ఆల్టో ఎంఎస్ ధోని ఎడిషన్‌ప్రారంభం
Published Sun, Nov 6 2016 10:32 PM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
యువతను ఆకట్టుకునే విధంగా ఎంఎస్ ధోని ఎడిషన్ పేరుతో రూపొందించిన ఆలో్ట–800, ఆలో్టకే10 వాహనాలు ఎస్‌బీ మోటార్స్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘సాక్షి’ మెగా ఆటో షోలో ఈ వాహనాలను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి మార్కెట్‌లోకి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న మారుతి ఆల్టో ఈ ఎడిషన్‌ద్వారా యువతను కూడా ఆకట్టుకుంటుందని అభిలషించారు. ఎస్‌బీ మోటార్స్ జీఎం ఎంవీఎస్‌ఎస్‌ఆర్ గుప్తా మాట్లాడుతూ ధరలో మార్పులేకుండా ఎంఎస్ ధోని సంతకంతో కూడిన సీటు కవర్లు, ఆకట్టుకునేలా గ్రాఫిక్ స్టిక్కర్లతో ఈ వాహనాలు ఉంటాయన్నారు. పెట్రోల్, సీఎన్‌జీ వేరియేషన్‌లో లభించే ఈ వాహనాలు 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని చెప్పారు. రెడ్, బ్లూ కలర్‌లలో లభిస్తాయన్నారు.
Advertisement
Advertisement