
హైదరాబాద్: త్రిభాషా పాలసీ అనేది కొత్తది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటునుండి ఈ విధానం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని, నచ్చిన భాషను చదువుకోవచ్చని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చాం. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలను రచ్చ కొట్టి అధికారం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి.
దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. నియోజకవర్గ పునర్విభజన పై కొత్త నియమాలు రాలేదు.జనగణన జరగలేదు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేస్తా అని అంటున్నారు. దక్షిణ భారత ప్రజలు తన్యవంతులయ్యారు అక్షరాస్యత పెరిగింది.. మీ పిచ్చి మాటలు నమ్మరు. రాజకీయ దురుద్దేశంతో ప్రజల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు మిగతా పార్టీలకు మధ్య వార్ నడుస్తోంంది. ఇదే అంశంపై పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానాన్ని సమర్ధించారు. ఎలాగు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది కాబట్టి సమర్థిస్తూ మాట్లాడారు పవన్. దీనిపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment