మలబార్‌లో జ్యూయలరీ షో ప్రారంభం | malabar jewelry exhibition opening | Sakshi
Sakshi News home page

మలబార్‌లో జ్యూయలరీ షో ప్రారంభం

Published Sat, Jan 28 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

malabar jewelry exhibition opening

దానవాయిపేట(రాజమహేంద్రవరం): 
మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆర్టిస్ట్రీ బ్రాండెడ్‌ జ్యూయలరీ ప్రదర్శనను రాజమహేంద్రవరంలోని గోకవరం బస్‌ స్టాండ్‌ వద్ద గల సంస్థ కార్యాలయంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథి ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒS జ్యూయలరీ షోను ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా ఉన్న భారతీయ ప్రాచీన సంప్రదాయ డిజై¯ŒS అభరణాలను నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీ శేషసాయి ప్రారంభించారు. వజ్రాభరణాలు, వివాహం, పార్టీల కోసం ధరించే ఆభరణాల కౌంటర్‌ను ఆకుల లక్ష్మీ పద్మావతి ప్రారంభిచారు. అ¯ŒSకట్‌ వజ్రాలతో పొదిగిన విశిష్ట ఆభరణాల శ్రేణి ఇరా కౌంటర్‌ను అనుసూరి పద్మలత, జాతి రత్నాభరణాల సముదాయం ప్రెష్యా కౌంటర్‌ను ఇంద్రాణి సన్యాల్, హస్తకళా నైపుణ్యతతో తయారు చేసిన ఆభరణాల ఎత్నిక్స్‌ కౌంటర్‌ను మాటూరి మంగతాయారు ప్రారంభించారు. చిన్నారుల కోసం రూపొందించిన స్టార్‌లెట్‌ ప్రత్యేక బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 5 వరకూ జ్యూయలరీ ప్రదర్శన నిర్వహిస్తామని సంస్థ మార్కెటింగ్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ లక్షీ్మపతి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement