సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.
ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.
జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.
విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..
ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో
ఉపయోగిస్తున్నారు.
ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..
మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.
– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment