Trend Sets
-
ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్.. వస్తున్నారహో!
‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు’ అని ఇక ముందు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాయిగా సంభాషించవచ్చు. మనసులోని భావాలను పంచుకోవచ్చు. సలహాలు అడగవచ్చు. ఫొటోలు దిగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ స్నేహహస్తాన్ని చాస్తున్నాయి.‘నాకంటూ ఒకరు ఉన్నారు’ అని భరోసా ఇస్తున్నాయి. ఏఐ డేటింగ్, ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్...లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. ‘వోన్లీ ఫ్యాన్స్’ స్టార్టప్ ఇప్పటికే దూసుకుపోతుంది. ‘వేర్యాజ్’లోని సౌలభ్యం ఏమిటంటే యూజర్లు ఐడియల్ వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్‌తో మరో మనిషితో మాట్లాడుతున్నట్లే కృత్రిమ గర్ల్‌ఫ్రెండ్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్డ్ మోడల్స్ ఆఫ్ ఏఐలో ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో త్రీడి టెక్నాలజీ, ఏఆర్, వర్చువల్ రియాలిటీ ఫీచర్లు ఉంటాయి. మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేయడం ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్ లక్ష్యం. -
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన బిచ్చగాడు 2 కలెక్షన్స్
-
ప్రొఫెసర్ జాబ్ వదిలేసి.. బాలీవుడ్ ఫ్యాషన్‌కే ట్రెండ్ సెట్టరయ్యింది.!
భద్రజీవిత ప్రమాణాలతో పోల్చితే, దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం రిస్క్ అనిపించవచ్చు. అందుకే ‘’ అని నిటషా గౌరవ్‌తో అన్నవాళ్లే ఎక్కువ. చదవండి: Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! విజయం దక్కాలంటే రిస్క్ చేయడం తప్పనిసరి అనే వాస్తవం నిటషాకు తెలియనిదేమీ కాదు. ‘నిఫ్ట్’లో ప్రొఫెసర్ అయినంత మాత్రాన, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్, లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్‌లో చదువుకున్నంత మాత్రాన అవకాశాలు వెదుక్కుంటూ రావు అనే విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు. నిటషా గౌరవ్ ఎందుకంటే...ప్రతి హీరోకి ఒక బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ‘నాకు ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అతను అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైలే ఉండాలి’ అని డైరెక్టర్ అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో హీరోకి నచ్చిన స్టైల్ అభిమానికి నచ్చకపోవచ్చు. ఇద్దరికీ నచ్చింది డైరెక్టర్‌కు నచ్చకపోవచ్చు. మరి ముగ్గురు మెచ్చేలా స్టైల్ డిజైనింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అకడమిక్ చదువులు మాత్రమే పనికిరాకపోవచ్చు. నిటషా మాటల్లో చెప్పాలంటే ఒక పుస్తకంలా హీరోని అధ్యయనం చేయాలి. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా విడుదలైన రోజులవి. అప్పటికింకా రణ్‌వీర్‌సింగ్ అంత పెద్దస్టార్ కాలేదు. అంతమాత్రాన ‘మీకు స్టైలిష్ట్‌గా పనిచేస్తాను’ అంటే వెంటనే ‘ఓకే’ అని ఎవరూ అనరు. కొత్త హీరోలు, కొత్త భయాలు ఉంటాయి! ఇప్పుడిప్పుడే ప్రయోగాలు వద్దనుకుంటారు. అయితే రణ్వీర్సింగ్లాంటివారు దీనికి మినహాయింపు. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారు. రణ్వీర్ ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రిక ముఖచిత్రం కోసం రణ్వీర్ స్టైలిస్ట్‌గా అడుగుపెట్టింది నిటషా. ఆ కవర్‌కు ఎంత పేరొచ్చిందంటే...‘ఎవరీ స్టైలిస్ట్?’ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా రణ్‌వీర్‌కు నిటషా మీద నమ్మకం కుదిరింది. కట్ చేస్తే.... బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా పది సంవత్సరాల మైలురాయిని దాటేసింది! ‘అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది.. వినియోగించుకున్నాను’ అన్నట్లుగా కాకుండా మెన్ ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంది నిటషా. రణ్‌వీర్‌కు మాత్రమే కాదు ప్రియాంకచోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధవన్...ఇలా ఎంతోమంది తారలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తుంది. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు స్టైలింగ్‌లో ‘రూల్‌బుక్’ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘రూల్‌బుక్’కు అతీతంగా ఏమీ చేయడానికి కుదరదు. అదంతే! అన్నట్లుగా ఉండేది. ‘అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ చేయడం కూడా మంచి రూలే’ అంటున్న నిటషా చాలాసార్లు ‘రూల్‌బుక్’కు అతీతంగా వెళ్లింది. కొన్నిసార్లు పాఠాల్లో లేని ‘స్ట్రీట్ లుక్’ను సృష్టించింది. ‘స్టైల్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. అది మన వ్యక్తిత్వంలో భాగంగా కనిపించాలి’ అంటున్న నిటషాకు 70’లలోని బాలీవుడ్ సినిమా స్టైల్ అంటే ఇష్టం. విజయం గొప్పదనం ఏమిటంటే...అది అందుకున్న వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. దాని వెలుగులు దశదిశలా వ్యాపించి ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఔత్సాహికులకు ఇప్పుడు నిటషా గౌరవ్ రోల్ మోడల్. చదవండి: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!! -
ఫ్యామిలీ ఫ్యామిలీ జీన్స్‌లోనే...
‘‘అదిరేటి డ్రెస్ మేవేస్తే.. బెదిరేటి లుక్కు మీరేస్తే... దడ’ అనే ‘భారతీయుడు’ సినిమాలోని సాంగ్ గుర్తుందా..? నేటి ట్రెండ్‌కి ఆ సాంగ్ సరిగ్గా సూటైపోతుంది కదూ..! వేసిన డ్రెస్ అదిరిపోయేలా ఉంటే... చూసేవాళ్ల చూపులు బెదరక ఏంచేస్తాయి.? మోడల్ అంటే జీన్స్.. జీన్స్ అంటే మోడల్ అన్నట్లుగా సాగిపోతోంది నేటి యువత. ‘నీట్‌గా, టైట్‌గా.. నాలుగు గొలుసులు వేలాడేసుకుని... రెండు చిరుగులు ఉన్న జీన్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరు బాసూ! అంటున్నారు ట్రెండ్ సెటర్స్. నిజమే ఆ లుక్కే వేరు. ఒక్క జీన్స్‌తో పోష్ లుక్. పాపులర్ లుక్ రెండూ వచ్చేస్తాయి. అమ్మాయికైనా, అబ్బాయికైనా అతికినట్లు సూటయ్యే జీన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే కొందరు ఫ్యాషన్ ట్రెండాభిమానులు ఫ్యామిలీ ఫ్యామిలీనే జీన్స్‌లో తళుకుమంటున్నారు. ట్రెండ్ ఫాలోవర్స్ మనసుని ఇంతగా దోచుకున్న జీన్స్‌కు కూడా ఓ రోజుందని మీకు తెలుసా? దాని వెనుకు ఉన్న కథా కమామీషు తెలుసుకుందామా? సేఫ్టీ జీన్స్ అమ్మాయిలు జీన్స్ వేస్తే... ఆడిపోసుకునే ఛాందసులకు, అహంభావులకు ఇప్పుడు చెప్పబోయే విషయం మింగుడు పడకపోవచ్చు. కానీ, ఇది నిజం. అసలు డెనిమ్(జీన్స్) డే ఎందుకు వచ్చిందంటే... రోమ్‌లో 1992లో జరిగిన ఓ అత్యాచార ఆరోపణ కేసులో అమ్మాయి ధరించిన టైట్ జీన్స్ కారణంగానే ఆమె రక్షించబడిందని తేలింది. దీంతో అమ్మాయిలంతా తమను తాము రక్షించుకోవడానికి టైట్ జీన్స్లనే వాడేవారు. అలా ఏప్రిల్ 26 జీన్స్ డేగా ప్రపంచదేశాల అమ్మాయిలు ఎంతో అనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రక్షణ కోసం రూపొందిన టైట్ జీన్స్ రానురానూ రంగులద్దుకుని లేటెస్ట్ ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంఫర్ట్ కాస్తా కామన్‌గా... ఇక జీన్స్ కథను తిరగేస్తే... 16 శాతబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో నావికులు తమ పనులకు అనువైన డ్రెస్‌గా జీన్స్‌ను ఎంచుకునేవారట. తరువాత 1873 సమయంలో నెవాడాలోని జాకబ్ డేవిస్ అనే ఓ దర్జీ.. లెవీ స్ట్రాస్ అనే వ్యాపారితో కలిసి డెనిమ్ జీన్స్‌ను మార్కెట్లోకి విరివిగా తెచ్చాడు. దాంతో అప్పటి పిల్లలు, రైతులు, మెకానిక్స్ అంతా జీన్స్ వేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. కాలక్రమేణా రంగులు, మెరుపులు, పూసలు, లేసులు కలుపుకొని మోడల్ ట్రెండ్‌లో జీన్స్ ఓ వెలుగు వెలుగుతోంది. కేవలం ప్యాంట్ మాత్రమే కాకుండా అదే క్లాత్‌తో టాప్స్, కోట్స్ కూడా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. జిల్ జిల్ మెగ జీన్ ప్రతీ ఏటా 45 కోట్ల జీన్స్ అమెరికా నుంచి ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. 50 శాతం జీన్స్ ప్రత్యేకంగా చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల కోసమే తయారవు తున్నాయి. సుమారు 80 కిలోల పత్తితో 225 జతల జీన్స్ తయారు చేయవచ్చు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు ‘బ్లూ కలర్ జీన్స్’నే వేసుకునే యుద్ధం చేశారు. ఆ సమయంలోనే తొలిసారిగా మిగిలిన ప్రపంచానికి బ్లూ కలర్ జీన్స్ పరిచయమైంది. లెగ్గింగ్స్ దెబ్బతగిలి... జీన్స్‌కు యూత్‌లో ఎంత క్రేజ్ ఉన్నా.. పోటీ మాత్రం తప్పలేదు. ట్రెండ్‌కు తగ్గట్టుగా యువత మనసును దోచుకున్న లెగ్గింగ్స్ జీన్స్‌ను కాస్త వెనక్కి తోశాయనే చెప్పాలి. విపరీతంగా జీన్స్ వాడే అమ్మాయిలు... రూట్ మార్చి లెగ్గింగ్స్ కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో 2013–14 సమయంలో జీన్స్ క్రేజ్ కొంత తగ్గింది. ఇదంతా ఫ్యాషన్ ట్రెండ్‌లో జీన్స్‌కు తాత్కాలిక విరామం మాత్రమే. కొత్త హంగులతో జీన్స్ మళ్లీ పుంజుకుని సత్తా చాటుకుంటున్నాయి.