జాతీయస్థాయిలో కవుల ప్రతిభ | poets merit in national level | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో కవుల ప్రతిభ

Published Sun, Mar 19 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

జాతీయస్థాయిలో కవుల ప్రతిభ

జాతీయస్థాయిలో కవుల ప్రతిభ

– ముగ్గురు కవులకు పురస్కారాలు
 
 మహానంది: మైసూరులోని కేంద్ర భారతీయ భాషల సంస్థ, న్యూఢిల్లీకి చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో ఆదివారం నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో మన కవులు ప్రతిభ చాటారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న టీఎం దాస్‌, తిమ్మాపురం జెడ్పీపాఠశాలలో పనిచేస్తున్న ఎల్‌ఎన్‌ నీలకంఠమాచారి, ఎస్‌.మహబూబ్‌భాషలకు జాతీయస్థాయిలో పురస్కారాలు లభించాయి. సీఐఐఎల్‌ డైరెక్టర్, ఫ్రొఫెసర్‌ డిజీరావు, కర్ణాటక తెలుగు రచయితల సంఘం సమాఖ్య కార్యదర్శి మాల్యాద్రి, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌పీ మహాలింగేశ్వర్‌లు పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. 
 ఫోటో– 19 ఎస్‌ఆర్‌ఐ 55...జాతీయస్థాయిలో పురస్కారాలు పొందిన ముగ్గురు కవులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement