యాఖ్యానించారు. తాగి తన్నుకున్న పంచాయతీలో టీఆర్ఎస్ను లాగి బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తల తలలు తెంపి మోరీలలో మొండేలను వేస్తాం..ఎంఎల్ఏలను బట్టలు విప్పి కొడతామంటూ వాడిన పదాలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని, వేదిక మీద ఉన్న జానా, ఉత్తమ్, జైపాల్ వంటి నేతల నాయకత్వానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. 2019 ఎన్నికలలో మీ బట్టలు విప్పి మీరు చెప్పిన మోరీలలో వేసేందుకు ప్రజలే సన్నద్దమవుతున్నారని అన్నారు. -
భాషకు ప్రాంతీయ హద్దులెందుకు?
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు! నమస్కారం! భాష పుట్టుక, నది జన్మ ఎవ్వరికీ తెలియదు. మనస్సులోని భావాలను ఇతరులతో పంచుకునే గొప్ప సాధనమే భాష. భాష నది వంటిది రాష్ట్రాలుగా మనల్ని కలుపుతుంది. సముద్రం పర భాష వంటిది దేశాలుగా విభజిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే తనలో ఉండే అహాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, మనస్సుని సమన్వయం చేసుకోవాలి. సమన్వయము చేసుకునే జ్ఞాపక శక్తి ప్రవహించే నది తియ్యని జలాలతో మనకి ఇస్తుంది. ఆ నది పేరే సరస్వతి. సరస్వతీ నదికి సమ న్వయము చేసే శక్తి ఉంటుంది అక్కడ నుంచి వచ్చినదే అతి పురాతనమైన తెలుగు భాష. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ నగ రంలో జరగడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. సమ్మే ళనం తెలుగు పేరు మీద జరిగింది. తెలుగు అంటే తెలం గాణ ప్రాంతం వారిదే కాదు. తెలుగు మాట్లాడే, మాట్లా డిన వారి సొంతం ఈ సమ్మేళనం. సమ్మేళనానికి వేల సంఖ్యలో అతిథులు విచ్చేసారు. పండితులైన శ్రీనాథ, అన్నమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ, రాయ ప్రోలు, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర వంటి వారి ప్రస్తావన చేసి ఉంటే సభకు మరింత వన్నెను ఇచ్చేది. తెలుగు వారిగా ఆధునిక కవులను గౌరవించాలి. సాహి త్యానికి హద్దులు లేవని చాటాలి. గౌరవనీయ రాష్ట్రపతి గారు తమ ప్రసంగంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రతినిధిగా విదేశాలలో ఉన్న తెలుగు వారిని ఆహ్వానించినట్లే ఆంధ్రా ప్రజలను కూడా ఆహ్వానించి ఉండాల్సింది. రాజకీయ ఇతర కారణాలను పక్కనపెట్టి చంద్ర బాబు నాయుడుగారిని కూడా సభలలో ఉండేలా చేసి ఉంటే తెలుగువారు ఒక్కటే అనే సందేశం అందరికీ అంది ఉండేది. అందమైన లేజర్ షోలో రచయితల చిత్రాలతో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమం నిండుతనాన్ని ఇచ్చేది. బతుకమ్మ మన రచయితలను మించినది అని చెప్పడం మనల్ని మనం మోసం చేసు కోవడమే. హైదరాబాద్ నగరం తన సంస్కృతితో పాటు లక్షల కుటుంబాలను కాపాడుతూ వచ్చింది. వందల సంవత్సరాలుగా మేము అందరము ఇక్కడ నివసి స్తున్నాము. ప్రఖ్యాత రచయిత మహాకవి గుంటూరు శేషేంద్ర గారి భార్యగా మాకు ఆహ్వానం అందలేదు. కానీ మా కోరిక మీముందు ఉంచడం బాధ్యతగా భావిస్తూ భవిష్యత్తులో జరిగే సభలలో ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ప్రతి ఒక్క తెలుగు రచయితను గుర్తు చేసుకోవాలి. రచయితలను, వారి కుటుంబాలను అవమానకర పరిస్థితులలో ఉంచ కూడదు. మీరు తెలివైన వారు. ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. తెలుగు భాష రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక వారధి. భాష ఇరు రాష్ట్రాల ప్రజలను కలిసి ఉండేలా చెయ్యాలి. ఆంధ్రా వారు, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఉండటం కారణంగా మీమీద మరింత బాధ్యత ఉన్నది. మీరు తెలుగు ప్రజ లందరికీ ముఖ్య నేత అనే విషయాన్ని గమనించాలి. రాష్ట్రానికి హద్దు ఉంటుంది. భాషకు హద్దు ఉండదు. వివక్ష జరిగింది అని గుర్తు చేసుకుంటూ ఉంటే కక్ష పెరు గుతుంది. కక్షలు, వివక్షలు లేకుండా ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. అభిమానం, అభి లాష, ఉత్సుకత సాంద్రతతో తెలియనిది తెలుసుకో వాలి అని వచ్చే వారికి తెలిపే ప్రయత్నం చెయ్యాలి. – ఇందిరా దేవి ధనరాజ్ గిరి, గుంటూరు శేషేంద్రశర్మగారి సతీమణి జియాన్ బాగ్ ప్యాలెస్ 97015 02653 -
మాతృభాషకు పూర్వవైభవం ఎలా?
వేలాది రూపాయలను కొత్త బట్టలకు తగలేసే మనం.. ఇంట్లో మన పిల్లలకి కనీసం పట్టుమని పది పుస్తకాలైనా కొనివ్వం. ‘తెలుగు భాష’ని మాట్లాడటం తల్లిదగ్గరే నేర్చుకున్న విద్యార్థికి ఇంట్లో చదవడానికి ‘పుస్తకా’లుండాలి. బాల్యంలో.. కోడిపిల్లలకి మల్లే అమ్మ రెక్కల కింద పదిలంగా, వెచ్చగా ఉండే మనం– వయసు పెరిగేకొద్దీ క్రమేణా ఆ రెక్కల కింద నుంచి తల బైటపెట్టి, బయటి ప్రపంచపు వింతలు చూసేందుకు ఉవ్విళ్లూరుతాం తప్ప, ఆ రెక్కల కిందే ఎప్పటికీ ఉండిపోవాలనుకోం. అమ్మ రెక్కల కింద ఉన్నన్నాళ్లూ మనకి విన్పించేది, అమ్మ భాష ఒక్కటే అయితే.. బయటి ప్రపంచంలో అడుగెట్టాక విన్పించేవి ఎన్నో భాషలు. బతుకుతెరువు కోసం.. పరభాషలు నేర్చుకునే పరిస్థితి మనది. కార ణం.. భాషాపరంగా మనదేశ చరిత్ర విభిన్నమైంది. ప్రపంచ యవనికపై ఇన్ని విభిన్న అధికార భాషలున్న దేశాలు అతి తక్కువగా కన్పిస్తాయి. ఇక రాష్ట్ర సరిహద్దులు దాటితే మనకెదురయ్యేవి ఎన్నో ప్రాంతీయ భాషలు, అక్కడ ఎవరి మాతృభాష వారికి పనికిరాదు. అందుకే అన్ని రాష్ట్రాల ప్రజల్ని ఏకం చేసేందుకు హిందీని ‘జాతీయ భాష’గా ‘ఇంగ్లిష్’ని ‘అనుసంధాన భాష’గా ప్రకటించి త్రిభాషా సూత్రాన్ని పాటిస్తోంది మన దేశం. ‘ఇంగ్లిష్ మీడియం’లో చదు వులు, ఉద్యోగాలకీ, వివిధ ఐటీ కంపెనీల్లో గుర్తింపు నకూ అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి– చాలా మంది గ్రామీణ ప్రజలు తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడి యంలోనే చదివించడానికి మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివించే స్తోమత లేకనే– తప్పని పరిస్థితుల్లో పేరెంట్స్ తమ పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇంగ్లిష్‌లో ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ లోపం మూలంగా తమ పిల్లలు పట్టణ విద్యార్థులతో పోటీ పడ లేకపోతున్నారన్న అసంతృప్తి.. గ్రామీణ ప్రజల్లో ఉందని తెలిసి, వారి అభీష్టం మేరకే కేజీ నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లని ప్రవేశపెడ్తూ పేద ప్రజలకి ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి తెస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. నిజానికిది అభినందించదగ్గ విషయం. అయితే బతుకుతెరువు కోసం మనం ఇంగ్లిష్, చైనీస్, ఫ్రెంచ్ లాంటి భాషల్ని ఎన్ని నేర్చుకున్నా మాతృభాషని అలక్ష్యం చేస్తే.. కొన్నాళ్లకి అది కూడా అంతరించి పోయిన భాషల్లో ఒకటిగా మిగిలిపో తుంది. ఈ మధ్య తెలుగు భాషా పరిరక్షణ అనగానే– ఇంతకీ ఏ తెలుగు– తెలంగాణ తెలుగా– రాయలసీమ తెలుగా– కోస్తాంధ్ర తెలుగా అంటూ మాండలికాల సెగలు కూడా చుట్టుముడుతున్నాయి. పరభాషా పదాలను ఇంగ్లిష్ వాడే తన డిక్షనరీలో చొప్పిస్తూ తన భాషని ఎప్పటికప్పుడు క్రొంగొత్త పదా లతో అప్డేట్ చేసుకుంటూంటే తెలుగునాట ఎవరి మాండలికానికి వారే పెద్దపీట వేసుకోవడం.. తెలుగు భాషా వికాసానికి అవరోధమవుతుంది. దీనికి బదులుగా తెలంగాణ మాండలికంలోని సొగసైన పదా లను, రాయలసీమ మాండలికంలోని సొంపైన పదా లను, కోస్తాంధ్ర మాండలికంలోని ఇంపైన పదాలనూ, ఆయా జిల్లాల్లో జనుల నాలుకల మీద నడయాడు తున్న మాండలిక పదాలను.. ప్రస్తుత ‘ప్రామాణిక భాష’లో ఉపయోగించడం అవశ్యం. ఇంటి విషయానికొస్తే.. కొన్ని వేల రూపాయలను కొత్త బట్టలకు తగలేసే మనం.. ఇంట్లో మన పిల్లలకి కనీసం పట్టుమని పది పుస్తకాలైనా కొనివ్వం. ‘తెలుగు భాష’ని మాట్లాడటం తల్లిదగ్గరే నేర్చుకున్న విద్యార్థికి ఇంట్లో చదవడానికి ‘పుస్తకా’లుండాలి. అవి తల్లిదం డ్రులే తెప్పించి, తమ పిల్లలతో చదివించాలి. పిల్లల్ని తమ దగ్గర కూర్చోబెట్టుకుని తెలుగు కథల్ని చదు వుతూ, వాళ్ల చేత చదివిస్తూ ఉంటే విద్యార్థికి తెలుగు భాష పట్ల ఎనలేని మక్కువ ఏర్పడుతుంది. టీవీల్లో నయీంలాంటి ఖల్‌నాయక్‌ల కథలతో ఊదరగొట్టకుండా ‘టీవీ చానల్స్’ వారు తెలుగు సాహిత్యంపై క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు లభిస్తుంది. తెలుగు మెసేజీలని ఇంగ్లిష్ అక్షరాలతో టైప్ చేస్తూ.. రాసిన భావం చదవ డానికే కష్టమై ఉభయ భ్రష్టులవుతున్నాం. కానీ, సెల్ ఫోన్లలో ‘తెలుగు ట్రాన్స్‌లేటర్’ టూల్‌ని డౌన్లోడ్ చేసు కుని తెలుగులోనే టైప్ చేస్తే – ‘తెలుగులిపి’లో మెసే జీలు చదవడం ఎంత తేలికో.. పిల్లలకే కాదు, మనకూ అర్థమవుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకుని మనమైనా, మన అమ్మైనా బయటికి వెళ్తాము. ఆ వెళ్లే క్రమంలో ఉన్నఫళాన ఇంట్లోని ఫార్మల్ బట్టలు వేసుకొని బయటికి వెళ్లం. ట్రిమ్గా తయారై వెళ్తాం. అమ్మ పట్టుబట్టలు కట్టు కుంటుంది. మనం సూటూబూటూ వేసుకుంటాం. బయటి పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ మనం ఫార్మల్ బట్టలు వేసుకుంటాం. అమ్మ నూలు చీర కట్టుకుంటుంది. అమ్మ మెత్తటి బట్టలు మనని సేదదీరుస్తాయి. ఒక్కమాటలో చెప్పా లంటే అమ్మ పట్టుచీరల్లాంటివి పరాయి భాషలైతే.. అమ్మ మెత్తటి నూలు చీరలాంటిది మన మాతృభాష. అలాంటి మన మాతృభాషని మనం పరిరక్షిం చుకోలేకపోతే.. ఎలెక్ట్రానిక్ మీడియాలో వచ్చీరాని తెలుగు మాట్లాడే యాంకరమ్మలే దొరుకుతారు. తెలు గులో పట్టీపట్టీ డైలాగ్స్ చెప్పే సినీ హీరోయిన్లతోనే సరి పెట్టుకుంటాం. ‘అబ్బో! తెలుగా? రాయటం కష్టం!’ అనుకునే విద్యార్థులనే చూస్తాం. అందుకే.. మన భాషకి ఆ దుర్గతి దాపురించకూడ దని తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా తదితరులు తెలుగు భాషా పరిరక్షణకై ఇతోధికంగా తమ వంతు కృషి చేస్తే, తెలుగు భాషకి పూర్వ వైభవం చేకూరుతుంది. – డాక్టర్ అమృతలత, రచయిత్రి, విద్యావేత్త మొబైల్ : 98488 68068 -
కేంద్ర కార్యాలయాల్లో మరాఠీ తప్పనిసరి!
సాక్షి, ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రాంతీయోద్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రాంతీయ భాషను తప్పనిరి చేస్తూ ఆదేశాలు జరీ చేశాయి. తాజాగా ఈ కోవలోకి మహారాష్ట్ర వచ్చి చేరింది. రాష్ట్రంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కార్యయాల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలు, పోస్టాఫీసులు, పెట్రోలియం, గ్యాస్, రైలు, టెలికమ్యూనికేషన్ కార్యాలయాల్లో మరాఠీని తప్పకుండా ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త్రిభాషా సూత్రానికి అనుకుగణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా వుండగా.. ఇప్పటికే మహారాష్ట్రలో మరాఠీ అధికార భాషగా ఉన్న విషయం తెలిసిందే. -
నూటా నలభై మూడోసారి
‘‘బ్రేకప్‌కి ముందు నిన్నొక మనిషిగా నేను ప్రేమించాను. బ్రేకప్ అయ్యాక నేనొక మనిషినై నిన్ను ప్రేమిస్తున్నాను.’’ ‘‘గాడ్.. ఆపుతావా! వద్దనుకున్నాం కదా విహాన్.. నాకు నువ్వు. నీకు నేను. నీ మాటలు నాకు అర్థం కావు. మాటలే అర్థం కానప్పుడు మనిషితో రిలేషన్ నిలుస్తుందా చెప్పు’’.. తల పట్టుకుంది. మణిచందన. ‘‘నాకూ ఇష్టం లేదు చందనా నువ్వంటే. కానీ నిన్ను ప్రేమిస్తున్నా. ఇష్టాన్నీ, ప్రేమను వేరు చేసి చూడలేవా నువ్వు?’’ ‘‘చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్నీ, ప్రేమను వేర్వేరుగా ఎలా చూస్తారు చెప్పు?’’ ‘‘ఎలానా?! నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వంటే నాకూ ఇష్టం లేదు. మన ఇష్టాల్ని పక్కన పడేద్దాం. ప్రేమకు ఇష్టాలు ఉండవా? వాటిని మనం గౌరవించలేమా చందనా?’’ ‘‘ప్రేమకు ఇష్టాలేంటి విహాన్? మనుషులకు కదా ఉండేది ఇష్టాలైనా, ప్రేమలైనా?’’‘‘పొరపాటు చందనా. ప్రేమ నన్ను ఎంపిక చేసుకుంది నిన్ను ఇష్టపడమని. అదే ప్రేమ నిన్ను ఎంపిక చేసుకుంది.. నాపై నీ ఇష్టాన్ని తెంపేసుకోమని’’‘‘అంటే.. విహాన్?!’’ ‘‘మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా.. మనల్ని కలపడానికో, విడదీయడానికో ప్రేమ మన ఇద్దరినీ ఒక సెట్‌గా ఎంపిక చేసుకుంది చందనా’’ అన్నాడు విహాన్. చందన భయపడింది. ‘‘విహాన్.. మనం ఎందుకు విడిపోయామో తెలుసా? ఇదిగో ఈ క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ నాకు అర్థం కాకనే! నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేవా విహాన్. ఇప్పుడైనా, విడిపోయాకైనా..’’ వేడుకుంటోంది చందన. ‘‘ఓకే చందనా. నువ్వు నన్ను ప్రేమించొద్దు. కానీ నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నువ్వు తెలుసుకుంటే చాలు నాకు’’. ‘‘అప్పుడేమౌతుంది విహాన్?’’ ‘‘ఏం కాదు. ఏం కాకపోవడమే కదా మీ అమ్మాయిలకు కావలసింది. ఏం కాదు కాబట్టే కాఫీ తాగడానికి వస్తారు. ఏం కాదు కాబట్టే మాటల వరకు వస్తారు. ఏం కానంత వరకూ.. ఎంత దూరమైనా వస్తారు’’.‘‘ఇప్పుడు నీకేం కావాలి విహాన్?’’ ‘‘నాకేం కావాలి అని అడక్కు చందనా. నా ప్రేమకు ఏం కావాలీ అని అడుగు.’’ ‘‘సరే.. నీ ప్రేమకు ఏం కావాలట?’’ ‘‘నీ చెంప పగలగొట్టాలట! కొట్టేదా?’’ అన్నాడు విహాన్. ‘‘నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు అడిగి ఏదీ చెయ్యరు విహాన్. నా బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చావు. అడిగే ఇచ్చావా?’’. పెద్దగా నవ్వాడు విహాన్. చందన కూడా నవ్వింది. విహాన్ చందనను దగ్గరకు తీసుకునేలోపే, చందన విహాన్ గుండెల్లోకి వెళ్లిపోయింది. నూటా నలభై మూడోసారి వాళ్లలా కలుసుకోవడం. ‘‘ఏంటి చందనా నాతో మాట్లాడవు?! మొహం మొత్తేశానా? ఇంకెవడినైనా లవ్ చేస్తున్నావా? చెప్పు మీ ఇద్దరికీ పెళ్లి చేసేసి, నేను తప్పుకుంటా. నా ఫోన్లో నీ నెంబరు కూడా ఉంచుకోను. డిలీట్ చే సేస్తా’’. ‘‘పెళ్లి మేమిద్దరం చేసుకుంటాం కానీ, నువ్వు నా నెంబరు డిలీట్ చేస్కో... చాలు.’’‘‘ఎవడు వాడు?’’‘‘నువ్వే చెప్పాలి ఎవడో వాడు. అన్నావ్ కదా.. ఇంకెవడినో లవ్ చేస్తున్నానని!’’‘‘సారీ.. ఏమైంది చెప్పు’’‘‘అయిందని నేను చెప్పానా?’’‘‘మాట్లాడ్డానికి ఏమయ్యిందీ అంటున్నా చందనా.. నీకేదో అయిందని కాదు?’’‘‘నాకు స్పేస్ కావాలి విహాన్. కొన్నాళ్లు నీ నుంచి స్పేస్ కావాలి’’ ‘‘వాట్’’ అన్నాడు విహాన్.‘‘ఎస్’’ అంది చందన.‘‘నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా నుంచి స్పేస్ కోరుకుంటావా చందనా. నీ జీవితానికి నేను అంత ఇరుకైపోయానా?’’‘‘నిజంగా నిన్ను ప్రేమించాను కనుకే.. నువ్వు నాకు ఇరుకైపోయావని నీతో మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను విహాన్’’‘‘నువ్విప్పుడు మాట్లాడేది క్యాచ్ ట్వంటీటూ లాంగ్వేజ్ కాదా చందనా?’’ ‘‘ఏ లాంగ్వేజో నాకు తెలీదు. అర్థం అయ్యేలా చెప్పగలిగానని మాత్రం అనుకుంటున్నా. నీ ప్రేమ బరువును నేను మోయలేకపోతున్నాను విహాన్’’.‘‘చావు’’ అన్నాడు విహాన్. మూడొందలా నలభై ఒకటోసారి వాళ్లలా విడిపోవడం. ‘‘అబ్బ.. చంపుతున్నావ్ విహాన్. ఇష్టాన్ని, ప్రేమను వేర్వేరుగా చూసి ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు. చచ్చిపోనా? ఎప్పుడూ అంటూంటావుగా చావమని’’ అంది చందన. ‘‘చచ్చిపోవద్దు’’ ‘‘మరి!’’ ‘‘బతికించు’’ ‘‘ఎవర్ని?!’ ‘‘నన్నే’’ ‘‘బాగానే ఉన్నావ్‌గా, నన్ను చంపుకు తినడానికి. ఇంకా ఏం బతికించాలి నిన్ను’’.‘‘మనిషిగా నన్ను బతికించు చందనా. ప్లీజ్. ఏడుస్తోంది చందన. విహాన్ సమాధి పక్కనే కూర్చొని. ‘‘వెళ్దాం పద.. చీకటి పడుతోంది’’ అంది యోగిత. ఇద్దరూ నడుస్తున్నారు. ‘‘మనిషిగా బతికించమని అంటే ఏంటి చందనా?! విహాన్ ఎందుకలా అన్నాడు’’ ‘‘తెలీదు యోగిత. కానీ మనిషిగా ఉన్నప్పుడు మాత్రం విహాన్ అలా అనలేదు.’’ ఉలిక్కిపడింది యోగిత. ‘‘అంటే..?! ‘‘ఆ రోజు ఇద్దరం బాగా గొడవ పడ్డాం. ఎప్పుడూ నన్ను చావు.. చావు.. అనేవాడు. ఆరోజు మాత్రం ఫస్ట్ టైమ్ నేను అన్నాను విహాన్ని చావమని’’. కన్నీళ్లు ఆగట్లేదు చందనకి. ‘‘ఊరుకో చందనా.. ప్లీజ్’’ అంటోంది యోగిత. ‘‘చావమనగానే చావడానికి వెళ్లిపోయాడు స్టుపిడ్. చచ్చిపోయాక వచ్చి బతికించమన్నాడు. ఇప్పుడు కూడా వాడు ఇక్కడ ఎక్కడో నా పక్కనే ఉండి ఉంటాడు. బతికించు చందనా.. బతికించు చందనా.. అని బెగ్ చేస్తూ ఉండి ఉంటాడు’’.. ఏడుస్తోంది చందన. ‘‘ఆత్మలు నిజంగానే ఉంటాయంటావా చందనా?’’ అడిగింది యోగిత, చందన చేతిని గట్టిగా పట్టుకుంటూ. చందన వెనక్కి తిరిగి విహాన్ సమాధి వైపు చూసింది. ‘‘తెలీదు యోగితా. కానీ ప్రేమ ఉంటుంది’’ అంది. -
ఉపఖండ స్ఫూర్తికి జ్ఞానపీఠ కీర్తి
‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులోనూ ఆ రచనకన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే కృష్ణ సొబ్తి సాహిత్యం జ్ఞానపీఠానికి ఒక ఉపఖండ పరిమళం. అనగా అనగా అమెరికాలో ఉన్న ఒక భారతీయ పెద్దమనిషి సంత్ సింగ్ చత్వాల్, హోటల్ వ్యాపారంలో స్థితి మంతుడు. తనపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కొన్నేళ్ళ కిందట, తానెలా పద్మభూషణ్ పురస్కారానికి అర్హుడో, అది తనకు రాకుండా ఎలా ఆటంక పరుస్తున్నారో, టీవీలో చెప్పి చెప్పి బాధ పడుతున్నాడు. అదే ఏడాది ప్రముఖ రచయితలు కృష్ణ సొబ్తి, బాదల్ సర్కార్, తమకు ప్రకటితం అయిన పద్మభూషణ్ పురస్కారాలను తిరస్కరించారు. అప్పుడీ చత్వాల్ అవార్డ్ యావ టీవీలో చూసి తీరాల్సిందే అని చమత్కరించుకున్నారు కూడా. తరువాత కొన్నేళ్లకు అవార్డ్ వాపసీ చేస్తున్న రచయితలతో బాటుగా తన సాహిత్య అకాడమీ అవార్డ్ వాపస్ చేశారు కృష్ణ సొబ్తి. దేశ స్వాతంత్య్ర కాలానికే, 22 ఏళ్ల వయసుగల తరంగా, వీరి రచనల్లో దేశ విభజన బలంగా పలి కింది. స్త్రీ లైంగికత, శారీరక అవసరాల గురించి ‘‘మిత్రో మోర్జని’’ నవలలో రాశారు కృష్ణ సొబ్తి. ‘‘టు హెల్ విత్ యు మిత్రో’’ పేరిట ఈ రచన ఆంగ్ల అనువాదం అయ్యింది కూడా. తన తొలినాళ్ళ కథానిక, ‘‘సిక్కా బదల్‌గయా’’ (నోట్లు మారిపోయాయి) ఉపఖండం రెండు దేశాలుగా చీలిపోతున్న విషాద చిత్రణ చేసిన ముఖ్య రచనల్లో ఒకటి. ఈ రచన అచ్చు వేసింది ఆజ్ఞేయ్ పేరుతో ప్రసిద్ధమైన హిందీ సాహిత్యవేత్త. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఈ యువ రచయిత్రి కథానికను అచ్చు వేశారు. అప్పట్లో ఈమెకి అదొక పెద్ద సంబరం. ప్రతి పదంలో, భావన పలకడంలో ప్రసూతి వేదన నిజమైన రచయితలు అనుభవిస్తారు అంటారు కృష్ణ సొబ్తి. ‘‘సృజనాత్మక రచన, రచయిత చేతిలో ఆట బొమ్మ కాదు. ఆ రచయిత మానసిక, తాత్విక, భాషాపరమైన ఆవరణపు ఫల స్వరూపం అది. మాటలు రాయడంలో ఒక రచయిత వాటి ద్వారా, తాను సృష్టి చేస్తున్న సమాజాన్ని నేస్తాడు. నేను నా ప్రతి రచనలో నా భాషను మార్చేస్తానని అంటారు. ఇది నేను కావాలని చేసేది కాదు. జరిగే సృష్టి, వాటికి అవసరం అయిన పరిస్థితులను విధిస్తుంది సృష్టికర్త పైన. నేను రాసేటప్పుడు, నా రచనతో కొంత దూరాన్ని ఉంచుకుంటాను. తగు దూరం ఉండేలా (ఈక్విడిస్టెన్స్) అన్ని దిశలనుంచి చెరో వేపు లాగుతున్న దశ ఇది’’ అని వివరిస్తారు. ‘‘జిందగీనామా’’ రచన ఈమెకు పేరు తెచ్చిపెట్టిన ఒక బృహత్ నవల. ఇందులో 500ల పాత్రలు ఉన్నాయి. ఈ కథ అంతా రాశాక, దాన్ని పైకి చదువుకోవడం ఈమెకు అలవాటు. రాసేది, రాత్రి సాయంత్రం మొదలు పెట్టి, రాత్రి తెల్లారే దాకా. ఇక అప్పుడు పడుకోవడం. అలా ఈ జిందగీనామా పూర్తి అయ్యాక, పైకి చదువుకోవడం మొదలు పెడితే ఇది ఏకంగా మరునాడు రాత్రి దాటి పోయి, మూడో రోజు ఉదయంలోకి కొనసాగిన ఒక పఠన ధారావాహిక. అంతా అయ్యాక, అప్పుడు ఆరంభం బిగితో రాలేదు అనిపించి, తిరిగి, దాన్ని రాసేందుకు కూచున్న పనిమంతురాలు కృష్ణ సొబ్తి. ఇంగ్లిష్‌లో చదువుకున్నారు కదా, మరి హిందీ ఎలా మీ సాహిత్య భాష అయింది అన్న ప్రశ్నకు కృష్ణ సొబ్తి స్పందిస్తూ ‘‘అనేకమంది భారతీయ రచయితలు హిందువులైనా, ముస్లింలైనా హిందీలో రాశారు. వారిలో మాలిక్ మహ్మద్ జయసి, తులసీదాస్, కబీర్ మొదలగు వారున్నారు. హిందీ భాషకు ప్రత్యేకమైన ధ్వని ప్రపంచం ఉన్నది. ఈ ధ్వని లోకంలోని పలు భాషల నుంచి వచ్చింది. ప్రతీ మాటకు ఒక తనదైన ధ్వని ముద్ర ఉన్నది. పంజాబీ నుంచి వచ్చిన మాటలు ముతకగా, మొరటుగా శబ్దం చేస్తాయి, రాజస్తాన్ నుంచి వచ్చి చేరినవి, చాలా క్లుప్తంగా, పొందికగా ఉంటాయి. నా సృజన ప్రపంచంలో ఎన్నో హిందీ పలుకుబళ్ళు, ఉర్దూ, సంస్కృతం కూడా ఉంటాయి. నేను నా మొదటి నవల రాస్తుండగా, ప్రఖ్యాత హిందీ రచయిత అమృత్లాల్ నగర్, ఇలాంటి పంజాబీ కలిసిన హిందీ నిలబడదు అని అన్నారు. నేను ఒక్క పదేళ్ళు ఆగి చూడండి అని బదులిచ్చాను. మేము హిందీ రాయడం మొదలు పెట్టిన కాలంలో అది కాయగూరల భాష అని అందరూ వెక్కిరించే వారు, కానీ ఒక దశాబ్దిలోనే నిర్మల్ వర్మా, ఫణీశ్వర్ నాథ్ రేణు వంటి రచయితలు, ప్రజల, పాఠకుల దృష్టి తమవేపు ఆకట్టుకున్నారు’’ అని వివరిస్తారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా సాహిత్య దృక్కోణాలు ఉండగలవు అని నేను అనుకోను. సిద్ధాంతకర్తలు ఇలా ఇరుకు దృష్టితో చూడవచ్చునేమో కానీ, గొప్ప రచనలు వాటిలో సహజంగానే, స్త్రీ, పురుష పార్శా్వల సంబంధిత అంశాలతో కూడి ఉంటాయని నేను భావిస్తాను. మగవాడు రాసినంత మాత్రాన ఆ రచనలో స్త్రీల జీవితం చిత్రణ కాకూడదు అని లేదు. ఉదాహరణకు నేను ‘‘హష్మత్’’ అనే మగ పేరుతో రాసేదాన్ని. ఆలా రాసేటప్పుడు నా భాష, నా చేతి రాత కూడా మారిపోయేవి. ఇవి కృష్ణ సొబ్తి రాసిన వాక్యాలేనా అని నేను చకిత నయ్యేదాన్ని, అదే కళకు గల సంక్లిష్టత, ప్రత్యేకత అని స్పష్టం చేస్తారు. తన తొంభైరెండేళ్ల జీవితంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొంది, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని నమ్మి ఆచరించే ప్రగతి శీల సాహిత్యవేత్త కృష్ణ సొబ్తి. ‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులో కూడా ఆ రచన కన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే ఈమె సాహిత్యం జ్ఞాన పీఠానికి ఒక ఉపఖండ పరిమళం, కావ్యం విశ్వ శ్రేయస్సు కోసమే అనే సనాతన వివేకానికి ఒక నవీన నిరూపణం. వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 రామతీర్థ -
భాషల్లో తేడాలు గుర్తించే గర్భస్థ శిశువులు!
గర్భంలో ఉండే శిశువు ఎనిమిదో నెల నుంచి వేర్వేరు భాషలను గుర్తించగలదని అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. కాన్సస్ విశ్వవిద్యాలయ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు 24 మంది గర్భిణులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. గర్భస్థ శిశువుల గుండె చప్పుళ్లతోపాటు అతిసూక్ష్మ స్థాయిలో ఉండే అయస్కాంత క్షేత్రాలను గుర్తించే బయోమాగ్నెటో మీటర్స్‌ను ఇందులో ఉపయోగించారు. ఇంగ్లిష్, జపనీస్ భాషల్లో రికార్డు చేసిన కొన్ని మాటలను వినిపించారు. ఇంగ్లీష్ భాషలో సంభాషణలు విన్నప్పుడు శిశువు గుండె చప్పుడు సాధారణంగా ఉండగా.. జపనీస్ భాషలో విన్నప్పుడు మా త్రం స్పష్టమైన తేడాలు కనిపించాయి. రెండు భాషల ఉచ్ఛారణల్లో తేడా ఉండటం వల్ల ఇలా జరుగుతుందని.. తల్లి మాటలతోపాటు గర్భంలో ఉండే శబ్దాలకు అలవాటు పడ్డ శిశువు ఇతర భాషలో మాటలు విన్నప్పుడు వచ్చిన స్పందన గుండె చప్పుడులో మార్పులకు కారణమవుతోందని పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మినాయి తెలిపారు. -
ప్రాచీన హోదాను ఖూనీ చేస్తున్నారు
భాషను పట్టించుకోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు సాహిత్యంపై రాష్ట్ర విభజన ప్రభావం ప్రముఖ కవి ఆచార్య జయధీర్ తిరుమలరావు రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సాహిత్యంపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ కవి, విమర్శకుడు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, పరిశోధనా సంస్థల విశ్రాంత సంచాలకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాఠకులు కూడా వేరయ్యారని చెప్పారు. పురమందిరంలో ఆదివారం నిర్వహించిన సినారె సంస్మరణ సభలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగ సాహిత్యం పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే... ప్రభుత్వాల అసమర్ధతకు పరాకాష్ట కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా... రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఈ హోదాను చంపేస్తున్నాయి. ఈ విషయం చెప్పడానికి మొహమాటం అవసరం లేదు. పరిశోధనలకు నిధులు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో శ్రద్ధ తీసుకోరు. మైసూర్లో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రంలో ఉన్న మన తెలుగు విభాగాన్ని సొంత గడ్డపైకి తెచ్చుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. మన పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఏనాడో తమ తమిళ విభాగాన్ని అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రానికి తీసుకుపోయింది. మన భాషను మనం కాపాడుకోవాలి... అభివృద్ధి చేసుకోవాలి... కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం విచారకరం. విభజన ప్రభావం సుస్పష్టం తెలంగాణ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు ఇక్కడికి చేరడం లేదు. పత్రికలు, ప్రచురణకర్తలు విడిపోయారు. ప్రముఖుల రచనలు మినహాయించి, ఒక ప్రాంతంలో అచ్చయ్యే పుస్తకాలు మరో చోట లభ్యం కావడం లేదు. అటు తెలంగాణలో నవకేతన్, నవ తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు చాలా వరకూ ఆయా ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. సినారె అందరి వాడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్ధివ శరీరం వద్ద ఆ రోజు ఉదయం నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మరి కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నారు. మహాకవి అంతిమ ప్రస్థానంలో రాజకీయాలు చూడొద్దు. సినారె అందరి వాడు. ఆయనకు అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్నారు. పూర్వ వైభవం సంతరించుకోవాలంటే... నేను బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యపీఠానికి ఇన్చార్జి డీన్‌గా పనిచేశాను. ఈ రోజున సాహిత్యపీఠం పూర్వవైభవం తిరిగి సంతరించుకోవాలంటే గట్టి రాజకీయ సంకల్పం కావాలి. ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం కావాలి. అవి తగిన స్థాయిలో వ్యక్తం కావడంలేదు. కొన్ని సంస్థలు ఉమ్మడి జాబితాలో ఉంటేనే మేలు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం పరిశోధనా సంస్థ వంటివి ఉమ్మడి జాబితాలో ఉంటేనే భాషాసాహిత్యాలకు మేలు జరుగుతుంది. ఈ సంస్థ నిర్వహించే తాళపత్రాల సేకరణ, అధ్యయనం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా జరిగితే మంచిది. ఈ విషయంలో వేరుకుంపట్లు అనవసరం. -
కన్నుల భాషలు
-
భాషకాదు.. కథాంశమే ముఖ్యం
దంగల్ డైరెక్టర్ నితిష్ తివారీ అమలాపురం : ‘భాష ఏదన్నది కాదు.. కథాంశమే ముఖ్యం. బాలీవుడ్లో మాత్రమే సినిమా తీయాలనే ప్రత్యేక నియమం ఏదీ నేను పెట్టుకోలేదు. మంచి కథాంశం దొరికితే ఏ భాషలోనైనా సినిమా తీస్తాను’ అని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ రైటర్ నితిష్ తివారి. కోనసీమలో ‘మీ నిజమైన సంపద’ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణకు వచ్చిన ఆయన తన భావాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. కథకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. కథను బట్టే ఏ భాషలో తీయాలనేది నిర్ణయించుకుంటాను. ఇప్పుడు తీస్తున్న షార్ట్‌ఫిల్మ్ హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. కథలు పూర్తయ్యాకా ఏ కథాంశం బాగుంటే దానినే తెరకెక్కించే సన్నాహాలు చేస్తాను. – ఇప్పటి వరకు మూడు సినిమాలు తీశాను. దంగల్ సినిమా తీసేందుకు రూ.70 కోట్ల వరకు ఖర్చయితే.. దేశంలో రూ.850 కోట్ల వరకు వసూలు చేసింది. సినిమాలకు ముందు నేను చాలా షార్ట్‌ఫిల్మ్స్, యాడ్‌ఫిల్మ్ ్స చేశాను. మూడు గంటల సినిమా అయినా.. మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ అయినా నేను ఒక విధంగా కష్టపడతాను. – రెండు,మూడు నిమషాల షార్ట్‌ఫిల్మ్ తీయడం చాలా సులువు అని అందరూ అనుకుంటారు. కానీ అదే చాలా కష్టం. రెండున్నర గంటల్లో చెప్పాల్సింది రెండున్నర నిమిషాల్లో ప్రేక్షకులకు చెప్పడం అంత సులువేం కాదు. కథతోపాటు నటీనటుల హావభావాలు, సున్నితాంశాలను చాలా తక్కువ సమయంలో ఎక్కువ చూపించాలి. – బాహుబలి పార్ట్–1, పార్ట్–2 చూశాను. చాలా అద్భుతంగా ఉంది. కెమెరాతో మొదట తీసేదానికి గ్రాఫిక్స్‌లో విజువలైజేషన్‌కు చాలా తేడా ఉంటుంది. ఇది దర్శకుని ప్రతిభమీద, అతని ఊహాశక్తిపైన ఆధారపడుతుంది. ఈ విషయంలో రాజమౌళి చాలా అద్భుత ప్రతిభ చూపారు. అందుకే బాహుబలికి అంతక్రేజ్ వచ్చింది. – బాహుబలి వసూళ్లను మించిన సినిమా తప్పకుండా వస్తుందనే నేను నమ్ముతున్నాను. రావాలి కూడా.. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తుంది. – టాలీవుడ్‌కు.. బాలీవుడ్‌కు చాలా తేడాలున్నాయి. సినిమా మేకింగ్ విషయంలో కూడా తేడా ఉంది. అయితే రెండుచోట్లా ప్రేక్షకులు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు ఇండస్ట్రీలలోను సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. – కోనసీమ చాలా బాగుంది. ఇంత మండు వేసవిలో కూడా పచ్చదనమే కనిపిస్తోంది. ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ ప్రజలు చూపుతున్న ఆదరణ, వారు పలుకుతున్న స్వాగతం మనస్సుకు చాలా హాయినిస్తోంది. పచ్చని ప్రాంతంలో పనిచేయడం మరిచిపోలేను. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నాలుగు రోజులుగా పనిచేస్తున్నాను. మరో రెండు రోజులు పనిచేయాల్సి ఉంది. -
అన్ని రంగాల్లోనూ తెలుగు భాషను అమలు చేయాలి
పాశ్చాత్య ప్రభావంతో మాతృభాషకు ముప్పు చిన్నారుల్లో తెలుగుపై మమకారం పెంచాలి ‘సాక్షి’తో కవి, రచయిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ రాజమహేంద్రవరం రూరల్ : అమ్మ ఒడి లాంటి బడిలో నేర్చుకున్న మన మాతృభాషకు పాశ్చాత్య నాగరికత, సంస్కృతి వల్ల కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రముఖ కవి, రచయిత, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలన, బోధన, జనజీవన రంగాల్లో తెలుగును పూర్తి స్థాయిలో అమలు చేసిననాడే న్యాయం జరుగుతుందని చెప్పారు. బొమ్మూరులోని తెలుగు యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగులోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరపాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన తీసుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే మాతృభాషపై మమకారం పెంచాలని, పర భాషను గౌరవించు..మాతృభాషను ప్రపంచానికి చాటి చెప్పు అనే నినాదాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని ఆయన సూచించారు. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలన్నారు. భాష స్వరూపం మార్చేస్తున్నారు ఆధునిక పోకడల పేరుతో మాతృభాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారని ఆవేదన చెందారు. సామాజిక చైతన్యం కోరే దిశగా కవులు, రచయితలు తమ రచనలు కొనసాగించాలని కోరారు. కవిత్వంలో ప్రాసలు, యాసలు కన్నా సామాజిక ఇతివృత్తానికే ప్రాధాన్యత కల్పించాలన్నారు. కవిత్వం నేడు కొత్తదనం కోరుకుంటోందని చెప్పారు. సోషల్‌మీడియా, ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా కవిత్వం రాసేవారు తయారుకావడం హర్షణీయమన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ సారథ్యంలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి, వందలాది మంది కవులను సత్కరించి ప్రోత్సాహిస్తున్నామన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని కవులు, రచయితలతో సంఘం ఏర్పాటు చేయనున్నట్టు ప్రతాప్ తెలిపారు. -
భాషా మూషికం
హ్యూమర్ ప్లస్ అనేక ఫైళ్ళని నమిలి, కొరికి తినిన జ్ఞానముండడం వల్ల ఒక ఎలుకని ప్రభుత్వ కార్యాలయాల సలహాదారుగా నియమించుకున్నారు. తోకా తల రెండూ ఏకకాలంలో ఆడించడం దాని ప్రత్యేకత. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు, అధికారులు కూడా చట్టంతో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోయేవాళ్ళు. నిస్సందేహంగా ఏ పనినైనా చేయగలిగిన వాళ్ళకి కూడా ఒక్కోసారి సందేహాలొచ్చేవి. అపుడు మన ఎలుకని సంప్రదించేవాళ్లు. ‘‘ప్రభుత్వ అవసరాల, సరఫరాల, ఖనిజ లవణ జల, ప్రతిపాదిత చట్టం సెక్షన్ 26 ఎ.బి.సి. క్లాజ్ 391 డి ప్రకారం మానవ వినియోగ సమధర్మ, సమతుల్య సంయోజిత ప్రయోజనమంటే ఏంటి?’’ అని అడిగేవాళ్ళు.దానికి మన ఎలుక ముందరి కాళ్ళతో ముక్కు గోక్కుని, మీసాలు సవరించుకుంటూ ‘‘ఇట్ మస్ట్ బి బై ఆల్ మీన్స్ నెవర్ అండర్స్టాండింగ్ టేకెన్ బై సంథింగ్ గివెన్ బై నథింగ్’’ అని చెప్పేది. ఇంగ్లి్లష్‌లో వున్న గొప్పతనం ఏంటంటే, వచ్చిన వాళ్ళకంటే, వస్తుందనుకునేవాళ్ళే ఎక్కువ. ఈ సూత్రాన్ని కనిపెట్టింది ఎలుక. అవతలోడు ఏం మాట్లాడినా ఆబియస్లీ ఆసం అని అరిచేది. ఎలుక ఏం మాట్లాడుతోందో అర్థం కాకపోయినా, అధికారులు తమకి తోచిన అర్థాన్ని అనువాదం చేసుకునేవాళ్ళు. అనువాదం ఒక జీవ నది. నీటిచుక్కని రుచి చూస్తే చాలు, నదిపైన ఏకంగా కావ్యమే రాసేయచ్చు. అలాగే ఇంకోసారి ‘‘తూనికలు, కొలతలు తొంభైయారు చుట్టుకొలతల చట్టం ప్రకారం, ధనధ్రువ ముక్తాయింపు, నిశ్చేష్ట నిర్మూలనా నిబద్ధ శేషవిలువ గురించి చెప్పండి’’ అని అధికారులు అడిగితే – ‘‘వెయిట్స్ అండ్ హైట్స్ ఆల్వేస్ స్ట్రెయిట్, కాలిక్యులేటెడ్ అండ్ డిఫైన్డ్ రిఫైన్డ్ బై వేరియస్ పీపుల్ అండ్ ఎనిమల్’’ అని అర్థం చెప్పింది ఎలుక. జీవితమే అర్థంకాక లోకమంతా గందరగోళంగా వుంటే పదాల అర్థాల గురించి ఆలోచించే ఓపిక ఎవరికుంది? అందువల్ల మన ఎలుక సజావుగా ఉద్యోగం చేసుకునేది.ఒకసారి కాస్తోకూస్తో ఇంగ్లి్లష్ వచ్చిన అధికారి దానికి ఎదురయ్యాడు. వాడు నేరుగా ఇంగ్లి్లష్లోనే ప్రశ్నించాడు. ఎలుక కొంచెం కంగారుపడి వెంటనే తమాయించుకుంది.‘‘ఇష్ట ఫలేశ్రుయః కషాంతే కాకీకెకైకఃకహ!’’ అని బదులిచ్చింది. ఎదుటివాడు భక్తితో చేతులు జోడించి ‘‘మహాప్రభూ, సంస్కృతంలో మాట్లాడుతున్నారా?’’ అన్నాడు. తమకి రాని భాష ఎవడు మాట్లాడినా భయంభక్తి అసంకల్పితంగా ఏర్పడతాయి. ‘‘నా దృష్టిలో ప్రభుత్వమంటే దైవంతో సమానం. అందుకని దేవభాష మాట్లాడుతున్నా’’ అని చెప్పింది ఎలుక. దాని ప్రతిభని గుర్తించిన ప్రభుత్వం వారు ఉత్తరకొరియాలో జరుగుతున్న భాషా ఉత్సవాలకి ప్రతినిధిగా పంపారు. కొరియా భాషలో జంకుగొంకు లేకుండా కవిత్వం కూడా చదివింది.‘‘మీకు మంగోలు భాష తెలుసా?’’ అని అడిగాడు కొరియా మంత్రి. ‘‘ఒక్క మంగోలేంటి, అన్ని అడ్డగోలు భాషలు తెలుసు’’ అని చెప్పింది ఎలుక. నోటికొచ్చిన భాషలో కవిత్వం చదివితే, దాన్ని మంగోల్గా వాడు గుర్తించినందుకు సంతోషపడింది.కాలం ఒక్క తీరుగా వుండదు. పచ్చని చెట్టుకి కూడా చెదలు పడతాయి. కాలు మీద కాలేసుకుని మనం కూర్చునేలోగా, మన కాళ్ళు లాగేవాడు ఒకడు పుడతాడు. ఒక చెదపురుగు ఎలుకకి పోటీగా వచ్చింది. ‘‘పుస్తకాలని అక్కడక్కడ రుచి చూసిన ఎలుకకే అంత జ్ఞానముంటే, పూర్తిగా నమిలి, పొడిపొడి చేసిన నాకెంతుండాలి?’’ అని పోటీకి దిగింది.ఊహించని శత్రువు ఎదురైనపుడు ఊహలతో, వ్యూహాలతో పనులు జరగవు. ఈ ఎరుక వున్నందువల్ల మన ఎలుక వెంటనే చెదపురుగుని నమిలి తినేసింది.‘‘అది జ్ఞానాన్ని తింటే, దాన్ని తినడం నా జ్ఞానం’’ అని లోకానికి తెలియజేసింది. – జి.ఆర్. మహర్షి -
జాతీయస్థాయిలో కవుల ప్రతిభ
– ముగ్గురు కవులకు పురస్కారాలు మహానంది: మైసూరులోని కేంద్ర భారతీయ భాషల సంస్థ, న్యూఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఆదివారం నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో మన కవులు ప్రతిభ చాటారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీఎం దాస్, తిమ్మాపురం జెడ్పీపాఠశాలలో పనిచేస్తున్న ఎల్ఎన్ నీలకంఠమాచారి, ఎస్.మహబూబ్‌భాషలకు జాతీయస్థాయిలో పురస్కారాలు లభించాయి. సీఐఐఎల్ డైరెక్టర్, ఫ్రొఫెసర్ డిజీరావు, కర్ణాటక తెలుగు రచయితల సంఘం సమాఖ్య కార్యదర్శి మాల్యాద్రి, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్పీ మహాలింగేశ్వర్‌లు పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. ఫోటో– 19 ఎస్ఆర్ఐ 55...జాతీయస్థాయిలో పురస్కారాలు పొందిన ముగ్గురు కవులు -
అమ్మ భాషకు ఊపిరిపోద్దాం
నన్నయలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : జన్మనిచ్చిన తల్లిని, మాటలు నేర్పిన మాతృ భాషను ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకోవాలని, అవే మన మనుగడకు మార్గాలవుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితల సాహిత్య సమ్మేళనాన్ని మంగళవారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మ భాష గొప్పదనం, అమ్మ భాష కమ్మదనం తెలుగు భాషకు ఉందంటూ ఎందరో కవులు లిఖించిన వర్ణణలను ఉటంకిస్తూ ప్రపంచ భాషలో ఆ మాధుర్యం ఒక్క తెలుగులోనే దొరుకుతుందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స’గా వర్ధిల్లిన మాతృభాష అంతరించిపోతున్న భాషల్లో చేరడం నిజంగా దురదృష్టకరమన్నారు. మాతృభాష పరిరక్షణకు కవులు, రచయితలు తమ కలాలను, గళాలను విప్పాల్సి ఉందని విశిష్ట అతిథి స్పెయిన్ రచయిత, ప్రీలాన్స్ జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ అశోక్ బీర అన్నారు. పాశ్చాత్య దేశాలలో మాతృభాషలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని, వారి విద్యా బోధన ఆయా భాషల్లోనే జరుగుతుందన్నారు. మరో విశిష్ట అతిథి, సీనియర్ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికలు కూడా ఆంగ్ల పదాలకు తగ్గించి, తెలుగు పదాల వాడకం పెంచాలన్నారు. పాలన, బోధన, జనజీవన రంగాలలో తెలుగు భాషను కచ్చితంగా అమలు చేయాలని తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. తెలుగు భాషకు సీపీ బ్రౌన్ చేసిన కృషిని నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు గుర్తు›చేశారు. అమ్మ, అమ్మ భాషను మరిచిపోతే సమాజం మనుగడను కూడా కోల్పోతుందని సదస్సు సంచాలకులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం, కాకినాడ, రాజోలు, రామచంద్రాపురం, పాలకొల్లు, భీమవరంలలో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. తీర్మానాలు.. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగులో విద్యా బోధన జరగాలని, పాఠశాల నుంచి కళాశాల వరకు విధిగా తెలుగు భాషను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్ డాక్టర్ ఆర్. జానకీరావు, కోఆర్డినేటర్స్ డాక్టర్ నిట్టల కిరణ్‌చంద్ర, డాక్టర్ పి.లక్ష్మీనారాయణ, డాక్టర్ డి.లక్ష్మీనరసమ్మ, డాక్టర్ జి.ఎలీషాబాబు, విద్యార్థులతోపాటు కళాసాహితీ, రమ్య సాహితీ, నన్నయ వాజ్మయపీఠం, స్ఫూర్తి, కళాస్రవంతి, సీపీ బ్రౌన్ సేవాసమితి, సహృదయ సాహితీ, దళిత చైతన్య వేదిక, వంటి 16 సాహితీ సంస్థలు పాల్గొన్నాయి. ఆయా రంగాలలో పేరుగడించిన స్పెయిన్ రచయిత, ప్రీలాన్స్ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ అశోక్ బీర, సీనియర్ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్, తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్‌లను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. రసరమ్యంగా సాగిన కవి సమ్మేళనం అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో డాక్టర్ కడిమళ్ల శతావధాని, గిడ్డి సుబ్బారావు, జోరశర్మ, దడ్డ దైవెజ, వీడుల శిరీష, డాక్టర్ గిరినాయుడు, గడల, డాక్టర్ రెంటాల, ఎంఆర్వి సత్యనారాయణమూర్తి, గనార, గరికిపాటి మాస్టారు, మద్దల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణపై జరుగుతున్న సదస్సులు, పర్యావరణం, నగదు రహిత లావాదేవీలు, ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలు తదితర అంశాలపై విమర్శలు, ఎత్తిపొడుపులు, పొగడ్తలు ఇలా తమదైన శైలిలో కవులు వ్యంగ, హాస్య, చమత్కార భాణాలను వదులుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. -
తెలుగుభాషకు తృణీకరణా..!
భాషాసాహిత్యాలకు తప్పని ‘చంద్ర’గ్రహణం వెంటిలేటర్‌పై ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల దాతల విరాళాలతో నామమాత్రపు జీతాలు కళాగౌతమి, రచయితల సమితి సమావేశాలకు చోటు కరువు ‘తెలుగదేల యన్న దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు నాడు అన్న మాటలని కాస్తఅటూఇటూ (ఏ)మార్చి, ‘తెలుగదేల? దేశభాషలందు తెలుగు లెస్’ అని నేటి పాలకులు అక్షరాలా రుజువు చేస్తున్నారు. ఆంధ్ర మహాభారతం పుట్టిన రాణ్మహేంద్రవరం గడ్డమీద-వేయి సంవత్సరాలకు మించిన చరిత్రగల తెలుగు భాష నేడు అత్యంత నిరాదరణకు గురి అవుతోంది. తెలుగుభాషా సాహిత్యాల వికాసానికి ఆవిర్భవించిన సంస్థల అస్తిత్వానికే ప్రమాదం ముంచుకొస్తోంది. - రాజమహేంద్రవరం కల్చరల్ అంపశయ్యపై తెలుగుసాహిత్య పీఠం దివంగత నందమూరి తారక రామారావు మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయం. 1985లో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1987లో బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పడింది. సుమారు 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాహిత్య పీఠంలో ఇప్పటి వరకు 340 మంది డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు. 400 మందికిపైగా పరిశోధక విద్యార్థులు ఎం.ఫిల్ పూర్తి చేశారు. సాహిత్య పీఠం గ్రంథాలయంలో అరుదైన 27 వేల గ్రంథాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సాకుగా ప్రభుత్వం సృష్టించిన అనిశ్చిత పరిస్థితితో, నేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎంఏ తెలుగు మొదటి సంవత్సరంలో తొమ్మిది మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో పది మంది విద్యార్థులు మిగిలారు. ‘నేనే వార్డెన్‌ను, నేనే గ్రంథాలయాధికారిని, నేనే డీన్‌ను’ అని సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సాక్షితో అన్నారు. ఇంతటి చరిత్రగల సాహిత్య పీఠం నేడు ఏకోపాధ్యాయ పాఠశాల స్థాయికి దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్యపీఠం అస్తిత్వానికే ముప్పు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రమవుతుందని 2015లో జరిగిన పుష్కరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటన చేశారు. అయితే, ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు సరికదా, అధినేతల నిర్లక్ష్యధోరణితో సాహిత్యపీఠం అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందని, ప్రతిష్టాత్మకమైన గౌతమీ విద్యాపీఠం (ఓరియంటల్ కళాశాల)కు పట్టిన గతే దీనికి పడుతుందని çపలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరాళాలతో మనుగడ గోదావరి గట్టుపై ఉన్న ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలకు సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఎయిడెడ్ హోదా ఈ కళాశాలకు ఉండేది. ఎనిమిది జిల్లాలో అతివలకు తెలుగు, సంస్కృతం బోధించే ఏకైక కళాశాల ఇదే. ఇక్కడ అవధానం నేర్చుకున్న అమ్మాయిలు శతావధానాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తెచ్చిన చీకటి జీవో పుణ్మమా అని ఎయిడెడ్ హోదా పోయింది. ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు రిటైరయితే, ఆ స్థానంలో మరొకరిని భర్తీ చేసే వెసలుపాటు పోయింది. ప్రతినెలా దాతల నుంచి వచ్చిన విరాళాలతో నామమాత్రపు జీతాలు అధ్యాపకులకు చెల్లిస్తున్నారు. ఎన్ని వినతులు ఇచ్చినా ప్రభుత్వంలో కదలిక లేదు. ప్రభుత్వం నిర్వాకం వలన వెంటిలేటర్‌కు చేరుకున్న మరో సంస్థ ఇది. నగరపాలక సంస్థ పాఠశాలల్లో తెలుగుస్థానే ఇంగ్లిష్ భాషను ప్రవేశపెడుతూ జనవరిలో ప్రభుత్వం జారీ జీవో చంద్రబాబు కీర్తికిరీటంలో ‘మరో కలికి తురాయి’. కర్ణాటక రాష్ట్రం, మైసూరులో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రానికి సంబంధించి, తమిళ, కన్నడ, మళయాళ భాషలను ఆయా ప్రభుత్వాలు తమ గూటికి మార్చుకోగలిగాయి. తెలుగుభాషను మాత్రం సొంతగడ్డపైకి మార్చుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి కృషి చేయడం లేదు. స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహం ఏదీ? అమ్మ పెట్టనూ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్న రీతిలో అధికారులు తెలుగు భాషా సాహిత్య వికాసాలకు కృషి చేస్తున్న సంస్థలతో వ్యహరిస్తున్నారు. 25 ఏళ్లుగా యువతకు తెలుగు సాహిత్యంపై అభినివేశం కలిగించడానికి కృషి చేస్తున్న కళాగౌతమి, దశాబ్దకాలంపైగా క్రమం తప్పకుండా జరుగుతున్న రచయితల సమితి సమావేశాలకు కాసింత చోటు తెలుగువారి సాంస్కృతిక రాజధానిలో కరువైంది. నూనూగు మీసాల యువకుల నుంచి తల నెరిసిన వృద్ధుల వరకు హాజరయ్యే రచయితల సమితి నెలకు ఒక్కరోజు తన కార్యక్రమాలకు చోటు ఇమ్మని అధికారులను, ప్రజాప్రతినిధులను పదేపదే కోరినా, స్పందన లేకుండా పోయింది. నన్నయ వాజ్ఞ్మయ వేదిక ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అనేక ఇతర సంస్థలదీ ఇదే సమస్య. తల్లిని, తల్లిభాషను తృణీకరిస్తున్న కాలం ఇది తల్లిని, తల్లి భాషను తృణీకరిస్తున్న-కాదు తరిమేస్తున్న కాలం ఇది. గతంలో పెద్దలు ఇంట్లోనే తెలుగు అక్షరాలు దిద్దించడం జరిగేది. ఇల్లు బడిగా ఉండేది. ఇప్పుడు అ ఆలు బదులు ఏబీసీడీలు మాత్రమే నేర్పుతున్నాం. ఇంగ్లిష్ వ్యాపార భాష. తెలుగు వ్యాపారభాష కాదు. తమిళులకు ఉన్న భాషాభిమానం తెలుగువారికి లేదేమోననిపిస్తోంది. - ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డీన్ తెలుగు సాహిత్యపీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆత్మవిశ్వాసం నింపేది మాతృభాషే ఒక విషయం నిర్మొగమాటంగా చెప్పాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో దాదాపు అందరూ శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన విద్యార్థులు. భాషాసాహిత్యాలను చదివే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం జరుగదు. ఎందుకంటే, సాహిత్యం మనిషిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. - డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు అధ్యాపకుడు, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల -
తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా రవికుమార్
కర్నూలు సిటీ: తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా రావూరి రవికుమార్ ఎన్నికయ్యారు. ఇటీవల వేదిక జాతీయ అధ్యక్షుడు పి.హరికృష్ణ తనను ఎంపిక చేసినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తెలుగు భాషా పరిరక్షణ, మాతృ భాషాభివృద్ధికి తెలుగు దేశం పార్టీ అనుబంధంగా ఈవేదిక ఏర్పడినట్లు వెల్లడించారు. మాతృ భాషాపై ప్రజలో చైతన్యం తీసుకువచ్చేందుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భాషాభివృద్ధికి కృషిచేసే కళాకారులు, కవులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు. -
పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
జాతీయస్థాయి సదస్సులో నన్నయ మాజీవీసీ జార్జ్ విక్టర్. భానుగుడి(కాకినాడ) : మాతృభాషలో అధ్యయనం వల్లే చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందాయని నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యత–సాంఘీకరణ పోకడలు అనే అంశంపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి సరైన సామాజిక దృక్పథం కొరవడిందన్నారు. సోమవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో కుల, వర్ణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యాలు పై విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేనే కుల వ్యవస్థపై అసహనం సమసిపోయి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ పంజాబ్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను చెరసాల నుంచి తప్పించడం జాతీయ సమైక్యతకు ముప్పుగా పరిణమించవచ్చన్నారు. సదస్సులో నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ జాతి సంపదను అసమానంగా పంచబడడం, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవిద్య, ఆహార కొరత మొదలైన అంశాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, కందుల ఆంజనేయులు, యూజీసీ కోఆర్డినేటర్ హరిరామ ప్రసాద్, ఆర్గనైజింగ్ మెంబర్స్ వి.చిట్టిబాబు, కె.నరసింహారావు, స్వామి, పాండురంగారావు, పారేశ్వర సాహు, డాక్టర్ వీపురి సుదర్శన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
నాటకానికి సామాజిక ప్రయోజం ముఖ్యం
విజయవాడ కల్చరల్ : నాటకానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి.విజయభాస్కర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ క్రియేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్థి సంస్థలు సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించిన ద్వితీయ ఆహ్వాన నాటకోత్సవాల ముగింపు సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయభాస్కర్ మాట్లాడుతూ ఆర్ఆర్ క్రియేన్స్ నాటక సంస్థను మహిళలే నిర్వహిస్తున్నారని, అందరూ స్త్రీల పాత్రలతో నాటక పోటీలు నిర్వహిస్తే భాషా సంస్కృతిక శాఖ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నాటకరంగంలో అన్నిశాఖలను మహిళలే నిర్వహించేలా ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ కార్యదర్శి ఎస్. రాజేశ్వరి, కోశాధికారి ఎం.చాందిని, అధ్యక్షులు వై.భవాని తదితరులు ప్రసంగించారు. అనంతరం పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీచేశారు. మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు, మహేశ్వరీప్రసాద్ కామెడీ క్లబ్ అధ్యక్షుడు బాల గంగాధర తిలక్, నటుడు దర్శకుడు సుఖమంచి కోటేశ్వరరావు, బాలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాటకాలు ప్రదర్శించిన సంస్థలకు డాక్టర్ విజయభాస్కర్ జ్ఞాపికలు, నగదుపారితోషికం అందించారు. మధు థియేటర్స్ తుళ్లూరు ప్రదర్శించిన నిశ్శబ్ద సంకేతం, వెలగలేరు థియేటర్స్ సంస్థ ప్రద్శించిన ఎవరికి ఎవరు నాటకం సామాజిక అంశాలను ప్రస్తావించాయి. -
భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానమని హర్పర్ కొల్లిన్స్ డిక్షనరీ బోర్డు స్పెషలిస్ట్ అర్నియా సుల్తానా అన్నారు. రాజమహేంద్రవరం ఆల్‌బ్యాంక్ కాలనీలోని షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏషియాటిక్ స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎక్స్‌క్విజిట్ ఇంగ్లిషు ఈడెన్’ పేరుతో ఇంగ్లిషు వారోత్స ప్రారంభ వేడుకలు బుధవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్నియా సుల్తానా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంగ్లిషు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలు ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ఈనెల 25 వరకు వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, రోల్‌ప్లే, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ కవులు, కవయిత్రుల వేషధారణలో అలరించారు. స్కూలు డైరెక్టర్ తంబాబత్తుల శ్రీవిద్య పాల్గొన్నారు. -
అర్థం పర్థం
జీవితం ఎంతకీ అర్థం కాకపోయేసరికి, ఒకాయనకి నిఘంటువు తయారు చేయాలనే కోరిక పుట్టింది. ఒక పండితుడి దగ్గరకెళ్లి ఈ విషయం చెప్పాడు. ‘‘నీకు భాష తెలుసా?’’ అనుమానంగా అడిగాడు ఆయన. ‘‘తెలుసండి. మన సందు చివర గోలీ సోడాలమ్ముతాడు’’. ‘‘నీ మాటలకేమైనా అర్థంపర్థముందా?’’ అని వంకీ కర్ర వేసుకుని వెంటపడ్డాడు పండితుడు. మనవాడు పారిపోయాడు. ఒక ప్రవచనకర్త ఎదురయ్యాడు. ‘‘స్వామీ అర్థానికి అర్థం తెలుసుకానీ పర్థమంటే ఏంటి?’’ అని అడిగాడు. ఆయన కండువాని మెడకి పరపర రుద్ది ‘‘అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే నీకు అర్థమైందంటే నువ్వు అర్థశాస్త్ర నిపుణుడివై యుంటావు. ఇక పర్థమంటే పరమార్థం. మనుషులు ఆత్మల్ని పరమాత్మని ఆశ్రయించినట్టు, అర్థం కానిదే పరమార్థం’’ అని చెప్పాడు. ‘‘పరమార్థమంటే అర్థం కానిదా? అర్థం లేనిదా?’’ ‘‘అర్థం కానిదంతా అర్థం లేనిది కాదు. అర్థం లేనిదంతా అర్థం కానిదీకాదు.’’ జ్ఞానులు మాట్లాడుతున్నపుడు అజ్ఞానులు అడ్డుతగలడం సర్వసాధారణం. జ్ఞానం నదిలాంటిదైతే అజ్ఞానం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి. చాపకింద నీరులాగా వెళ్లి జ్ఞానాన్ని కలుషితం చేస్తుంది. ‘‘అడ్డగోలుగా వాదిస్తే వేదం కూడా ఓడిపోతుంది. నామవాచకాలు సర్వనామాలుగా మారుతాయి. క్రియ నిష్క్రియగా మారుతుంది. అన్వయం సమన్వయం, అమ్రేడితంగా మారి పీడిస్తాయి’’ ‘‘అయ్ బాబోయ్ మీకు భాష తెలుసా?’’ ‘‘తెలుసు, బస్టాండ్ సెంటర్లో బజ్జీలమ్ముతుంటాడు’’ ‘‘తలకట్టు చూసి, పదకట్టు తెలుసుకున్న, మీదీ కనికట్టేనా?’’ ‘‘నీకు పిచ్చిగిచ్చి వుందా?’’ అని పద్యంలో బాదడానికి ప్రయత్నించాడు. సీసా మద్యం కంటే, సీసపద్యం ప్రమాదమని మనవాడు గ్రహించి పారిపోతుండగా ఒక పొలిటీషియన్ ఎదురయ్యాడు. జనాలకి దండం పెట్ట్టి ఆయన రెండు చేతులు అతుక్కుపోయాయి. అతుకు వదిలించడానికి డాక్టర్ దగ్గరి వెళుతున్నాడు. ‘‘సార్, పిచ్చి అనేది లోకసహజం. అది ఉన్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. పిచ్చి లేనివాళ్లు పిచ్చాసుపత్రిలో, అది ఉన్నవాళ్లు లోకమనే ఆస్ప్రత్రిలో ఉంటారు.’’ ఈ వాలకం చూసి నాయకుడికి కొంచెం కంగారు పుట్టింది. ‘‘ఇంతకూ నీకేం కావాలి?’’ భయంగా అడిగాడు. ‘‘పిచ్చికి అర్థం తెలుసు కానీ, గిచ్చి అంటే అర్థమేంటి?’’ ‘‘అర్థాలు తెలుసుకోవడమంత అనర్థం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యమంటే అర్థం తెలియకుండా పాతికేళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నా, అన్నీ తెలిసినట్టు నిండుకుండలా ఉంటూ, ఏదడిగినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలిగితే డోకా ఉండదు. గిచ్చడమంటే ఓటేయడం. నాయకులు ప్రజల్ని ఓటేయించుకుని గిచ్చితే, ఓటుకు డబ్బులడిగి ప్రజలు నాయకుల్ని గిల్లుతారు. ఇంతకీ ఈ అర్థం గోల నీకెందుకు?’’ ‘‘డి క్షనరి తయారు చేద్దామని’’ ‘‘డికాక్షన్‌కి, డిక్షనరీకి తేడా తెలియని ఆర్డినరీ జనానికి ఎక్స్ట్రార్డినరీ అవసరం లేదు’’ ‘‘అయితే మీక్కూడా ఎంతో కొంత భాష తెలుసన్నమాట’’ ‘‘ఎంతో కొంత కాదు, బాగా తెలుసు, పోయిన ఎలెక్షన్లలో నేను పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశాను’’ అన్నాడు. జిలేబీకి, గులాబీకి తేడా తెలియని జనం లోకమంతటా ఉన్నారు. మూర్ఖత్వాన్ని మొగ్గలోనే తుంచేయాలి అనుకుని మనవాణ్ణి వెంట పెట్టుకుని పండితుడి దగ్గరికెళ్లాడు నాయకుడు. ‘‘చేతులు జోడించి ఉన్న నాయకుణ్ని చూసి పండితుడు ముచ్చటపడి ప్రతి నమస్కారం చేశాడు. ‘‘చెప్పులజోడు. కళ్లజోడులుగా ఇది చేతుల జోడు. దీన్ని విడదీయలేదు’’ అన్నాడు నాయకుడు. ‘‘ఇంతకూ మీరిద్దరూ ఎందుకొచ్చారు?’’ ‘‘భాష అంటే ఒక వ్యక్తి కాదు ఇద్దరని తెలపడానికొచ్చాం’’ అని చెప్పాడు నిఘంటువు తయరీదారు. మలేరియా వచ్చినోడిలా పండితుడు గజగజ వణికాడు. వంకీకర్రతో నాయకుడి చేతుల మీద ఒక్కటేశాడు. చేతులు విడివిడగానే నాయకుడు ఆనందించి... ‘‘ఆగ్రహం వల్ల అనుగ్రహం లభించడమంటే ఇదే’’ అన్నాడు. ‘‘నువ్వు మూర్ఖుడివా? గీర్ఖుడివా?’’ అన్నాడు పండితుడు. గీర్ఖుడికి అర్థం తెలుసుకోవడానికి నిఘంటువు బయలుదేరింది. ‘‘మాటల్లోనే కాదు, మీరు చేతల్లో కూడా పండితులే’’ అనుకుంటూ నాయకుడు వెళ్లాడు. - జి.ఆర్.మహర్షి -
ఆన్లైన్లో భాష సమస్య ఉత్పన్నం కాదు
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైలింగ్ విధానంలో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనూ నిర్వహించుకోవచ్చని భాష సమస్య ఆన్లైన్లో ఉత్పన్నం కాదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకూ ప్రతిఫైలూ ఆన్లైన్లోనే పొందుపరచాలని, అయితే దిగువ స్థాయిలో ఇంగ్లిష్‌లో పట్టులేక ఫైల్‌ను ఆన్లైన్లో పొందుపరచక నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జిల్లాలో రెండేళ్ల నుంచి ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆన్లైన్లో ఫైల్స్ పొందు పరిచే ప్రక్రియ వేగవంతమైందన్నారు. ప్రజలకు సత్వరమే పనులు జరిగేందుకు ఆన్లైన్ విధానం ఎంతో దోహదపడుతుందని అవినీతిని కూడా కొంతవరకూ నిరోధించగలుగుతున్నామన్నారు. పాఠశాల విద్యస్థాయిలో టీచర్లకు బయోమెట్రిక్ విధానాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 382 మంది సిబ్బందికి 298 మంది సిబ్బంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారని మిగిలిన 84 మంది ఎందుకు బయోమెట్రిక్ వేయడం లేదని డీసీహెచ్ఎస్ శంకరరావును ప్రశ్నించారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల అవసరాలకే ప్రాధాన్యం
విజయవాడ (బస్‌స్టేçÙన్) : ప్రయాణికుల అవసరాలే ప్రధానంగా వ్యాపారాలు కొనసాగిస్తేనే ఆర్టీసీ సహకారం ఉంటుందని రీజనల్ మేనేజర్ పీవీ రామారావు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం వోల్వో కార్నర్ సమీపంలో రేవతి విశ్రాంతి లాంజ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందించాలన్న ఆలోచనతో విశ్రాంతి గదులను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని కోరారు. నిర్వాహకుడు ప్రసాద్ మాట్లాడుతూ ఎండీ నండూరి సాంబశివరావు చేస్తున్న బస్టాండ్ అభివృద్ధికి అనుగుణంగా ఈ లాంజ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డీఏం నాగశేషు, బస్టాండ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జాన్‌సుకుమార్, యూనియన్ నాయకులు ఎండీ దుర్గాప్రసాద్, బర్మా ప్రభాకర్, తెలంగాణ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి లాంజ్ ప్రత్యేకత లాంజ్ వోల్వో సర్వీసు ప్రయాణికులు అరగంటపాటు ముందుగా వచ్చి ఉచితంగా ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. టికెట్లు పరిశీలించాకే నిర్వాహకులు లాంజ్‌లోకి అనుమతిస్తారు. ఎక్కువ సమయమైతే చార్జీ వసూలు చేస్తారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం గంటకు రూ.20, ఆపై ప్రతి గంటకు రూ.10 వసూలు చేస్తారు. ఈ ఏసీ లాంజ్‌లో సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. -
తెలుగు భాషా మాంత్రికుడు.. కాళోజీ
దేవరకొండ తెలంగాణ భాషా విశిష్టతను దశదిశలా చాటి చెప్పిన భాషా మాంత్రికుడు కాళోజీ నారాయణరావు అని దేవరగిరి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు పొట్ట ముత్యాలు కొనియాడారు. పట్టణంలోని సంజయ్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాళోజీ జీవిత విశేషాలను, రచనా శైలిని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు నిరసనమెట్ల సుందరయ్య సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొట్ట రాములు, ఉపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య, చిన ముత్యాలు, పావని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
– ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి నంద్యాలరూరల్: భావి తరాల కోసమైన మన మాత భాష తెలుగును పరిరక్షించుకుందామని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. శనివారం నంద్యాల రామకష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ‘70 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు భాష పరిస్థితి’ అన్న అంశంపై సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మాత భాష అయిన తెలుగు అభివద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రాచీన హోదాపై వివాదాలు వస్తున్నా ప్రభుత్వాలు కళ్లు తెరవకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కేంద్ర, ప్రభుత్వం తెలుగుభాషకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు నేర్పాలని కోరారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంద్యాల రఘుబాబు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే తెలుగును అభివద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకష్ణారెడ్డి, సాహితీ స్రవంతి నంద్యాల అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాదాల శ్రీనివాసులు, నాయకులు అన్నెం శ్రీనివాసరెడ్డి, శోభన్‌కుమార్, శేషఫణి, డాక్టర్ రవీంద్రనాథ్, కరీముద్దీన్, శ్రీనిధి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
అనంతపురం సిటీ: తెలుగు భాషకు ప్రాణం పోయాలి..అచ్చ తెలుగును కాపాడు కోవాలని తెలుగు భాషా సంఘం జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ‘కృష్ణా పుష్కర కవితోత్సవం’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పొట్లూరి హరికృష్ణతోపాటు రాష్ట్ర పౌరసంబంధాలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువశ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్‌తో పాటు ప్రముఖ కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణాపుష్కరాల ప్రాధాన్యతను వివరిస్తూ కొందరు, జిల్లా కరువు స్థితిగతులకు అద్దం పట్టేలా మరికొందరు కవులు తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. నేటి తరానికి అచ్చతెలుగు భాషను అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంగ్లంపై మోజుతో తల్లిలాంటి తెలుగు భాషను పక్కన పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కవితలతో మెప్పించిన వారిని తెలుగు భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో కవులు జాబిలి జయచంద్ర, ఏలూరి యంగన్న, రియాజ్, రఘురామయ్య, వెంకటేశులు, జూటూరు షరీఫ్‌లతో పాటు పలువురు ఉన్నారు. -
ఏకాంత ప్రార్థనా జీవితంతో విజయం
సువార్త పాలరాయి భవానికి అందాన్నిస్తుందేమో కానీ పటిష్టత మాత్రం అగోచరమైన, అందవిహీనమైన పునాది రాళ్లతోనే వస్తుంది. పునాది మారదు, మాట్లాడదు, మిడిసిపడదు, కదలదు, కనిపించదు. అందంలాంటి తేలికపాటి బాహ్యాంశం పునాదికి పట్టదు. అందువల్ల తననెవరూ పట్టించుకోకున్నా నొచ్చుకోదు. పునాది జీవితం, భాష కూడా పటుత్వమే, దృఢత్వమే! అప్పుడే ఆరంభమైన ఏలియా ప్రవక్త పరిచర్యకు పునాది లాంటి ఆజ్ఞను దేవుడిచ్చాడు. కెరీతు వాగు దగ్గర కొన్నాళ్లు దాగి ఉండమని దేవుడాయన్ను ఆదేశించాడు. ప్రజల్లో భాగంగా ఉంటూ పరిచర్య చేయవలసిన తనను ప్రజలకు దూరంగా వెళ్లి అజ్ఞాతంలో దాగి ఉండమని దేవుడెందుకంటున్నాడో ఏలియాకు ఏలియాకు వెంటనే అర్థమై ఉండదు. అయినా దైవాజ్ఞకు విధేయుడయ్యాడు (1 రాజులు 17:3). పరమ దుర్మార్గుడైన అహాబురాజు ఎదుట నిలబడి దేవుని మాటల్ని నిష్కర్షగా అతనికి కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అహాబునే ఎదుర్కొన్న తాను ఇంకెవరినైనా అవలీలగా ఎదుర్కోగలనన్న భావంతో ఉన్న ఏలియాకు దేవుడే అజ్ఞాతవాసం విధించాడు. అహాబునెదిరించిన అనుభవం ఏలియాకు గొప్పదే కాని దేవుని దృష్టిలో అది చాలా చిన్న అనుభవం. దేవుని ప్రణాళిక ప్రకారం ఒక రోజున ఏలియా కర్మెలు పర్వత శిఖరం మీద వేలాది మంది ఇశ్రాయేలీయులు, వారిని హేయమైన పూజా విధానాలకు పురికొల్పిన బయలు ప్రవక్తల ముందు నిలబడవలసి ఉంది. అక్కడ బయలు ప్రవక్తలను ఆత్మీయంగా చిత్తుచేసి ఓడించి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని, భయంకరమైన క్షామంతో తల్లడిల్లుతున్న దేశం మీద విస్తారమైన వర్షాలు కురిపించవలసి ఉంది. ఈ కర్మెలు యాగానికి ముందస్తుగా, సిద్ధపాటుగా కెరీతు వద్ద అజ్ఞాతంలో ఉంటూ దేవునితో ఏకాంత ప్రార్థనా జీవితం గడపవలసి ఉంది. కర్మెలు విజయానికి ఈ కెరీతు అనుభవమే పునాది కానున్నది. దేవునితో విశ్వాసులు, పరిచారకుల అనుబంధం ఎంత పటిష్టంగా ఉంటే వారి ప్రార్థనలు అంత శక్తివంతంగా ఉంటాయి. లోక విధానాఉల, మానవ శక్తియుక్తులతో సాగే పరిచర్యలు దేవుని త్రాసులో తేలిపోతాయి, వెలవెలబోతాయి. అవి పరిచారకులకు మేలు కలిగిస్తాయేమో కాని దేవునికి మహిమ కలిగించవు. యేసుప్రభువే తరచుగా కొండల్లోకి వెళ్లి పరలోకపు తండ్రితో గంటలకొద్దీ ప్రార్థనలో గడిపే వాడని బైబిలు చెబుతోందంటే ‘ఏకాంత ప్రార్థనానుభవం’ ఎంత శ్రేష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసుప్రభువు తన శిష్యులను హెచ్చరించాడు (యోహా 14:5). ఆ రహస్యాన్ని పరిచర్యలో అర్థం చేసుకున్న పౌలు ‘నన్ను బలపరుచు దేవునియందే సమస్తం చేయగలనన్నాడు’ (ఫిలి 4:13). తమ జీవితాలు, కుటుంబాలు, చర్చిలు, పరిచర్యల్లో గొప్ప కార్యాలు జరగాలనుకుంటే ముందుగా ‘ప్రార్థన’ అనే పునాది వేసుకోవాలి. ఏకాంత ప్రార్థనా క్రమశిక్షణనలవర్చుకోవాలి. మహా దైవజనులు భక్తసింగ్గారు ఎన్నో లక్షల మందికి ఆశీర్వాదకరంగా పరిచర్య చేశారు. హైదరాబాద్‌లో తన రెండు గదుల నిరాడంబర నివాసంలో ఒక గదిని ప్రత్యేకించి ప్రార్థనకు కేటాయించారు. ఎక్కువ సమయాన్ని అందులోనే గడిపేవారు. నిరాడంబరత్వం, ఏకాంత ప్రార్థనానుభవం, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం ఇదే కెరీతు అనుభవమంటే. ప్రార్థనా జీవితం బలంగా ఉంటే సాధించలేనిది లేదు, అది బలహీనపడితే సాధించగలిగింది లేదు!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
పలు భాషలు రావడం మెదడుకు మేతే
లండన్: ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చిన వారిని మనం బహుభాషా కోవిదులు అంటూ కొనియాడుతాం. వారిని అలా పిలవడం ద్వారానే మనకు తెలియకుండానే వారి పట్ల సానుకూల దృక్ఫథం వ్యక్తం చేస్తాం. ఒక్క భాష వచ్చిన వారి మెదడు బాగా పని చేస్తుందా? లేదా రెండు, అంతకంటే ఎక్కువ భాషలు వచ్చిన వారి మెదడు బాగా పనిచేస్తుందా ? అన్న అంశంపై ఎప్పటి నుంచో చర్చ కొనసాగుతోంది. ఒకటికన్నా ఎక్కువ భాషలు నేర్చుకుంటే మెదడు గందరగోళంగా తయారవుతుందని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై అది ప్రభావం చూపిస్తుందని వాదించేవాళ్లు ఎప్పటి నుంచో ఉన్నారు. వాస్తవానికి ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చినవారు, అంటే బహుభాషా కోవిదుల్లో జ్ఞానశక్తి, అవగాహన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ‘బైలింగ్విల్ రిసెర్చ్ బాడీ’ ఒకటి తాజాగా వెల్లడించింది. బహు భాషలు రావడం మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, భాషల మీద పట్టు సాధించడమే కాకుండా కార్యనిర్వాహక సామర్థ్యం కూడా వారిలో పెరుగుతోందని రిసెర్చ్ బాడీ తెలిపింది. పలు భాషలు నేర్చుకోవడం వల్ల మెదడులోని అన్ని ప్రాంతాలు క్రియాశీలకం అవుతాయని, అలా మెదడులోని అన్ని విభాగాలు క్రియాశీలకం కావడం కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తోందని ప్రపంచ బహుభాషా పరిశోధకుల్లో ప్రముఖులైన ఎలెన్ బయాలిస్టాక్ చెప్పారు. తమిళంతోపాటు ఇంగ్లీషు వచ్చిన భారత్‌కు చెందిన 20 మంది, కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన 20 మందిపై తాము జరిపిన పరిశోధనల వల్ల ఈ విషయం తేలిందని ఆమె అన్నారు. బహు భాషలను నేర్చుకోవడం వల్ల మెదడు స్వరూపంలో కూడా మార్పులు వస్తాయని తాజాగా విడుదలైన మరో సర్వే కూడా తెలియజేస్తోంది. అందుకేనేమో ఒక్క విదేశీ భాషైనా నేర్చుకోవాలనే నియమం యూరప్ లాంటి దేశాల్లో ఉంది. పది మందిపైనో, పాతిక మందిపైనో అధ్యయనం చేయడం ద్వారా బహు భాషల వల్ల మెదడుకు ప్రయోజనమని వాదించడం సబబు కాదని ప్రముఖ సైకాలజిస్ట్ కెన్నేత్ పాప్ అభిప్రాయపడుతున్నారు. బహు భాషల వల్ల సామాజిక ప్రయోజనం ఉన్న మాట వాస్తవమేనని, దాని ద్వారా జ్ఞానశక్తి వద్ధి చెందుతుందన్న వాదనతో విభేదిస్తున్నానని ఆయన అన్నారు. వచ్చిన ఒకే ఒక్క భాషతోనే వివిధ రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని ఆయన చెప్పారు. -
తెలుగు భాషపై నిర్లక్ష్యం దురదృష్టకరం
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఢిల్లీలో ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్’ పుస్తకావిష్కరణ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష ఇతర రాష్ట్రాల్లో నిర్లక్ష్యానికి గురికావడం దురదృష్టకరమని, ఇతర రాష్ట్రాల దురభిమానం వల్ల తెలుగు వారు కష్టాలు ఎదుర్కొంటున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి చదివిన భాషలో కాకుండా ఆ రాష్ట్రాల అధికార భాషల్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని, వారి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరారు. కృష్ణ వీర్ అభిషేక్ రచించిన ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్’ పుస్తకాన్ని జస్టిస్ రమణ న్యూఢిల్లీలో మంగళవారం ఆవిష్కరించారు. మాతృ భాషాదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరగ డం సంతోషమని, జాతి మనుగడలో భాష అత్యంత అవసరమని చెప్పారు. అభిషేక్ ఆలోచనా ధృక్పథం సరైనదని, దేశ వ్యాప్తంగా అవసరమైన పున్తకాన్ని ఆయన అందించారని అభినందించారు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే ఏదీ సాధ్యం కాదేమోనని అనిపిస్తుందని, అన్ని వృత్తులలో కంటే న్యాయవాద వృత్తిలో ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిదే ఎవరూ కూడా కోర్టులో నిలబడి వాదించి తన క్లయింట్ కు న్యాయం చేకూర్చలేరని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి పేర్కొన్నా రు. అభిషేక్ చేసిన ప్రయోగం వల్ల పలువురు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహా దారుడు (కమ్యూనికేషన్ స్కిల్స్) కె.లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర హిందీ సమితి సభ్యలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. -
ద్విభాషా పరిజ్ఞానం మెదడుకు మంచిదే!
