OPENING
-
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్ సందడి (ఫొటోలు)
-
దుబాయిలో రెస్టారెంట్ ఓపెనింగ్‌లో సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా..ఓపెనింగ్ ఫోటోలు వైరల్
-
కూకట్‌పల్లిలో కాంచీపురం నారాయణి సిల్క్స్ వస్త్ర షో రూమ్ ను ప్రారంభించిన సినీనటి లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
చదువుల మోత!
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్‌స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పారిస్ ఒలింపిక్స్ 2024: సన్నాహకాలు.. ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Rakul Preet Singh: హైదరాబాద్‌లో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన రకుల్ (ఫోటోలు)
-
‘అర్జునుడి గీతోపదేశం’ మూవీ ఓపెనింగ్ (ఫోటోలు)
-
హైదరాబాద్ శరత్ సిటీ మాల్ లో అత్యాధునిక థీమ్ తో A19 క్లబ్, కిచెన్ ప్రారంభం (ఫొటోలు)
-
సాక్షి మనీ మంత్ర : స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఫోకస్లో రిలయన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు కోలుకున్నాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో క్రాష్ అవ్వగా ఈరోజు స్టీడీ అయినట్లు కనిపిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 14.96 పాయింట్లు లేదా 0.021 శాతం నష్టంతో 72,289.92 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29.80 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 21,921.35 వద్ద కొనసాగుతున్నాయి. రిలయన్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటర్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా మార్కెట్లు.. దూసుకెళ్తున్న ‘టాటా’ షేర్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మంగళవారం లాభాలతో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు కూడా స్వల్ప లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 16.65 పాయింట్లు లేదా 0.023 శాతం స్వల్ప లాభంతో 73,111.87 వద్ద కొనసాగుతోంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా 11.00 పాయింట్లు లేదా 0.050 శాతం ఎగిసి 22,209.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, హిందాల్కో షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హీరో మోటర్‌కార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం కూడా నష్టాలతోనే సెషన్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160.80 పాయింట్లు లేదా 0.23 శాతం క్షీణించి 70,370.55 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22.60 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 21,216.20 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, కోల్ఇండియా షేర్లు టాప్ గెయినర్స్‌గా, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటర్‌కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటర్స్, గ్రాసిమ్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు భారీ భద్రత
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర భద్రత , ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేశారు. అయోధ్య విమానాశ్రయ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. మొదటి దశలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి గంటకు రెండు నుంచి మూడు విమానాలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. 2,200 మీటర్ల పొడవున రన్‌వే నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. విమానాశ్రయం రెండో దశ అభివృద్ధికి త్వరలో కేబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటామని సింధియా తెలిపారు. రెండో దశలో రన్‌వే పొడవును 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెంచనున్నారు. దీని వల్ల రన్‌వే పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్లకు పెరగనుంది. -
‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2024 జనవరి 22న నూతన రామాలయంలో మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. తాజాగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15తో పోల్చారు. రాయ్ మీడియాతోమాట్లాడుతూ దేశంలో 1947, ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో, 2024 జనవరి 22 కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా అయోధ్య రామమందిర నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమవుతుండటంపై దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. 2024, జనవరి 22న నూతన రామాలయంలో జరిగే బాల రాముని విగ్రహప్రతిష్ణాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. -
బెజవాడలో కృతీ శెట్టి.. ఎంత ముద్దుగా ఉందో! (ఫోటోలు)
-
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 19,000 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు నమోదైన నష్టాలు కొనసాగాయి. సెన్సెక్స్ మళ్లీ 500 పాయింట్ల నష్టానికి చేరువైంది. నిఫ్టీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో 63,580 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల క్షీణతతో 18,975 వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, మహీంద్ర అండ్ మహీంద్ర, అదానీ ఎంటర్‌ప్రైజస్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకుని టాప్ లూజర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు లాభాలతో ముగిసిన సూచీలు ఈరోజు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 66,305 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 19,781 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లలో తాజా పెరుగుదలకు మార్కెట్లు సర్దుబాటు అవుతున్న క్రమంంలో ఈరోజు ట్రేడింగ్ సెషన్ మందకొడిగా ప్రారంభమైంది. నిఫ్టీ50 19,820 మార్క్ పైన ప్రారంభమైంది. ట్రేడ్ ప్రారంభంలో సెన్సెక్స్ 50 పాయింట్లు మాత్రమే పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ప్రతికూల పక్షపాతంతో ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సిప్లా, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అలాగే అపోలో హాస్పిటల్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడట్స్, ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం
కామారెడ్డి: రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకై క ప్రభుత్వం మాదేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొల్లూర్‌లో రూ.98 కోట్ల నిధులతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రాన్ని 15 ఏళ్లు సీఎంగా పాలించినా నేటికి అక్కడ కరెంటుకు దిక్కులేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడం, సీఎండీగా ప్రభాకర్‌రావు డిస్ట్రీబ్యూషన్, ట్రాన్స్మిషన్, జనరేషన్లో తీసుకున్న విప్లవాత్మక చర్యల మూలంగా తెలంగాణలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన సమయంలో మనకు 7,780 మెగావాట్ల విద్యుత్ వస్తే దాన్ని నేడు 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్రావులకే దక్కుతుందన్నారు. కొల్లూర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్కిట్లను పంపిణీ చేశారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రారెడ్డి, జెడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ తుకారాం, నాయకులు ద్రోణవల్లి సతీష్, అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. తలసరి వినియోగంలో టాప్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140యూనిట్లు అయితే దేశం సరాసరి విద్యుత్ తలసరి వినియోగం 1255 యూనిట్లు మాత్రమేనని తెలిపారు. వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్ఈ సూర్య నర్సింహారావు, తదితరులు ఉన్నారు. -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలకు బ్రేక్! లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు
today stock market opening: వరుస నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 65,589 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,535 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, నెస్లే, హెచ్‌యూఎల్, ఐచర్ మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
today stock market opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఏ మాత్రం కోలుకోలేదు. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 65,059 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల క్షీణతతో 19,400 వద్ద కొనసాగుతున్నాయి. నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: అదే నష్టాల బాట.. నేలచూపుతో ప్రారంభమైన సూచీలు
Today Stockmarket Opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పండగ వేళ వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కీలక సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 67,196 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 117 పాయింట్లు క్షీణించి 20,016 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ గెయినర్స్‌గా కొనుసాగుతుండగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జియో ఫినాన్సియల్ కంపెనీ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ప్రేమ.. వినోదం
‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్పై ఎం.గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్. నిర్మాత రాచాల యుగంధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న,లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. -
Varun Tej Matka Movie Pooja Ceremony Photos: వరుణ్ తేజ్ కొత్త మూవీకి శ్రీకారం.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్ (ఫొటోలు)
-
సాక్షి మనీ మంత్రా: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జులై 19) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 67,021 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 19,810 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీసీ, ఇన్ఫోసిస్, విప్రో, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్‌గా, మారుతీ సుజికీ, ఐచర్ మోటర్స్, సిప్లా, హీరో మోటర్‌కార్ప్, నెస్లే సంస్థలు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టగా, ఆటో మొబైల్ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
కూకట్‌పల్లిలో వస్త్ర దుకాణం ప్రారంభోత్సంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
త్వరలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..
భారత్ కొత్త పార్లమెంటు భవనాన్ని మే నెలాఖరు కల్లా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ తొమ్మిదేళ్ల పాలనుకు గుర్తుగా నిర్మించిన ఈ కొత్త పార్లమెంట్ భవనం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ భవనాన్ని దాదాపు 970 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో సుమారు 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది. ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణంలో జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు. దీనిని 2020 డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంభోత్సవంలో భాగంలో నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు భారీగా ప్రత్యేక ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు మే 30న ప్రధాని మోదీ భారీ ర్యాలీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ మరుసటి రోజే ప్రధాని రెండో ర్యాలీని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తదుపరి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని దర్కించుకుని నిరాటంకంగా తొమ్మిదేళ్లు పాలించారు. అందుకు గుర్తుగా దేశ వ్యాప్తంగా బీజేపీ సినియర్ నేతలు సుమారు 51 ర్యాలీలు నిర్వహించనుండగా, దాదాపు 396 లోక్‌సభ స్థానల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ ర్యాలీలు, బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం (చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..) -
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్ (ఫొటోలు)
-
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం (ఫొటోలు)
-
Sreeleela : హైదరాబాద్ ఏ ఎస్ రావునగర్ నగర్ లో శ్రీలీల సందడి ( ఫొటోలు)
-
IPL 2023 Opening Ceremony : ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అదరహో (ఫొటోలు)
-
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
Kiran Abbavaram Photos: కొత్త సినిమా స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
నిజామాబాద్‌లో నభా నటేశ్ సందడి (ఫొటోలు )
-
విజయవాడలో అనుపమ, మంత్రి రోజా సందడి (ఫొటోలు )
-
ఘనంగా గల్లా అశోక్ కొత్త సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్రామ్గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్సార్ చొరవతో.. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్ -
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్ 11న మేడ్చల్–మల్కాజిగిరి ,వికారాబాద్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాదాపు ఆరేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిపాలన కీసర మండల కేంద్రం సమీపంలోని అద్దె భవనం నుంచి కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలకు పారదర్శక పాలన, పరిపాలన సులభతరం.. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచటం.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా 2017 అక్టోబర్ 11న శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పునాది వేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. -
తాలిబన్ల రాజ్యం ఆప్గన్‌లో స్కూల్స్ ఓపెన్.. స్పెషల్ కండీషన్స్ అప్లై..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆప్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అనంతరం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు. ఇదిలా ఉండగా.. తాలిబన్ల సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆప్గనిస్తాన్ పిల్లల చదువు విషయంలో సర్కార్ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మద్ రయాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని కండీషన్ అప్లై అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని చెప్పారు. అయితే, బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని తెలిపారు. అలాగే, రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేని క్రమంలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నట్టు వెల్లడించారు. కాగా, బాలుర విద్యాసంస్థల్లో పురుషులతో తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మరోవైపు, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్, కాలేజీల మూసివేత ఉండదని స్పష్టం చేశారు. -
కూకట్ పల్లిలో ‘మహానటి’ కీర్తి సురేశ్ సందడి
టాలీవుడ్ హీరోయిన్, ‘మహానటి’ కీర్తి సురేశ్ కూకట్‌పల్లిలో సందడి చేసింది. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ముగ్ధ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ముగ్ధ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించారు. ఇప్పటికే నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియోని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... హైదరాబాద్‌లోని కూకట్పల్లి వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. -
నేతన్న ల కోసం కొత్త టెక్నాలజీని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
కేసీఆర్ ఢిల్లీ టూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
-
రెన్యువబుల్ ఎనర్జీలో తెలంగాణలో నెంబరు2గా ఉంది : కేటీఆర్
-
హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూఎస్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మాదాపూర్‌లోని సలార్పురియా సత్వ నాలెజ్డ్ సిటీలో 1,59,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం నుంచి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కంన్జ్యూమర్ బ్యాంకింగ్ సపోర్ట్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది పనిచేస్తున్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 800లకు చేరుతుందని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2023 చివరినాటికి హైదరాబాద్ కేంద్రంలో 2,500 మంది ఉద్యోగులు ఉంటారని వెల్లడించారు. మహమ్మారిలోనూ పెట్టుబడులు.. కార్యాలయం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రభుత్వంతో గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ బృందం చర్చించింది. హైదరాబాద్ కార్యాలయానికి 500 మందిని నియమించుకుంటామని ఆ సందర్భంగా తమకు తెలిపారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘2023 నాటికి 2,500 మందిని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. ఇక్కడి మానవ వనరుల సామర్థ్యంపై కంపెనీకి ఉన్న నమ్మకానికి, మెరుగైన మౌలిక వసతులకు ఇది నిదర్శనం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే లక్ష్యానికి చేరుకోవడంతోపాటు కంపెనీ తదుపరి విస్తరణ చేపడుతుందన్న విశ్వాసం ఉంది. మహమ్మారిలోనూ పెట్టుబడులను ఆకర్శిస్తున్నాం. మరిన్ని కంపెనీలు రానున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో భాగ్యనగరిలో 1.8 లక్షల మంది పనిచేస్తున్నారు. వీ–హబ్‌తో కలిసి పనిచేయాల్సిందిగా గోల్డ్‌మన్ శాక్స్‌ను కోరుతున్నాను’ అని మంత్రి తెలిపారు. -
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్ జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైష్ణవ్, కృతీలను చూసేందుకు ‘ఉప్పెన’లా ఎగిసిపడ్డ జనసంద్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్డౌన్ తర్వాత విడుదలై సినిమాల్లో ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. దీంతో ఈ మూవీ హీరోహీరోఇయన్, దర్శకుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటు బిజీ అయిపోయారు. వీరికి ఉప్పెన నిర్మాతల నుంచి విలువైన బహుమతులు అందాయి. ఇటీవల బచ్చిబాబు సనాకు మైత్రీ మూవీ మేకర్స్ విలువైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. Khammam lo KLM shopping mall opening lo Uppena Hero Heroines ni choodadaaniki Uppenalaa egasipadina janam... pic.twitter.com/76OgBVLPcX — BARaju (@baraju_SuperHit) April 3, 2021 చదవండి: ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..! -
ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వషీ
చెన్నై: డ్రెసింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చే విలువైన సలహాలు యువ ఆటగాళ్లలో ఎంతో స్పూర్తిని నింపుతాయని, మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు అవి ఓ టానిక్‌లా ఉపయోగపడతాయని టీమిండియా యువ సంచలన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఆటలో ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అతను పేర్కొన్నాడు. తన ఆటతీరును కోచ్ రవిశాస్త్రి ఏ మేరకు ప్రభావితం చేసాడనే అంశంపై సుందర్ మాట్లాడుతూ.. నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ లభించటం ఎంతో అదృష్టమని, మరీ ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా రాణించాలకున్న నాకు రవిశాస్త్రి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. రవిశాస్త్రి తన టెస్టు కెరీర్లో ఎడమచేతి స్పిన్ బౌలర్‌గా, కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించిన విషయాన్ని సుందర్ గుర్తుచేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. కోచ్ రవిశాస్త్రే తనకు, స్పూర్తి, ఆదర్శమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ అండర్-19 క్రికెట్లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడితే సరిపోదని, తనలోని స్పిన్ బౌలింగ్‌కు సాన పట్టాడు. చాలామంది యువ ఆటగాళ్లలాగే సుందర్ కూడా ఐపీఎల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటూ తన చిరకాల స్వప్నం అయిన టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. బ్రిస్బేన్ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మొత్తం 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. -
7వ రోజూ లాభాల ఓపెనింగ్ చాన్స్?!
నేడు(9న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 51 పాయింట్లు ఎగసి 11,878 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,827 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సహాయక ప్యాకేజీపై తిరిగి చర్చలు ప్రారంభంకావచ్చంటూ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో గురువారం యూఎస్ మార్కెట్లు 0.8-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే.. ఆర్బీఐ పాలసీ సమీక్ష, వరుసగా 6 రోజులపాటు ర్యాలీ నేపథ్యంలో నేడు ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో నేడు మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్@ 40,180 గురువారం దేశీ మార్కెట్లు 7 నెలల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు జంప్‌చేసి 40,183 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు జమ చేసుకుని 11,835 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు హైజంప్ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,062 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 11,906-11,791 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,782 పాయింట్ల వద్ద, తదుపరి 11,729 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,896 పాయింట్ల వద్ద, ఆపై 11,958 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,020 పాయింట్ల వద్ద, తదుపరి 22,848 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,407 పాయింట్ల వద్ద, తదుపరి 23,623 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 978 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 20 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అతి పొడవైన టన్నెల్‌ని ప్రారంభించనున్న మోదీ
షిమ్లా: మనాలి–లేహ్ మధ్య 46 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించే హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్తంగ్ వద్ద కీలకమైన అటల్ టన్నెల్‌ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే హైవేపై నిర్మించిన అతి పొడవైన టన్నెల్. 9.02 కిలోమీటర్ల ఈ టన్నెల్ రక్షణ రీత్యా అత్యంత వ్యూహాత్మకమైనది. మనాలీ లేహ్‌ల మధ్య 4 నుంచి 5 గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ఈ టన్నెల్‌ను సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో, అత్యాధునిక సాంకేతికతతో నిరి్మంచారు. ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ, బస్సులో ఈ టన్నెల్ మార్గంలో ప్రయాణిస్తారు. (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం) -
కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలు ఈ వంతెనను ప్రారంభించాల్సి ఉంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. (దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్ అందాలు) మరోవైపు ఈ నెల నాలుగో తేదీనే మరికొన్ని రోడ్లు, వంతెనలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన నగరంలోని బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ లాంఛన ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. ఫిబ్రవరిలోనే ఈ వంతెనపై వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. అలాగే రూ.100 కోట్లతో నిర్మించ తలపెట్టిన బెంజి సర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన, రూ.740 కోట్లతో నిర్మించిన మచిలీపట్నం రోడ్డు ప్రారంభోత్సవం, రూ.2,700 కోట్లతో నిర్మించనున్న విజయవాడ బైపాస్ రోడ్ల రెండు ప్యాకేజీలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈనెల 8వ తేదీ తర్వాత ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
మావో సూట్, మారిన హెయిర్‌స్టైల్
సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్‌లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. నవ్వుతూ కలియతిరుగుతూ.. ఉ. కొరియా విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తే కిమ్ అనారోగ్యం బారిన పడినట్టు లేదు. నల్లని మావో సూట్ వేసుకొని, కొత్త హెయిర్ స్టైల్‌తో నవ్వుతూ కనిపించారు. తన సోదరి అందించిన కత్తెరతో రెడ్ రిబ్బన్ కట్ చేసి అందరి కరతాళ ధ్వనుల మధ్య ఫ్యాక్టరీని ప్రారంభించారు. పొగ పీలుస్తూ, అధికారులతో మాట్లాడుతూనే ఎరువుల ఫ్యాక్టరీలో కలియతిరిగారు. ఫ్యాక్టరీలో తిరిగేటపుడు ఊతకర్ర లేకుండా నడిచారు. 2014లో ఆయన కాలుకి సర్జరీ జరిగి కోలుకున్నాక కిమ్ గతంలో కొంతకాలంపాటు ఊతకర్ర సాయంతో నడిచారు. ఈ సారి నడుస్తున్నపుడు ఊతకర్ర సాయం తీసుకోలేదు. అయితే ఒక ఫొటోలో కిమ్ పక్కన ఉన్న అధికారి చేతిలో ఊతకర్ర ఉంది. ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి చూపించే చరిత్ర ఉ.కొరియాకు ఉండడంతో కిమ్ ఊతకర్ర లేకుండా నడుస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మాస్కులతో కార్మికులు.. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన వేదికపై కిమ్, ఇతర అధికారులు కూర్చొని ఉండగా బెలూన్లు గాల్లో ఎగురవేసి మే 1న సంచోన్ ఫాస్ఫేటిక్ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం అయిందంటూ ప్రకటించారు. ఆ సమయంలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు ముఖానికి మాస్కులతో కనిపించారు. అంటే ఉ.కొరియాలోనూ కరోనా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. పార్టీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పాలిట్ బ్యూరోలోకి ఏప్రిల్ 11న తన సోదరిని నియమించాక కిమ్ బయట ప్రపంచానికి కనిపించలేదు. కిమ్ బాడీ గార్డుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకిందని, అందుకే ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. -
అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం నేడు
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేశ్ డీ పటేల్ (దాజీ) మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఉదయం నుంచే పలు దేశాల నుంచి అభ్యాసీలు తరలివస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. -
నభా సందడి
-
నితిన్, ప్రియా వారియర్ మూవీ ప్రారంభం
-
బడికి వేళయింది
-
ఇదేందయ్యా..సోమిరెడ్డీ..!
వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెంలో పంచాయతీ కార్యాలయాన్ని..కమ్యూనిటీ భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. సరిగ్గా 24 గంటలు గడవలేదు. హంగూ..ఆర్భాటాలు..మందీ మార్బలంతో వచ్చి మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మళ్లీ వాటిని ప్రారంభించారు. ఇది చూసి జనం అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరమంటూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి ఆయనకు పరిపాటే అంటున్నారు స్థానికులు. మత్స్యకారులకు వలలు ఇస్తామని ప్రలోభపెట్టి కండువాలు కప్పడం.. సైకిళ్ల పంపిణీ కోసం తీసుకెళ్లి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం టీడీపీ నాయకులకే చెల్లుతోందని గుసగుసలాడున్నారు. వెంకటాచలం: మండలంలోని తాటిపర్తిపాళెంలో గేట్‌వే కంపెనీ ఏర్పాటుకు పంచాయతీ సహకరించడంతో ఆ కంపెనీ యాజమాన్యం గ్రామంలో తమవంతు సహకారంగా గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు కమ్యూనిటీ హాల్, పాఠశాలకు ప్రహరీ ర్మాణాలను చేపట్టింది. ఈ నిర్మాణాలు పూర్తికావడంతో అధికారికంగా గురువారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సమక్షంలో పంచాయతీ కార్యాలయాన్ని, కమ్యూనిటీ హాల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ డేగా శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ గ్రామంలో చాలా బలహీనంగా ఉందనే విషయం స్పష్టమైపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌ను 24 గంటల వ్యవధిలో మంత్రి సోమిరెడ్డి చేతుల మీదుగా మళ్లీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. గురువారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారనే విషయం తెలిసినా మంత్రి సోమిరెడ్డి అవేమీ తనకు పట్టవన్నట్లు మళ్లీ ప్రారంభించడాన్ని చూసి గ్రామస్తులు నవ్వుకున్నారు. సర్పంచ్ ప్రారంభించిన కార్యాలయాన్ని మంత్రి మళ్లీ ప్రారంభించడం ఏమిటని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కున్నారు. వెంకటాచలం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో దిక్కుతోచక తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నవ్వులపాలవుతోందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
'ఎన్టీఆర్' సినిమా ప్రారంభోత్సవం
-
ప్రజల కోసమే పాస్‌పోర్ట్ సేవలు
నల్లగొండ : ఉమ్మడి జిల్లా ప్రజల ప్రయోజనం కోసమే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప్రజల ఇబ్బందులను గమనించి జిల్లా కేంద్రంలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన ఎంపీ గుత్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాలంలో పాస్‌పోర్టు ప్రతిఒక్కరికి అవసరమన్నారు. గతంలో పాస్‌పోర్టు పొందేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడావసరం లేదన్నారు. ఎంపీ గుత్తా మాట్లాడుతూ.. నా హయాంలోనే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవలను ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాస్‌పోర్టు సర్వీసెస్ బోర్డు మెంబరు ఉషా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్, ఆర్డీఓ వెంకటచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి, రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎం.ఎలీషా, చీఫ్ పోస్ట్‌మాస్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. -
నగరంలో కాజల్ సందడి
నిజామాబాద్ కల్చరల్ (నిజామాబాద్‌అర్బన్) : ఇందూరు నగరంలో సోమవారం హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సందడి చేశారు. నగర నడిబొడ్డున రాష్ట్రపతిరోడ్డులో గల కిసాన్ ఫ్యాషన్మాల్ను సోమ వారం ఆమె రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. కాజల్ వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీసంఖ్యలో ఉదయం 10 గంటలకే కిసాన్ మాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ ఇందూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఆధునిక వస్త్ర ప్రపంచాన్ని ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదరించాలన్నారు. తాను నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు చక్కటి అవకాశాలు వస్తున్నాయన్నారు. కిసాన్ గ్రూపు చైర్మెన్ ధన్పాల్ సూర్యనారాయణగుప్తా మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా కస్టమర్లను సంతృప్తి పరచడానికి కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించామన్నారు. 40 సంవత్సరాలుగా తమ పట్ల కస్టమర్లు చూపుతున్న ఆదరణ మరచిపోలేమని, ఇదే ఆదరాభిమానాలు మున్ముందు చూపాలని ఆయన కోరారు. దాదాపు 40 నిమిషాలపాటు ఉన్న కాజల్ ఆగర్వాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్లో కలియతిరిగారు. అనంతరం షోరూం నుంచి తిరిగి వెళ్తూ బయట ఉన్న అభిమానులకు హాయ్ చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ ఫ్యాషన్ మాల్ యజమానులు ధన్పాల్ ప్రణయ్‌కుమార్, ఉదయ్‌కుమార్. నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
గొల్ల కురుమ సంక్షేమ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన
-
'వాళ్లమ్మాయి' షూటింగ్ ప్రారంభం
-
నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభం
-
బేగంపేటలో స్వాగతం.. శంషాబాద్‌లో వీడ్కోలు
-
బేగంపేటలో స్వాగతం.. శంషాబాద్‌లో వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు తాత్కాలిక షెడ్యూల్ ఖరారైంది. గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30కి ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన వెంట రానున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. వీరందరూ అక్కణ్నుంచి హెలికాప్టర్లో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన మెట్రో రైల్ పైలాన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి.. అనంతరం మెట్రో రైలును ప్రారంభిస్తారు. అదే రైలులో మియా పూర్ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి మియాపూర్ చేరుకుంటారు. మొత్తం 15 నిమిషాల పాటు ప్రధాని రైలు ప్రయాణం కొనసాగుతుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్లో మొత్తం 25 నిమిషాలను మెట్రో ప్రారంభోత్సవానికి కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మియాపూర్ నుంచి ప్రధాని, సీఎం హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సదస్సులో కేసీఆర్, అమెరికా పారిశ్రామికవేత్తల బృందానికి సారథ్యం వహిస్తున్న ఇవాంకా ట్రంప్ ప్రసంగాల అనంతరం మోదీ ప్రసంగిస్తారు. అక్కణ్నుంచి రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గంలో హెచ్ఐసీసీ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు భారత ప్రభుత్వం తరఫున ఈ ప్యాలెస్‌లో విందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి 8.45 నుంచి 9.30 వరకు ఇవాంకాతోపాటు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో ప్రధాని ఈ విందులో పాలుపంచుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. మియాపూర్‌లో పలు దుకాణాల తొలగింపు ప్రధాని రాక నేపథ్యంలో మియాపూర్ మెట్రో డిపో సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్–21 సిబ్బంది తొలగించారు. మియాపూర్ డిపో సమీపంలో వినాయకుల విగ్రహాల తయారీ దుకాణాలు, ఫర్నిచర్ సెకండ్ సేల్, టీస్టాల్స్, హోటల్స్ నిర్వహించే చిన్న గుడిసెలను తొలగించారు. ఎస్పీజీ అధికారుల సూచనల మేరకు భద్రతా కారణాలరీత్యా దుకాణాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మియాపూర్ ముస్తాబు.. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ డిపో అందంగా ముస్తాబవుతోంది. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రోరైలును లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో మియాపూర్ డిపో పరిసరాల్లో తీరొక్క మొక్కలు.. కార్పెట్ గ్రాస్‌తో హరిత వాతావరణం ఏర్పాటు చేయడంతోపాటు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. డిపో సమీపంలో సుమారు పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పార్కింగ్, ప్రజోపయోగ స్థలాల ఏర్పాటుతోపాటు.. చిన్నారులు గ్రామీణ క్రీడలు ఆడుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని హెలికాప్టర్‌ను నిలిపేందుకు మియాపూర్ డిపో లోపల ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. డిపో సమీపంలో ప్రధాని ఆవిష్కరించనున్న మెట్రో పైలాన్‌ను వడివడిగా సిద్ధం చేస్తున్నారు. కాగా, మెట్రో రైలు టికెట్ చార్జీలను నేడోరేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది -
సాయి ధరమ్ తేజ్ , కరుణాకర్ చిత్రం
-
బడి.. రెడీ
భీమడోలు/నిడమర్రు : బడి గంటలు మోగే సమయం ఆసన్నమైంది. 49 రోజుల వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు పునఃప్రారంభం కాబోతున్నాయి. నెల రోజులపాటు వృత్త్యం తర శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధనా పద్ధతులకు మెరుగులు దిద్దుకున్నారు. కొత్త ఉత్సాహంతో తరగతి గదుల్లోకి అడుగు పెట్టబోతున్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికే విద్యార్థుల నమోదు, పాఠశాలల పరిశుభ్రత, సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాలని సర్వశిక్షాభియాన్ అధికారులు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. దీంతో వారంతా శనివారం నుంచే బడిబాట పట్టారు. కొత్త తర గతుల్లో చేరేందుకు సోమవారం నుంచి విద్యార్థులు రానుండటంతో గదులు, బెంచీలను శుభ్రం చేయించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. వృత్తి నైపుణ్యం పెంచుకుని.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం వరకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ పొందారు. జిల్లాలో ప్రభుత్వ అన్ని యాజమాన్యాల పరిధిలో 3,300 పాఠశాలలు ఉండగా.. ఉపాధ్యాయులందరికీ వృత్త్యంతర శిక్షణ పూర్తయ్యింది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు నిర్వహించాలి్సన కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడ్డాయి. గత ఏడాది నిర్వహించిన తరగతి సంసిద్ధత, సంకల్పం, మన బడి–మన బాధ్యత, బోధనా పరికరాల మేళాలు, పాఠశాలల వార్షికో త్సవాలు, వేసవి బడులు వంటి కార్యక్రమాల ఫలితాలను ఒడిసిపట్టి పాఠశాలల పటిష్టతకు నడుం బిగించాలని అధికారులు నిర్దేశం చేశారు. ప్రతి పాఠశాలలో గత ఏడాది కన్నా 5నుంచి 10 మంది విద్యార్థులను నూతనంగా చేర్పించేందుకు ఉపాధ్యాయులు నడుం కట్టారు. చేపట్టాలి్సన కార్యక్రమాలివీ l ఐదేళ్ల వయసు నిండిన చిన్నారులను జూన్ 10నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి l పాఠశాలల పరిశుభ్రత, సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. l ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రాథమిక పాఠశాలలు రూ.వెయ్యి, యూపీ, హైస్కూళ్లు రూ.1500 చొప్పున పాఠశాల నిర్వహణ గ్రాంట్ నుంచి వినియోగించుకోవచ్చు. బ్యానర్లు, ఆడ్మిషన్ ఫారాలు సిద్ధం చేసుకుని ఈనెల 16వ తేదీ వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. l పాఠశాలకు నిర్ణయింపబడిన రంగులు వేయించాలి. ఇందుకు గ్రాంట్లను వినియోగించుకోవాలి. l పాత పుస్తకాలు, విరిగిన కుర్చీలు, బల్లలు లేకుండా చూసుకోవాలి. వీలైతే వాటిని బాగు చేయించడం లేదా స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసి విక్రయించాలి. l పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్లు, లైట్లు, మోటార్ కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. l టాయిలెట్లు, మంచినీటి ట్యాంకులు బాగుం డాలి. వాటిలో నీటి ప్రవాహం ఉండేలా ఏర్పాట్లు చేయించాలి. టాయిలెట్ల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1800–425–6358 అందరికీ కనిపించేలా పెయింట్‌తో రాయించాలి. l కిచెన్ షెడ్‌ను మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో శుభ్రం చేయించి జూన్ 12 నాటికి వంటకు సిద్ధం చేసుకోవాలి. పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్రం ఉంటే.. ఆ సిబ్బందిని కలుపుకుని వెళ్లాలి. l ప్రతి శుక్రవారం సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్ల లందరికీ ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు చదువు, ఆటపాటలు ఉండేలా సమీక్షించి చిన్నారుల ప్రగతిని పరిశీలించాలి. l సృజన పుస్తకాల ఆధారంగా బోధనా పరికరాల (టీఎల్ఎం)ను ఉపాధ్యాయులు విధిగా తయారు చేయాలి. లేదంటే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు. l పాఠశాల తరగతి సంసిద్ధత కార్యక్రమాలకు ఉపాధ్యాయులంతా ఉమ్మడి నిర్ణయం తీసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. విద్యా సంవత్సరంలో రోజువారీ కార్యక్రమాలను రికార్డు చేయాలి. l ఐదేళ్లు నిండిన చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలి. l చిన్నారుల హాజరు పుస్తకాలు, ప్రమోషన్ జాబితాలను సిద్ధం చేసుకోవాలి. l నూతనంగా చేరే విద్యార్థుల ఆధార్ నంబర్ తప్పనిసరిగా తీసుకోవాలి. l తరగతుల వారీగా పిల్లలందరికీ పాఠ్య పుస్తకాలు, రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందించాలి. l పాఠశాలల్లో పిల్లల సాయంతో కిచెన్ గార్డెన్లు నిర్వహించాలి. పిల్లలకు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉంటూ వారిని ప్రోత్సహించాలి. -
ప్రాణనష్టం నివారణకు రోడ్డుసేఫ్టీ వెహికల్స్
ప్రారంభించిన అర్బన్ ఎస్పీ రాజకుమారి అందుబాటులో మూడు వాహనాలు రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశామని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ పి.రాజకుమారి తెలిపారు. శనివారం సాయంత్రం మోరంపూడి సెంటర్లో మూడు వాహనాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ వాహనాలు ఆ ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకుని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చుతాయన్నారు. అర్బ¯ŒS జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 45 మంది, 2014లో 75 మంది మృత్యువాత పడ్డారన్నారు. రాజానగరం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో నరేంద్రపురం, బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో మోరంపూడి, కడియం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో బుర్రిలంక గ్రామాల్లో జాతీయరహదారి పక్కన ఈ వాహనాలు ఉంటాయన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని, ప్రమాదం తెలిసిన వెంటనే ఐదు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటాయన్నారు. అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ : రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ–బీట్ సిస్టమ్‌లో ఆఫ్లై¯ŒS యాప్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్బ¯ŒS జిల్లాలో 68 బీట్లు ఉన్నాయన్నారు. బీట్ షెడ్యూల్ ప్రకారం పది నుంచి 20 పాయింట్లు ఉంటాయన్నారు. ప్రతి పాయింట్ వద్ద బీట్ కానిస్టేబుల్ 20 నుంచి 30 నిమిషాలు ఉండాలన్నారు. ఇప్పటికే 26 సెల్ఫోన్లకు ఈ–బీట్ సిస్టమ్ అప్లోడ్ చేశామన్నారు. కార్యక్రమాల్లో డీఎస్పీలు రమేష్‌బాబు, కులశేఖర్, నారాయణరావు, సత్యానందం, త్రినాథరావు, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇ¯ŒSస్పెక్టర్లు చింతా సూరిబాబు, కనకారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె.వరప్రసాదరావు, సురేష్, కృపానందం, రవీంద్ర, రవికుమార్, రామకోటేశ్వరరావు, సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: ఆసియా నుంచి వీస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 36.47 పాయింట్ల నష్టంలో 28,190.14 వద్ద, నిఫ్టీ 12.20 పాయింట్ల నష్టంలో 8722.05 వద్ద ఎంట్రీ ఇచ్చాయి. వచ్చే వారంలో వచ్చే ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు మార్నింగ్ ట్రేడ్‌లో నష్టాలు గడించగా.. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, గెయిల్, కోల్ ఇండియా, ఐడియా సెల్యులార్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా పవర్, టెక్ మహింద్రా, అరబిందో ఫార్మా లాభాలు పొందాయి. గురువారం ట్రేడింగ్‌తో పోలిస్తే శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 67.35 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్‌గా డాలర్ బలహీనపడటంతో రూపాయి విలువ పెరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అశుతోష్ రైనా చెప్పారు. నేడు విడుదలయ్యే అమెరికా ఉద్యోగ డేటాపై కూడా మార్కెట్లు ఎక్కువగా దృష్టిసారించాయన్నారు. అనూహ్యంగా బీజింగ్ తన పాలసీని కఠినతరం చేస్తూ స్వల్పకాలిక రేట్లను పెంచడంతో చైనీస్ మార్కెట్లు పడిపోయాయి. దీంతో ఆసియా షేర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న కఠినతరమైన పాలసీలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అత్యంత స్వల్పంగా 5 రూపాయల లాభంతో 28,875గా ట్రేడవుతోంది. -
మలబార్లో జ్యూయలరీ షో ప్రారంభం
దానవాయిపేట(రాజమహేంద్రవరం): మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యూయలరీ ప్రదర్శనను రాజమహేంద్రవరంలోని గోకవరం బస్ స్టాండ్ వద్ద గల సంస్థ కార్యాలయంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథి ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒS జ్యూయలరీ షోను ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా ఉన్న భారతీయ ప్రాచీన సంప్రదాయ డిజై¯ŒS అభరణాలను నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి ప్రారంభించారు. వజ్రాభరణాలు, వివాహం, పార్టీల కోసం ధరించే ఆభరణాల కౌంటర్‌ను ఆకుల లక్ష్మీ పద్మావతి ప్రారంభిచారు. అ¯ŒSకట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట ఆభరణాల శ్రేణి ఇరా కౌంటర్‌ను అనుసూరి పద్మలత, జాతి రత్నాభరణాల సముదాయం ప్రెష్యా కౌంటర్‌ను ఇంద్రాణి సన్యాల్, హస్తకళా నైపుణ్యతతో తయారు చేసిన ఆభరణాల ఎత్నిక్స్ కౌంటర్‌ను మాటూరి మంగతాయారు ప్రారంభించారు. చిన్నారుల కోసం రూపొందించిన స్టార్లెట్ ప్రత్యేక బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 5 వరకూ జ్యూయలరీ ప్రదర్శన నిర్వహిస్తామని సంస్థ మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ లక్షీ్మపతి తదితరులు పాల్గొన్నారు. -
సంబరాలు ఆరంభం
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప పర్యాటకులకు కనువిందు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తీరంలో నాలుగు రోజులు కొనసాగనున్న సందడి ఉవ్వెత్తున ఎగసే జలధి తరంగాలు మనసులో వెల్లువెత్తే ఉత్సాహానికి ఉపమానాలు. ఆ అలల సాక్షిగా.. కాకినాడ కడలి తీర సందర్శకుల మదిలో అటువంటి ఉత్సాహమే ఉరకలెత్తింది. గురువారం ప్రారంభమైన సాగర సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, వివిధ రకాల పశు ప్రదర్శనలు, స్టాల్స్.. ఇటు విజ్ఞానాన్ని, అటు ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి సందడి ఈ సంబరాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిశి ముసిరిన వేళ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను అలరించాయి. కాకినాడ బీచ్‌లో గురువారం సాగర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ«ధ్యాత్మికత విలసిల్లే ఆలయ నమూనాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా.. కొమ్ము నృత్యాలు, చేనేతల అందాలు, రంగురంగుల పూల సోయగాలు, నోరూరించే వంటకాలు, కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే శిల్పాలు, చిత్రాలు, జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనలు సాగరతీరంలో కొలువుదీరి పర్యాటకులకు కనువిందు చేశాయి. బెంగళూరు ఫ్లవర్ షో, వ్యవసాయశాఖ, పురావస్తుశాఖ, ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్, ఏపీ టూరిజం, ఉద్యానవనం, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మత్య్సశాఖ ఆధ్వర్యంలో రొయ్యల పుట్టుక, పెరిగే విధానం, వాటిని ఎగుమతి చేసే పద్ధతులు వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్లో వివిధ రకాల మత్స్యసంపదను ప్రదర్శించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు, నేత, దారాలకు రంగులు అద్దె తీరు, వస్రా్తలు తయారు చేసే పద్ధతిని వివరించే విధంగా స్టాల్స్ పెట్టారు. పశుసంవర్ధక శాఖకు చెందిన స్టాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో డాగ్ షోను, పుంగనూరు ఆవు, దూడ, ఒంగోలు ఆవు, ముర్రాగేదె, గిరి ఆవులను ప్రదర్శనలో ఉంచారు. – కాకినాడ రూరల్ నోరూరించిన వంటకాలు గోదావరి వంటకాలు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, మారేడుమిల్లికి చెందిన బ్యాంబూ చికెన్, గోదావరి మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన 36 రకాల సముద్ర ఉత్పత్తుల వంటకాలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామం జీడిపప్పు, పచ్చళ్ల వ్యాపారం, ఆత్రేయపురం నేతి పూతరేకులు, మాడుగుల అల్వా, రాయలసీమ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి, పెద్దాపురం పాలకోవా ఇలా 100కి పైగా వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్‌తో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాలు నోరూరించాయి. ఇలా సాగరతీరంలో 400 రకాల స్టాల్స్ పర్యాటకులకు కనువిందు చేశాయి. అలరించిన శిల్పాలు, చిత్రాలు ఒడిశాకు చెందిన కళాకారులు బీచ్‌లో వేసిన నగదు రహిత విధానాన్ని తెలిపేలా, జిల్లా నమూనాలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, వివిధ పంట ఉత్పత్తులతోను, మత్స్యకన్య, బుద్ధుడు, తిరుమల, తిరుపతి దేవస్థానం, శ్రీకృష్ణుడు వంటి సైకత