
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: తమన్నా
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రస్తావనే లేదని తమన్నా స్పష్టం చేశారు.
నెల్లూరు: నగరంలోని నర్తకి థియేటర్ పక్కన ఏర్పాటుచేసిన లాట్ మొబైల్ షోరూంను సినీ నటి తమన్నా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ నీలిమా కాంప్లెక్స్, కళానికేతన్ షోరూం పక్కన మరో రెండు షాపులు ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. అందరికీ అందుబాటు ధరల్లో దొరికే విధంగా షోరూంలో సెల్‌ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో తాను రెండు సార్లు నెల్లూరు వచ్చినా ఎప్పుడూ భోజనం చేయలేదన్నారు. ఈ సారి నెల్లూరు రుచులు ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన లేదు...
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రస్తావనే లేదని తమన్నా స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పెళ్లి విషయం చెబుతానన్నారు. తొలుత కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. సినిమాలు సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. బాహుబలి చివరి దశలో ఉందని, రవితేజ, తమిళ హీరో ఆర్యతో సినిమాలు చేస్తున్నానని వివరించారు.