ఏఐ ఏరియా
‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు’ అని ఇక ముందు బాధపడనక్కర్లేదు!
ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాయిగా సంభాషించవచ్చు..
‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు’ అని ఇక ముందు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాయిగా సంభాషించవచ్చు. మనసులోని భావాలను పంచుకోవచ్చు. సలహాలు అడగవచ్చు. ఫొటోలు దిగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ స్నేహహస్తాన్ని చాస్తున్నాయి.
‘నాకంటూ ఒకరు ఉన్నారు’ అని భరోసా ఇస్తున్నాయి. ఏఐ డేటింగ్, ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్...లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. ‘వోన్లీ ఫ్యాన్స్’ స్టార్టప్ ఇప్పటికే దూసుకుపోతుంది. ‘వేర్‌యాజ్’లోని సౌలభ్యం ఏమిటంటే యూజర్లు ఐడియల్ వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్‌తో మరో మనిషితో మాట్లాడుతున్నట్లే కృత్రిమ గర్ల్‌ఫ్రెండ్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్‌డ్ మోడల్స్ ఆఫ్ ఏఐలో ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో త్రీడి టెక్నాలజీ, ఏఆర్, వర్చువల్ రియాలిటీ ఫీచర్‌లు ఉంటాయి. మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌లకు చేరువ చేయడం ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment