మనం చూసిన వీడియోలు, చేసిన కామెంట్స్‌ను యూట్యూబ్ సేవ్ చేస్తుంది. కామెంట్ హిస్టరీని చూడాలనుకుంటున్నారా? ఎడిట్ లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి... యూట్యూబ్ లోగోకు లెఫ్ట్‌లో ఉన్న హంబర్గర్ మెనూ బటన్‌ను క్లిక్ చేయాలి. ‘యూ’ సెక్షన్ కింద ఉన్న ‘హిస్టరీ’ని క్లిక్ చేయాలి. రైట్‌లో ఉన్న ‘మేనేజ్ ఆల్ హిస్టరీ’ క్లిక్ చేయాలి కామెంట్స్–ట్యాప్.
డిలిట్, ఎడిట్ చేయడానికి...
– ‘ఎక్స్’ ఐకాన్‌ను నొక్కితే కామెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.
– ఎడిట్ చేయడానికి వీడియో లింక్‌ను నొక్కాలి. లోడ్ అయిన పేజీ మీ కామెంట్‌ను హైలైట్ చేస్తుంది.
– ఎడిట్ చేయాలనుకుంటున్న కామెంట్ పక్కన ఉన్న త్రీడాట్ మెనూ బటన్‌పై క్లిక్ చేసి ‘సేవ్’ బటన్ నొక్కాలి.
– గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్పులు చేసిన తరువాత కామెంట్ ఎడిట్ చేసినట్లు యూట్యూబ్ చూపిస్తుంది.
ఇవి చదవండి: Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్!
Comments
Please login to add a commentAdd a comment