శిల్పాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీన్ని ప్రకాశంజిల్లా అద్దంకికి చెందిన కళాకారులు ఏర్పాటు చేశారు. విరుల విందు బెంగళూరు, చెన్నైలతో పాటు జిల్లాలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 350 వరకు వివిధ జాతుల పూల మొక్కలు, బోన్సాయ్, వివిధ రకాల కొటా¯Œ్స మొక్కలు, వివిధ పండ్లతో తయారు చేసిన దేవుళ్ల ఆకారాలను ప్రదర్శించారు. నమూనా ఆలయాలకు పోటెత్తిన భక్తులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా సముద్రతీరంలో తాటాకులతో ప్రత్యేక ఇళ్లను జిల్లా విద్యాశాఖ నిర్మించింది. సంక్రాంతి పండగ గ్రామాల్లో ఏ విధంగా ఉండేదో వివరిస్తూ గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గంగిరెద్దులు, హరిదాసు, గరగల నృత్యం, కోలాటం, కాళికానృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే «థింసా, కొమ్ము నృత్యం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. జిల్లా సంస్కృతి చాటేలా బీచ్‌ఫెస్టివల్ కాకినాడ రూరల్ : జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగురోజులపాటు ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం రాత్రి కాకినాడ సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. తూర్పుగోదావరి ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతీసంప్రదాయాలకు పర్యాటక పరమైన ప్రాచుర్యం కల్పించేందుకు ఏటా క్రమం తప్పకుండా కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ, మన్యం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ నుంచి అంతర్వేది, రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, మారేడుమిల్లి సర్క్యూట్లను రూ.350 కోట్లతో అభివృద్ధి చేసి జిల్లాను టూరిజం హబ్‌గా రూపుదిద్దుతున్నట్టు చినరాజప్ప వివరించారు. వచ్చే ఏడాది బీచ్ ఫెస్టివల్‌ను జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.23 కోట్లతో మొదట దశ పనులు పూర్తి చేశామన్నారు. బీచ్ ఫెస్టివల్ తరహాలో ఫిబ్రవరిలో కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు బీచ్ అభివృద్ధికి కేటాయించారన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యులు కాకరపల్లి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణమూర్తి, స్థానిక సర్పంచ్ యజ్జల బాబ్జీ తదితరులు ఈ సాగర సంబరాలను పర్యవేక్షించారు. -
సురక్షిత తాగునీటికి ప్రాధాన్యం
పాలకొల్లు అర్బన్: రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ నేరుగా పైపులైన్ వేసి తాగునీరు అందించడానికి రూ.450 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. లంకలకోడేరులో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీవీఎస్‌ఎస్‌ఎన్ రాజు, రాజు వేగేశ్న ఫౌండేషన్ (విశాఖ) సంయుక్త ఆధ్వర్యంలో రూ.4.50 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రతి ఇంటా ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. పైపులైన్ ద్వారా నేరుగా గృహ యజమాని ఇంట్లోకి తాగునీరు అందించడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. 70 నుంచి 80 శాతం రోగాలు తాగునీరు ద్వారా వచ్చే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సురక్షిత తాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం, వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీరు కలుషితమవుతోందన్నారు. జిల్లాలో 250 ఎన్టీఆర్ సుజల పథకాలు ఏర్పాటు చేశామని, మరో 230 ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, సర్పంచ్ తాళ్లూరి ధనలక్ష్మి, సొసైటీ ఉపాధ్యక్షుడు తాళ్లూరి ప్రకాశరావు, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూలపల్లిలో సీసీ రోడ్డుకు కలెక్టర్ భాస్కర్ భూమిపూజ చేశారు. -
రైలు మార్గాలతో పారిశ్రామికాభివృద్ధి
రాయదుర్గం–కళ్యాణదుర్గం రైలు మార్గం ప్రారంభోత్సవంలో ఎంపీ జేసీ రాయదుర్గం : రైలు మార్గాల ఏర్పాటుతో నూతన పరిశ్రమలు వస్తాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం – కళ్యాణదుర్గం నూతన రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాంపై సౌత్, వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే గుప్తా అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ జేసీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, ప్రభుత్వ చీఫ్‌విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2007–08లో రాయదుర్గం నుంచి తుంకూరు వరకు 207 కి.మీ నూతన రైలు మార్గం మంజూరైందన్నారు. ఇందులో రైల్వే వాటా రూ.857.25 కోట్లు కాగా, ఏపీ వాటా రూ.390.17 కోట్లు, కర్ణాటక వాటా రూ.467.08 కోట్లు అన్నారు. 2018 లోగా పూర్తి కావాల్సి ఉందని, అయితే రెవెన్యూ అధికారులు భూసేకరణలో జాప్యం చేయడంతో ప్రస్తుతం కళ్యాణదుర్గం వరకు 40కి.మీ రైల్వే మార్గం పనులు పూర్తయ్యాయన్నారు. ఆ రైలును ప్రారంభం చేయడం ఆనందంగా ఉందన్నారు. మార్చిలోగా కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు రైల్వే లైన్ పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మడకశిర వరకు 90 శాతం భూసేకరణ పూర్తయిందని, మిగిలిన పదిశాతం పూర్తయితే వచ్చే రెండేళ్లలో మడకశిర వరకు రైలు ప్రారంభం అవుతుందన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ గుంతకల్లు నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం మీదుగా మడకశిర, బెంగుళూరుకు రైలు మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం నుంచి విజయవాడకు రైలు నడపాలని కోరారు. అనంతరం రైల్వే శాఖామాత్యులు సురేష్‌ప్రభాకర్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కళ్యాణదుర్గం రైలును లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక నేతలు కూడా స్టేజీ మీద పచ్చజెండా ఊపగా నూతన మార్గంలో రైలు కళ్యాణదుర్గానికి పరుగులు తీసింది. కార్యక్రమంలో సౌత్‌వెస్ట్రన్ రైల్వే ఈఈ చంద్రశేఖర్, హుబ్లీ రైల్వే చీఫ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్, జెడ్పీటీసీలు విజయ్‌కుమార్, పూలనాగరాజు,కౌన్సిలర్లు, రైల్వే యాక్షన్ కమిటీ సభ్యులు, ఆర్డీఓ రామారావు, తహశీల్దార్ ఖాతిజిన్ కుఫ్రా, ఎంపీడీఓ చిట్రా శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
మోరిలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
-
మోరిలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
