ప్రయాణికుల అవసరాలకే ప్రాధాన్యం
ప్రయాణికుల అవసరాలే ప్రధానంగా వ్యాపారాలు కొనసాగిస్తేనే ఆర్టీసీ సహకారం ఉంటుందని రీజనల్ మేనేజర్ పీవీ రామారావు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం వోల్వో కార్నర్ సమీపంలో రేవతి విశ్రాంతి లాంజ్ ప్రారంభమైంది.
విజయవాడ (బస్‌స్టేçÙన్) : ప్రయాణికుల అవసరాలే ప్రధానంగా వ్యాపారాలు కొనసాగిస్తేనే ఆర్టీసీ సహకారం ఉంటుందని రీజనల్ మేనేజర్ పీవీ రామారావు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సోమవారం వోల్వో కార్నర్ సమీపంలో రేవతి విశ్రాంతి లాంజ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందించాలన్న ఆలోచనతో విశ్రాంతి గదులను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని కోరారు. నిర్వాహకుడు ప్రసాద్ మాట్లాడుతూ ఎండీ నండూరి సాంబశివరావు చేస్తున్న బస్టాండ్ అభివృద్ధికి అనుగుణంగా ఈ లాంజ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డీఏం నాగశేషు, బస్టాండ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జాన్‌సుకుమార్, యూనియన్ నాయకులు ఎండీ దుర్గాప్రసాద్, బర్మా ప్రభాకర్, తెలంగాణ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంతి లాంజ్ ప్రత్యేకత
లాంజ్ వోల్వో సర్వీసు ప్రయాణికులు అరగంటపాటు ముందుగా వచ్చి ఉచితంగా ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. టికెట్లు పరిశీలించాకే నిర్వాహకులు లాంజ్‌లోకి అనుమతిస్తారు. ఎక్కువ సమయమైతే చార్జీ వసూలు చేస్తారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం గంటకు రూ.20, ఆపై ప్రతి గంటకు రూ.10 వసూలు చేస్తారు. ఈ ఏసీ లాంజ్‌లో సినిమాలు కూడా ప్రదర్శిస్తారు.