పరిపరి శోధన మన స్కూళ్లలో చాలావరకు మూడు భాషలు నేర్పిస్తున్నారు. తెలిసిన భాష తప్ప మిగిలిన భాషలను నేర్చుకోవడాన్ని చాలామంది తప్పనిసరి తంటాగా భావిస్తుంటారు. అయితే, ఒకటికి రెండు భాషలు నేర్చుకోవడం మెదడుకు మంచిదేనని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కనీసం రెండు భాషల్లో దాదాపు సరిసమానమైన పరిజ్ఞానం ఉన్నట్లయితే పక్షవాతం వంటివి సోకినప్పుడు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. పక్షవాతం సోకిన 600 మంది రోగులపై పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఎడిన్బర్గ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రెండు భాషల్లో మంచి పరిజ్ఞానం ఉన్న రోగుల్లో మెదడు పనితీరు త్వరగా మెరుగుపడినట్లు గుర్తించామని వారు అంటున్నారు. -
'తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలి'
ఢిల్లీ: విద్యార్థులు తమిళంలోనే పరీక్షలు రాయాలని తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇతర భాషల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరిన ఆయన దీనిపై ఈ నెల 23న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. -
షారూక్ ఖాన్‌ది ‘ఉగ్ర’భాష!
-
షారూక్ ఖాన్‌ది ‘ఉగ్ర’భాష!
బాలీవుడ్ నటుణ్ని ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ ♦ ఇష్టమైతే పాక్‌కు వెళ్లిపోవచ్చని సలహా ♦ అలాంటి చెత్త మాటలు వద్దన్న వెంకయ్యనాయుడు ♦ ఆలోచనల సంఘర్షణ సాగాలన్న ఆర్బీఐ గవర్నర్ న్యూఢిల్లీ/జమ్మూ: భారత్‌లో అసహనం తీవ్ర స్థాయిలో ఉందన్న బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి దాడి తీవ్రమైంది. తాజాగా ఓ బీజేపీ ఎంపీ షారూక్‌ను పాక్ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో పోల్చారు. ‘హఫీజ్ సయీద్, షారూక్ల మాటల్లో నాకెలాంటి తేడా కనిపించడం లేదు. ఇద్దరూ ఒకే విధమైన ఉగ్రవాద బాష ఉపయోగిస్తున్నారు’ అని బుధవారం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశంలోని మెజారిటీ వర్గీయులు నీ సినిమాలను బహిష్కరిస్తే.. సాధారణ ముస్లింలా నువ్వు కూడా ముంబై వీధుల్లో తిరగాల్సిందేనని గుర్తుం చుకో’ అని హెచ్చరించారు. ముస్లిం అయిన కారణంగా భారత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న షారూక్ తదితరులను సయీద్ పాక్‌కు ఆహ్వానించడంపై స్పందిస్తూ.. కావాలనుకుంటే షారూక్ పాక్ వెళ్లిపోవచ్చన్నారు. ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్వయంగా షారూక్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. భారత్‌లో ఉంటున్నప్పటికీ.. షారూక్ ఖాన్ ఆత్మ పాక్‌లోనే ఉందంటూ మంగళవారం తాను చేసిన ట్వీట్‌ను బీజేపీ నేత కైలాస్ విజయ్ వర్గియా వెనక్కి తీసుకున్నారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న కైలాస్.. ‘భారత్‌లో అసహనమే ఉంటే.. అమితాబ్ తరువాత అంతటి పాపులర్ హీరోగా షారూక్ ఖాన్ అయ్యుండేవాడు కాదు’ అంటూ మరో ట్వీట్ వదిలారు. ముస్లిం అయినంతమాత్రాన షారూక్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం సరికాదని శివసేన అభిప్రాయపడింది. భారత్ సహన దేశమని, ఇక్కడి మైనారిటీలు సహనపరులని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. భారత్ సహనభరిత దేశం కావడం వల్లనే షారూక్ సూపర్ స్టార్ కాగలిగారన్నారు. అసహనంపై చర్చకు సిద్ధం: వెంకయ్య పార్లమెంటు సజావుగా సాగేలా కాంగ్రెస్ సహనం చూపితే.. అసహనంపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎమర్జెన్సీ, మీడియాపై ఆంక్షలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్ల కష్టాలు.. వీటన్నింటిపైనా చర్చిద్దామన్నారు. షారూక్ ఖాన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్యలపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరూ అలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దన్నారు. అసహనంపై రచయితలు వ్యక్తం చేస్తున్న నిరసన ప్రజా తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల తరువాత పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యమే భారత్ బలం: రాజన్ భారత్‌లో నెలకొన్న అసహన వాతావరణంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్ధించుకున్నారు. దేశాభివృద్ధికి సహనం, పరస్పర గౌరవం అవసరమన్న తన వ్యాఖ్యలు లోతుగా ఆలోచించి చేసినవన్నారు. ప్రజాస్వామ్యమే భారత్ అతిపెద్ద బలమన్న రాజన్.. స్వేచ్ఛాసమాజ వాతావరణాన్ని కొనసాగించుకోవాలని, దాన్ని మూసేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ఆలోచనల సంఘర్షణ సాగాలన్నారు. ఆరోగ్యకర చర్చ అవసరమని, అది వాదులాటకు, భావ ప్రకటనను హరించడానికి దారితీయకూడదని పేర్కొన్నారు. ‘బ్లూమ్‌బర్గ్ న్యూస్’కిచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కశ్మీరీ పండిట్ల మూకుమ్మడి వలసలు, సిక్కుల ఊచకోత సమయంలో ఇలాంటి నిరసనలు ఎందుకు తెలపలేదని కశ్మీరీ రచయితలు అగ్నిశేఖర్, ఖేమా కౌల్, తదితరులు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో భారత్ రాలేను: గులాం అలీ న్యూఢిల్లీ: ప్రముఖ పాక్ గజల్ గాయకుడు గులాం అలీ భారత్‌లో త్వరలో జరగనున్న తన సంగీత ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. సంగీత కచేరీలకు ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవన్న కారణంతో ఆయన తన కార్యక్రమాలపై వెనక్కుతగ్గారు. ఎలాంటి రాజకీయాల్లోనూ తాను భాగం కాదల్చుకోలేదని స్పష్టం చేశారు. శివసేన హెచ్చరికలతో గతనెలలో ముంబైలో ఏర్పాటు చేసిన తన సంగీత కచేరీ రద్దు కావడంతో తన తండ్రి ఆ నిర్ణయం తీసుకున్నారని బుధవారం గులాం అలీ కుమారుడు ఆమిర్ తెలిపారు. నవంబర్ 8న ఢిల్లీలో తన తండ్రి గజల్ కచేరీ ఉండబోదని, ముంబైలో జరిగింది చూశాక, తాము రిస్క్ తీసుకోదల్చుకోలేదని అన్నారు. పరిస్థితులు చక్కబడ్డ తరువాత భారత్‌లో గులాం కచేరీ ఉంటుందన్నారు. ముంబై కార్యక్రమం రద్దైన తరువాత నవంబర్ 8న ఢిల్లీలో కచేరీ నిర్వహించాల్సిందిగా ఆప్ ప్రభుత్వం గులాం అలీని ఆహ్వానించింది. కాగా, కవులు, కళాకారుల ‘అవార్డ్ వాపసీ’కి నిరసనగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ శనివారం ఒక ర్యాలీ నిర్వహించనున్నారు. -
షారుక్‌కు దన్నుగా శివసేన!
ముంబయి: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు శివసేన పార్టీ దన్నుగా నిలిచింది. ఒక ముస్లిం అయినందున షారుక్ ఖాన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదని శివసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ఏకధాటిగా షారుక్ పై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పై విధంగా శివసేన వ్యాఖ్యానించింది. షారుక్ భారత్‌లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్థాన్‌లోనే ఉంటుందని మధ్యప్రదేవ్ ఎమ్మెల్యే బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గియా, షారుక్ భాష, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ భాష ఒకటేనని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం అని పక్షపాతంతో ఓ నటుడిపై విమర్శలు చేయడం సమంజసం అనిపించుకోదని వ్యాఖ్యానించింది. -
వారి భాష మీకు తెలుసా?
ఆత్మబంధువు ‘‘హలో రేఖా. ఎలా ఉన్నావ్?’’ ఫోన్లో పలకరించింది మనీషా. ‘‘హాయ్ మనీ... వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటే ఇవ్వాళ నా మీద దయ కలిగింది.’’ ‘‘అదేం లేదు. ఆ మధ్య మీ ఇంటికి వచ్చాం కదా. అప్పటినుంచి నీతో మాట్లాడాలనే అనుకుంటున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావోననీ...’’ ‘‘ఏమిటే... ఏదైనా సమస్యా?’’ ‘‘హా... సమస్యే. కలిసి చెప్తాలే. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు.’’ ‘‘నీకోసం ఎప్పుడైనా ఫ్రీ నే. వచ్చేసెయ్’’ అంది రేఖ. సరే అని ఫోన్ పెట్టేసిన రెండు గంటల్లో రేఖ ఇంటిలో ప్రత్యక్షమైంది మనీషా. అంత త్వరగా వచ్చిందంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుందని అర్థమైంది రేఖకు. కాస్త కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు చెప్పరా. ఏంటి నీ సమస్య?’’ అడిగింది. ‘‘శంకర్’’ తటపటాయిస్తూ చెప్పింది మనీషా. ‘‘శంకర్‌తో నీకు సమస్యేంటే?’’ ‘‘మనం కాలేజీలో ఉన్నప్పుడు వాడు నాకోసం ఎంత తిరిగాడో, ఎలా తపస్సు చేశాడో నీకు తెలుసుగా. అంతగా ప్రేమిస్తున్నాడనే ఇంట్లో వాళ్లను ఒప్పించి వాడ్ని పెళ్లి చేసుకున్నా.’’ ‘‘అవును. ఇప్పుడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా?’’ ‘‘అలాంటిదేం లేదు. కానీ ఓ మంచి చీర కట్టుకున్నా, మంచి వంట చేసినా... అసలేమీ మాట్లాడడు.‘ఐ లవ్యూ’ చెప్పిన సందర్భాలైతే వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘నేను రోజుకోసారైనా చెప్తా.’’ ‘‘శంకర్ ఐలవ్యూ చెప్పడం లేదంటే... నువ్వంటే ఇష్టం లేదా?’’ ‘‘కాదు, ఇష్టమే. ఎక్కడ టూర్‌కు వెళ్లినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లలేకపోతే నాకోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. నా ఫొటోలు తీసి ఇల్లంతా అలంకరిస్తాడు. నేను మంచి చీర కట్టుకుంటే తినేసేలా చూస్తాడు.’’ ‘‘మరింకేం.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ కన్నుగీటింది రేఖ. ‘‘అవుననుకో. కానీ ఓ మాటామంతీ ఉండదే.’’ అర్థమైనట్లుగా తలూపింది రేఖ. ‘‘నీ సమస్య శంకరా? లేక అతను మాట్లాడక పోవడమా?’’ అంది కూల్‌గా. ‘‘అంటే... వాడి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, నేను చెప్పినా స్పందించక పోవడం నాకు నచ్చట్లేదు.’’ ‘‘కనీసం తన ప్రేమ అర్థమైందా?’’ ‘‘అర్థమైంది కానీ...’’ అంటూ ఆగిపోయింది మనీషా. ‘‘సమస్యేమిటో నీకు అర్థం కాలేదని నాకర్థమైందిలే.’’ ‘‘నువ్వు అర్థం చేసుకుని ఏదైనా సలహా చెప్తావనేగా నీ దగ్గరకు వచ్చింది.’’ ‘‘సరే సరే... ఇచ్ లీబే డిచ్.’’ ‘‘ఏంటీ?’’ అర్థం కాక అడిగింది మనీషా. ‘‘జే తైమే.’’ ‘‘ఏంటే... ఏమంటున్నావ్?’’ ‘‘తే అమో.’’ ‘‘ఏమైందే... ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావ్?’’ ‘‘ఐ లవ్యూ అని జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో చెప్పా. అర్థమైందా?’’ అంది రేఖ నవ్వుతూ. ‘‘ఊహూ’’ అంటూ తల అడ్డంగా ఊపింది మనీషా. ‘‘కదా... అలాగే శంకర్ మాట్లాడే భాష కూడా నీకు అర్థం కావడం లేదు.’’ ‘‘మేం మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అర్థం కాకపోవడమేంటి?’’ అంది మనీషా అయోమయంగా. ‘‘చెప్తా చెప్తా. మనుషులు మౌలికంగా మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. దృష్టి ప్రధానం, శ్రవణ ప్రధానం, అనుభూతి ప్రధానం. మీరు మాట్లాడుకునేది తెలుగు లేదా ఇంగ్లిష్‌లోనే అయినా మీరెంచుకునే పదాలు ఆయా వ్యక్తిత్వాలపైన ఆధారపడి ఉంటాయి. శంకర్‌ది దృష్టి, అనుభూతి ప్రధానమైన వ్యక్తిత్వమని నీ మాటలను బట్టి అర్థమైంది. అంటే అతను అందమైన ప్రపంచాన్ని చూడ్డానికి ఇష్టపడతాడు. తన ప్రేమను అందమైన కానుకల రూపంలో లేదంటే స్పర్శ ద్వారా వ్యక్తీకరిస్తాడు. నీది శ్రవణ ప్రధానమైన వ్యక్తిత్వం. నీకు ఏదైనా మాటల్లో చెప్పాలి. చేతల్లో చూపిస్తే అర్థం కాదు. అంటే ఓ లక్ష రూపాయల నెక్లెస్ కొనిచ్చినదానికన్నా.. ‘ఐ లవ్యూ’ అని చెప్తే ఎక్కువ ఆనందిస్తావ్. అలా చెప్పడం శంకర్‌కి రాదు. అంటే మీ ఇద్దరి భావ వ్యక్తీకరణ తీరు వేర్వేరు. అందుకే అతని ప్రేమ నీకు అర్థం కావట్లేదు.’’ ‘‘ఆ నిజమే. వాడు నాకు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేస్తే వాడి కళ్లు మెరిసి పోతాయి. వెంటనే హగ్ చేసుకుంటాడు.’’ ‘‘అదీ అతని భావ వ్యక్తీకరణ తీరు. అదీ అతను ఐ లవ్యూ చెప్పే విధానం. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అతని ప్రేమ నీకు అర్థమవుతుంది.’’ ‘‘ఆ, అర్థమైంది వాడికి నేనంటే ఎంత ప్రేమో. థాంక్స్ రేఖా..’’ అంటూ ఆనందంగా వెళ్లిపోయింది మనీషా. - డాక్టర్ విశేష్ కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఒక గానమూ - కొన్ని పలవరింతలు
రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. ఏ చారిత్రక మలుపులో ఎవరితో ఎటువంటి రచనలు రాయించుకోవాలో సమాజానికి తెలుసు. తెలంగాణ విడిపోయింది. సమైక్యాంధ్ర బద్దలైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ కరువూ, భాషా, సంస్కృతి, చరిత్రా వెరసి స్థానిక ప్రత్యేకత ఒక చర్చనీయ సందర్భమైంది. ఈ సామాజిక సందర్భమే హంద్రీగానానికి గొంతు సవరించుకుంది. రాయలసీమ నేలగీతం క్రిష్ణానది. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు కోస్తాకు వనరులై ఉపయోగపడుతుంటే, మా క్రిష్ణానది ఒక పరాధీనగీతమే! రాయలసీమ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రణాళికాసంఘం ఆమోదంకూడా పొందిన క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఏమైంది? ఆ ప్రాజెక్టునుంచి రాయలసీమకు రావాల్సిన 400 టీఎంసీలు ఎక్కడకు పోయినాయి. మనది ఒకే భాష ఒకే జాతి అనే నెపం మీద రాయలసీమను ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోంచి బైటికి తీసుకువచ్చి మోసం చేసిందెవరు? క్రిష్ణా పెన్నార్‌ను నాగార్జునసాగర్ అనే బానపొట్టగా మార్చి హైజాక్ చేసిందెవరు? వాడే! బ్రిటన్ హయాంలోనే నీటి రుచి మరిగినవాడు! రాయలసీమ నీళ్ళకోసం భాషను కూడా పాచికగా విసరగలిగిన వాడు! వాడే!! రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. లాభంలేనివాన్ని చివరకు నెట్టే కుట్రను దొరలపాలనే కనిపెట్టింది. రెళైై్ల, నీళ్లై కోస్తాకు ఆధునిక వికాసమైన ఆంగ్లపాలన నీ దేహం మీద కరువుల పర్వమే రచించింది. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. సర్కారు సోదరులమీద సీమ హృదయప్రేమ అనుమానపు తెరలుగా ఊగింది. చరిత్రలో పెద్దన్న బుద్ధి ద్రోహ ఉదాహరణలుగానే నమోదయ్యింది. సియామిస్ కవలల కల అట్లా భగ్నమైంది. అలిగిన కోటి రతనాల వీణ తీగలు తెంచుకు వెళ్ళిపోయింది. కానీ, ఆ పొరపాటు అతుకు కోసం నువ్వు కోల్పోయిన బళ్ళారి మాటేమిటి? భద్ర నీటి హక్కు మాటేమిటి? కొండారెడ్డి ఋరుజు ముందు చెదరిన గుడారాలు చార్మినార్ ఎదుట రాజధానిగా మారిన మాటేమిటి? ఆంధ్రా బూర్జువాలకేం? తమ పెట్టుబడి గుడ్లను పొదుగుతూనే ఉంటారు, ఎక్కడైనా ఎప్పుడైనా! కోస్తాకు స్తన్యమిచ్చిన నా రాయలసీమ తల్లీ! శ్రీబాగ్ ఒడంబడికను సమాధి చేసిన నా సోదరుల నేర చరిత్ర మాటేమిటి? వారు మాట్లాడినదే భాషంట! వారు జీవించినదే నాగరికతంట! అట్లయితే, మైసూరు నుండీ శ్రీలంక దాకా మాది దుఃఖ తెనుగు స్వగతమేకదా! కానీ, ప్రతి అస్తిత్వ హననమూ చివరికి పునరుజ్జీవనాన్నే వాగ్దానం చేస్తుంది కదా! అదిగో ఫినిక్స్ గానం! రాయలసీమా! నీ కావ్యజగత్తును ఏమని వర్ణించను? పెద్దనకు హిమవన్నగమై, తిమ్మనకు దివ్యలోక పారిజాతమై, ధూర్జటికి భక్తి నేర్పిన మూగప్రాణాలై, సూరనకు కళాపూర్ణో దయ వైభవమై... అంతేనా? ఈస్తటిక్సును కాస్సేపు పక్కకు పెట్టు. అన్నమయ్యకు మాత్రమే జీర్ణమైన నీ తెనుగు పదం మాటేమిటి? వేమన పలికిన సమాజ నిష్టూరాల్నీ, వీరబ్రహ్మం తెచ్చిన అపండిత భాషా విప్లవాన్నీ, సూఫీ గురువుల సామరస్య మార్గాన్నీ సాంస్కృతిక జిగిబిగిగా అల్లుకున్నది నువ్వేకదా రాయలసీమా! జనసమూహాల ఆశలపై జీమూతంలా వాలే రాజకీయ పాలేగాళ్ళకు నీ చరిత్రా, సంస్కృతి ఏం అక్కరకు వస్తాయిలే! అధికారపు నిచ్చెన మెట్లకు ఒక్కొక్క సహోదరుణ్ణీ బలి ఇచ్చేవాళ్ళేకదా నేటి రాయలసీమ రాజకీయ విభులు! రాయలసీమా! నీవు జలదాహాల దేహార్తివి. కరువు మాత్రమే పండే పంటపొలానివి. చరిత్ర చిల్లర దేవుళ్ళకు చించి చుట్టబెట్టిన వస్త్రానివి. నీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే దాహపు వీలునామా ఎక్కడ? ఇదంతా చూస్తూ కూడా నీ లేపాక్షి బసవడో, యాగంటి బసవడో తోక తొక్కిన త్రాచుపామై ఎందుకు లేవడు? నువ్వెవరని ఎవరైనా ఎందుకంటారు రాయలసీమా! బతుకుతెరువు కోసం యుద్ధమైనావు. చరిత్ర నేర్పిన గుణపాఠాల జ్ఞాపకమైనావు. అనాదిక్రోధపు సంకేతమైన దేవరగుట్ట కర్రల సమర శబ్దానివయినావు. రాగిముద్దా ఊరుమింటిని సద్ది కట్టుకో రాయలసీమా! రాజధానిని చూడవద్దువు గానీ. గుట్టల మీదా కొండల కిందా వెలసిన అవధూతల దర్గాతాతల ఆశీర్వాదాలు తీసుకోవడం మరిచిపొయేవు సుమా. అదిగో నీ దారి. ఊరి బొడ్రాయి గడ్డన వెలసిన మారెమ్మ గుడి సందులనుంచీ, బీరప్ప పరసల జాతర్లనుంచీ రా! సూఫీ దర్గాలనుంచీ, ఆదోని మాదిగ లక్ష్మమ్మ కరుణా ప్రసాదంతో రా! దుఃఖాన్ని పండించే పంటపొలాలనుంచీ, పెన్నా క్రిష్ణలు కలిసే కలను ఛిద్రం చేసిన ఆ తీరప్రాంతానికి రా! మూన్నాళ్ళ ముచ్చటైన రాజధానిని చూసి నా ఎద మీద ప్రశ్నగా మొలుచుకొస్తావేమో! చిట్లిపోయిన కన్నీటి చుక్కల మట్టి కేకనవుతాను. ఉరి పేనిన బతుకుపంటనవుతాను. కోడెగిత్తలు కాడి తప్పిపోతుంటే, నదీ మూలాలు నడకలు మరిచిపోతుంటే, నెర్రెలు చీలిన పగుళ్ళలోంచి ఆత్మశ్వాసనవుతాను. కానీ, రాయలసీమ ఫీనిక్స్ గానంలో ఉన్నానున్నానేనున్నాను కవీ! అనంతపురం గూగూడుకుళ్ళాయి స్వామి సూఫీతత్వపు మంత్ర కణికనై, చిత్తూరు గంగ జాతరలో అనాది చిందునై, కడప అమీర్ పీరా దర్గాలో సామరస్య ప్రార్థననై, ఒంగోలు గిత్త చర్మపు డప్పు జనక జనక జజ్జనకనై, గుండ్లకమ్మ నుండీ పెన్న దాకా, కొండారెడ్డి బురుజు నుంచీ హోసూరు దాకా ఉన్నానున్నానేనున్నాను రాయలసీమ కవీ! రాయలసీమ భూమిపుత్రులను మేల్కొలిపే శబ్దశరంకదా నీ హంద్రీగానం! ఉపసంహారం: వెంకటక్రిష్ణ హంద్రీగానంలో కాలం పేజీలు వెనక్కితిప్పి చరిత్రను తడిమే స్పర్శ జ్ఞానముంది. సాంస్కృతిక పునరుజ్జీవన భవిష్యద్దర్శనముంది. ఐతిహాసిక చిత్రణ ఉంది. జీసస్ వెప్ట్ అన్నట్లు రాయలసీమ కోసం ఇతనిది ప్రవక్త దుఃఖం. ఇతనిలో దున్నేకొద్దీ దుఃఖముంది. మండే కొద్దీ ధర్మాగ్రహముంది. చరిత్ర వైపు వేలెత్తి చూపే సాహసముంది. ఇతడు రాయలసీమ జనహృదయ గానాన్ని సాధన చేసినవాడు. ఈ కవికి అభినందనలు. ఇతని కవిత్వానికి జేజేలు. - బండి నారాయణస్వామి 8886540990 -
ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్!
మెడిక్షనరీ మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ‘పొరుగు’యాసలో మాట్లాడితే ఎలా ఉంటుంది. తన యాసలో ఉన్న మాటలనే పొరుగుయాసలో పలకబోయి పట్టుబడతాడు. అది అతడి మాతృభాష కాదని, పొరుగు భాషావ్యవహర్తలంతా గుర్తుపడతారు. ఈ రుగ్మత పేరే ‘ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్’. ఇదొక మానసిక/నరాలకు సంబంధించిన రుగ్మత. ఇలా చేసే కొందరిలో ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులను పరిశీలించినప్పుడు మెదడులోని భాష సెంటర్లో బేసల్ గ్యాంగ్లియాన్కు దెబ్బతగిలి ఉండటాన్ని డాక్టర్లు కొంతమందిలో గుర్తించారు. ఇలా మాట్లాడేవారు కేవలం మనదేశంలోనే గాక... జపనీస్‌ను కొరియా భాషలాగా, ఇంగ్లిష్‌ను ఫ్రెంచ్లాగా, స్పానిష్ను హంగేరియన్ లాంగ్వేజీలా మాట్లాడతారు. -
తాష్కెంట్ లో భారతీయులతో మోదీ భేటీ
ఉజ్బెకిస్థాన్ : విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో భారతీయులతో భేటీ అయ్యారు. అక్కడి ఎన్నారైలతో సమావేశం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భారతీయ విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతానికి ఎనలేని ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. మనిషి వికాసంలో భాష కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భాష అన్ని ప్రాంతాలు, సంప్రదాయాలను కలుపుతుందన్నారు. 50 ఏళ్లుగా ఇక్కడి రేడియోల ద్వారా హిందీలో ప్రసారాలు జరగడం గొప్ప విషయమని, ఇది తనకు సంతోషాన్ని కలిగించిదని తెలిపారు. మనిషి హింసా మార్గం వైపు వెళ్లకుండా సంగీతం తోడ్పడుతుందన్నారు. ఆందోళనల నుంచి విముక్తికి, వ్యక్తిత్వ వికాసానికి సంగీతం మంచి మార్గమని ప్రధాని సూచించారు. -
పశువులు కూడా సిగ్గు పడే భాష
సాక్షి, హైదరాబాద్: పశువులు కూడా సిగ్గు పడే భాషను కొంతమంది ఉపయోగిస్తున్నారని, తాను అలా మాట్లాడలేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల నీతి నిజాయితీ, విలువల గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు ఏ విలువలను ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి వాడిన భాషను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తప్పు చేయలేదని, డబ్బు తీసుకెళ్లలేదని, స్టీఫెన్సన్కు ఇవ్వలేదని, ఆ డబ్బుతో పార్టీకి సంబంధం లేదని, ఆడియో టేపులో ఉన్న సంభాషణ తనది కాదని చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదన్నారు. సభ్యతలేని మనుషులు మాట్లాడే అసభ్యమాట లను మీడియా కూడా తొలగించాలని సూచించారు. -
తెలుగు లెస్సేనా..?
ఇంగ్లీషులోనే దుకాణాల పేర్లు అమలుకాని కార్మికశాఖ నిబంధనలు గూడూరు: దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు.. తెలుగు భాషను కాపాడేందుకు స్థానిక ప్రభుత్వాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికి జిల్లాలో మాత్రం తెలుగు లెస్ అనిపిస్తుంది. తెలుగు భాషను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తెలుగు మహాసభలు నిర్వహించినా ప్రజల్లో మాత్రం పరభాష పై వ్యామోహం మాత్రం తగ్గడం లేదు. అందుకు నిదర్శనమే వ్యాపార సముదాయాలు, దుకాణాల పేర్లు ఆంగ్లంలో ఉండటమే. ఏపీ దుకాణాలు, సంస్థల చట్టాన్ని అనుసరించి 1988వ సంవత్సరంలో 29(13) రూల్ ద్వారా కార్మికశాఖ నుంచి దుకాణాలకు, కాంప్లెక్సులకు అనుమతులు తీసుకున్న సమయంలోనే దుకాణాల బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలన్న చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఇతర భాషల్లో రాయాల్సి ఉంటే తెలుగు తర్వాతే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. దుకాణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు. గతేడాది ఉగాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం జీవో తెచ్చి కార్మికశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనలు పాటించని దుకాణాలపై దాడులు చేసి జరిమానా విధించడంతో పాటుగా కేసు నమోదు చేసి లెసైన్సును రద్దుపరచే అధికారం కార్మిక శాఖాదికారులకు ఉనప్పటికీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. అమల్లో ఉన్నా పట్టించుకునే వారేరీ..? జిల్లాలో వేలల్లోని దుకాణాలు, దుకాణ సముదాయాలు అధికారికంగా రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. సుమారు 70 శాతానికి పైగా దుకాణాలు రూల్స్ పాటించడం లేదు. నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో నిబంధనలు పాటించే వారు తక్కువగా ఉన్నారు. ఇంగ్లీషులోనే దుకాణ పేర్లు రాయిస్తున్నారు. దీంతో తెలుగుకు చోటు లేకుండా పోతుంది. కార్మికశాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ. 100, రెండోసారి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. అయినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్డులో హాజరుపరచవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి తెలుగు భాషలో దుకాణాల పేర్లు ఉండేలా చూడడంతో పాటు తెలుగుభాషా ఔనత్యాన్ని కాపాడాల్సి ఉంది. -
గిరిగీతలు నగరికి
హత్తుకున్న ధన్యులు! వేష, భాష, నడక, నడతల్లోనే కాదు కళల్లోనూ కృత్రిమత్వానికి బహుదూరం! చిత్రరచనలోనూ వాళ్ల కుంచె ప్రకృతినే ప్రస్తుతిస్తుంది. అధునాతన హంగులు అద్దుకోని ఆ రంగులు గిరి దాటి నగరికి చేరుతున్నాయి. ఆ సహజ కళను నాగరిక ప్రపంచానికి పరిచయం చేయాలనే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా ‘ఆదిచిత్ర’ పేరుతో గిరిజన చిత్రకళాప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఈసారి దీనికి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తోంది. మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోని నెహ్రూ మ్యూజియం వేదికగా ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది. ప్రత్యేకమైన కళ గిరిజన చిత్రాలు ప్రత్యేకమైనవి. నిజానికి వీళ్ల చిత్రకళకు వాళ్ల గుడిసెల గోడలే క్యాన్వాసులు. వాళ్లు కొలిచే దేవుళ్లు, దైనందిన జీవితం, అది సాఫీగా సాగడానికి ప్రకృతిని వాళ్లు కోరే దీవెనలే.. ఆ కళకు వస్తువులు! జీవం ఉట్టిపడే ప్రతిగీతకు ప్రకృతి ప్రసాదించిన రంగులే అదనపు హంగులు సమకూరుస్తాయి. ఈ అందాలన్నీ ఈ చిత్రప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గోండులు, పర్ధానులు, పిథోరా, కోయ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సవర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రత్వా, భిలాల, నాయక్, భిల్ తెగల గిరిజన కళాకారులు పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘నాయకపోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించనున్నారు. టైఫెడ్.. ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కేంద్ర గిరిజనశాఖ అనుబంధ సంస్థ) గిరిజన ఉత్పత్తులు, హస్తకళలను ప్రమోట్ చేయడానికి.. వాటికి మార్కెటింగ్ కల్పించడానికి ఏర్పడిన సంస్థ. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ గిరిజన సంక్షేమానికే వినియోగిస్తారు. ఇక్కడ ‘ఆదిచిత్ర’ను నిర్వహిస్తున్నది ఈ టైఫెడే. ఈ చిత్ర కళాప్రదర్శనలో పాల్గొంటున్న వారంతా ఆదివాసీలే. -
చరిత్రకు మూలాధారం
భాష మానవ అస్తిత్వానికి మూలం. భావ వ్యక్తీకరణకే కాదు, బుద్ధి వికాసానికీ ఆలంబనగా నిలిచేది భాష మాత్రమే. చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటుంది. భాష లిపిబద్ధమయ్యాక, ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూ వచ్చింది. చరిత్రకు ఆధారంగా నిలుస్తున్న శాసనాలే అందుకు నిదర్శనాలు. శాసనాల చదువరులు ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేటితరంలో అరుదైన శాసనాల చదువరి గండవరం వెంకటరత్నం. పురావస్తు సహాయక సంచాలకుడిగా శాసనాలపై పరిశోధన సాగించిన ఆయన, అత్యంత ప్రాచీనమైన లిపిని సైతం చదవగల నేర్పరి ఆయన. చరిత్రకు మూలాధారమైన శాసనాలపై ‘సిటీప్లస్’తో పలు విషయాలను ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు.. ఈ ధర్మాన్ని నిర్వర్తించగలరు’.. శాసనాల్లో లిఖితమైన తొలి పదం ఇదే. ఆనాడే ధర్మాన్ని గురించిన ప్రస్తావన శాసనాల్లో ఉంది. తెలుగునాట కనిపించే మొట్టమొదటి శాసనం క్రీస్తుశకం 200 నాటిది. బ్రహ్మీలిపిలో ఉన్న ఆ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు తన దూతలను ఆంధ్ర దేశానికి పంపాడు. అశోకుడి నాటి శాసనాల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. పూర్తిగా తెలుగులో రాసిన శాసనాలు మనకు క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. భాషలో, లిపిలో ప్రతి మూడు శతాబ్దాలకు మార్పు సహజం. చరిత్రకు మూలాధారాలు శాసనాలే. భారతదేశంలో అశోకుడి ముందు లిపి అంటే సింధు నాగరికత నాటి పిక్టోగ్రఫీ మాత్రమే. దీనినే పిట్టల లిపి లేదా బొమ్మల లిపిగా వ్యవహరిస్తారు. తర్వాత రాజరాజ నరేంద్రుడి తామ్రశాసనం పశ్చిమగోదావరి జిల్లా పాతగండిగూడెంలో లభించింది. దక్షిణ భారతదేశంలో దొరికిన తొలి తామ్రశాసనం ఇదే. హైదరాబాద్‌లో శాసనాలు.. శాసనాల్లో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నగరానికి 30 కి.మీ దూరంలోని కీసరగుట్ట గుండురాతిపై పెద్ద అక్షరాలు తొలచబడి ఉన్నాయి. అది క్రీ.శ. 4వ శతాబ్దంలో పాలించిన విష్ణుకండినుల నాటిది. అక్కడ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటివిగా గుర్తించిన బొమ్మల లిపికి సంబంధించి 400 ముద్రలు లభ్యమయ్యాయి. వాటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మూసీ ఒడ్డున చైతన్యపురి కాలనీలో పెద్దకొండరాతిపై క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి శిలాశాసనం బయటపడింది. తొలిసారి 1986లో ఆ శాసనాన్ని కాపీ చేయించాను. అనుభవంతోనే సాధ్యం.. శాసనాలు చదవడం అనుభవంతోనే సాధ్యం. వేద పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాను. ఎస్వీయూలో సాహిత్య శిరోమణి, సంస్కృతంలోనే బీఈడీకి సమానమైన ‘శిక్షా శాస్త్రి’ పూర్తి చేశాను. తర్వాత కేంద్రీయ విద్యాపీఠంలో ఆచార్య కోర్సు, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఆర్కియాలజీ చదువుకున్నాను. పురావస్తు శాఖలో 1985లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి శాసనాల పరిశోధన మొదలైంది. శాసనాల పరిశోధనకు నేటితరం యువత ముందుకు రావాలి. చరిత్ర పరిశోధనలపై అభిలాష పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. లేకుంటే, భవిష్యత్తులో శాసనాలు చదివేవారే కరువైపోతారు. ‘ఎపిగ్రఫీ’ పూర్తిగా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన అంశం. ఇదివరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేసిన చెల్లప్ప ఈ అంశంలో కొంతవరకు దీని అభివృద్ధి కోసం కృషి చేశారు. తర్వాత పట్టించుకున్న వారే లేరు. తెలుగు వర్సిటీ, భాషా సాంస్కృతిక శాఖలు ముందుకొచ్చి కృషిచేస్తే, శాసనాలను చదవగలవారు తయారవుతారు. సుధాకర్ ఫొటోలు: కె. రమేష్ బాబు -
ప్రపంచ భాషల్లో ఖురాన్
ఖురాన్ అరబీ భాషలో అవతరించింది. ఖురాన్ అనే పదం అరబీ భాషకు చెందింది. దీని అర్థం ఎక్కువ చదివే పుస్తకమని. క్రీస్తు శకం 610లో మహ్మద్ ప్రవక్తపై ‘చదువు నిన్ను సృష్టించిన వాడి సాక్షిగా(అధ్యాయం సూరే అలఖ్లో)’ అనే తొలివాక్యంతో అవతరణ ప్రారంభమైంది. క్రీస్తు శకం 632 అనగా 22 ఏళ్ల ఐదున్నర మాసాలలో మొత్తం దివ్య ఖురాన్ పూర్తి అయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఏడేళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గలిగిన స్త్రీ, పురుషులు దీనిని కంఠస్తం చేశారు. 30 భాగాలుగా... దివ్యఖురాన్ అరబీ భాషలో అవతరించడానికి గల కారణం... ఇది అన్ని భాషలలో కెల్లా సులభతరమైంది కావడమే. దివ్యఖురాన్లో 30 భాగాలు, ఏడు దశలు, 114 అధ్యాయాలు, 540 రుకువులు (పేరాగ్రాఫ్‌లు), 6666 వాక్యాలు ఉన్నాయి. అతి పెద్ద అధ్యాయం సూరే బఖరా. అతి చిన్న అధ్యాయం సూరే కౌసర్. మొదటి అధ్యాయం సూరే ఫాతియా. చివరి అధ్యాయం సూరే నాస్. మొదటి దశ సూరే ఫాతిహా నుంచి సూరే నిస్సా. రెండో దశ సూరే మైదా నుంచి సూరే నూర్. మూడో దశ సూరే యూనుస్ నుంచి సూరే నహల్. నాలుగో దశ సూరే బనీ ఇస్రాయిల్ నుంచి సూరే ఫుర్ఖాన్. ఐదో దశ షూరా నుంచి సూరే యాసిన్. ఆరో దశ సూరే సఫ్ఫాత్ నుంచి సూరే హుజురాత్. ఏడో దశ సూరే ఖాఫ్ నుంచి సూరే నాస్ వరకు ఉంటుంది. పర్షియన్ భాషలో.. ఖురాన్‌లోని కేవలం ‘సూరే ఫాతేహా’ అధ్యాయం 7వ శతాబ్దంలో పర్షియన్ భాషలో అనువదించారు. 17వ శతాబ్దంలో ఇతర భాషలలో ఖురాన్ పూర్తిగా అనువదించడం ప్రారంభమైంది. 1772లో తొలిసారి జర్మన్ భాషలో ఖురాన్ అనువదించారు. అప్పటినుంచి 1936 వరకు 102 అరబేతర భాషలలో అందుబాటులోకి తెచ్చారు. శతాబ్దం క్రితం.. తెలుగు భాషలో ఖురాన్ అనువాదం శతాబ్దం క్రితమే జరిగింది. 1925లో డాక్టర్ చిలుకూరి నారాయణ ఖురాన్‌ను తొలిసారి తెలుగులో తీసుకొచ్చారు. తదనంతరం 1948లో మౌల్వీ అబ్దుల్ గఫూర్ మరింత సరళీకరించారు. 1981లో వ్యవహారిక తెలుగు భాషలో షేక్ మౌలానా హమీదుల్లా షరిష్ దివ్యఖురాన్ను అనువదించారు. దీన్ని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ సంస్థ ప్రచురించింది. లిపి ఉన్న అన్ని భాషలలో... ప్రస్తుతం లిపి ఉన్న అన్ని భాషలలో ఖురాన్ అందుబాటులో ఉంది. మనదేశంలోని దాదాపు 14 భాషల్లో ఖురాన్ అనువాదం చేసిన ఘనత జమాతే ఇస్లామీ హింద్ సంస్థకు దక్కుతుంది. 30 ఏళ్ల పాటు కృషి చేసి ఈ అనువాదాన్ని పూర్తిచేశాం. - ముహ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి, జమాతే ఇస్లామీ హింద్ -
మెదడు కూడా వ్యాయామం చేయాల్సిందే!
మీకు తెలుసా? మెదడు కూడా కండరంలాంటిదే. వ్యాయామం చేయకపోతే దేహంలోని ఇతర కండరాల్లాగానే మెదడు కూడా శక్తిహీనమవుతుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే... కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీలయినంతగా చదవాలి. కొత్త భాషను నేర్చుకునే క్రమంలో మెదడు చురుగ్గా స్పందించి ఉత్తేజితమవుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం అంటే మెదడుకి తగినంత వ్యాయామం అందించినట్లే. మానసిక ఒత్తిడి వల్ల కార్టిజోల్ హార్మోన్ విడుదలవుతుంది. అది మెదడు పనితీరును నిరోధిస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనయినట్లు గుర్తించిన వెంటనే పది నిమిషాల సేపు ఇష్టమైన పని (ఇష్టమైన పుస్తకం చదవడం లేదా ఒక పజిల్ని పరిష్కరించడం) చేయడం వల్ల ఒత్తడి తగ్గి మెదడు ఉత్తేజితమవుతుంది. ఆహారంలో ‘బి’ విటమిన్ పుష్కలంగా తీసుకోవాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా తీసుకోవాలి. రోజుకు కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసినప్పుడు ఊపిరితిత్తులు దీర్ఘంగా శ్వాసిస్తాయి. దాంతో దేహం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి నశిస్తాయి. -
భాషణ కళకు కొత్త భాష్యం కోసం
సందర్భం. అక్షరం స్పష్టతకూ, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికీ తిరుగులేని పరిష్కారం. అయితే అది చిహ్నాల సముదాయమే! కానీ భాష అంటే సంభాషించేది. మాటలోనే భావవ్యక్తీకరణ సంపూర్ణంగా ఉంటుంది. మానవ స్పందనలన్నీ మనిషి కంఠస్వరంలో మేళవిస్తాయి. టెలిగ్రాఫ్, టెలిఫోన్, రేడియో, టెలివి జన్, ఇంటర్నెట్ ఇదీ ఆధునిక సమాచార వైజ్ఞానిక ఆవిష్కరణల క్రమం! అంతకు ముందు పుస్తకం, పత్రికలు ఉన్నాయి. తీగల సాయంతోనో, లేకుండానో సమాచారం పంపడం, అది కూడా మానవ కంఠస్వరం ఉపయోగించి సాధించడం అనూహ్య పరిణామం. జాన్ గూటెన్ బెర్గ్ 1448లో అచ్చుయంత్రాన్ని ప్రయోగపూర్వకంగా చూపారు. 1456 ఆగస్టు 24న బైబిల్ అచ్చయింది. 1702లో ఇంగ్లడ్ నుంచి ‘ైడైలీ కోరంట్’ అనే మొదటి వార్తా పత్రిక ప్రారంభమైంది. అమెరికాలో 1704లో మొదటి వార్తాపత్రిక ‘బోస్టన్ న్యూస్‌లెటర్’ మొదలైంది. దీనికి ముందు భావ ప్రసారం ప్రధానంగా మానవ కంఠస్వరం ద్వారానే ఉండేది. మనిషి గమనించి, ప్రోది చేసిన జ్ఞానమంతా నోటిమాటగా, చేతిరాతగా వచ్చేది. రాతకు సంబంధించి మెరుగైన సదుపాయాలు, అచ్చు సౌకర్యాలు రావడంతో పరిస్థితి మారిపోయింది. ఇది సుమారు రెండు దశాబ్దాలు అప్రతిహతంగా నడిచింది. టెలిఫోన్, రేడియో, సినిమా, టెలివిజన్, నెట్ రావడంతో మళ్లీ నోటిమాట ప్రధాన భావ ప్రసార వేదికయింది. అక్షరం స్పష్టతకూ, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికీ తిరుగులేని పరిష్కారం. అయితే అది చిహ్నాల సముదాయమే! కానీ భాష అంటే సంభాషించేది. మాటలోనే భావవ్యక్తీకరణ సంపూర్ణంగా ఉంటుంది. మానవ స్పందనలన్నీ మనిషి కంఠస్వరంలో మేళవిస్తాయి. ఈ తేడాను గుర్తించాలంటే అక్షర రూపంలోని నాటకానికీ, నాటక ప్రదర్శనకీ అంతరాన్ని అధ్యయనం చేయాలి. అందువల్ల మానవ గళాన్ని ఎటువంటి సహాయం లేకుండా ప్రసారం చేయగల సాంకేతిక పరిజ్ఞానం రావడం గొప్ప విప్లవం. రాత అక్షరం మాటను మింగి వేయడంతో అక్షరా స్యత, నిరక్షరాస్యత అనే భేదాలు వచ్చి పడ్డాయి. అయితే ఫోన్, రేడియో, టెలివిజన్ రాకతో మరలా మనిషి గాత్రం ఈ అవాంతరాలనూ అధిగమించి ముందుకు పోయింది. నేడు మౌఖిక సమాచారం అని పిలిచే వ్యవస్థకు పునాది మాట్లాడగలిగే సామర్ధ్యం. అద్భుతమైన స్పందనలను రంగరించిన భావ వ్యక్తీకరణ మాట్లాడే కళ ద్వారా సాధ్య మైంది. సేల్స్ రిప్రజెంటేటివ్స్, టీవీ యాంకర్లు, రేడియో జాకీలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, నటీన టులను మీరు కొంచెం పరిశీలిస్తే ఈ ‘భాషణకళ’ ఎంతగా పుష్పించి విలసిల్లుతున్నదో సులువుగా గుర్తించవచ్చు. కంఠస్వరానికి ఉండే ప్రాధాన్యం తెలియజెప్పడానికి, అవగాహన కల్గించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16ను ‘వరల్డ్ వాయిస్ డే’గా జరుపుకుంటున్నాం. నిజానికి ‘డే’ అనే పదంలో ‘దినం’ అంటే బావుండదు. (కొన్ని ప్రాంతాల్లో మరణానికి సంబంధించి వాడుక పదం కనుక) అలాగే దినోత్సవం అంటే ఇందులో ఉత్సవకోణం కనిపించదు. కనుక అర్థం చక్కగా అమరడానికి ప్రపంచ కంఠస్వర ‘అవగాహన సందర్భం’గా అనువదించవచ్చు. 1999లో ఆరంభమైన ఈ కార్యక్రమం ఇపుడు సుమారు 47 దేశాలలో జరుపుకుంటున్నారు. ముందుముందు మరిన్ని దేశాలు చేరతాయి. కంఠస్వరం ప్రాధాన్యం గుర్తించి, సవ్యమైన ధోరణులను ప్రచారంలోకి తేవడమే దీని ఉద్దేశం. మాటను ఎంత జాగ్రత్తగా, పొందికగా, ప్రయోజనాత్మకంగా వినియోగించవచ్చునో అనంతమైన అధ్యయనం సాగింది, సాగుతోంది. అదే సమయంలో గొంతు ఆరోగ్యం గురించి కూడా కొంత దృష్టి పెట్టాల్సి ఉంది. ఒక అంచనా ప్రకారం జనాభాలో 5-6 శాతం గొంతుకు సంబంధించిన సమస్య లతో బాధపడుతూ ఉన్నారు. వీరిలో 70-75 శాతం మంది అవగాహన లోపంతో సమస్యలు తెచ్చుకుంటున్న వారే. అతిగా వాడటం, సరిగా వాడకపోవడం, దుర్వినియోగం చేయడం అనే మూడు రకాలుగా పొరపాట్లు చేస్తున్నాం. సంగీత సాధకులు, యోగ నిపుణులు, ఆయుర్వేద వైద్యులు ఎంతోకాలంగా ఉన్న, ఇతరత్రా సమస్యలను గురించి, కంఠస్వరం’ రక్షణ పద్ధతులను గురించి సులువుగా వివరిస్తారు. మారిన జీవనశైలి, ఆహార పదార్ధాల విని యోగం, ఏసీ, ఫ్రిజ్ వంటివి గొంతు ఆరోగ్యాన్ని, మాటలోని ధర్మాలను దెబ్బతీస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి! ఇలాంటి విషయాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొని, జాగ్రత్త పడటానికి ఈ సందర్భం దోహదపడుతుంది. డా. నాగసూరి వేణుగోపాల్ -
బాలగోకులం
పిల్లల భాషలో ఆనందంగా గడపడం అంటే ఆడుకోవడమొక్కటే. ఆటపాటలతో ఒళ్లు అలిస్తేనే వాళ్లకు మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనుషులంతా ఒక్కటే అన్న మాటకు అర్థం ఒక్క ఆటలోనే వాళ్లు నేర్చుకోగలరు. పిల్లలకు ఆటలెంత అవసరమో అనడానికి ఇలా... బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. కాని ఓ గంట వారితో ఆటలాడించే తీరిక ఎంతమందికి ఉంది? బాలగోకులం గురించి తెలుసుకుంటేగాని ఈ తీరిక విలువ తెలియదు మనకి. ఒకోసందర్భంలో డబ్బు కంటే సమయం చాలా విలువైంది. ఆ సమయంలో మనం చేసే పనులను బట్టి ఆ విలువ మరింత పెరుగుతుంది. పుస్తకాల ప్రపంచంలో పడి తలకిందులవుతున్న చిన్నారులను కాసేపు బయటికి తీసుకెళ్లి నాలుగు రకాల ఆటలాడించే పరిస్థితి ఎక్కడా కనపించడం లేదు. ఆ లోటుని పూరించడానికి వచ్చిందే బాలగోకులం. పిల్లలకోసం కాసింత సమయం కేటాయించడం ఇష్టమైన వారు బాలగోకులంలో సభ్యులుగా చేరి వారి చుట్టుపక్కలున్న చిన్నారి పిల్లల్ని ప్రతి ఆదివారం ఓ గంటన్నరపాటు ఆటలు ఆడించాలి. అదే బాలగోకులం. ముప్పైఏళ్లక్రితం కేరళలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పొరుగుదేశాలకు కూడా వెళ్లింది. ప్రస్తుతం మన రాష్ర్టంలో 30 ెకేంద్రాలలో బాలగోకులం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 9 గంటలవరకు ఈ ఆటల కార్యక్రమం కొనసాగుతుంది. ఆన్లైన్ సిలబస్... బాలగోకులం ఆటలకు సంబంధించిన వివరాలాన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. బాలగోకులం డాట్‌కామ్‌లో ఏ రోజు ఏ ఆటలు ఆడించాలో వివరాలు ఉంటాయి. ఈ కేంద్రాలున్న అన్ని చోట్లా ఒకటే సిలబస్‌ని ఫాలో అవుతారు. ఈ కేంద్రాలు ఎవరు నడుపుతారంటారా! ఆసక్తి ఉన్న యువకులే ముందుకొస్తున్నారు. ‘‘నాకు బాలగోకులం గురించి తెలిసిన వెంటనే ఓ పదిరోజులుపాటు శిక్షణ తరగతులకు వెళ్లాను. తర్వాత మా ఇంటిచుట్టుపక్కలున్న పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న పార్కుకి పంపమని అడిగాను. మొదట్లో ముగ్గురు నలుగురు పిల్లలే వచ్చారు. ప్రస్తుతం అరవైమంది పిల్లలవరకూ వస్తున్నారు. బాలగోకులం కార్యకలాపాల వల్ల పిల్లల్లో మంచి మార్పులు వచ్చాయని వారి తల్లిదండ్రులు చెబుతుంటే చాలా సంతోషమేస్తుంది. నేను ఓ ప్రయివేటు ఉద్యోగిని. వారంలో ఒక గంటన్నర నాది కాదనుకుంటే పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇవ్వొచ్చుకదా అని బాలగోకులంలో సభ్యుడిగా చేరాను’’ అని చెప్పారు హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఏవీ నారాయణ. ఆటలతోపాటు... బాలగోకులంలో ఆటలతో పాటు ప్రతిరోజు ఒక యోగాసనం ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల పుట్టినరోజుల్ని జరుపుకోవడం, ఆ వారి గురించి చర్చించుకోవడం ఉంటుంది. అప్పుడప్పుడు ఉపన్యాసపోటీలు, క్విజ్లు ఉంటాయి. వీటితోపాటు చిన్నపిల్లలకు మైండ్ డెవలప్మెంట్ గేమ్స్‌లో భాగంగా సంఖ్యామథనం పేరుతో రకరకాల ఆటలు ఆడిస్తారు. అలాగే పరుగు పందేలు, అంత్యాక్షరి వంటివి రెగ్యులర్‌గా ఉంటాయి. దేశభక్తిగీతాలు, దేవుడి పాటలు కూడా నేర్పిస్తుంటారు. భగవద్గీత, రామాయణం, బైబిల్...అన్నింటిలోని పిల్లలకు అర్థమయ్యే అంశాలను వారికి బోధిస్తారు. ఇవన్నీ ఒక సిలబస్ రూపంలో ఏ వారం ఏంచేయాలో వెబ్సైట్లో వివరంగా ఉంటాయి. దాన్నిబట్టి బాలగోకులం సభ్యులు ఆరోజు ఏం చేయాలన్న విషయంపై పూర్తి అవగాహనతో ఉంటారన్నమాట. సభ్యులు కావాలంటే... రూపాయి ఖర్చులేకుండా సమాజాన్ని మార్చే గొప్ప ఆయుధం బాలగోకులం అంటారు మియాపూర్‌కి చెందిన ప్రదీప్. ‘‘నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మియాపూర్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మాది చాలా పెద్ద అపార్ట్మెంట్. సాయంత్రం స్కూళ్లనుంచి రాగానే పిల్లలందరూ టీవీల ముందు కూర్చుండిపోవడాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఆదివారమైనా ఆరుబయట ఆడుకోవడానికి ఎక్కడికి పంపిస్తారు? నేను ఇక్కడ బాలగోకులం మొదలుపెట్టాక పిల్లలకంటే తల్లిదండ్రులే ఎక్కువ సంతోషపడుతున్నారు. ఆటపాటలతో పాటు యోగాసనాలు, క్విజ్లు వారిని మరింత హుషారుగా ఉంచుతున్నాయి. వారంలో ఒక గంటన్నర మనది కాదనుకుంటే మన చుట్టుపక్కల పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చినవారమవుతాము’’ అని ముగించారు ప్రదీప్. నిజమే! ఆటపాటలు లేని బాల్యం భవిష్యత్తులో పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సివస్తుంది. ఆ లోటు లేకుండా చేస్తున్న బాలగోకులాన్ని అందరం పోత్సహించాలి. - భువనేశ్వరి ఫొటోలు: శివ మల్లాల -
తప్పనిసరి పలుకుబడి
‘మన ఉద్దేశం ఎదుటివారికి స్పష్టంగా తెలుపడం ముఖ్యమైనప్పుడు, భాష, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి గదా!’ అంటారు డాక్టర్ తిరుమల రామచంద్ర. ‘తాను ప్రయోగించే పదం తన అభిమతాన్ని వ్యక్త పరుస్తుందా లేదా అనే విషయం రచయితకు తెలియాలి’ అని కూడా మరోచోట అంటారాయనే. రామచంద్ర బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన పత్రికా రచయిత. ఆయన స్వీయానుభవంతో చేసిన ఈ సూచనలను కాదనవలసిన అవసరం లేదు. ‘పలుకుబడి’ పేరుతో రామచంద్ర ఒక పత్రిక కోసం రాసిన వ్యాసాలను వయోధిక పాత్రికేయ సంఘం (హైదరాబాద్) ఇటీవల వెలువరించింది. ‘సమష్టి’- ‘సమిష్టి’, ‘నిరసన’-నిరశన’, ‘నిర్దిష్టం’-‘నిర్దుష్టం’, ‘చారిత్రక’-‘చారిత్రిక’.... వీటిలో రచయిత వ్యక్తం చేయదలుచుకున్న విషయానికి సందర్భోచితంగా ఏది ఉంటుంది? అదే సమయంలో ఏది ఒప్పయినది? ఇలాంటి ప్రశ్నలు రాసేవాళ్లంతా ఏదో దశలో ఎదుర్కొంటారు. ఇలాంటి వాటిని వివరించే పుస్తకమే ‘పలుకుబడి’. సరైన శబ్దాలు ఏమిటో చెప్పడం పండిత ప్రకర్షకైతే కాదు. ‘నిరసన’ అంటే నిరాకరించడం. ‘నిరశన’ అంటే అభోజనంగా ఉండడం. కానీ ఈ అర్థాలు తెలియక చాలామంది ఈ పదాలను తారుమారు చేసి అభాసుపాలవుతూ ఉంటారు. కానీ రామచంద్రగారే అన్నట్టు ఒకసారి పాతుకుపోయిన అభిప్రాయాలను వదల్చుకోవడానికి చాలా సంస్కారం కావాలి. భాష మీద ప్రేమ ఉన్నవాళ్లు ఈ మాత్రం సంస్కారం అలవరుచుకోవడానికి వెనుకాడకూడదు. అవసరమైతే సంధి సూత్రాలు ఇస్తూ, సందర్భం, సున్నిత హాస్యాలను మేళవించి ఇలాంటి పలుకుబడి పదాలను రామచంద్ర అందించారు. రాస్తున్న వారూ, రాయాలని కోరిక ఉన్నవాళ్లే కాదు, చదివే అలవాటు ఉన్నవాళ్లు కూడా ఆనందంగా చదువుకోదగ్గ పుస్తకం. ఎంతో ఉపయోగకరమైనది కూడా. ఇన్నాళ్లూ మనం చేసిన తప్పులను ఈ విధంగానైనా తెలుసుకోవచ్చు. సహృదయత ఉంటే నవ్వుకోవచ్చు కూడా. కానీ ఇలాంటి పుస్తకంలో కూడా ఉపోద్ఘాతాలలో లెక్కకు మిక్కిలి అచ్చుతప్పులు కనిపించడం బాధాకరం. పలుకుబడి, డాక్టర్ తిరుమల రామచంద్ర, ప్రతులకు: విశాలాంధ్ర; వెల రూ. 100/- కొండగాలీ కొత్త జీవితం ఇవన్నీ పాతరోజులు. సోవియెట్ యూనియన్ వల్ల ఆ ఛత్రం కింద దేశాలన్నీ ఏ మేరకు లాభపడ్డాయో లేదో కాని పుస్తక ప్రపంచం మాత్రం విపరీతంగా లాభపడింది. ప్రపంచమంతా సోవియెట్ సాహిత్యం శుభ్రమైన అట్టలతో నాణ్యమైన ఫాంట్‌తో పరిమళాలీనే కాగితంతో సాహితీ ప్రేమికుల ఒళ్లోకొచ్చి పడింది. రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలు రాళ్లెత్తకపోయినా పుస్తకాలెత్తి ప్రపంచమంతా కొత్త సాంస్కృతిక సౌధాలను నిర్మించాడానికి కష్టపడ్డాయి. ‘కొండగాలీ కొత్తజీవితం’ 1979 నాటిది. ఇందులోని తొమ్మిది ఆర్మేనియన్ కథలు- ఆ ప్రశాంతమైన పర్వత ప్రాంత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఒక దేశం గురించి, ఒక జాతి గురించి తెలియాలంటే ఆ జాతిని సరిగ్గా ప్రతిబింబించే సాహిత్యాన్ని చదవడమే మార్గం. కథ అంటే ఏమిటో జాతి కలిగిన కథ అంటే ఏమిటో ఈ పుస్తకం చదవి తెలుసుకున్నారు చాలామంది. ఆర్మేనియా- సోవియెట్ యూనియన్ కింద అంత సుఖంగా లేదన్నది వేరే విషయం. ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఫ్యాక్టరీల వల్ల తమ అందమైన దేశం కాలుష్యం బారిన పడుతోందని గగ్గోలు పెట్టింది. సోవియెట్ యూనియన్ పతనానికి ఒక సంవత్సరం ముందు- అంటే 1990లో అది స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు అక్కడి సాహిత్యం ఎలా ఉందో తెలియదు. మన దాకా చేరే మార్గం కూడా లేదు. కాని మిగిలిన ఇలాంటి అరాకొరా పుస్తకాలే దాచుకున్న గులాబీ రెమ్మలు. ఊహల్లో మిగిలిన ఆకుపచ్చ లోయలు. -
‘అమ్మ’ భాషను ప్రోత్సహించా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినకర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతివేగంగా కనుమరుగవుతున్న భాషలో తెలుగు ఉండటం శోచనీయమన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ మాతృ భాషలో విద్యాబోధన చేపట్టడం వల్ల చెప్పాలనుకున్న విషయాన్ని విద్యార్థులకు సులభంగా చెప్పవచ్చన్నారు. తెలుగు భాష సంస్కృతి, గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బోధించాలన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి వంటి కవులు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తెలుగు భాషలోని కఠిన పదాలను వాడుక భాషలోకి మార్చి అందరికి అర్థమయ్యేలా గిడుగు రామమూర్తి విశేష కృషి చేశారన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అనే విధంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. నన్నయ్య, తిక్కయ్య, ఎర్రప్రగడ వంటి వారు భాషాభివృద్ధికి సాహితీ పరంగ విశేష కృషి చేశారన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ప్రకటనలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు కృషి చేసిన ఉపాధ్యాయులు ఎండీ షరీఫ్, ఉండ్రాల్ల రాజేశం, సంపత్‌కుమార్ తెలుగులో పది పాయింట్లు సాధించిన ప్రత్యుష తండ్రిని కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి రాంచంద్రయ్య, ఎంఈఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
వివరం: మన తెలుగు మన వెలుగు
తెలుగు గురించిన ఈ రెండు గొప్పదనాలు, ఉత్తి స్వాతిశయపు విశేషణాలేం కాదు. తెలుగు, రాయడానికి అందమైన భాష; వినడానికి సొంపైన భాష. దీన్ని ప్రకటించుకుంది కూడా మనం కాదు; ఆ గుర్తింపునిచ్చింది అన్యభాషీయులే! ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మురిశాడు ఇటలీ యాత్రికుడు నికొలొకాంటి. ‘సుందర తెలుగు’ అని చాటాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. అన్నీ ఉన్నా ‘తెలుగువాడి నోట్లో’ శని అన్నట్టు, మొదట్నుంచీ మన మీద సంస్కృత అత్తగారి పెత్తనాన్ని కొనసాగనిచ్చాం; ఇప్పుడేమో ఇంగ్లీషు మామగారి ఆధిపత్యానికి నాలుకలు మడతపెడుతున్నాం. ఆగస్టు 29న ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా మన తెలుగేమిటో, మన వెలుగేమిటో ఒకసారి మాట్లాడుకుందాం... మనమేమో ‘వానల్లు కురియాలి వానదేవుడా!’ అనే చిన్నప్పటి పాట నెమరువేస్తుంటాం. పిల్లలేమో బడిలో ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అంటూ చక్కని రైమింగ్లో వానని వెళ్లగొడుతుంటారు. పేదరాసి పెద్దమ్మ కతల తరం మనదైతే, హ్యారీపోటర్ తరం మన పిల్లలది. కాలం మారిపోయింది. దానితో పాటు తెలుగు భాషకీ కాని కాలం వచ్చింది. కాని కాలం రాకపోతే టీవీ ప్రదర్శనల్లో యాంకరమ్మ ‘హాయ్ వ్యూయర్స్!’ అని తెలుగువాళ్లని ఇంగ్లిష్‌లో పలకరించే సాహసం చేస్తుందా? ‘యస్టర్ డే మార్నింగ్ మార్కెట్‌కి వెళితే టూ హండ్రెడ్ రూపీస్కి టూ కిలోస్ వెజిటబుల్స్ రాలేదండీ’ అని పక్కింటి పడుచు, ఎదురింటి యిల్లాలితో మాట్లాడుతుంటే, పోనీలే క్రియాపదాలైనా తెలుగులో ఉన్నాయని, తెలుగు భాషాభిమానులం సంతృప్తి పడుతున్నామా లేదా? అక్షరాలు ముత్యాల కోవలు ‘అరయంగ కర్ణుడీల్గె నార్వుర చేతన్’ అన్నట్టు తలా ఒక చెయ్యి నెత్తిమీద వెయ్యగా తెలుగుతల్లి మునిగిపోతుందన్నది వాస్తవం. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది. ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు ‘అమృతం కురిసిన రాత్రి’లో దేవరకొండ బాలగంగాధర తిలక్. ‘నా అక్షరాలు ముత్యాల కోవలు’ అని కూడా అంటే మరింత బాగుండేదనిపిస్తుంది. ఆ అందం, చందం ఒక్క తెలుగు వర్ణమాలకే ఉంది. ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా? తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. ‘తేనె వలె తీయనిది’ అని పాడుకునేది అందుకే. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది. గిడుగు రామ్మూర్తి పంతులు గిడుగు జయంతి (ఆగస్టు 29)నే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణవ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి.భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే పద్యాలు, వేమన, సుమతీ శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా? ఈ సొంపు హలంత భాషలకు ఉండదు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని నికొలొకాంటి అనే ఇటలీ యాత్రికుడు తెలుగును మెచ్చుకోవటానికి కారణం ఇదే. ఇటాలియన్ భాష కూడా తెలుగు మాదిరే అజంత భాష. ఈ వినసొంపైన లక్షణమే, కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు కీర్తనల్ని అగ్రస్థానంలో నిల్పింది. ‘సుందర తెలుగు’ అని సుబ్రహ్మణ్య భారతి వంటి తమిళ మహాకవుల మెప్పు పొందింది. పరాయి భాషలంటే మొహం చిట్లించే తమిళులు త్యాగరాజు కీర్తనల్ని ఆస్వాదించటానికి ముఖ్య కారణం మన భాషలోని నాద మాధుర్యమే. ‘రెండు వేల’ ఏళ్ల తెలుగు ‘జనని సంస్కృతంబు సకల భాషలకును ’ (క్రీడాభిరామము) అనే నమ్మకమే చిరకాలం నుంచి రాజ్యమేలింది. అయితే తెలుగు సంస్కృత జన్యం కాదని, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ (19వ శతాబ్ది) నిరూపించటంతో సంస్కృతానికి, తెలుగుకు తల్లీబిడ్డల బంధం తెగిపోయింది. అయితే నన్నయ మొదలు కవులంతా తెలుగు కావ్యాల్లో సంస్కృత పదాలు గుప్పించి, సామాన్య ప్రజలకి సాహిత్యం దూరం చెయ్యటంలో కృతకృత్యులయ్యారు. సంస్కృతం లేదా ప్రాకృతమే రాజభాషగా శాసనాల్లో చెలామణి అయ్యింది. క్రీస్తు శకారంభం నుంచి తెలుగు మూల ద్రావిడ భాష నుంచి విడివడ సాగింది. అప్పటి ‘గాథాసప్తశతి’ ప్రాకృత గ్రంథంలో అత్త, అమ్మి, పొట్ట, పాడి మొదలైన తెలుగు మాటలు తొంగిచూశాయి. క్రీ.శ.ఒకటవ శతాబ్ది నాటి అమరావతి స్తూపం రాతిపలక మీద కనపడ్డ ‘నాగబు’ (నాగము, పాము) అనేది మనకు కనిపించిన మొట్టమొదటి తెలుగు మాట. ఆ తర్వాత రేనాటి చోళులు వేయించిన కలమళ్ల, ఎర్ర గుడిపాడు శాసనాల్లో (క్రీ.శ.575) తెలుగు భాష కనపడుతుంది. పండరంగడి అద్దంకి శిలాశాసనం (క్రీ.శ.848) మొట్టమొదటి (తరువోజ) పద్య శాసనం. యుద్ధమల్లుడి బెజవాడ శాసనం, విరియాల కామసాని గూడూరు శాసనం మొదలైన వాటిల్లో కనపడే తెలుగు పద్యాలు నన్నయభట్టుకు ముందే తెలుగు కవిత్వం ఉందని నిరూపిస్తున్నాయి. తెలుగు ప్రాచీన హోదాని బలపరుస్తున్నాయి. 12, 13 శతాబ్దాల్లో నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు ‘జాను తెనుగు’ ఉద్యమం చేపట్టి, సంస్కృత మార్గ పద్ధతి కాక తేటతెలుగే కావ్య భాషగా ఉండాలని ప్రతిపాదించారు. తర్వాత కాలంలో తెలుగు మీద సంస్కృతం పెత్తనాన్ని నిరసిస్తూ అచ్చ తెలుగు కావ్యాలు వచ్చాయి. ఏది ఏమైనా తెలుగు మీద ఒకప్పుడు సంస్కృతం అత్తగారి పెత్తనం సాగితే, ఇవాళ ఇంగ్లిష్ మామగారి పెత్తనం సాగుతుందన్నది వాస్తవం. ప్రాచీన సౌందర్యం వర్తమాన సాహిత్య అధ్యయనం వల్ల సమకాలీన వస్తువులు, అధునాతన వ్యక్తీకరణ పద్ధతులు, వాదాలు, ఉద్యమాలు మొదలైనవాటి గురించి తెలుస్తుంది. మరి ప్రాచీన సాహిత్యాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యాలి? ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ఇక అతని కవిత్వంలో ధాటి చెప్పాల్సిన పనిలేదు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ వ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి. ‘అభ్రంకషంబైన యాలపోతు నితండు త్రుంచినా డీతండు పెంచినాడు’ అనే నాచన సోమన పద్యాన్ని పరిశీలిస్తే, భిన్నాంశాల మధ్య వైరుధ్యాన్ని ఎట్లా వ్యక్తీకరించవచ్చో తెలుస్తుంది. అదే కవి ‘అరి జూచున్, హరి జూచు’ అంటూ భిన్న చర్యల మార్పును ఎంత చక్కగా కవిత్వీకరించవచ్చో చూపించాడు. అడిగెదనని కడు వడి జను నడిగిన దను మగుడ నుడుగడని నడ యుడుగున్ వెడవెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్రుడిని రక్షించటానికై ఆదర బాదరగా పరిగెత్తుతున్న విష్ణువు పరిస్థితి అర్థం గాని లక్ష్మీదేవి మానసిక డోలాందోళన అది. పోతన రచించిన సర్వ లఘు కందం. చక్కని డకార అనుప్రాస. అర్థానికి శబ్ద సౌందర్యంతో పరిపుష్ఠి నెట్లా కల్పించవచ్చో తెల్పుతుంది. ‘మమ్మెరుగు, దెదిరి నెరుగుదు’మనే కంద పద్యంలో తిక్కన ఏడు వాక్యాలు ఇమిడించాడు. అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన తిక్కనను చూసి నేర్చుకోవాల్సిందే. శ్రీనాథుడు తనకెంతో ఇష్టమైన సీస పద్య రచనలో 32 రకాల గతి భేదాలు ప్రదర్శించాడు. వ్యావహారిక భాషావాదం ఆంగ్లేయుల వలస పాలనలో 20వ శతాబ్ది మొదటి పాదంలో దేశంలో ఆధునిక దృక్పథం మొదలైంది. తరతరాల సాహిత్య, సాంస్కృతిక మూలాలను విమర్శిస్తూ కొత్త దారుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. గురజాడ, గిడుగు సాహిత్య రంగంలో దీనికి ఆద్యులు. ‘మంచి గతమున కొంచెమే’ అన్నాడు గురజాడ. భాషలో యథాస్థితి వాదానికి, పరిణామ వాదానికి మధ్య యుద్ధం 1910లోనే మొదలైంది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు, గురజాడ అంకురార్పణ చేశారు. దానికి వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు నాయకత్వంలో గ్రాంథిక భాషా వాదం సాగింది. కాలక్రమంలో వ్యావహారిక భాషోద్యమానిది పైచేయి అయిందని మనకు తెలిసిన సంగతే. ఆ తర్వాత భాషా వ్యవహారంలో స్థిరీకరణ కోసం శిష్ట వ్యవహారం ముందుకొచ్చింది. కాని నిలబడలేకపోయింది. విభిన్న మాండలికాల మధ్య ప్రామాణిక భాష అనేది ఆదర్శంగానే మిగిలిపోయింది. అయితే మధ్య కోస్తాలో వెలసిన పత్రికల ద్వారా ఆ ప్రాంతపు భాష ముఖ్యంగా రాతలో, రచనల్లో ఆధిపత్యం వహించింది. రాను రాను రచయిత తమ ప్రాంతపు జీవద్భాషలో రచనలు చెయ్యటం వల్ల గొప్ప భాషా వైవిధ్యం చూడగలుగుతున్నాం. ప్రాచీన గ్రంథాల భాషకి, ప్రజల వ్యవహార భాషకి మధ్య గల అంతరాన్ని గుర్తించటమే వ్యావహారిక భాషావాదానికి ప్రాతిపదిక. గ్రాంథిక భాషలోని కృత్రిమత్వాన్ని, ‘పండితభిషక్కుల భాషా భేషజా’న్ని గిడుగువారు బయటపెట్టారు. వాడుక భాషే రచనా భాషగా ఉండటం సహజమైన విధానమని ఆయన చెప్పటంలో తప్పు లేదు. అయితే వ్యావహారిక భాషావాదులు గమనించని అంశమేమిటంటే, మాట్లాడే భాషకి, లిఖిత భాషకి పూర్తి ఏక రూపత సాధ్యం కాదనేది. ఉచ్ఛారణలో విసంధులు పాటించం. కాని రాతలో పాటించకపోతే అర్థ స్పష్టత ఉండకపోగా అపార్థాలు చోటుచేసుకుంటాయి. గురజాడే ‘కన్యాశుల్కం’లోని సంభాషణల్లో ఉచ్ఛారణ భేదాన్ని గుర్తించటానికి కొన్ని గుర్తులు వాడాల్సి వచ్చింది. వ్యావహారిక భాషోద్యమం గ్రాంథిక ‘భాష’ని తిరస్కరించే క్రమంలో ఆ భాషలోని అన్ని విలువల్ని తిరస్కరించే ఆలోచనావిధానం తలెత్తింది. తన కవిత ‘శ్మశానాల వంటి నిఘంటువుల దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదలి’ వెలువడిందన్నాడు శ్రీశ్రీ. కవిత్వ ఆవిర్భావంలోని నిసర్గ లక్షణాన్ని ఆయన దర్శించిన పద్ధతి అది. ఆ మాటలలోని ధ్వనిని వదిలిపెట్టి, వాచ్యార్థం గ్రహించిన సాహిత్యకారులు, నిఘంటువులు, వ్యాకరణాలు, ఛందస్సులు పూర్తిగా అనవసర విషయాలుగా భావించారు. ప్రాచీన సాహిత్యానికి అవి నిర్మాణ సాధనాలు. వాటిని తిరస్కరించే క్రమంలో ఆ సాహిత్యాన్నీ తిరస్కరించారు. అందులో రాచరిక, భూస్వామ్య విలువలు, వర్ణ భేదాలు, దైవ కేంద్రక భావజాలం- ఇవన్నీ ఉన్నమాట నిజం. అయితే ప్రాచీన సాహిత్యమంటే అవి మాత్రమే కాదు. భాషా విన్యాసం, పలుకుబడి, సాంస్కృతిక విశేషాలు, పౌరాణిక, చారిత్రక సమాచారం- మరెన్నో అందులో ఉన్నాయి. వాటిని నిరాకరించటమంటే ఆ వారసత్వ సంపదని కోల్పోవటమే. పద్యాల్లో వ్యక్తిత్వ వికాసం పద్యం పాత చింతకాయ పచ్చడే కావచ్చు. కాని పిల్లలకు నైతిక జీవసూత్రాలు తెల్పటానికి, ధారణాశక్తి వృద్ధికి, భాషా సౌందర్యం తెలుసుకోవటానికి పద్య సాహిత్యం ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. ఉదాహరణకి తిక్కన భారతంలో ఒక పద్యం చూడండి: ఒరు లేయవి యొనరించిన నరవర! య ప్రియము మనంబున కగు, దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్ ఇతరులు ఏ పనులు చేస్తే మనం బాధపడతామో, ఆ పనులను ఇతరుల పట్ల మనం చెయ్యకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం. ‘చదువు పద్యమరయ చాలదా యొక్కటి’ అన్నాడు వేమన. ఆ ఒక్కటి ఈ పద్యమే అనుకోగూడదా? తప్పులెన్నువారు తండోపతండముల్ ఊరి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరో విశ్వదాభిరామ! వినురవేమ! తేట తెలుగు మాటలతో సరళమైన అల్లిక పనితనం అది. భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే యిటువంటి పద్యాలు, శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా? తెలుగు లేని చదువు ఒక్క తెలుగు అక్షరం నేర్చుకోకుండా ఉన్నత విద్యాధికుడు కాగల అవకాశం తెలుగు దేశంలోనే ఉంది. కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. తెలుగు మీడియం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక సంపదకి దూరం కావటమే. పునాది లేని సమాచార నిధిగా మిగిలిపోవటమే. భాషను ఆధునికం చెయ్యటం ఎలా? భాష కూడా ఇవాళ ప్రపంచీకరణకి గురి అవుతున్నది. కొత్త కొత్త శాస్త్ర విశేషాలు, కొత్త కొత్త అవసరాలు, వాటిని తీర్చే సాధనాలు పుట్టుకొస్తున్నప్పుడు వాటిని గ్రహించకుండా ఏ భాషైనా మడికట్టుకొని కూర్చోగూడదు. భాష విస్తృతం కావటానికి రెండు పద్ధతులున్నాయి. కొత్త పరిభాషని ఇతర భాషల నుంచి యధాతథంగా గ్రహించటం. రైలు, రోడ్డు, గుమస్తా, తారీకు, బత్తాయి మొదలైన ఇతర భాషా పదాల్ని (అన్య దేశాలు) అట్లాగే చేర్చుకొన్నాం. విషయ నిర్దేశానికి, వ్యక్తీకరణకి అవసరమైన పరిభాషను సొంతగా కల్పించుకోవటం. అశ్వ శక్తి, నల్ల ధనం, హరిత విప్లవం లాంటివి ఇట్లా కల్పించుకున్నవే. ఆ ప్రయత్నం పట్టుదలతో సాగటం లేదు. కంప్యూటర్ పరిభాషని మొత్తం తమిళంలో కల్పించుకోగలిగారు తమిళులు. ‘కంప్యూటర్’ అనే ఒక్క మాటని కూడా తెలుగు చెయ్యలేకపోయాం. పాలనా యంత్రాంగంలో అధికార భాషగా ఇంగ్లిష్ స్థానంలో తెలుగును ప్రవేశపెట్టడం అవసరం. నాయకులకు రాజకీయ నేపథ్యం తప్ప సాంస్కృతిక నేపథ్యం లేకపోవటం మన దురదృష్టం. తెలుగు భాషకి ప్రాచీన హోదా కన్నా ఆధునిక హోదా ఇవాళ అత్యవసరం. - పాపినేని శివశంకర్ (ప్రముఖ కవి, రచయిత) -
తెలుగు భాష మధురం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: పరభాషీయుల చేత పొగడబడిన మధురమైన భాష మన తెలుగు భాష అని విశ్రాంత తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కాసల నాగభూషణం అభిప్రాయపడ్డారు. శనివారం చెన్నై, పెరంబూర్‌లోని బందర్‌ఆది వెలయ సమూహం వేదికగా శ్రీరాయల కళాసమితి(తెలుగు సాంస్కృతిక సమితి) 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందనామావళితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గిరి కంపెనీ అధినేత మోటుపల్లి డాక్టర్ గిరిహనుమంతరావు అధ్యక్షత వహించారు. పిళ్లారిశెట్టి ఆదికేశవరావు స్వాగతం పలికారు. చెన్నై, రెప్కో బ్యాంకు జనరల్ మేనేజర్ వంజరపు శివయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ కాసల నాగభూషణం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతికి ఆయుపట్టు భాష అని కొనియాడారు. అనంతరం గిరి హనుమంతరావు మాట్లాడారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ రాయలు పేరు మోసిన రాయలకళా సమితి నిర్వహించిన కార్యక్రమానికి తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరుకాక పోవడం విచారకరమన్నారు. వార్షికోత్సవంలో జీ.గౌరి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వందన సమర్పణ బాబు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవి, కాకాణి వీరయ్య, పీ.రమణయ్య తదితర ప్రముఖులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.