నగదు రహిత లావాదేవీల పరిశీలన శంకుస్థాపనలు..రుణాల పంపిణీ ఆ గ్రామంలోనే బాబు ఆరు గంటల పర్యటన అమలాపురం : ఫైబర్ గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టు...నగదురహిత గ్రామం... స్మార్ట్ విలేజ్.. బహిరంగ మల విసర్జనరహిత గ్రామంగా గుర్తింపు సంతరించుకున్న మోరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సందర్శించారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఈసారి సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు గ్రామాలకు మాత్రమే పరిమితమైనా ఈ రెండు గ్రామాల్లో ఏకంగా ఆరు గంటలపాటు చంద్రబాబు గడపడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు లబ్ధిదారులకు రుణాలను అందజేశారు. గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం... చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా మొదలైంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఉదయం 10 గంటలకు రావాల్సి ఉండగా విజయవాడ నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11.05 గంటలకు మోరి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కాన్ఫెరె¯Œ్స సెంటర్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.50 వరకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన సీఈవోలతో ఫైబర్ గ్రిడ్‌పై చర్చలు జరిపారు. బర్కలీ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఎ¯ŒSఆర్ఐ సాల్మా¯ŒS డార్వి¯ŒS ఆధ్వర్యంలో 42 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్ గ్రిడ్, ఎల్ఈడీ, వాటర్ మేనేజ్మెంట్, డిజిటల్ క్లాస్‌లు తదితర విషయాలపై సుమారు 1.45 గంటలపాటు చర్చలు జరిపారు. ఆయా కంపెనీల సీఈవోలతో ఫైబర్ గ్రిడ్, ఎల్ఈడీ, వాటర్ మేనేజ్మెంట్, డిజిటల్ క్లాస్‌లు తదితర విషయాలపైనా చర్చించారు. వారు చేపట్టే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. బాబు అక్కడ నుంచి స్థానిక ఉన్నత పాఠశాలకు చేరుకుని డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన, డిజిటల్ పాఠాలను వీక్షించారు. తరువాత గ్రామంలో పర్యటించి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే దుకాణాలను పరిశీలించారు. స్థానిక రంగన్నా మెడికల్ స్టోర్స్‌లో నగదు రహిత లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. 1.30 గంటలకు సభా వేదికకు చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని çవేదిక వద్దనే పలు శంకుస్థాపనలు చేశారు. అంతర్వేదిలో రూ.22 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్, శంకరగుప్తం డ్రై¯ŒSపై రూ.13 కోట్లతో నిర్మించే నాలుగు వంతెనలు, రూ.15 కోట్లతో నిర్మించే బ్రాంచ్ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కాపు కార్పొరేష¯ŒS ద్వారా 615 లబ్థిదారులకు రూ.9.35 కోట్ల రుణాలను అందజేశారు. సభలో చంద్రబాబు ఏకంగా 1.15 నిమిషాలపాటు ప్రసంగించారు. మోరి గ్రామం సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామంలో 1400 ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలందుతాయన్నారు. గ్రామంలో ఎల్ఈడీ బల్బులను ఆయన ప్రారంభించారు. అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఏఏ వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయి, వెలగడం లేదని తెలుసుకునే వ్యవస్థ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోరి సాధించిన విజయాలు స్ఫూర్తినిస్తాయని, ఇదొక నూతన విప్లవమన్నారు. రాష్ట్రమంతా ఈ విధానంలోకి తీసుకువస్తామని బాబు ప్రకటించారు. మోరి గ్రామంలో సేవలందిస్తున్న వివిధ కంపెనీల సీఈవోలను, విద్యార్థులను ఆయన ప్రసంశించారు. అక్కడ నుంచి తిరిగి కాన్ఫెరె¯Œ్స హాల్ సమీపంలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన నమూనాలను బాబు పరిశీలించి వచ్చి ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపారు. సాయంత్రం 5.10 గంటలకు హెలీకాఫ్టర్లో విజయవాడ బయలుదేరి వెళ్లారు. అగ్రి టూరిజానికి పెద్దపీట... కోనసీమలో అగ్రి టూరిజానికి పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత అందాలకు, వ్యవసాయ విధానం, సంప్రదాయ జీవనం పర్యటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇందుకు అగ్రి టూరిజం మంచి ఆదాయవనరుగా గుర్తింపు సంతరించుకుంటుందన్నారు. బాబుకు ఘన స్వాగతం... మోరి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నర్శింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, కె.రవివర్మ, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్జిబాబు, పిల్లి అనంతలక్ష్మి, తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీలు కె.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌లు స్వాగతం పలికార -
రాజమహేంద్రిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్
22న ప్రారంభించనున్న చాగంటి కోటేశ్వరరావు దానవాయిపేట (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద ప్రముఖ వస్త్ర దుకాణం ‘కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్’ కొలువుదీరబోతోంది. ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు షోరూంను ప్రారంభిస్తారని యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తమ సొంత మగ్గాలపై తయారు చేసే పట్టుచీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు, పిల్లలు, పురుషులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు లభిస్తాయని తెలిపింది. -
21న చంద్రబాబు రాక
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 21న జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో ఉంగుటూరు మండలం గొల్ల గూడెం చేరుకుంటారు. అక్కడ పోలవరం కుడికాలువపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను 11 గంటలకు ఆయన ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో పోలవరం వెళతారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్లో విజయవాడ బయలుదేరుతారు. -
రైతులకు మరిన్ని సేవలందించాలి
జిల్లా సహకారశాఖ అధికారి ప్రవీణ పెనుగుదురు(కరప) : ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా రైతులకు మరిన్ని సేవలందించాలని జిల్లా సహకారశాఖ అధికారి (డీసీఓ) టి.ప్రవీణ సూచించారు. మండలంలోని పెనుగుదురు సొసైటీ కార్యాలయం వద్ద జ్వోతి ప్రజ్వలన చేసి 63వ సహకార వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు అందించడంతో పాటు, వారిని చైతన్య పరచి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించాలన్నారు. కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూంలు ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలు అందజేయాలని సూచించారు. సహకార సంఘాలు లాభాలు సాధించేలా పాలకవర్గాలు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు, మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు చీకాల అప్పలరాజు ఏడురంగుల సహకార జెండా ఆవిష్కరించారు. జిల్లా సహకార ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వారోత్సవాల ప్రత్యేకాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు సూచనలిచ్చారు. విద్యార్థులకు ఇంగ్లిష్ నిఘంటువులను డీసీఓ ప్రవీణ అందజేశారు. సీఈఓ తిబిరిశెట్టి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు చీపురపల్లి జయేంద్రబాబు, డైరెక్టర్లు కలవల రాజు, టి.గోవిందు తదితరులు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి కృషి బోట్‌క్లబ్ : రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా తెలిపారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సోమవారం సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.102 కోట్లు ఇచ్చి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. స్వల్ప కాలిక రుణాలు రూ.720 కోట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సిబ్బంది పాల్గొన్నారు.