ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే ఏ అద్భుతమైనా సాధ్యమే అనుకునేరోజుల్లో ఉన్నాం. చిత్రకళ పోటీల్లోకి కూడా కృత్రిమ మేధస్సు అడుగు పెట్టింది. అయితే అంత పెద్ద ‘ఏఐ’ కూడా చేతుల ముందు బిక్క చచ్చిపోతుంది. ఏఐ టూల్స్ చేతులను గీయడంలో తడబడుతున్నాయి. ఏఐ–జెనరేటెడ్ హ్యాండ్స్‌లో కొన్నిసార్లు తొమ్మిది వేళ్లు కనిపిస్తాయి. కొన్ని చిత్రాల్లో అయితే అరచేతితో సంబంధం లేకుండా కనిపిస్తాయి.
‘హ్యాండ్స్’ విషయంలో ఏఐ ఎంత పూర్‌గా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్‌కు సంబంధించిన ఫేక్ ఇమేజ్. ఈ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్‌లోపోలీసు అధికారి చేయి ట్రంప్ శరీరంలో కలిసిపోయి కనిపిస్తుంది. నార్మల్ లుకింగ్ హ్యాండ్స్ విషయంలో ‘ఏఐ’ ఎందుకు తప్పటడుగు వేస్తుంది? అనే విషయానికి వస్తే... చేతులు అనేవి మానవ శరీరంలో చిన్న భాగాలు. వేరియబుల్‌గా ఉంటాయి. పిడికిలి బిగించడం, చేయి ఊపడం...మొదలైనవి చేయి ఎలా పనిచేస్తుందో చెప్పే దృశ్య వ్యత్యాసాలు. త్రీ–డైమెన్షనల్ వరల్డ్‌తో యాక్సెస్ లేని ‘ఏఐ’కి చేయి ఎలా కనిపిస్తుందో మాత్రమే తెలుసు. బొటన వేలు, పిడికిలి బిగించడం....మొదలైనవి ఏఐకి కష్టతరమైనవి.
‘ఏఐకి చేయి అంటే చెయి మాత్రమే. అరచేయి, వేళ్లు, గోర్లు...ఇలాంటి వాటి గురించి దానికి తెలియదు. ఇప్పటి 2డీ ఇమేజ్ జనరేటర్‌లు హ్యాండ్స్‌కు సంబంధించిన త్రీ–డైమెన్షనల్ జామెట్రీని అర్థం చేసుకోలేపోతున్నాయి’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ లండన్‌లోని కంప్యూటర్ సైంటిస్ట్ పీటర్ బెంట్లీ. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? జవాబు బెంట్లీ మాటల్లోనే... ‘భవిష్యత్‌లో ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. త్రీడీ జామెట్రీలపై శిక్షణ మొదలైంది. ప్రస్తుతం 2డీ ఇమేజ్‌కు సంబంధించిన ఫలితాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. తగినంత 3డీ డిజైన్ డేటాను పొందడానికి మాత్రం సమయం పడుతుంది’
Comments
Please login to add a commentAdd a comment